Friday, August 26, 2016

శ్రీ సద్గురు శివానందమూర్తి


    ఉర్దాం జమిందారు వంశంలో శ్రీ కుందుకూరి శివానందమూర్తిగారు 1928 డిసెంబరు 20 అర్ధరాత్రి 12.38ని.లకు రాజమండ్రిలో శ్రీ కందుకూరి వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళ దంపతులకు పుత్రునిగా జన్మించారు. వారిది ఆర్వేల నియోగివంశము, లోహితస గోత్రము, సంప్రదాయము లింగధారణాది శైవదీక్షయుతమగు శైవాచారము.
    శ్రీ శివానందులు బాల్యంలో ఎంతో ముద్దుగా గారాబంగా పెరిగారు. తల్లి ప్రథమ గురువై రామాయణ, భారత, భాగవత కథలతోపాటు నీతి శతకాలను నూరిపోయడంతో పూవు పుట్టగానే పరిమళించినట్లు బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతన అలవడింది. తల్లి కృష్ణ భక్తురాలు. తండ్రి శ్రీరామభక్తుడు, కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వేడుగ్గా శ్రద్ధా భక్తితో నిర్వహించేవారు. శ్రీ శివానందమూర్తిగారికి హరిహరాద్వైత భావన జన్మతః లభించిన మహోత్తమ వైశిష్ట్యము.
    గురుదేవుల విద్యాభ్యాసము రాజమండ్రిలోనే కొనసాగింది. బాల్యం నుండి యోగాభ్యాసం పై అభిరుచి ఉండడం వలన తరచు ప్రాణాయామం, ధ్యానం వింవి చేస్తూ ఉండేవారు. గురువుగారు 12 ఏళ్ళ వయసులో ఒకరోజు కొవ్వూరు గోదావరినదిలో స్నానం చేస్తూ ఉండగా, ఉత్తరదేశం నుండి వచ్చిన ఒక యోగి ఈ బాలుని ముఖంలో తేజస్సు చూసి దగ్గరకు పిలిచి ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో పఠించడం చూసి ఆ యోగి మొత్తం 32 మంత్రాలను ఉపదేశించి, 32 రోజులలో గొప్ప సిద్ధి లభిస్తుందని ఆశీర్వదించారు. తరువాత ఆ యోగి శ్రీ శివానందమూర్తిగారిని పిలిచి నువ్వు గొప్ప యోగి అవుతావని చెప్పి. అతని చేతిలో 16 గింజలను ఉంచి, ఒక్కొక్క మంత్రము చెబుతూ గోదావరిలో పడవేయమన్నారు. భయపడకుండా ఆ కార్యం నిర్వహిస్తే యోగసిద్ధులు లభిస్తాయని చెప్పి ఆశీర్వదించి ఆ యోగి నిష్క్రమించాడు.
    గురుదేవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యోగిచెప్పినట్లు మంత్రాలను పఠిస్తూ 16 గింజలు గోదావరి నదిలో వేయగానే 4 వైళ్ళపొడువైన వెయ్యి పడగల సర్పం ఒకి తనవైపు రావడం చూసి నిర్భయంగా కళ్ళుమూసుకొని, నమస్కారం చేసేసరికి ఆ సర్పం అమాంతం గురుదేవునిపై పడి శరీరంలో లీనమైపోయింది. ఆ విధంగా కుండలినీ శక్తి స్వామివారిలో జాగృతమయింది.
    గురువుగారు బాల్యంలో కొన్నాళ్ళు నెల్లూరులో ఉన్నప్పుడు, అక్కడ శ్రీరమణ కేంద్రంలో సామూహిక ధ్యానంలో ఉండగా శ్రీ రమణమహర్షి ఎదుట సాక్షాత్కరించి, ఎదురుగా నిలబడి గురువుగారి తలపై జుత్తులోనుండి అయివేళ్ళు పోనిచ్చి శిరస్సుపై హస్త ఉంచడంతో దివ్యానుభూతిని పొందేరు. ఆ విధంగా గురువుగారికి శ్రీరమణ మహర్షువారి ఆశీస్సులు కృప లభించింది.
    గురువుగారికి దేశ భక్తి మెండు ఒక సందర్భంలో 'కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పడుకుని పొర్లాలనిపిస్తోంది' అన్నారు. ఆ మాటలే భారతదేశంపై వారికున్న ప్రేమ, సంసార బంధనాలు తెంచుకోకుండా కాషాయాన్ని ధరించకుండా ఉత్తమ సంప్రదాయాలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనతో పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చని తెలియజేసి, నిరాడంబరంగా ఆధ్యాత్మిక చింతనాపరులను చేరదీసి వరంగల్‌లో 'శ్రీగురుధామ్‌ భీమునిపట్నంలో 'ఆనందవనం' పేరుతో రెండు ఆశ్రమాలు నెలకొల్పి 'సుపధ' ఆధ్యాత్మిక పత్రికను కూడా నడుపుతున్నారు.
