Friday, August 26, 2016

సంధ్యావందనం

అందరికీ సంధ్యావందనం

శుక్లాం బరధరం విష్ణు శశివర్నం చతుర్భుజమ్‌| ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోప శాంతయే||

తా. తెల్లని వస్త్రము ధరించి, అంతా వ్యాపించి, చంద్రుని వలె తెల్లని రంగు కలిగి, నాలుగు భుజములతో విరాజిల్లుతూ ప్రసన్న వదనముతో వెలుగొందే ఆ వినాయకుని ధ్యానించే నా విఘ్నములు అన్నీ తొలగిపోవుగాక!
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ||
తా. గురువే బ్రహ్మ! గురువే విష్ణువు! గురువే ఈశ్వరుడు! గురువు సాక్షాత్తు ఆ పరబ్రహ్మయే! అి్ట గురువునకు నమస్కారము.
శ్లో. అపవిత్రః పవిత్రోవా-సర్వావస్థాం గతో-పివా | యస్స్మరేత్‌ పుండరీకాక్షం-స బాహ్య అభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్షాయ నమః
తా. అపవిత్రుడు గాని, పవిత్రుడు గాని, ఎన్ని విధములైన అవస్థలను పొందినవాడు గాని, ఎన్ని విధములైన కాకక్షుడైన ఆ విష్ణుమూర్తిని స్మరించినచో, అతడు, వెలుపలను, లోపలను పరిశుద్ధుడగును.
ఆచమనము
కేశవాయనమః | నారాయణాయ నమః | మాధవాయ నమః| గోవిందాయ నమః | విష్ణవే నమః | మధు సూదనాయ నమః | త్రివిక్రమాయ నమః | వామనాయ నమః | శ్రీధరాయ నమః | హృషీకేశాయ నమః | పద్మ నాభాయ నమః | దామోదరాయ నమః | సంకర్షణాయ నమః | వాసుదేవాయ నమః | ప్రద్యుమ్నాయ నమః | అనిరుద్ధాయ నమః | పురుషోత్తమాయ నమః | అధోక్షజాయ నమః | నారసింహాయ నమః | అచ్యుతాయ నమః | జనార్దనాయ నమః | ఉపేంద్రాయ నమః | హరయే నమః | శ్రీకృష్ణాయ నమః | 
భూతోచ్ఛాటనమ్‌
శ్లో. ఉత్తిష్ఠంతు భూత పిశాచాః-యేతేభూమి భారకాః | ఏతేషామవిరోధేన-బ్రహ్మ కర్మ సమారభే ||
తా. భూమికి భారముగా ఏయే భూతములు, పిశాచములు ఉన్నవో అవి యెల్ల ఇక్కడ నుండి తొలగి పోవుగాక! ఎందుకలనగా వీనికి విరోధము లేకుండ బ్రహ్మకర్మను ప్రారంభించుచున్నాను.
ప్రాణాయామము
కుడిచేతి బొటనవ్రేలితో కుడి ముక్కు మూసికొని, ఎడమవైపు నుంచి 4 సెకనలు కాలము నెమ్మదిగా గాలిపీల్చి, మధ్యవ్రేలు, ఉంగరము వ్రేళ్ళతో ఎడమ ప్రక్క కూడా మూసి, ''గాయత్య్రై నమః'' అని మనసు చేత వీలున్నన్నిసార్లు జపిస్తూ, 8 సె|| కాలము గాలిని బంధించి, తదుపరి కుడివైపున బొటన వ్రేలిని తీసివేసి, గాలిని నెమ్మదిగా 4 సె|| కాలము విడువవలెను. ఇది యొక ప్రాణాయామ మగును.
మమ ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాం/మాధ్యాహ్నిక సంధ్యాం/ సాయం సంధ్యాం ఉపాసిషే |
మమ ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అర్ఘ్య ప్రదానం కరిష్యే |
నా పాపములన్నియు నశించి, శ్రీ పరమేశ్వరునకు ప్రీతి కలుగుటకు అర్ఘ్యము (మంత్ర జలము)ను విడుచు చున్నాను!
అర్ఘ ్యప్రదానం
''యో దేవః సవితా అస్మాకం ధియః ధర్మాది గోచరాః ప్రేరయేత్‌ తస్య యద్భర్గః తత్‌ వరేణ్యం ఉపాస్మహే!''
పై శ్లోకముతో ఉదయం తూర్పువైపు తిరిగి, సాయంత్రం పడమరకు తిరిగి, 4సార్లు అర్ఘ్యము నీయవలెను (దోసలితో నీరు విడువవలెను).
తర్పణం
ప్రాతః/మాధ్యాహ్ని/సాయం సంధ్యాంగ తర్పణం కరిష్యే | సంధ్యాం తర్పయామి | గాయత్రీం తర్పయామి | సావిత్రీం తర్పయామి | సరస్వతీ తర్పయామి | ఆదిత్యం  తర్పయామి | సోమం తర్పయామి | మంగళం తర్పయామి | బుధం తర్పయామి | బృహస్పతిం తర్పయామి | శుక్రం తర్పయామి | శనిం తర్పయామి | రాహుం తర్పయామి | కేతుం తర్పయామి | యమం తర్పయామి | చిత్రం తర్పయామి | చిత్రగుప్తం తర్పయామి | సర్వాన్‌ దేవాన్‌ తర్పయామి | 
తర్పయామి అన్నప్పుడల్లా ఒక ఉద్ధరిణెడు నీళ్ళు కుడి అరచేతిలోంచి క్రిందకు జారి, పళ్ళెంలో పడునట్లు విడుచు చుండవలెను.
ఆచమనము
కేశవాయ నమః | నారాయణాయ నమః | మాధవాయ నమః............శ్రీకృష్ణాయ నమః |
ధ్యానమ్‌
శ్లో. ముక్తా విద్రుమ హేమ నీలం ధవళచ్ఛాయైః ముఖైః త్రీక్షణైః యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుాం తత్త్వార్థవర్ణాత్మికాం | గాయత్రీం వరదా (  ) భయాంకుశ కశాః శుభ్రం (   ) కపాలం గదా శంఖం చక్ర (   ) మథార విందయుగళం హస్తైర్వహంతీం భజే ||
శ్రీ గాయత్రీ దేవ్యైనమః గంధం సమర్పయామి
శ్రీ గాయత్రీ దేవ్యైనమః పుష్పం సమర్పయామి
శ్రీ గాయత్రీ దేవ్యైనమః ధూపం సమర్పయామి
శ్రీ గాయత్రీ దేవ్యైనమః దీపం సమర్పయామి
శ్రీ గాయత్రీ దేవ్యైనమః అమృతం నైవేద్యం సమర్పయామి
శ్రీ గాయత్రీ దేవ్యైనమః తాంబూలాది సర్వోపచార పూజా సమర్పయామి |
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యా అంగత్వేన / మధ్యాహ్నిక సంధ్యా అంగత్వేన / సాయం సంధ్యా అంగత్వేన యథాశక్తి గాయత్రీ మంత్ర జపం కరిష్యే |
''యో దేవః సవితా అస్మాకం ధియః ధర్మాది గోచరాః ప్రేరయేత్‌ తస్య యద్భర్గః తత్‌ వరేణ్యం ఉపాస్మహే ||
తా. ఏ సూర్య భగవానుడు మన యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షాదులకు సంబంధించిన బుద్ధి వృత్తులను (అనగా ఆలోచనలను) ప్రేరేపించుచున్నాడో, అి్ట తేజ స్వరూపమైన, సూర్యమండలమందున్న గాయత్రీ దేవతలను మేము ఉపాసించుచున్నాము.
కళ్ళుమూసుకొని సూర్యబింబాన్ని తలచుకొని, దాని మధ్య తేజోబింబాన్ని ఊహించుకొని, దాని మధ్యలో గాయత్రీమాత స్వరూపాన్ని స్మరించుకుంటూ, వెన్నుపూస నిరుగా ఉంచి, ఏకాగ్రతతో, మానసికంగా, పెదవులు, నాలిక కూడా కదలకుండా పై మంత్రాన్ని యథాశక్తి 10 / 28 / 108 /1008 సార్లు జపించాలి.
అనేన, యథాశక్తి మయాకృతేన గాయత్రీ మంత్ర జపేన గాయత్రీదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు 
అని ఉద్ధరిణెతో నీళ్ళు విడిచిపెట్టవలెను.
(యథాశక్తి నాచే చేయబడిన ఈ గాయత్రీ జపము వలన గాయత్రీమాత సంతోషించి ప్రసన్నురాలగు గాక!)
సూర్యస్తుతి
నమః పరబ్రహ్మణే సూర్యాయ ప్రాతః సంధ్యాయై నమః నమః రుద్రాయ సూర్యాయ మాధ్యాహ్నిక సంధాయై నమః నమః విష్ణవే సూర్యాయ సాయం సంధ్యాయై నమః
(నమస్కరించవలెను)
దేవతా నమస్కారము
సంధ్యాయై నమః | సావిత్య్రై నమః | గాయత్య్రై నమః | సర్వాభ్యో దేవతాభ్యో నమః | దేవేభ్యో నమః | ఋషిభ్యో నమః | మునిభ్యో నమః | గురుభ్యో నమః | మాతృభ్యో నమః | పితృభ్యో నమః ||
ఆకాశాత్‌ పతితం తోయం యథాగచ్ఛతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
(ఆకాశము నుండి పడిన జలమెక్కడ పడినను, అది ఏ విధముగా సముద్రమునే చేరుచున్నదో, అదే విధముగ యే దేవతకు నమస్కారము చేసినను అది సర్వ దేవాత్మకుడైన శ్రీమన్నారాయణమూర్తికే చెందుచున్నది).
నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే | సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోీ యుగధారిణే నమః ||
(అంతము లేనివాడును, నామరూపాత్మకమైన సమస్త ప్రపంచము తన స్వరూపమే యైనవాడును, అనాది కాలము నుండియు నున్నవాడును, నిత్యుడునగు ఆ పురాణ పురుషోత్తమునకు ఇదే నా వందనము!)
ఆచమనము
శ్లో. కాయేన, వాచా, మనసేంద్రియైర్వా బుద్ద్యాత్మనావా ప్రకృతే స్స్వభావాత్‌ | కరోమి యద్యత్‌ సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి ||
తా. నేను నా ప్రకృతి ననుసరించి మనసుతో గాని, వాక్కుతో గాని, శరీరముతో గాని, కర్మేంద్రియములతో గాని, జ్ఞానేంద్రియములతో గాని, బుద్ధితో గాని, అంతరాత్మతో గాని యేమి చేసినను అది యెల్ల శ్రీమన్నారాయణుని మూర్తికే అర్పణము చేయుచున్నాను.
మంత్ర, తంత్ర కర్మ లోపప్రాయర్చిత్తార్థం నామత్రయం జపేత్‌ ఓం అచ్చుతాయ నమః, ఓం అనంతాయ                నమః, ఓం గోవిందాయ నమః. 
సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు

No comments: