కరుశదేశమునకు చంద్రముఖుండను రాజుయుండెను. అతనికి వందమంది భార్యలు. పట్టపురాణిపేరు తారంగి. ఆ దంపతులు ధర్మనిష్ఠులు. వారిది అపురూపదాంపత్యము. తారంగి చాలా దైవభక్తిగలది. వారి అంతఃపురసవిూపమున నొక విష్ణుమందిరముగలదు. ప్రతిదినమూ అచ్చికి వెళ్ళి పరిపరి విధముల సేవచేయుట ఆమె దినచర్య, వేలకొలది దాసదాసీలున్నప్పికీ దేవాలయమును శుభ్రముచేయుట ముగ్గులు వేసి తోరణములు క్టి అలంకరించుట స్వయముగ చేసెడిది. ఒకసారి యచ్చికి శుకమునులవారు వచ్చి ఆమె విశిష్టసేవను గమనించి ఆశ్చర్యముతో ''అమ్మా ఇంతి అపూర్వ సేవ చేయుటకు కారణమేమి'' యని అడిగిరి. ఆమె భక్తితో నమస్కరించి ఇట్లనెను ''మహానుభావా మీకు తెలియనిది ఏమియున్నది. మీరు అడిగితిరి కనుక తెలిపెదను అని ''పూర్వజన్మములో నేనొక శూద్రస్త్రీని నా తండ్రి మరియు నా సోదరు నలుగురూ పరమ పాపిష్ఠులు, వారిపని వేాడుట, దొంగతనము చేయుట దారిదోపిడీ చేయుట నిత్యకృత్యము. ఒకసారి నా అన్నలు బ్రాహ్మణ యాత్రికులను చంపి వారివద్ద గల ధనమును అపహరించిరి. ఆ విషయము ఆ దేశపురాజుకు తెలిసి వారందరికి మరణదండన విధించిరి. నా తండ్రికి అదేగతి అయ్యెను. నా తల్లి ఖైదులోనే ప్రాణములు విడిచెను. రాజభటులు నన్ను మగధదేశమునకు తీసుకుపోయి సుఘోషుడు అను బ్రాహ్మణునికి అమ్మివేసిరి అతని పత్ని చాలా స్నేహశీలి వారిద్దరి రక్షణలో నేను సుఖముగా పెద్దదాని నైతిని. ఒకసారి ఆ విప్రపత్ని శ్రీకృష్ణాష్టమి వ్రతము యొక్క మహిమను తెలిపెను. ఆమె దానిని ఆచరింపమని ప్రేరణచేసి అట్లు ఆచరించుట వలన మూడవ జన్మలో మహారాణి వగుదువని చెప్పెను. అట్లే నేను ఆ వ్రతము యొక్క విధి విధానములు చేప్పెను. అట్లే నేను ఆ వ్రతము ఆచరించితిని. ఆ రోజు పూర్ణ ఉపవాసముచేసి మర్నాడు ప్రాతఃకాలమున పారణచేసితిని. కొంతకాలమునకు ఆ బ్రాహ్మణుడు మృతి చెందెను. అతని భార్య సహగమనము చేసెను. కొంతకాలమునకు విషజ్వరము సోకి నేను మృతిచెందితిని.
దేహమును వదలివేసిన వెంటనే విష్ణుదూతలు నలుగురు వచ్చి విమానమునందు నన్ను కూర్చుండబ్టెి విష్ణులోకమునకు తీసుకొని వచ్చిరి. దానియందు ప్రవేశము దొరకలేదు. అశరీరవాణి ''నీకుదినలో ప్రవేశించుటకు కాలమాసన్నమవలేదు'' అని నుడివెను. అచటనుంచి ఇంద్ర లోకమునకు యచట నుంచి యమలోకునకు తీసుకొనివచ్చిరి. యముడు నన్నాదరించి అనుగ్రహించిరి. ఆ సమయమునకు అచ్చటకు యమదూతలు ఆగమించి ''ప్రభూ విూ ఆజ్ఞప్రకారము ఇప్పుడు మగధదేశమునందు పరమపాపియైన బ్రాహ్మణుని తీసుకొని వచ్చుటకు వెళ్ళితిమి. కానీ ఆశ్చర్యకరమైన విషయము. మేము అతని కంఠమునకు వేసిన పాశము తెగిపోయె, ఎత్తిన దండము విరిగిపోయె, చాపిన చెయ్యి అట్లే యుండిపోయె. అతడి వేడి యూపిరి మమల్ని కాల్చుటకు సిద్ధమయినది. భీతులైన మేము తిరిగి వచ్చితిమి.'' అనిరి. చిత్రగుప్తుడు యముని యాజ్ఞతో ఆ రహస్యమును చెప్ప మొదలుపెట్టెను. ''అతనొక పరమపాపి. కానీ శ్రీకృష్ణాష్టమి వ్రతమును ఆచరించిన ఈ తారంగికి ఆశ్రయమిచ్చిన ఫలితముగా అంతిగొప్పదనము నొందెను. అతనిని గౌరవముతో తీసుకొని రమ్మని యాజ్ఞపించిరి. అతనిని పిలుచుకొని వచ్చిన తరువాత అతనికి సన్మార్గము నుపదేశించిరి. అతనిని పిలుచుకొనివచ్చిన తరువాత అతనికి సన్మార్గమునుపదేశించిరి. యమదేవుడు తారంగితో ''ఇతడు కరూశదేశమునకు రాజుగా పుట్టును నీవు యతని పత్నిగా మహారాణి వగుదువు. శ్రీకృష్ణాష్టమివ్రతము ఆచరించి నీవు మహారాణి వగుదువని నీ యజమానురాలు చెప్పును. ఆ కోరిక నీ మనసులో యుండుటచేత నీకు వైకుంఠములో తలుపులు తెరచుకోలేదు. నీ అగ్నీలు నరక వాసముననుభవించి హీనయోనులందు జన్మించి ఇప్పుడు మరల వేటగాండ్రుగా ప్టుిరి. నా తల్లిదండ్రులు అడవి పందులుగా జన్మించిరి. నీ వలన వారందరు ఉద్ధారమవవలెనని యమదేవుడు తెలిపిరి. ఇది యంతయు జ్ఞాపకముండునట్లుగా వరమిచ్చిరి.అదే నేను ఇప్పుడు జన్మించితిని. నాకు ఏడవ సంవత్సరములో పూర్వజన్మ స్మృతి లభించెను.
అప్పుడు ఆ నలుగురు వేటగాళ్ళు రెండు అడవి పందులను వేాడుటను చూసితిని. ఆ వేటగాళ్ళు నా అన్నలు అడవి పందులు నా తల్లిదండ్రులు నన్ను చూసిన వెంటనే వారికి జ్ఞానోదయమయి సద్గతి కలిగినది. నేను ''నారాయణ'' మంత్రముతో అభిమంత్రించిన జలములను ఆ పందులపై ప్రోక్షించితిని. అవి పాపవిముక్తులై వైకుంఠమునకు వెళ్ళినవి. కౌసల దేశమునకు రాజకుమారిగానున్న నేను కరూశదేశమునకు మహారాణినయ్యాను. ఇదంతా ''శ్రీకృష్ణజన్మాష్టమీ'' వ్రతము యొక్క ఫలము. అందుకొరకే శ్రీహరిని ఇంతి భక్తితో ఆరాధించు చున్నాను. ఇక ముందు నేను విష్ణులోకమును వెళ్ళుదును. శుకముని ఆశీర్వదించి వెళ్ళి పరిక్షిత్తు రాజు పుత్రుడయిన జనమేజయునకు ఆ వ్రతమునుపదేశించి ఉద్దరించిరి.
No comments:
Post a Comment