    మొత్తం ప్రపంచంలో విశ్వశాంతి నెలకొలపడానికి అనేకచోట్ల కాశీ, ప్రయాగ, నైమిశం, ప్రభాస, శ్రీశైలం, కన్యాకుమారి, గోకర్ణం, ఉజ్జయినీ, బదరికాశ్రమం, కేదారి, జోగీశ్వర్‌, మున్నగు పుణ్యక్షేత్రాలలో 400 రుద్రయాగాలు నిర్వహించి, భారతీయ సంస్క ృతిని పునరుద్ధరింపజేసారు. 1994లో 28 రోజులపాటు రుద్రయజ్ఞాన్ని భీమునిపట్నం ఆనందవనంలో నిర్వహించారు. మహాలక్ష్మిదేవి కాక్షం అందరికి ఉండి, భారతదేశం సుసంపన్నంగా ఉండాలని భీమునిపట్నం ఆనందవనంలో ఉత్కళ సాంప్రదాయ పద్ధతిలో చక్కని దేవాలయం నిర్మించారు.
    'మనకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము. సంతోషమే కానీ అంతకన్నా ముఖ్యమైనది మన దేశ క్షేమం. మన క్షేమం గురించి ప్రార్థించేకన్నా దేశ క్షేమంను గురించి ప్రార్థించే వారి క్షేమాన్ని భగవంతుడు ప్రధానంగా అనుగ్రహిస్తాడు. మానవసేవే మాధవ సేవని గుర్తుచేసి, అనే సేవాకార్యక్రమాలను ఇంా, బయట ప్రోత్సహించి సద్గురువగా పలువురిచేత పూజలందుకొంటున్నారు. శివాయ గురువే నమః.
    రాజకీయ, సాంస్క ృతిక ఆధ్యాత్మిక చరిత్రమీద ఆయన రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుాలుగా ముద్రితమయ్యాయి. కఠోపనిషత్‌ మీద ఆయన రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాటరాసిన డేవిడ్‌ ఫ్రాలీ ''అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శ్రీ శివానందమూర్తి'' అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమబుద్ధ (2008) ఆయన ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానంపట్ల సామాన్యుడికి సూర్తినిస్తూ ఆంధ్రభూమిలో ఆయన రాసిన 450 పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్‌లో 13 భాగాలుగా ప్రసారమైంది.
    సనాతన ధర్మ చారిటబుల్‌ ట్రస్టుకు ఆయన ప్రధాన ధర్మకర్త. లలితకళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ప్రతి సంవత్సరము శ్రీరామనవమినాడు ఘనంగా సన్మానించడం ఒక సాంప్రదాయంగా వస్తూంది.
    భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, న్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్‌ అకాడెమీని స్థాపించారు. రికార్డులకోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్‌ హాల్‌ను నిర్మించారు. ఇక్కడ వర్క్‌ షాపులను నిర్వహిస్తుాంరు.
    చెన్నైలోని శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్‌ ఆయనను 2000లో రాజలక్ష్మి ఆవార్డుతో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్‌ేతో సన్మానించాయి.
    ఆయన ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుాంయి. సనాతన ధర్మాన్ని చిత్త శుద్ధితో పాిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెబుతుాంరు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అంారు.
    శ్రీ శివానందమూర్తిగారు కల్చరల్‌ ట్రస్ట్‌, ఆంధ్రా మ్యూజిక్‌ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలు సహా ఎన్నో సాంస్క ృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించారు.
    శ్రీ శివానందమూర్తిగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్‌ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
    సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త సద్గురు శ్రీ శివానందమూర్తిగారు 10.06.2015 బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలప్పుడు (87 ఏట) వరంగల్‌లోని ములుగురు రోడ్డులో ఉన్న గురుధామ్‌లో శివైక్యం చెందారు.

No comments: