సన్ధికాలములో ఆరాధింపదగిన దేవత సంధ్యా దేవత! ఆ దేవత సూర్యమండలాంతర్గత చిచ్ఛక్తి యని, ''గాయత్రి'' అని చెప్పుదురు. సన్ధి కాలములో ఏ దేవతనైనను ఉపాసించుట ''సంధ్యావందనము'' అనిపించుకొనును. గాయత్రిని ఉపాసించుట యెల్లరు చేయదగినదే! అది వారి యోగ్యతానుసారము స్తోత్ర పాఠముగా నుండ వచ్చును. మంత్ర పాఠముగా నుండవచ్చును. భజన రూపముగా నుండవచ్చును. ధ్యాన రూపముగా నుండవచ్చును.
ఇతర ప్రాణుల కంటె మనకు విశిష్టముగ బుద్ధిని ప్రసాదించి, మనకు కావలసిన గాలి, నిప్పు, నీరు, వెలుతురు, అన్నము, వస్త్రము మొదలైన సౌకర్యములు కలిగించిన ఆ భగవంతునికి కృతజ్ఞతగ ఎంతచేసిన ఋణము తీర్చుకొనగలము!! కనుక ఆ భగవంతుని ఆరాధనకై అందరూ చేయవలసినదే ఈ సంధ్యావందన రూప దైవ ప్రార్థన! అత్యుత్తమ ''ఆధ్యాత్మిక క్రమ శిక్షణ''! దీని వలన ఎప్పి పాప మప్పుడు నశించును. పుణ్‌యము చేకూరును. చిత్తశుద్ధి వలన భగవదనుగ్రహము కలుగును. దానితో జన్మ కృతార్థ మగును. అదియే మోక్షము. అందువలన, అందరూ తప్పక స్వధర్మ ప్రకారము సంధ్యావందనమనే అత్యుత్తమ ''ప్రార్థన'' చేయవలయును.
విగ్రహంలో ఉండే దైవాన్ని కరిగించి, చిక్కని కష్టాల్ని-చక్కని వరాలుగా మార్చగల అద్భుత చింతామణి - 'సంధ్యావందనం'!
మనిషిలోని నిస్సంత్తువనీ, నిరూత్సాహాన్నీ, నిరాశనీ, నిర్వేదానీ తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే కామధేనువు-'సంధ్యావందన'!
కలలోనైనా ఊహించని, కమనీయమైన వరాలని ప్రసాదించే కల్పతరువు 'సంధ్యావందన'!
రమణీయమైన ప్రకృతిలో, అతి రమణీయమైన సంధ్యా సమయంలో, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అన్ని వర్ణాలవారూ, వేదాన్ని నిర్ద్వంద్వంగా నమ్మేవాళ్ళందరూ చేయదగినదీ 'సంధ్యావందన'!
సత్యం, ధర్మం, ఆలంబనగా, నిత్యం నిర్మలమైన మనస్సుతో, సంధ్యా సమయంలో ఈ ప్రార్థన చేసుకుంటూ, ముత్యంలాిం జీవితాన్ని, ఆణిముత్యంలా మార్చుకునే అద్భుత అవకాశాన్ని, అంది పుచ్చుకోండి!! !! శుభం భూయాత్ !!

No comments:
Post a Comment