పుష్కర ప్రాశస్థ్యం
భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నప్పికీ వాిలో 12 మహానదులకు మాత్రమే పుష్కరాలు నిర్వహించబడుచున్నవి. అటువిం పుణ్యనదులలో గోదావరినది పేరెన్నిక గలది.
''సప్తగోదావరం తీర్ధం, సర్వతీర్ధోత్తమమ్'' అని మహాఋషులు చెప్పినమాట.గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకం వద్ద జన్మించి, తెలంగాణరాష్ట్రం గుండా ప్రవహించి గుండాల గ్రామము, భద్రాచలం మండలంలో ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రంలో ప్రవేశించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలగుండా ప్రవహించి, బంగాళాఖాతంలో కలుయును.
బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుపబడును. ఈ పవిత్ర సమయం 12 సంవత్సరములకు ఒకసారి వస్తూ ఉంటుంది.
బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించగానే 12 రోజులు ఆదిపుష్కరమని, బృహస్పతి, కన్యారాశిలోకి వెళ్ళేముందు 12 రోజులను అంత్యపుష్కరమని గుర్తిస్తారు.
గోదావరి పుష్కర సమయంలో భక్తులు నదిలో పవిత్ర స్నానమాచరించి, దాన, తర్పణ, పిండ ప్రధానాది కార్యక్రమములు నిర్వహించి దేవతలకు, పితృదేవతలకు తృప్తిని కలిపించి దివ్యఫలాలను పొంది కృతార్థులవుదురు.
గత పుష్కరములు 2003 సంవత్సరంలో ది.30.7.2003 నుండి ది.10.8.2003 వరకు రాష్ట్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
No comments:
Post a Comment