Friday, August 26, 2016

లింగాభిషేకం

లింగాభిషేకం

పరమేశ్వరుడి తలపై ఒక వైపు గంగ, మరొక వైపు చంద్రరేఖ కనిపిస్తూ ఉంాయి. ఇవి రెండూ చల్లగానే ఉంాయి. వీికి తోడు ఎడమచేతి భాగమేమో హిమగిరి దుహితా-అంటే హిమవంతుడి కుమార్తె పార్వతి. ఆమె కూడా చల్లని తల్లే. వీిన్నింకీ తోడు తెల్లవారు ఝామున అభిషేకం. ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఈ జగమంతా సుభిక్షంగా ఉండానికి. 

ఈ బ్రహ్మండమంతా అండాకారంలో ఉంటుంది. శివుడి తలపై చంద్రబింబం ఉంటుంది. అందుకే చంద్రబింబాకారంలో ఉన్న పాత్ర నుంచి ఎప్పుడూ అమృతధార పడుతూ ఉండాలి. ఆ నీళ్లు పడుతున్న సమయంలో శివలింగాన్ని ముట్టుకుంటే- అది చల్లగా ఉండాలి. అప్పుడు ఈ లోకమంతా చల్లగా ఉంటుంది. దీనికొక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. మనసు కోరికల తాపం వల్ల వేడెక్కుతుంది. దీనిని చల్లబరిచే ప్రయత్నం చేయగలిగిన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే ఎటువిం బాధలు, కోరికలు ఉన్నా అభిషేకం చేయమని చెబుతారు. ఈ అభిషేకం చేసే పంచామృతాలకు కూడా విశిష్టత ఉంది. ఈ పంచామృతాలు- మన అంతరాత్మను శుద్ధి చేస్తాయి. వీిలో ఒకో దానికి ఒకో విశిష్టత ఉంది. పంచామృతాలలో మొదటగా ఆవుపాల గురించి తెలుసుకుందాం. ఆవుపాలు సమీకృత ఆహారం. అన్ని వయస్సులవారు వీిని తాగుతారు. వేదాంతంలో జ్ఞానాన్ని పాలతో పోలుస్తారు. మానవులకు జ్ఞానం- ఆవుపాల అభిషేకం వల్ల సిద్ధిస్తుంది. ఈ పాలతో అభిషేకం చేస్తూ- ''ఈశ్వరా! ఈ ఆవుపాల అభిషేకము చేస్తున్నాను... నాకు జ్ఞానం ప్రసాదించు తండ్రి..'' అని భక్తుడు కోరుకుాండు. రెండోది తేనె. తేనె ఆపాతమధురం. తియ్యగా వుండే తేనె ఎటువిందో విషయములయందు వుండే అనురక్తి అటువింది. తేనె ఎక్కువతాగితే మత్తెక్కిపోతుంది. అలాగే విషయాలను ఎంత అనుభవించినా తృప్తి కలగదు. తేనెతో అభిషేకం చేస్తూ- ''ఈశ్వరా! నాకు ఈ విషయములయందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి. అదీ వైరాగ్యసుఖం! దానిని నాకు ప్రసాదించు..'' అని భక్తుడు ప్రార్థిస్తాడు. మూడోది పంచదార. ఇది గరుగ్గా ఉంటుంది. కానీ తీయగా ఉటుంది. ప్రతి వ్యక్తి తాను చాలా గొప్పవాడినని అహంతో విర్రవీగుతూ ఉంాడు. కాని అది ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే పంచదారతో అభిషేకం చేస్తూ- ''నాకు అవినయాన్ని తీసేసి, నాకు వినయాన్ని కృప చేయి'' అని భక్తుడు శివుడిని ప్రార్థిస్తాడు. ఆ తర్వాత ఆవునేతితో అభిషేకం చేస్తారు. ఆవునేయికి పాపాలను దహించే శక్తి ఉంది. అందుకే ''నా పూర్వజన్మములోను, ఈ జన్మములోను తెలియక చేసిన పాపాలేవైనా ఉంటే వాిని నీ కృప చేత కాల్చేయి..'' అని ప్రార్థిస్తూ ఆవునేతితో అభిషేకం చేస్తారు. 
కార్తికమాసం ఉపాసనకాలం కాబ్టి పరమేశ్వరుడి అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఫలితం లభిస్తుంది.
బిల్వార్చన రహస్యం
ఈశ్వరుడికి పూజచేసే మారేడు దళాలకు కూడా చాలా విశిష్టత ఉంది. మారేడుదళాన్ని చూడకుండా వేసినప్పుడు- ఆ ఆకు వెనకున్న ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీకాక్షం సిద్ధిస్తుందని చెబుతారు. మారేడుదళం బోర్లాపడితే జ్ఞానకాక్షం లభిస్తుందాంరు. అంటే ఆకు ఎటువైపు తగిలినా కాక్షం తప్పకుండా లభిస్తుంది. అంతే కాదు.. లక్షల ఆకులతో ఈశ్వరుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు. 'ఏక బిల్వం శివార్పణం..' అనుకొని ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు! ఒక సారి భగవాన్‌ రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవిడ వెళ్లి- ''సహస్రబిల్వార్చన చేద్దామను కుంటున్నాను. ఓ వంద బిల్వాలు తక్కువైనాయి. ఏం చేయమాంరు?'' అని అడిగిందట. ఆయన వెంటనే 'నీ ఒళ్లు గీరుకో..' అన్నారట. ఈ మాటలకు ఆవిడ ఆవాక్కయింది. అప్పుడు మహర్షి- ''పూజ అంటే ఏమి? బిల్వదళాలు పీక్కొచ్చేయటమేగా? వంద తక్కువయిందని చెట్టు గిల్లుతుాంవు? అంతకన్నా బుద్ధేం నిలబడుతుంది? వందమాట్లు చెట్టును గిల్లటం బదులుగా నిన్ను నువ్వే గిల్లుకుంటే సరిపోతుంది కదా..!'' అన్నారట. అంటే పూజ చేసేటప్పుడు దానిపై బుద్ధి నిలపటం ప్రధానం. అంతే తప్ప లెక్కలు కట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
108 ఎందుకు?
పూజలలోను, అష్టోత్తర శతనామావళిలలో తొమ్మిది సంఖ్య కనిపిస్తూ ఉంటుంది. శ్రీమహావిష్ణువుకు 108 తులసిదళాలతో పూజచేస్తారు. అష్టోత్తర శతనామావళి అని నూట ఎనిమిది నామాలు చదువుతారు. దీనికి కూడా ఒక అర్థముంది. ఈ జగత్తులో ఏ ప్రాణి ప్టుినా 27 నక్షత్రాలలోనే ప్టుాలి. 27 నక్షత్రాలకి నాలుగుపాదాలు ఉంాయి. దీనికి గుర్తుగా 108 నక్షత్ర పాదాలలోను ప్టుిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసీదళాలు, 108 నామాలతో ఈశ్వరునికి పాదార్చన చేస్తారు.
లీ లీ లీ
కార్తిక తీర్థస్నానం ఎందుకు?
మానవుల మనస్సులో సత్వగుణం ఆవిర్భవించి ఈశ్వరానుగ్రహాన్ని పోగుచేసుకోవానికి తీర్థస్నానం ఉపయోగపడుతుంది. అసలు తీర్థయాత్ర అంటే స్నానం వల్ల పుణ్యాన్ని మూటకట్టుకోవటమని అర్థం. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నదులు వేరు. తీర్థాలు వేరు. నది గట్లు అన్నీ తీర్థాలు కావు. ఉదాహరణకు గంగనే తీసుకుందాం. గంగ అనేక ప్రాంతాల నుంచి ప్రవహిస్తుంది. కానీ మణికర్ణిక అనే ప్రాంతం మాత్రమే తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఇదే విధంగా వేంకాచల పర్వతములో స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం.
అసలు ఈ తీర్థం అనే మాట పుట్టానికి వెనుక ఒక కథ ఉంది. ఆంగిరస మహర్షి ప్రపంచంలోని అనేక తీర్థాలలో యజ్ఞయాగాదులు చేశాడు. మన లోకం నుంచి ఊర్థ్వలోకాలకు వెళ్లిపోతూ, ''మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం. ఎవరు ఇక్కడకు వచ్చి స్నానం చేస్తారో వారికి ఈ యజ్ఞ ఫలితం దక్కుగాక!'' అని వరం ఇచ్చారు. అందువల్ల ఈ తీర్థాలలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఆంగిరస మహర్షి చేసిన యజ్ఞ ఫలితాలు దక్కుతాయి. వారు సోమయాజులు అవుతారు. ఇలా ప్రపంచంలో అనేక తీర్థాలలో స్నానం చేసిన వారు తీర్థులు అవుతారు. వారిని చూస్తే తీర్థస్నాన ఫలితం దక్కుతుంది.
యజ్ఞ యాగాలు ఎందుకు?
యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని జరిగితే లోకం అంత సుభిక్షంగా ఉంటుందాంరు. మన శాస్త్రాలు ఈ విధంగా చెప్పానికి ఒక కారణముంది. పరమేశ్వరుడు ఈ సృష్టిని సక్రమంగా నడపానికి ఒక ధర్మచక్రాన్ని రూపొందించాడు. దేవత లందరినీ పిలిచి, ''మీరు మనుష్యులిచ్చిన హవిస్సును ఆహారంగా తీసుకోండి. సంతృప్తి చెందితే వర్షం కురిపించండి.. దాని వల్ల పంచభూతాలు సంతోషిస్తాయి. అవి మళ్లీ ఆహార సృష్టికి కారణమవుతాయి'' అని చెప్పాడు. అందువల్ల యజ్ఞయాగాలు చేస్తే వర్షాలు కురిసి అంతా సుభిక్షంగా ఉంటుందాంరు. అయితే ఈ ఆధునిక కాలంలో యజ్ఞ యాగాదులు చేయటం చాలా కష్టం. దక్షిణాయనం అంటేనే ఈశ్వరోపాసన కాబ్టి ఈ సమయంలో తీర్థస్నానం చేస్తే యజ్ఞం చేసినట్లే.
గంగా స్నాన మాహాత్మ ్యం
కార్తికమాసంలో చేసే గంగాస్నానానికి ఒక విశిష్టత ఉంది. స్కందపురాణంలో ఆగస్త్య మహర్షితో సుబ్రహ్మణ్యుడు, ''అన్ని క్షేత్రాలకు ఎందుకు వెళ్లాలి, అన్ని తీర్థాలలోను ఎందుకు స్నానం చేయాలి అనే అనుమానం రావచ్చు. వీటన్నిం దర్శనం వల్ల, తీర్థాలలో స్నానాల వల్ల కాశీపట్టణ ప్రవేశానికి, విశ్వనాథుడిని సేవించానికి, గంగాస్నానాన్ని చేయానికి అధికారం లభిస్తుంది'' అని చెబుతాడు. అంతే కాకుండా ప్రతి కాలానికి ఒక విశిష్టత ఉంటుంది. కార్తికమాసానికి కూడా అలాిం విశిష్టతే ఉంది. అందువల్ల కార్తికమాసంలో గంగా స్నానానికి చాలా ప్రత్యేకత ఏర్పడింది.
గంగ ఒడ్డున దీపాలు..
కార్తికమాసంలో అసురసంధ్యవేళ గంగ ఒడ్డున నిలబడి కార్తికదీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహా ముచ్చటగా వుంటుంది. దానికి అసలైన తాత్త్వికమైన అవగాహనను తెలుసుకోవాలంటే భారతంలో ఒక పద్యం చాలా ఉపకరిస్తుంది. శ్రీకృష్ణపరమాత్మను కుంతీదేవి
యాదవులందుఁ బాండవులయందు నధీశ్వర నాకు మోహవి
విచ్ఛేదము సేయుమయ్య ఘనసింధువుఁ జేరెడిగంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁగదయ్య యీశ్వరా. (భాగ.1-199) అని కోరుతుంది.
''ఓ కృష్ణా! యాదవులందు, పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయి. గంగ సముద్రంలో కలిసిపోయినట్లు, నా బుద్ధి నిను చేరేటట్లు చేయి..'' అని కోరుతుంది. మన శరీరంలోపల ఒక దీపం ఉంటుంది. ఆ దీపం శాశ్వతం. శరీరాలన్నీ తాత్కాలిక ఆవాసాలే. లోపల జ్యోతివెలుగుతున్నప్పుడు ఈ శరీరం పనిచేస్తుంది. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళి పోయిందా ఇక శరీరంతో చేసేదేమీ ఉండదు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమాంరు. ఒకసారి జ్యోతి ఆరిపోయిన తర్వాత ఈ శరీరం అగ్నియందు సంస్కరింపబడుతుంది. శరీరం ఉంటేనే ఎవరికైనా ఉపకారం చేయడం, నదీస్నానం చేయడం, భగవన్నామం చెప్పడం విం పనులు చేయగలుగుతాం. అలాిం గొప్ప జ్యోతి మన శరీరంలో ఉంటే దానిని వదిలేసి, తాత్కాలికమైన ప్రపంచాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నాం. అలాిం దీపం ఎప్పికైనా పరమాత్మలో కలిసిపోవాల్సిందే. ఈ విషయాన్ని చెప్పానికే కార్తికమాసంలో దీపాలు పెట్టమని చెబుతారు. గంగలో వదిలిన దీపాలు నీిలో తేలుతూ సముద్రంలో కలిసినట్లు, మన ఆత్మజ్యోతులన్నీ కూడా పరమాత్ముడిని చేరతాయని తెలియజేయానికే దీపాలను వదులుతారు.
లీ లీ లీ
కార్తికమాసంలో గోపూజ ఎందుకు చేయాలి?
కార్తికమాసంలో ప్రశస్తమైన రెండు తిథులు ఉన్నాయి. ఒకి శుక్లపక్షంలో వచ్చే అష్టమి. రెండవది కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశి. శుక్లపక్ష అష్టమిని గోపాష్టమీ అంారు. ద్వాదశినాడు చేసే పూజను గోవత్సపూజ అంారు. ఈ రెండు రోజులు గోవును పూజించటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు. మఠాలలోను, దేవాలయాలలోను మూడు రకాల జంతువులకు పూజలు జరుగుతాయి. అవి గజపూజ, అశ్వపూజ, గోపూజ. ఈ మూడింలో గజపూజ, అశ్వపూజలు పశుపూజలు. గోపూజ మాత్రం పరదేవతాపూజ. అసలు గోవుకు ఇంత విశిష్టత ఎందుకు ఉంది? ఇది తెలుసుకోవాలంటే గోపుట్టుకను తెలుసుకోవాలి.
చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అనేక ప్రాణులు ప్టుాయి. కానీ గోవు మాత్రం చతుర్ముఖ బ్రహ్మసృష్టిలోనిది కాదు. గోవును సృష్టించింది వసువులు. ఒకానొకప్పుడు ప్రజాపతి వసువులందరిని పిలిచి- ''ప్రపంచంలో ఎక్కడా లేనటువిం ప్రాణిని సృష్టించండి. అది పరబ్రహ్మ స్వరూపమై ఉండాలి'' అని కోరాడు. వసువులు తన అశక్తతను తెలియజేశారు. అప్పుడు ప్రజాపతి వారికి, ''నూరేళ్లు ఎడతెరపి లేకుండా హోమం చెయ్యండి. మీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో ఓ ప్రాణిని సృజించండి'' అని సలహా ఇచ్చాడు. అష్ట వసువులూ ప్రజాపతి సలహా పాించి తమ తపశ్శక్తితో గోవును సృష్టించాడు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఆ గోవు సంతానమే.
వేదంలో గోవు :
వేదంలో గోవును ''గౌరగ్నిహోత్రః'' అని వర్ణిస్తారు. గోవు అగ్నిహోత్రంగా భావించటం వెనక ఒక రహస్యముంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్యప్రాప్తికి సంబంధించిన ఆశీర్వచనం చేస్తారు. ''మేధావీ భూయాసన్‌ యశస్వీ భూయాసన్‌'' అంటూ ఆ యజ్ఞ భస్మం తీసి అవయవాలకు రక్షగా పెడతారు. అలాిం అగ్ని స్వరూపానికి ప్రతిగా గోవును భావిస్తారు. అగ్ని ఎంత ఐశ్వర్యాన్నిస్తుందో గోవు కూడా అంతే ఇస్తుంది. ప్రతిరోజూ హోమం చేసి, పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం అనుగ్రహాన్ని పొందటం చాలా క్లిష్టమైన పని .ఈ ఫలితాన్ని సులభంగా పొందే అవకాశం గోపూజ ద్వారా లభిస్తుంది. గోవు పృష్ట భాగంలో కాస్త పసుపూకుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమప్రసన్నురాలవుతుంది.
ఎందుకంటే, లక్ష్మీదేవి నివసించే అయిదు స్థానాలను పెద్దలు నిర్ధారించారు. వాిలో మొదిది ఏనుగు కుంభస్థలం. రెండవది ఆవు వెనకతట్టు. మూడవది తామరపువ్వు. నాలుగవది బిల్వదళం వెనుకభాగంలో ఉండే ఈనెలు. అయిదవది సువాసినీ పాపట ప్రారంభస్థానం. అందువల్ల ఆవు పృష్టపూజతో లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. దీనితో పాటుగా గోవును దానం చేయటం వల్ల విశేషమైన పుణ్యం వస్తుంది. ఉదాహరణకు, మనం ఒకరికి బట్టలు దానం చేస్తే, దానికి తగ్గ ఫలితమే దక్కుతుంది. కానీ ఒక గోవును దానం చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. దాతకు ఆ ఫలితం లభిస్తుంది. మరి గ్రహీతకో? అతని తపశ్శక్తి క్షీణించకుండా ఏకాసిని సహస్రం అనే మంత్రాన్ని దేవాలయంలో కూర్చుని పారాయణం చేయాలి. గోసేవనం కూడా చాలా గొప్పది. అందుకే చాలామంది ఆవుకు కాస్తంత పచ్చగడ్డి పరకలు పట్టుకుని తినిపించి, ప్రదక్షిణం చేసి గంగడోలు దువ్వి, వెనకత్టి, పృష్టభాగంలో పసుపు కుంకుమ వేసి వెళ్ళిపోతారు. దీనివల్ల వచ్చే ఫలితం ఆపారం. పరమాత్ముడు ఆ గోవు శరీరానికి ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్కపెడతాడు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన నూరు యజ్ఞాలు చేశారని లెక్కవేస్తాడు. ఇదే విధంగా గోవును హింసిస్తే వచ్చే ఫలితం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది.
ఒక పరమ సాత్వికమైన వ్యక్తిని ఇల్లు దాిపోయేవరకు కొడితే ఏ పాపం వస్తుందో నిష్కారణంగా ఆవు ఒంి మీద  చెయ్యిప్టిె కొడితే ఆ పాపం వస్తుంది. మన ప్రపంచంలోని 84లక్షల జీవరాసులలో మలమూత్రాలు సుగంధభరితాలైన ప్రాణి గోవొక్కటే. దాని మూత్రపురీషాలు సువాసనతో కూడుకుని ఉంాయి. ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుమూత్రం, ఆవుపురీషం అంటే ఆవుపేడ ఈ అయిదింని కలిపి పుచ్చుకోవాన్ని పంచగవ్యప్రాశనం అంారు. దీనిని సమంత్రకంగా లోపలికి పుచ్చుకుంటే పెద్ద పెద్ద క్రతువులు చేసేటప్పుడు శరీరంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఆయుర్వేదం వేదానికి ఉపాంగం కాబ్టి దీనిలో గోమూత్రంతో ప్రత్యేకంగా తయారుచేసే ఔషధికి గోమూత్ర శిలాజిత్‌ అని పేరు. దీనిని సేవించివారి శరీరానికి విపరీతమైన రోగనిరోధకశక్తి వస్తుంది. గోశాలలో ఉండే దర్భల్ని తెచ్చి హోమం చేస్తే దాని వల్ల అజేయులవుతారని నమ్ముతారు. అందుకే పూర్వం రాజులు ప్రత్యేకంగా గోశాలలు పెంచి, ఆ గోవులు తిరిగే ప్రాంతంలో, వాి మలమూత్రాలు ఉండేచోట గడ్డి పెంచేవారు. అవి ఎత్తుగా పెరిగి ఉండేటట్టుగా కాపాడేవారు. యుద్ధ సమయంలో గోశాలలో పెరిగిన దర్భగడ్డితో హోమం చేసేవారు. అందుకే కార్తికమాసంలో గోపాష్టమినాడు, ద్వాదశి తిథినాడు గోపూజ తప్పనిసరిగా చేయాలి.
కంచిస్వామి-గోశాల  : 
నడిచే దేవుడని పేరుపొందిన కంచి కామకోిపీఠాధిపతులు చంథ్రేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి గోవులంటే పరమప్రీతి. ఆయన వీలైనంత ఎక్కువ సేపు గోవులతోనే గడిపేవారు. ఒకసారి మహాత్మా గాంధీని కలుసుకోవాల్సి వస్తే గోశాలలోనే కలుసుకున్నారు. అక్కడే మ్లాడుకున్నారు. పరమాచార్య స్వామివారు శ్రీశైల క్షేత్రానికి వెళ్లినప్పుడు కూడా మఠంలో విశ్రాంతి తీసుకోకుండా రాత్రంతా గోశాలలోనే నిద్రపోయేవారు. ఒకసారి ఆయన ఏకాదశి రోజున బయటకు వెళ్తున్నారు. పొలం గట్టువెంట నడవాల్సి వచ్చింది. ఆ పొలం నూతి దగ్గరికి రెండు ఆవుల్ని తీసుకురమ్మని, ఆ నూతి గట్టు మీద కూర్చుని ఆ రోజంతా భగవధ్యానంలో గడిపారు.
లీ లీ లీ
కార్తిక ఉపాసన ఎలా చేయాలి?
కార్తికమాసంలో ఉపాసన చేసేటప్పుడు ఈశ్వరుడితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకోవాలి. ఆ అనుబంధాన్ని స్మరించకుండా ఏం చేసినా యాంత్రికమైపోతుంది. ఏదైనా ప్రేమతో చేసినదై ఉండాలి తప్ప, ఏ భావనా లేకుండా చేసిందై ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. భగవంతుడిని మనం ప్రేమిస్తే.. పరమేశ్వరుడు మనని కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇది అవగాహన అయిననాడు భగవంతుడికి, మనకు ఉన్న అనుబంధం మన మనసుకు తెలుస్తుంది. పూజకు కూర్చున్నా, మామూలుగా స్మరించినా ఒంో్ల పులకరింతలు కలుగుతాయి. ''కర్మ తత్‌ జడం'' అంారు రమణమహర్షి. మనసు ప్రధానం. ఇది భగవంతుని దగ్గరకు నిజంగా వెళ్తే ఈశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడి దగ్గరకు మనసును చేర్చే సాధనాలే పువ్వులు, ఉపచారాలు. మనసు లొంగకుండా యాంత్రికంగా, 'ఓం ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగవే నమః' అని పువ్వులొక్కటే వేస్తూ పోతే ప్రయోజనం ఉండదు. ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్త కాదు. ఆయన సృష్టిలోనిదే ఆ పువ్వు. ఈశ్వరుడిది కానిది, మనదైనది ఈలోకంలో ఏదీలేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే. ఆయన సృష్టిలోనివే. ఆయన సృష్టిలోనివే అయినా మనం వాికి ప్రేమను కలిపి ఇస్తే పరవశించిపోయి తీసుకుాండు.
మీకో ఉదాహరణ చెబుతాను. భగవంతుడికి నైవేద్యం ప్టిెన చక్కెర పొంగలిని తల్లి కొడుకుకు పెడుతుంది. ఆ కొడుకు చాలా మెచ్చుకుాండు. 'అమ్మా! నువ్వు కూడా తిను...' అని నోిలో పెడతాడు. అప్పుడు ఆ తల్లి ఆనందానికి హద్దులు ఉండవు. భర్త దగ్గరకు వెళ్ళి, ''ఏమండీ, ఇవాళ వాడు చక్కెర పొంగలి చాలా బాగుందని నాకు ప్టిె తరువాత వాడు తిన్నాడు. ఫరవాలేదు, పరమేశ్వరుడు మనకు మంచి కొడుకునిచ్చాడు...'' అని మురిసిపోతుంది. కొడుకు చక్కెర పొంగలి చేయలేదు. దానికి కావాల్సిన దినుసులు కూడా వాడు సంపాదించలేదు. కానీ వాడు ప్టిెన చిన్న ముద్దతో అమ్మ మురిసిపోతుంది. అమ్మలాగానే ఇన్ని బ్రహ్మాండాలను సృష్టించి, అందరికీ శరీరాల్నిచ్చిన పరమేశ్వరుడు, భక్తితో ఒక్క పువ్వును పాదాలమీద వేస్తే మురిసిపోతాడు.
త్రయంబక ఉపాసన
త్రయంబకుడు అంటే 'త్రయాణాం, లోకానాం, అంబకః పితా'- అని అమరకోశం చెబుతుంది. మూడు కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతికి తల్లీ, తండ్రీ అయినటువింవాడు త్రయంబకుడు. నారాయణుడు, త్రయంబకుడు ఒకరే. పరమేశ్వరుడే నీలమేఘశ్యాముడై శంఖ చక్ర గదా పద్మాలను పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ 'స్ఫిక మణినిభం పార్వతీశం నమామి' అన్నట్టు కూర్చుంటే శంకరుడు. ''శాకంభరీతి శశిశేఖర వల్లభేతి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి'' అంారు శంకరాచార్యులవారు. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంాడు. అమ్మవారి రూపం దాలుస్తాడు. చదువు కావాలని అడిగితే ఆమె వీణపట్టుకు కూర్చుంటుంది. భక్తిభావం పడుతుంటే పద్మంలో కూర్చుని అభయ హస్తాన్ని చూపిస్తుంది. శరీర పటుత్వం కావాలి అని అడిగితే ఆమె రుద్రాణి స్వరూపిణియై మన ముందు కూర్చుంటుంది. ఏది కావాలని కోరుకుంటే దానికి అనువైన రూపాన్ని దాలుస్తుంది.
ఇప్పుడు ఒక లౌకికమైన ఉదాహరణ చెబుతాను. ప్రభుత్వం అంటే ఏమి? దానికి ఒక రూపం ఉండదు.
రేషన్‌కార్డు ఇవ్వాలంటే ఎమ్‌.ఆర్‌.ఒ.గా కూర్చుంటుంది. ఇంో్ల దొంగలు పడితే పోలీసాఫీసర్‌ అవుతుంది. పుస్తకాలు కొనుక్కోలేకపోతే లైబ్రరీ రూపంలో కూర్చుంటుంది. బతకానికి ఆధారం లేకపోతే రెండెకరాలు భూమి ఇచ్చే కలెక్టర్‌ అవతార మెత్తుతుంది. కానీ ప్రభుత్వం ఏదీ, ఎక్కడుంది అని అడిగితే కనబడదు. అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. అన్ని శాఖలు ప్రభుత్వమే కదా.. అని ఇంో్ల దొంగలు పడితే ఎమ్‌.ఆర్‌.ఒ. ఆఫీస్‌కు వెళ్ళకూడదు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాలి. ఇదే విధంగా ఏ కాలంలో ఏ రూపాన్ని ఆరాధిస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడో దానిని గ్రహించాలి. ఇది తెలుసుకున్న రోజు త్రయంబక స్వరూపం, దామోదర రూపం ఒకటేనని తెలుస్తుంది. దానిని ఆరాధిస్తే చాలు. అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు-
వటుర్వా గేహీ వా యతిరపి జీ వా తదితరో నరో వా యః కశ్చిద్‌భవతు భవ! కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో! భవసి భవభారం చ వహసి.
అంారు. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సన్యాసివా అనేది ఎవడిక్కావాలి? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని ఇక్కడ ప్టోవా చెప్పు. చెప్తే ఆయన వెంట పడతాడు.
చంథ్రేఖర భారతీ స్వామి! : 
మహానుభావుడు, జీవన్ముక్తుడు చంథ్రేఖరభారతీ స్వామి వారు అపురూపమైన వ్యక్తి. శృంగేరి పీఠాధిపత్యం వహించారు. ఆయన భక్తి తీవ్రంగా ఉండేది. స్వామివారు తన్మయత్వ స్థితిలో ఉన్నప్పుడు చెప్పే శ్లోకాలను శిష్యులు రాసుకుంటూ ఉండేవారు. ''ఓం నిధనపతయే నమః'' అని చంద్రమౌళీశ్వరుడి పూజ చేస్తూ గంటల కొద్ది ఉండిపోయేవారు. కొన్ని రోజుల పాటు స్నానం చేసేవారు కాదు.. పీఠాధిపతి స్నానం చెయ్యకుండా ఉండకూడదని, శిష్యులు బిందెతో ఆయనపై నీళ్ళు పోసేసేవారు. ఆయన తనలో తాను అలా రమించిపోతూ ఈశ్వర దర్శనం చేస్తూ ఉండిపోయేవారు. ఆయన త్రికాలవేది. వారికి తెలియని విషయం ఉండేదికాదు. ధ్యానంలో ఉండి అన్నీ చెప్పేవారు. ఒకసారి ఆయన ధ్యానంలో నుంచి హఠాత్తుగా బయటకు వచ్చి, నేపాల్‌ ప్రభువులకు ఇవ్వమని శిష్యులకు ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు. ''తొందరలోనే మీ ఉపద్రవం తగ్గిపోతుంది. మీరు రాజ్యాధికారం తిరిగి పోందుతారు'' అని ఆ ఉత్తరంలో ఉంది. స్వామి చెప్పినట్లే నేపాల్‌ రాజుకు ఉపద్రవ్యం వచ్చింది. మళ్ళీ దానిని తట్టుకొని నిలబడగలిగారు.
అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రాధాన్యం
పరమ పవిత్రమైన కార్తికమాసంలో అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. ఆ అపమృత్యుదోషం పోగొట్టడానికి వీలైన తిథులు ఈ నెలలో వస్తాయి. దైవ ఉపాసన అవసరంలేకుండానే- అత్యంత ప్రేమతోకూడిన మానవీయ సంబంధాలతో ఈ భయాలు తొలగించుకోవచ్చు. అలాిం ఒక సంబంధమే అన్నాచెల్లెళ్లది. దీనికి ఒక కథ కూడా చెబుతారు. సాధారణంగా దేవుళ్లకు కూతుళ్లుండరు. అందరూ కొడుకులే ఉంారు. సూర్యభగవానుడికి మాత్రం ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురి పేరు యమున. కొడుకు యముడు. యమున అంటే కాలానికి గుర్తు. తిరిగి రానిదని అర్థం. కాలంలో ఎవరు పడిపోవాలో వారిని పడగొట్టేవాడు యముడు. ఇది వీరిద్దరి మధ్యా ఉన్న సంబంధం. ఎంత దేవతైనా ఆమెకు కూడా తన అన్న ఇంికి రావాలనే కోరిక ఉంటుంది కదా! కానీ యముడికి క్షణం ఖాళీ ఉండదు. పాపుల్ని విచారించాలి. వారిని శిక్షించాలి. పోలీసు ఆయనే, మేజిస్ట్ర్‌ే ఆయనే. అసలే కార్తికమాసంలో యముడు చాలా బిజీగా ఉంాడు. అయినా చెల్లి పిలిచింది కాబ్టి కాదనలేక భోజనానికి వచ్చాడు. యమున పరమ ప్రేమతో అన్నం ప్టిెంది. భోజనం చేశాడు. చేసిన తర్వాత చెల్లెలికి ఏమైనా బహుమతి ఇవ్వాలిగా? ''అమ్మా! ఏం కావాలి చెప్పు'' అన్నాడు యముడు. ''అన్నయ్యా! నీ పేరు చెప్పేటప్పికి లోకం అంతా భయపడుతుంది. నువ్వు ఎంత ధర్మరాజువైనా, ఎంత ధర్మాత్ముడివైనా, మీ అన్నయ్య యమధర్మరాజుగారండీ.. అని అందరూ భయపడుతూ ఉంారు. అందుకని నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ కార్తికమాసంలో నువ్వు శుక్లపక్ష విదియనాడు మా ఇంికి వచ్చి భోజనం చేశావు కదా.. అలా ఏ సోదరి ఇంికి సోదరుడు వెళ్లి భోజనం చేసినా వాడి జోలికి నువ్వువెళ్లద్దు. అపమృత్యు నివారణార్థం మృత్యుంజయ హోమం, రుద్రాభిషేకం ఎలాిం ఫలితాలు ఇస్తాయో అలాిం ఫలితాలు ఇవ్వు'' అని కోరింది. యముడు వెంటనే అంగీకరించాడు.
అందుకే కార్తికమాస శుక్లపక్ష విదియనాడు ఏ అన్నయ్య అక్కా చెల్లెళ్ల ఇంికి వెళ్ళి అన్నం తిండో ఆ అన్నయ్యకి అపమృత్యుదోషం ఉండదాంరు. అందుకే దానిని సోదరి ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత వచ్చే తదియనాడు అక్కాచెల్లెళ్లను తీసుకువచ్చి పురుషులు సువాసినీ పూజచేయాలి. మంగళ ద్రవ్యాల్ని బహూకరించాలి. సువాసినీ పూజ చేసేటప్పుడు సువాసినీ నామాలు చదవాలి. సువాసినీ అంటే... ''గురుభక్తి పరాయణురాలు. వేదమంటే విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండే విషయాలను వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని ప్రేమించేది, అతిథుల్ని పరమప్రేమతో, మర్యాదతో చూసేది, కడుపున సంతానం కలిగి, ఆ సంతానం నష్టం కాకుండా బతికి ఉన్న పిల్లలతో సంతోషంగా గుడుపుతున్నది, అన్నినీ మించి బంధువులకు అన్నం పెట్టగలిగినది, బంధువుల పిల్లలు తన ఇంికి వచ్చినప్పుడు, తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది'' అని మన శాస్త్రాలు చెబుతాయి. ఇలాిం లక్షణాలున్న సువాసిని పాదాల్ని పళ్ళెంలో ప్టిె కడిగి ఆ తీర్థాన్ని తాగాలి. ఆమెకు జాబందనం చేయాలి. జాబంధనం అంటే పూలతో ఆమె జడను అలంకరించటం. ఆ తర్వాత సువాసినికి మంగళ ద్రవ్యాలు ఇవ్వాలి. ఎర్రి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోయిన పాలు, అలాగే పసుపు కుంకుమలు, గాజులు, అనుములు ఇలాింవి చిన్న చిన్న సంచులలో ప్టిె వీటన్నింనీ కలిపి వస్త్రద్వయం మీద ఉంచి సువాసినీ చిహ్నాలైన మెట్టెలు, ఇవ్వగలిగితే బంగారుతో చేసిన మంగళసూత్రాలు, నల్లపూసలు, కురులలోకి పువ్వులు, కుంకుమ, పాదాలకు పసుపురాసి బొట్టుప్టిె సిగలో పువ్వులు అలంకారం చేసి, ఒంికి పరిమళ ద్రవ్యాలు అద్ది, ఈ పదార్థాలన్నింని బహూకరించి నమస్కరించాలి. ఎవరైతే అలాిం పూజ చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారు ప్రసన్నురాలైతే అన్ని గ్రహాలూ ప్రసన్నమయినట్లే!
అన్నయ్యంటే..
అన్నయ్యా అన్నమాట ఎవరు కనిప్టోలరో గానీ, ఆ పిలుపు అంటే పోతనగారికి ఎంతో ఇష్టం. 'అమ్మా', 'అన్నయ్యా' అనే రెండు పదాలు అవకాశం వచ్చినప్పుడల్లా వాడుతూనే ఉంారు.
అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడలు సీర లిచ్చుో మన్నన సేయుో మధురమంజులభాషల నాదరించుో విన్నులమ్రోఁతలే నిజము మే లని చంపకుమన్న మాని రా వన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేఁడెదన్‌. (భాగ.10పూర్వ.26)
అంాడు వసుదేవుడు. ఈ పద్యంలో వసుదేవుడు బావా అని సంబోధించడు. అన్నవు నీవు చెల్లెలికి అంటూ మొదలు పెడతాడు పద్యాన్ని. దేవకీ దేవి దగ్గరకు కంసుడొచ్చి బిడ్డను లాగేస్తే ఆవిడ ఆ కంసుని వంక చూసి.
అన్న శమింపుమన్న తగ దల్గుఁడు గ్లాడిది మేనగోడ లౌ
మన్నన సేయుమన్న విను మానినిఁ జంపుట రాచపాడిగా
దన్న సుకీర్తివై మనఁ గదన్న మహాత్ములు పోవుత్రోవఁ బో
వన్న భవత్సహోదరిఁ గదన్న నినున్‌ శరణంబు వేఁడెదన్‌. (భాగ.10పూర్వ150)
అంటుంది ఒకికి పదిమార్లు అన్నయ్య, అన్నయ్య అని వేడుకుంటుంది.
లీ లీ లీ
కార్తిక దీపాలెందుకు?
శంకారాచార్యులవారు దక్షిణామూర్తి స్తోత్రంలో, ''నానాచ్ఛిద్ర ఘోదర స్థితమహాద్వీప ప్రభాభాస్వరం, జ్ఞానం యస్య తు చకక్షురాదికరణద్వారా బహిః స్పందతే'' అంారు. ''ఆత్మ కాంతి కిం మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను అయిదు ఇంద్రియాలకూ నాయకురాలి లాింది. కన్ను లేకపోతే సుఖాలన్నీ చచ్చిపోయినట్లే. కన్నుంది కాబట్టే చాలా సుఖాలున్నాయి. అటువిం కింని నాకిచ్చినందువల్ల నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, నా చెట్లని, పరమేశ్వరమూర్తిని, రామాయణాన్ని, గ్రంథాల్ని శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇవి చూసి ఎంత పొంగిపోతున్నానో ఈశ్వరా! ఈ కన్ను నాకిచ్చావు కాబ్టి ఇన్ని ఉన్నాయి, ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నాను'' అనేది దీని అర్థం.
అందుకే మనం దీపం ప్టిె ఈశ్వరుడికి పూజను ప్రారంభిస్తాం. కానీ కార్తికమాసంలో పెట్టే దీపం అందుకోసం కాదు. ఈ మాసంలో పెట్టే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యం ఉంది. కార్తిక సోమవారం పెట్టే దీపానికి ఒక ప్రాశస్త్యం ఉంది. చంద్రుడు మొట్టమొది హోరలో ఉన్నటువిం రోజున ప్రారంభమయ్యే రోజుకు సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ ఒక రోజులో ఎనిమిది హోరలు మూడు పర్యాయాలు తిరుగుతాయి. మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు మొట్టమొది హోర, అన్నికన్నా ప్రారంభంలో ఉండే హోర సూర్య హోర. తరువాత వచ్చేది శుక్ర హోర, తరువాత గురు హోర, తరువాత కుజ హోర. ఎనిమిది హోరలు. అందుకే ఆ హోరలు మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు పూర్తి, మళ్ళీ ఇరవై అయిదవ హోర వచ్చేటప్పికి హోర ప్రారంభమవుతుంది. కాబ్టి దానికాపేరు.
సోమవారం ఉందనుకోండి చంద్ర హోరతో మొదలవుతుంది. చంద్ర హోరతో మొదలవుతుంది కాబ్టి సోమవారం అని పిలుస్తాం దాన్ని. ఆదివారమనుకోండి సూర్య హోరతో ప్రారంభమవుతుంది. సూర్య హోరతో ప్రారంభమవుతుంది కాబ్టి ఆదివారం, భానువారం అని పిలుస్తాం. ఈ ఎనిమిదే ఇరవై నాలుగు గంటలలో పూర్తి అయిపోతాయి. అటువిం రోజుల్లో సోమవారంనాడు చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని పిలుస్తుాంరు. మనకి వేదాంతశాస్త్రంలో ఒక మాట చెప్తారు. హృదయ స్పందనే మనుష్యప్రాణి జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటుందో అంతసేపు బతికివున్నాడాంరు. గుండె ఆగిపోయిదనుకోండి ఆయన వెళ్ళిపోయాడండీ అంారు. ఈ గుండె కొట్టుకోవటం అనే దానికి హృదయంలో హృదయనాడి అనే నాడి ఉంటుంది.
నాడి మీకు భౌతికంగా కనబడేదికాదు. అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహమయి పోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయికి వచ్చిన కారణం వల్ల ఆ కాలంలో హృదయనాడి మూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు దేనికి ఎక్కువ ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వల్ల. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వత్తి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయనాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు పీల్చి వదులుతాడు. ఆయుఃకారకమవుతుంది. హృదయనాడి నిలబడుతుంది. అందుకని దీపాలు పెడతారు. అందరినీ దీపం పెట్టండి అంారు. ప్రతివారిని దీపం పెట్టండంటూ కార్తికమాసం ఉదయం దీపం, సాయంకాలం దీపం ఎందుకు ప్టిెస్తారంటే సమస్త భూతకోికి ఉపకారం చెయ్యమని. వాతావరణంలో ఆరోగ్యకరమైన వేడిని పెంచమని. బాహ్యంలో ప్రతిపాదన చేయడానికి ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతోగానీ ప్టిెన దీపమే పెట్టమని చెప్పానికి వెనక ఉన్న తార్కికమైన కారణమది.
ఉపనిషత్తులో దీపం : 
దీపం గురించి ''న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో-యమగ్నిః... తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి'' అని ఉపనిషత్తులు చెబుతాయి. పరమేశ్వరుడు ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగు ముందు ఈ వెలుగు పనిచెయ్యదు. కాబ్టి ఆయన ఒక్కరే ప్రకాశిస్తూ ఉంాడు. అందువల్ల ప్రకాశిస్తున్న ఆ కాంతి పుంజమున్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. దీనినే పోతనగారు-
లోకంబులు లోకేశులు లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగుపెం జీఁకి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్‌ 
అని వర్ణిస్తారు. ఇది భాగవతం అష్టమ స్కందంలో ఉంటుంది. అందరూ మహా ప్రళయంలో పడిపోతే, కిక చీకి ఆవరిస్తే, సూర్యచంద్రుల గమనమాగిపోతే, ఈ కిక చీకికావల ఒక్కడు వెలిగిపోతూ ఉంాడు. ఆ వెలిగిపోతున్న వెలుగుకు వెలుగైనదొక్కటున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానాండు గజేంద్రుడు.
లీ లీ లీ
కార్తికస్నానం ఎలా చేయాలి?
కార్తికమాసంలో నదీస్నానం చేసితీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒకమాట గుర్తు పెట్టుకోవాలి. కార్తికమాసంలో నదీ స్నానం చెయ్యడమంటే పక్కన ఉన్న నదిని వదిలిప్టిె ఎక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు కార్తికమాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే, ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదే! ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దాలు చేస్తూ, సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంాయి. అలా వెళ్లిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. ఆవిడ కార్తికమాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది. అందుకే కార్తికమాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదాంరు. కార్తికమాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీిని అమృతధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలగకుండా కాపాడుతుందన్నమాట.
అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనస్సు సాత్వికమై, పరమేశ్వరాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే, మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తికమాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీస్నానం చేసేటప్పుడు ఒంిమీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు ''నేను ఫలనాచోట ఉండి పూజ చేస్తున్నాను, ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేిం? వాడు సర్వజ్ఞుడేిం?'' అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే- ''గంగా కావేర్యోః మధ్య దేశస్థే, గంగా గోదావర్యోః మధ్య దేశస్థే'' అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్లిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చెయ్యాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకి తప్పనిసరిగా చెయ్యాలి.
నదీస్నాన ఎవరు చేయకూడదు?
శ్రావణ మాసంలో నదులు విశేషమైన వేగంతో ప్రవహిస్తూ ఉంాయి. ఈ ప్రవాహంలో చాలాసార్లు పాములు కొట్టుకొస్తూ ఉంాయి. అందువల్ల శ్రావణమాసం నదీ స్నానం చేయవద్దని పెద్దలు చెబుతూ ఉంారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. శాస్త్ర ప్రకారం పురుషుడు నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. స్త్రీలు వాలుకి చేయాలి. అభిముఖంగా స్నానం చేస్తే పాములు కొట్టుకు వచ్చి కాటువేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పురుషులను శ్రావణ మాసంలో మాత్రం ఎటువిం పరిస్థితుల్లోను నదీ స్నానం చేయవద్దని చెబుతారు.
అమ్మవారి రూపాలు :
ఈ జగత్తును రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసం వచ్చేటప్పికి వేప పువ్వు రూపంలో, కార్తికమాసం వచ్చేటప్పికి ఉసిరికాయ రూపంలో, ఆషాఢమాసంలో గడ్డిపరక రూపంలో అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఆషాఢమాసంలో కుక్కలు లేత పచ్చిగడ్డిని కొరుక్కుతింయి. దీనివల్ల వాి కడుపులో అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు బయటకు వచ్చేస్తాయి.
లీ లీ లీ
దీపం ఓ ఆధ్యాత్మిక మార్గం
దీపం యథార్థంగా పరమేశ్వర స్వరూపం. ఏ సహస్రనామాన్ని చదివినా దానిలో అనేక నామాలుాంయి. దానిలో పరంజ్యోతి అనే నామం కూడా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అలాిం ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. ఈశ్వరుడు కాంతి స్వరూపి. ఆయన ఎప్పుడూ మన వెనుక వెలుగుతూ ఉంాడు. పోతనగారు భాగవత రచన చేస్తూ ఈశ్వరుడు, ''స్త్రీ పురుష, నపుంసక మూర్తిలోకాక, క్రియ అక్రియ వరాహమూర్తియు కాక,.. వుండు తాను విభుతలంపు'' అంారు. మన వెనక ఉండి ప్రకాశిస్తూ మన శరీరాన్ని ఎంత కాలం నిలబడాలో అంత కాలం ఊపిరిని చిత్రంగా, గుప్తంగా నిలబ్టెి, ఆ ఊపిరి అయిపోగానే బయికి వెళ్ళి శివాన్ని శవం చేసి పడగొట్టగలిగిన స్వరూపమే అది. అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్రపుష్పంలో ''నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా'' అని చెబుతారు.
అంటే, ఈశ్వరుడు అణువంత రూపంతో ఇక్కడ ప్రకాశిస్తుాండు. ఆ కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతోంది. దాన్ని ఏ  పేరు ప్టిె పిలవాలి? ''స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో-క్షర పరమః స్వర్‌ా''. నువ్వు ఏ పేరు ప్టిె పిలిచినా ఈ కాంతి పలుకుతుంది. యథార్థానికి అది ఒక రూపం కాదు. అది ఒక కాంతి. అందుకే వెలుగుతోంది. భాస్కర అని దానికి పేరు. భా అంటే కాంతి. ఒక పెద్ద వెలుగు ముద్ద ఒకి ఇక్కడ కూర్చుని ఉంది. ఆ వెలుగుల ముద్ద కాంతి కొడుతోంది. తిర్యగూర్ధ్వమధశ్శాయీ అని చెబుతున్నాం కదా... పైకి పక్కలకి, కిందకి కాంతి కొడుతుంది. ఆ కాంతే పరమేశ్వరుడు. నువ్వు సాకారం చేస్తే నువ్వు ఎలా కావాలంటే అలా కనబడతాడు. నిజానికి ఆయనకొక ఆకారమెక్కడుంది? ఆకారముండదు. అలాంటప్పుడు దేనిని పూజించాలనే సందిగ్ధత ఏర్పడుతుంది. దీనిని నివారించానికే శంకరాచార్యులవారు వేదాంత డిండిమం చేస్తూ, ''ఆకారంచ నిర్గుణంచ, సాకారంచ గుణాకరం తత్త్వం తత్త్వం...' అంారు.
ఈ ప్రపంచంలో నిర్గుణం, సగుణం అని రెండు రకాలు ఉంాయి. నిర్గుణంలోకి వెళ్ళాలన్నవాడు పరమ వైరాగ్యంలోకి వెళతాడు. సాధారణ ఉపాసన చేసేవాడు, బాహ్యప్రయోజనం కావాలనుకునేవాడు మనసు నిలబ్టెాలి కాబ్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థానికి అది ఒక కాంతిపుంజం. ఆ కాంతిపుంజమే దివ్వె. ఆ దీపమే పరమేశ్వర స్వరూపం. కానీ దానిని అర్థం చేసుకోవటం ఎలా? ఉపాసన చేసినప్పుడు మేఘంలో, ప్రవాహంలో, బురదలో, దుంగలో అంతా ఈశ్వరుడే కనిపిస్తాడు. అంతా పరమేశ్వర స్వరూపం చూడగలిగిన స్థితికి ఎదగగలిగితే దీపాన్ని అర్థం చేసుకున్నట్లు గుర్తు. ఈశ్వరుణ్ణి ఎక్కడ చూడాలి అంటే పూజా మందిరంలో కాదు. ఈ లోకమంతా ఈశ్వరుడిని చూడగలగాలి. అందుకే రుద్రంలో, ''నమో నమో హరికేశాయోపవీతినే పుష్ణానాం పతయే నమో నమో'' అంారు.
కదలకుండా నిలబడి వింటున్నట్లు ఉంటే ఆకుపచ్చని చెట్టులో, ప్రతి ఆకులో పచ్చదనంలోను ఈశ్వరుడే కనబడాలి. ఆ దర్శనం పొందామనానికి ప్రత్యక్ష ఉదాహరణ దీపం. ఎందుకంటే లోకంలో యథార్థం తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం. మనకు ఒక పొడవైన తాడు కనిపించింది. కాని అది తాడో, పామో మనకు తెలియదు. అలాంటప్పుడు దీపం పనికొస్తుంది. అది తాడు అని పాము కాదని తెలిస్తే భయం పోతుంది. అందుకే ఆ తేజోరూపమైన పరమాత్మను నేను ఆరాధన చేస్తున్నాననే ఆంతర సంస్కారాన్ని పొందడానికి పదిమెట్లు పైకెక్కి నిలబడి అంతా ఈశ్వర దర్శనం చెయ్యగలిగిన మహోత్కృష్టమైన స్థితికి చేరుకోవానికి ప్రతీక కార్తిక దీపం. అందుకే కార్తిక దీపం అని ప్రత్యేకంగా పిలుస్తాం. దీపం, దీప వైభవం తెలుసుకొని దానిని వెలిగించటం ఒక ఎత్తు. తెలియకపోతే కార్తిక పౌర్ణమినాడు దీపం వెలిగిస్తున్నప్పుడు, ''దామోదరమావాహయామి'' లేదా ''త్య్రంబకమావాహయామి'' అనాలి.
దామోదరుడు అంటే విష్ణు సంబంధమైన విషయం. త్రయంబకం అంటే శివ సంబంధం. మూడు లోకాలకు కూడా తల్లీ,  తండ్రి అయి ఉంాడు కాబ్టి త్రయంబకుడని పేరు. అటువిం త్రయంబక స్వరూపమైన పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి. అక్షతలు వేసి. పువ్వో, పసుపో, కుంకుమో వెయ్యాలి దీపం మీద. దామోదరుణ్ణన్నా పిలవాలి, త్రయంబకుణ్ణి అయినా పిలవాలి. అలా ఆవాహన చేసిన తర్వాత ఆ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. లేదా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.
లీ లీ లీ
కార్తికస్నానంతో లాభాలెన్నో!
కార్తికమాసం ఉపాసనా సమయం. అందువల్ల ఈ మాసంలో చేసే స్నానాలకు ఒక విశిష్టత ఉంది. కార్తికస్నానం అనేది కేవలం శరీర శుద్ధికోసం మాత్రమే చేసేది కాదు. అందుకే మన పూర్వీకులు స్నానం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపకల్పన చేశారు. దీని వల్ల అనేక లాభాలు చేకూరతాయి. వాిలో మొట్టమొదిది మలాపకర్షణము. శరీరం రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు, మలద్వారం, మూత్రద్వారం విం నవ రంధ్రాలతో కూడి ఉంటుంది. ఈ తొమ్మిది రంధ్రాలకు వ్యర్థాలను విడిచిపెట్టే లక్షణం ఉంటుంది. అందువల్ల ఈ రంధ్రాలన్నీ శుభ్రపడితే తప్ప ఉపాసన సిద్ధించదు. ఇక రెండవది పాపాపకర్షణం. స్నానంతో తేజస్సు సంభవిస్తుంది. అందుకే ఏ అశౌచం శరీరాన్ని పట్టుకుందో ఆ అశౌచాన్ని పోగొట్టుకోవటమే శరీరంలో తేజస్సును పొందానికి కారణమై ఉంటుంది. మూడవది పుష్ఠి. చల్లి నీళ్ళు తల నుంచి పోసుకుని స్నానం చేసిన కారణం వల్ల శరీరానికి ఉపాసన క్రమంలో ఎలా వంగాలో, ఎలా కూర్చోవాలో, ఉత్సాహాన్ని ఎలా పెంచుకోవాలో అబ్బుతుంది. మత్తు విరిగిపోయి హాయిగా కూర్చుని భగవంతుని పూజించగలుగుతారు. నాలుగవది ఈశ్వరుని ఆరాధన అర్హత. మనం ఎంత మంచి బట్ట కట్టుకున్నా, తెల్లవారుఝామున స్నానం చేయకపోతే పూజా మందిర ప్రవేశార్హత లభించదు. ఇక అయిదవది ఆయువు. ప్రతి రోజూ నియమం తప్పకుండా మూడు పూటలా స్నానం చేసే అలవాటు ఉన్నవారికి చిరాయుష్షు లభిస్తుంది.
నదీ స్నానం మాహాత్మ్యం :
నదిని నమ్ముకున్నవాణ్ణి అది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది. అందుకే- 'ఇతి స్పందన శీలాః' అన్నారు ఋషులు.. అలాిం ఉదాహరణ ఒకి తెలుసుకోవాలి. తాడేపల్లి రాధాకృష్ణశాస్త్రి అనే మహాపండితుడు ఉండేవారు. ఆయన భార్యతో కలిసి గంగాస్నానానికి వెళ్ళారు. గంగాస్నానానికి వెళ్ళి, గంగలో దిగి- ''అరెరే! గంగకేమి ఇవ్వలేదే మనం, ఏమీ తీసుకురాలేదు, అమ్మకేమైనా ఆభరణం ఇవ్వొద్దూ!'' అనుకున్నారు. భార్యవంక చూసి నల్లపూసలిలా ఇచ్చెయి అన్నారు. ఆవిడ మెళ్ళో నల్లపూసలు తీసి ఇచ్చేసింది. ఆయన అది తీసి- ''అమ్మా గంగమ్మా! నీ మెళ్ళో వేసుకో!'' అని చెప్పి వదలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంికి వచ్చారు. ఇంికొచ్చి పూజా మందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి. ఆయన తెల్లబోయారు. ఆయన తెల్లబోయి ధ్యానం చేస్తూ ఉంటే, గంగమ్మకనబడి- ''బిడ్డా! మీ అమ్మను కదా! నువ్వు పది కాలాలు ఉండాలని కోరుకుాంను కదా! నీ భార్య మెడలో నల్లపూసలు నాకిచ్చేశావే.. అలా ఇవ్వచ్చా! అందుకే నల్లపూసలు ఇచ్చేశాను. నీ చేత్తో రేపు ఇంత పసుపు, కుంకుమ పట్టుకొచ్చి నాలో వెయ్యయ్యా!'' అంది. ఆ దంపతులు ఆ మర్నాడు వెళ్లి పసుపు, కుంకుమ సమర్పించి వచ్చారు!
స్నానాలు రకరకాలు :
మన శాస్త్రాల్లో రకరకాల స్నానాలను నిర్దేశించారు. ఒక్కో స్నానం వల్ల ఒకో విధమైన లబ్ధి చేకూరుతుంది. వీిలో మొదిది ఆకాశ స్నానం. ఒక పక్క ఎండ కాస్తూ ఉంటుంది, మరో వైపు చినుకులు పడుతూ ఉంాయి. అలాిం స్థితిలో సంవత్సరానికి ఒక సారైన స్నానం చేయాలి. రెండోది వాయుస్నానం. గోధూళి వేళ గోవులు ఇంికి వెళ్ళేటప్పుడు వాి డెక్కల మీద నుంచి రేగిన ధూళి పడితే చేసేది వాయు స్నానం. ఇక అసలు సిసలైన స్నాన మజ్జనం. అంటే తల మూడుసార్లు నీిలో మునిగేలా స్నానం చేయటం.
ద్వాదశి దీపం : 
కార్తికమాసంలో దేవాలయాలలో ద్వాదశి రోజున ద్వాదశి దీపం అని ప్రత్యేకంగా పెడతారు. సాధారణంగా ప్రతి విష్ణ్వాలయంలోనూ తులసి బృందావనం తప్పనిసరిగా ఉంటుంది. ద్వాదశి రోజున ఉత్సవమూర్తిని తులసీ బృందావనంలో చేస్తారు. అందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తారు. ఇళ్ళల్లో అయితే తులసి చెట్టు లేదా ఉసిరిచెట్టు పక్క, పక్కనే ఉంచి దీపం ప్టిె పూజ చేస్తారు.
లీ లీ లీ
కార్తికపౌర్ణమిరోజు ఏం చేయాలి?
కార్తికపౌర్ణమిరోజున ప్రతివాళ్లూ తమ ఇంో్ల కార్తిక దీపాలు ప్టోలి. ఇంో్ల కార్తిక దీపం పెట్టమనానికి కారణముంది. ప్రతి గృహస్థూ తమ ఇంో్ల ప్రతి రోజూ దీపం వెలిగించాలి. దీపం వెలగని రోజు ఒక్కి కూడా ఉండకూడదు. ఒకవేళ ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరినైనా పిలిచి ఇంో్ల దీపం పెట్టమనాలి. కానీ కొన్ని సార్లు దీపం పెట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో ప్రతిరోజూ దీపం వెలిగించటం కుదరకపోవచ్చు. అలాిం వారు తమ దోషాన్ని పోగొట్టుకోవానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే చాలా మంది కార్తిక పౌర్ణమి రోజున 365 వత్తులతో గుత్తి దీపం పెడతారు. ఒక ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో- దానికి పరిహారం ఈ గుత్తి దీపం. ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిసి వెలిగించాలి.
ఇంో్ల దీపం ప్టోలంటే కార్తిక పౌర్ణిమి తిథి ప్రధానం. దేవాలయంలో పెట్టేటప్పుడు కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రంనాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున గిరి ప్రదక్షిణ చేయానికి అవకాశమే ఉండదిక. మొత్తం కొండంతా జనంతో నిండిపోతుంది. అందరూ దీపాన్నే చూసి నమస్కారం చేస్తారు. భగవాన్‌ రమణులంతి వారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పికి, ఓ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. అరుణాచలం అంటేనే అగ్నిలింగం కాబ్టి, అక్కడ కొండ మీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. కార్తిక పౌర్ణమినాడు వెలిగించే దీపం కేవలం మన కోసమే కాకుండా, మనం చేసే దుష్కృతులను పోగ్టొి మన పాపాలను పోగ్టొి, అంతర తిమిరాన్ని పోగ్టొి బాహ్యంలోని తిమిరాన్ని పోగ్టొి, లోకోపకారంచేసి, సమస్త జీవుల నుద్ధరించానికి ప్టిెన దీపం.
అరి దొప్పల దీపాలు :
కార్తిక పౌర్ణమి రోజు దీపాలు దూరంగా వెళ్ళిపోవాలి. దీపాలను అరి దొప్పలలో ప్టిె నీిలో విడిచిపెడతారు. అప్పుడు  ఆ దీపాలు నీిని ఆధారం చేసుకొని వెళ్లిపోతాయి. అలా వెళ్లిపాతున్న దీపాలను చూస్తూ కొద్దిసేపు ఉండాలి. ఆ తర్వాతే ఇంికి రావాలి. మన పెద్దలు ఈ నిబంధన విధించానికి ఒక కారణముంది. నీళ్లన్నీ సముద్రంలో కలుస్తాయి. అంటే దీపం కూడా సముద్రంలో కలుస్తుంది. ఇదే విధంగా- మానవులందరూ ఆ పరమేశ్వరుడిలో కలుస్తారు. దీపాన్ని నీరు తనతోపాటుగా సముద్రంలో కలిపేసినట్లు... దీపాన్ని చూస్తూ భగవంతుడిని ప్రార్థిస్తే- ఆయన మనందరినీ తనలో కలుపుకుాండనే పారమార్థికమైన భావనతో దీపాన్ని చూడమాండు. అంతే కాకుండా, ఈశ్వరుడికి 'తజలా' అనే పేరు కూడా ఉంది. 'తజలా' అంటే నీరు అని అర్థం. లింగ పురాణంలో- ''సంజీవనం సమస్త నిగత సలిలభవాయుక్తి యుచ్యతే మూర్తి భవస్య పరమార్థః' అని చెబుతారు. అంటే- ''నీరు రూపంలో పరమశివుడున్నాడు. నీిని ఆశ్రయించి దీపం వెడుతోంది. భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెలువడుతున్నాయి. సంకల్పాలు ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పాలు నడుస్తూ ఉంాయి'' అని దీనర్థం. అరి దొప్పల్లోనే దీపాలను పెట్టడం వెనక మరొక పరమార్థం కూడా ఉంది. దీపం అరిదొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దీనిలో ఉన్న ఆవు నెయ్యి అంతా ఆవిరైపోతుంది. నెయ్యి ఆవిరి కావటంతో కొద్ది సేపికి దొప్ప తిరగబడి నీిలో కలిసిపోతుంది. అలా కలిసిపోయిన దొప్పలను నీిలోని చేపలు తింయి. అంటే దీపాలు విడిచిపెట్టడం వల్ల పర్యావరణానికి ఎటువిం హానీ కలగదు.
జ్వాలాతోరణం :
కార్తికపౌర్ణమినాడు దేవాలయాలలో జ్వాలాతోరణాలను నిర్మిస్తారు. దీని వల్ల అన్ని దోషాలూ తొలగిపోతాయని భావిస్తారు. ఈ జ్వాలా తోరణాలను యమ ద్వారం ఎలా ఉంటుందో అలా నిర్మిస్తారు. రెండు కర్రలు నిలువుగా పాతి, వాిపై అడ్డంగా కర్ర కడతారు. కొత్త గడ్డి తీసుకొచ్చి ఆ కర్రకు చుడతారు. దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. శ్రీనాథ మహాకవి తన భీమేశ్వర పురాణంలో ద్రాక్షారమంలో జరిగే జ్వాలా తోరణాన్ని....
కార్తికవేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ ఘోర భీకర యమద్వార తోరణంబు
అని వర్ణిస్తాడు. ''కార్తిక మాస పౌర్ణమి తిథినాడు జ్వాలా తోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే వారితో కలిసి మూడుమార్లు ఎవరు తోరణం కింద అటు వెళ్ళొచ్చారో ఇక వారు యమద్వారంలో ఉండే అగ్ని తోరణాన్ని చూడరు. అంటే శైవలోకాన్ని కానీ, విష్ణులోకాన్ని కానీ పొందుతారు. అది అశుతోషుడైన పరమేశ్వరుడు మహర్షులకు ఇచ్చిన అద్భుతమైన కానుక...'' అని దీని అర్థం. అందుకే కార్తిక పౌర్ణమినాడు చాలా ఆలయాలలో జ్వాలాతోరణం తప్పనిసరిగా చేస్తారు. ఆ జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిపోయిన గడ్డి రక్షపెడుతుందని భావిస్తారు. దాన్ని తెచ్చి చూరులోనో, గడ్డివాములోనో పెడతారు. కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు. దీని వల్ల భూతప్రేతాది ఉగ్రభూతాల నుంచి రక్షణ లభిస్తుందని, కరువు కాటకాలు లేకుండా ధాన్యాగారాలన్నీ నిండుగా ఉంాయని నమ్ముతారు.
లీ లీ లీ
కార్తిక ఉసిరి ప్రాస్తశ్యం!
కార్తికమాసంలో ఉసిరిచెట్టుకి పూజ చెయ్యడం, ఉసిరికాయ పచ్చడి తినడం అనేవి అత్యంత ప్రధానమైన నియమాలుగా చెబుతారు. స్కందపురాణంలో కూడా ఉసిరికాయ గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం భర్త ఆరోగ్యాన్ని చూరగొనడమనేదే భార్య ప్రధానమైన లక్షణం. ఒక పురుషుడు ఆరోగ్యంగా ఉండాలంటే- ముందు తల్లి, ఆ తర్వాత తల్లిలా చూసుకునే భార్య తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల కార్తికమాసంలో ఆదివారం మినహాయించి మిగిలిన రోజులన్నీ భర్తకు భార్య ఉసిరికాయ పచ్చడితో అన్నం ప్టోలి. ఇక్కడ ఉసిరికి సంబంధించిన మరో విశేషం కూడా చెప్పుకోవాలి. ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు ఉసిరికాయను తప్పనిసరిగా తినాలి. లేకపోతే ఉపవాస విరమణ కానట్లే! దానివల్ల ఫలితం కూడా ఉండదు.
ఉదాహరణకు, ఏకాదశినాడు ఉపవాసం చేశారనుకోండి. ద్వాదశినాడు పారణ చెయ్యాలి. పారణ చేయటం అంటే వీలైనంత త్వరగా తినటమని అర్థం. అటువిం సమయంలో కేవలం అన్నం మాత్రమే తినాల్సిన అవసరంలేదు. ఉసిరికాయ కూడా తినవచ్చు. అందువల్లే మన పూర్వీకులు ఇంో్ల ఏం ఉన్నా లేకపోయినా ఒక ఎండిపోయిన ఉసిరికాయ మాత్రం తప్పనిసరిగా ఉండాలని చెబుతారు.
ఉసిరితో శంకర భగవత్పాదులకు ఉన్న సంబంధం గురించి ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది. కేరళలో ఒక వృద్ధ బ్రాహ్మణి ఉండేది. ఆమె దగ్గర కేవలం ఒక్క ఉసిరికాయ మాత్రమే ఉంది. శంకర భగవత్పాదులు భిక్షకోసం వచ్చారు. దీనితో ఆమె తన వద్ద ఉన్న ఒక్క ఉసిరికాయను భిక్షగా వేసేసింది. ఆమెకు తినానికి ఏమీలేకపోయినా భిక్ష వేయటం వెనక ఒక కారణముంది. సాయంత్రం కావటంతో ఏకాదశి వెళ్లిపోతోంది. ఉసిరికాయ కూడా తనకపోతే బ్రాహ్మణికి ఉపవాస ఫలితం పోతుంది. బ్రహ్మచారికి భిక్ష వేయకపోతే గృహస్థ ఆశ్రమం పోతుంది. అందువల్ల ఏకాదశి పోవడం కన్నా ఆశ్రమం పోకపోవడమే మంచిదని ఆ బ్రాహ్మణి ఉసిరికాయను భిక్షగా వేసింది. అప్పుడు శంకర భగవత్పాదులు- 'ద్రవిణాంబు ధారా...' కనకధారా స్తవం చేస్తారు. దానితో అమ్మవారు ఆ బ్రాహ్మణి మీద బంగారు ఉసిరికలు కురిపిస్తుంది. ఒక ఉసిరికాయ వెనుక అంత కథ ఉంది.
ఓషధిగా ఉసిరి
ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే 70 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చేసిన తరువాత ఆయుర్వేద శాస్త్రాన్ని మన కిచ్చిన జనకుడు, ఉసిరికాయ ఓషధిగా స్వీకరించి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు. ఉసిరికాయ అంత గొప్పది. అమ్మవారు ప్రతి ఋతువులోనూ ఒకో రూపంలో వచ్చి మనుష్య జాతిని కాపాడుతుంది. కార్తికమాసంలో ఆమె ఉసిరిచెట్లకు ఉసిరికాయలుగా కాస్తుంది. ఉసిరి గాలి, ఉసిరి కాయ, ఉసిరికాయతో చేసిన పదార్థం కార్తికమాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదాలు తప్పిపోతాయి. రక్తనాళాలు కొవ్వుతో మూసుకుపోవటం వల్ల మృత్యు సమానమైన వ్యాధులైన గుండె జబ్బులు, పక్షవాతం వింవి వస్తాయని ఆయుర్వేదంలో పేర్కొాంరు. ఆ కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకొనే శక్తి ఆమలకము (ఉసిరి)కి ఉందని చెబుతారు. ఆ ఉసిరితో చేసిన పచ్చడి తినటం వల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల శారీరకమైన కఫ, వాత, పైత్యాలు విరిగిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతారు.
అమ్మవారి భృకుి!
యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ''శివావిశ్వస్య భేషజీ'' అనే మంత్రం ఉంది. భేషజీ అంటే స్త్రీ వాచకం. ఆమె లోకానికి భేషజీ ఔషధి. ఎప్పుడెప్పుడు లోకానికి ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది. ప్రపంచాన్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు సౌందరర్యలహరి స్తోత్రంలో..
దృశా ద్రాఘీ యస్యా దరదలితనీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే!
అనేనాయం ధన్యో..'' అంారు. ''అమ్మా నీ కళ్ళు ఇలా ఇక్కడ్నుంచి ఇక్కడి వరకు తిప్పుతూనే ఉంావ్‌. ఈ భూమండలం ఎంత వరుకుందో అంతకన్న ఎక్కువ చూస్తూాంవ్‌. ఎందుకో తెలుసా? ఈ భూమండలంలో ఉన్న క్రమికీటకాల దగ్గర నుంచి అందరం నీ బిడ్డలమే కదా.. అందుకే నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూసుకుంటూ ఉంావు..'' అని స్తుతిస్తారు. అంతే కాకుండా, ''భ్రువౌ భుగ్నే కించిద్భువన భయభంగవ్యసనినీ'' అని కూడా అంారు. అమ్మవారు కనుబొమ్మలను ముడివేయానికి వెనకున్న కారణాన్ని కూడా దీనిలో చెబుతారు. ''అరేరేరే, వీళ్ళకి బుద్ధి ఇచ్చాను.. అమ్మా అని ఒక్క మాటంటే చాలు రక్షిస్తాను, కానీ వీళ్లు ఆ బుద్ధి వాడటంలేదు.. ఎంత ఇబ్బంది వచ్చింది వీళ్ళతో..'' అని మానవుల అజ్ఞానాన్ని చూసి బాధతో అమ్మవారు కనుబొమ్మలు ముడివేస్తుందిట!
లీ లీ లీ

వనభోజనం ఎందుకు?
కార్తికమాసంలో వనభోజనం తప్పనిసరి. 'వనం' అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబుతుంది. కార్తికమాసంలో వన భోజనానికి ఎందుకు వెళ్లాలి? దీని వెనక ఒక పరమార్థం ఉంది. అరణ్యానికి ఎవరు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. వానప్రస్థంలో అందరూ అరణ్యంలోనే గడుపుతారు. అరణ్యంలో ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక ఆశ్రమం కట్టుకొని, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడిని ధ్యానం చేస్తూ గడుపుతారు. దానికి సాధనే వనభోజనం. అందుకే వనభోజనానికి పవిత్రమైన హృదయంతో వెళ్ళాలి. ఏ ప్రకృతిలో ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఆరోగ్యాన్నిచే ఉసిరి చెట్లు, తులసి చెట్లు, మామిడిచెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్ళాలి. 
ఉసిరి, తులసిల గురించి మనకు తెలుసు. మరి మామిడి విశిష్టత ఏమి? మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలం అని పేరు. పరమేశ్వరుని పేరు ఉన్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అటువిం మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువింవన్నీ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లాలి. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, మరే ఏ ఇతర వ్రతం గానీ చేయాలి. విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం- ఇవన్నీ సాయంత్రం దాకా చదవాలి. పొద్దు పొడిచిన తరువాత మహా నైవేద్యం ప్టిె భోజనం చేయాలి.
కృష్ణుడి వన భోజనం!
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు, ఇతర స్నేహితులతో- ''ఓరేయ్‌, రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా!'' అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాిం వాళ్లకు కొత్తగా వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే, వాళ్ళు ఉదయం స్నానం చేయరు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింరు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకా రెండా...! అందుకే వనం అంటే బ్రహ్మం కాబ్టి... బ్రహ్మాన్ని అరిగించటం.. అంటే కృష్ణభగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజనం. ఆ వన భోజనంలో ఏ అరమరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరిచెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహానైవేద్యం ప్టిె, అందరూ ఒక్కిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంికి తిరిగి రావడానికి వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్ళకూడదు.
అఘాసుర సంహారం
పోతన భాగవతంలో అఘాసుర సంహారాన్ని అనన్యమైన రీతిలో వర్ణిస్తారు. గోప బాలురు వన భోజనాలకు వెళ్లినప్పుడు అక్కడ అఘాసురుడనే రాక్షసుడు పెద్ద కొడ్డచిలువ రూపంలో పడుకొని ఉంాడు. గోపబాలురు తెలియక కొండచిలువ నోిలోకి వెళ్లిపోతారు. ''ఇక్కడంతా ఎర్రగా ఉందిరా, నాలికలా ఉంది, కొండ చిలువ దవడలా ఉంది, లోపల నుంచి దుర్వాసన వస్తోంది, వేడి పొగ వస్తోంది. కొండ చిలువ న్లోకి పోతున్నావేమోరా..!'' అనుకుాంరు. అప్పుడు ఒక గోప బాలుడు- 
బకునిం జంపిన కృష్ణుఁడుండ మనకుం బా మంచుఁ జింతింప నే ికి రా పోదము దాఁి కాక యది కౌిల్యంబుతో మ్రింగుడున్‌ బకు వెంటం జనుఁ గృష్ణుచేత ననుచుం బద్మాకక్షు వీక్షించి యు త్సుకులై చేతులు వేసికొంచు నగుచున్‌ దుర్వారులై పోవఁగన్‌. 
అంారు. ''అఘాసురుడు మనని చంపేస్తాడు అంావేింరా.. బకుణ్ణి కృష్ణుడు చంపేశాడు కదా.. నిజంగా వీడు అఘాసురుడైతే కృష్ణుడు చంపేస్తాడు. మనకెందుకు మన వెనక కృష్ణుడు ఉన్నాడు...'' అని ఈ పద్య తాత్పర్యం. వాళ్ళకి కృష్ణుడే పరమేశ్వరుడు అని తెలియదు. కానీ కృష్ణుడు ఉన్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్లిపోతున్నారు. వాళ్ల వెనక కృష్ణుడూ వెళ్ళాడు. అఘాసురుడు గోప బాలురిని మింగేస్తాడు. దాంతో వారందరూ మరణిస్తారు. ఆ రాక్షసుడు కృష్ణుడిని కూడా చంపేద్దామనుకుాండు. కానీ కృష్ణుడు అగ్నిస్తంభంగా నిలబడతాడు. ఈ తీవ్రతకు అఘాసురుడు చనిపోతాడు. అతని తేజస్సు కృష్ణుడిలో ప్రవేశిస్తుంది. అప్పుడు కృష్ణుడు తన కారుణ్య దృక్కులలో గోపబాలురినిబతికిస్తాడు. తన వెంట వచ్చే వారిని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడనే విషయాన్ని ఈ గాథ ద్వారా పోతన చెబుతారు.
లీ లీ లీ
కార్తికంలో త్రిలోచన గౌరీ వ్రతం
సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ || అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుాంరు. వాక్కు, అర్థము- ఈ రెండింనీ విడదీయలేరు. వీికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు, అర్థమూ లాింవారేనని ఈ శ్లోకం అర్థం. అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతినుండి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా- శవమవుతుంది. ఈ విధంగా ప్రకృతి పురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్లుగా వుంటుంది. శివుడు చిన్మయ రూపంలో ఉంాడు. అంతేకాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడతాయి. కార్తికమాసం ఉపాసనా కాలం కాబ్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలామందికి ఉదయిస్తుంది. దీనికి సమాధానమే-
శంకరాచార్య విరిచిత
పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీజఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే|| స్తోత్రం. 
ఈ సంసార భ్రమణ పరితాపం వదిలిపోవానికి, రెండు జన్మాల మధ్య పరితాపాన్ని త్యజించానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాిం మన్మథుడిని తన మూడోకిం మంటచేత దహనం చేసినవాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింలోను అమ్మవారు ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రే కాదు, పార్వతీ దేవిది కూడా. అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు  శివుడు ఎలాిం వరాలిస్తాడో.. అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే. అందుకోసమే కార్తికమాసంలో తదియనాడు త్రిలోచనగౌరీ వ్రతం చేస్తారు. ఆ రోజుకొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తారు.
మానవుడి ప్రత్యేకత
పరమేశ్వరుడికి అన్ని ప్రాణులు సమానమే. అందుకే పరమేశ్వరుడికి చేసే సేవల్లో రకరకాల జంతువుల ప్రమేయం ఉంటుంది. ఉదాహరణకు పూజంతా పూర్తయిన తర్వాత అలసిపోయిన పరమేశ్వరుడికి చామరం. వీస్తారు. ఆ చామరాన్ని చామరీ మృగం తోకలో ఉండే వెంట్రుకలతో చేస్తారు. అదే విధంగా అభిషేకం చేసే సమయంలో ఆవు పాలను వాడతారు. తన వెంట్రుకలు ఈశ్వరుని ఖేదాన్ని కూడా తగ్గించగల గొప్పవని తెలుసుకుని చామరీమృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వెయ్యలేదు. ఆవు తన పాలను తనంతట తానుగా తీసుకువచ్చి ఈశ్వరుడికి అభిషేకం చేయగలదా? చేయలేదు. ఏనుగు దంతం చాలా అదంగా వుంటుంది. కానీ ఏనుగుకు తెలుసా? నాకు దంతం వుంది. ఈ దంతం ఇంత అదంగా వుంటుంది. నేను బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. చేప ఒక్కటే నీళ్ళలో ఈదగలదు. నీిలో ఈదగలిగే శక్తి నాకే వుంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీిలో వుండే చేప భూమిమీద వుండలేదు. భూమిలో వుండే ప్రాణి నీిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీమృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరునికి చామరం వేసి పుణ్యాన్ని పొందుతాడు. ఆవుపాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. అలాిం జన్మాన్ని పొందాలంటే కొన్ని కోట్ల జన్మలెత్తాలి. అలాగ జన్మ ఎత్తిన తర్వాత మాత్రమే మానవుడు ఈశ్వరుడితో మమేకమవుతాడు. దీనికోసం తనతోపాటుగా ఉన్న అన్ని జీవులకు ఉపకారం చేయాలి. దీనికి ప్రశస్తమైన కాలం కార్తికమాసం.
భూత యజ్ఞం : 
అన్నం తినేముందు నాలుగు కాకులకు నాలుగు మెతుకులు వేసి, కుక్కకు రెండు మెతుకులు ప్టిె, ఇంికి వచ్చిన అతిథికి అన్నం ప్టిె అప్పుడు మనం తినాలి. అందుకే శాస్త్రాలు- ఇంో్ల అన్నం మిగలాలి. మిగిలిన అన్నం భూతములకందాలి అని చెబుతాయి. ఎందుకంటే- ఈ జీవులన్నీ మానవుడిని సేవిస్తున్నాయి. ఒక గుర్రం పరుగెడుతూ వుంటే, దాన్ని ఎక్కి ధ్యేయానికి చేరుకోగలుగుతారు. గొప్ప పండితులను సన్మానించాలనుకున్నప్పుడు గజారోహణ సత్కారం చేస్తారు. ఇలా మనకు ప్రతి ప్రాణి ఏదో  ఒక విధంగా సాయపడుతుంది. అందువల్ల వాికి కూడా అభ్యున్నతిని కల్పించాల్సిన అవసరం మానవుడిపై ఉంది.
లీ లీ లీ
భాగవతంలో వనభోజనాలు!
గోపాలబాలురు ప్రతి రోజూ వనాలకు వెళ్తారు. అలాిం వారు మళ్లీ కొత్తగా వన భోజనాలకు ఎందుకు వెళ్లాలి? శ్రీకృష్ణుడు  తన లీలలను వారికి చూపించాలనుకున్నాడు. అందరిని కూడగ్టి, ''రేపు మనం వన భోజనాలకు వెళ్తున్నాం'' అని ప్రకించాడు. గోపాలబాలురు ప్రతిరోజు మాదిరిగానే లేచి, చద్ది అన్నం మూటలను భుజానికి తగిలించుకొని వన భోజనాలకు బయలుదేరారు. ఇక్కడ గోపాలబాలుర ప్రవృత్తిని పోతన మధురంగా వర్ణిస్తారు. ఒకడు అందరికన్నా ముందే లేచి కొమ్ముబూర తీసుకొని ప్రతివాళ్ల ఇంి ముందుకు వెళ్లి ఊదాడు. దీంతో అందరూ లేచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చారు. కొందరు ఆకాశంలో పకక్షులను చూసి... వాి నీడల వెంట పరిగెత్తడం మొదలు ప్టోరు. ఇంకొందరు గోతుల్లో దాక్కుని గ్టిగా అరుస్తున్నారు. వారిని పట్టుకోవడానికి మరి కొందరు వెతుకుతున్నారు. నెమళ్లు నాట్యం చేస్తుంటే వాిని చూసి కొందరు అనుకరిస్తున్నారు. అందరూ మాత్రం కృష్ణుడి వైపు తిరిగి, ''మాకు ఇన్ని విద్యలు వచ్చు.. నువ్వు గమనిస్తున్నావా?'' అన్నట్లు చూస్తున్నారు.
కొందరు కృష్ణుడి మీద పడి పిడిగుద్దులు గుద్దుతున్నారు. కృష్ణుడు వాళ్లని పట్టుకొని మళ్లీ కొడుతున్నాడు. అందరూ మళ్లీ కలిసిపోతున్నారు. ఇలా ఆడుకుంటూ, ఆడుకుంటూ అందరూ అఘాసురుడు అనే రాక్షసుడి న్టోకి వెళ్లిపోయారు. ఆ రాక్షసుడు కొండ చిలువ రూపంలో ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. అఘాసురుడి నోిలోకి వెళ్లిపోతున్నామనే విషయం గోపాలబాలురకు తెలియదు. మనం లోకంలో కూడా చాలా మందికి పాపం చేస్తున్నామనే విషయం తెలియదు. అలాగే, తెలియకుండా పాపం చేసేవారిని ఈశ్వరుడు వచ్చి రక్షిస్తాడు. హఠాత్తుగా వారిలో కొందరు తాము రాక్షసుడి న్లోకి వెళ్లిపోయిన సంగతి గమనించారు. మిగిలిన వారిని హెచ్చరించారు. కానీ అందరి మనసుల్లో తమను కృష్ణుడు రక్షిస్తాడనే నమ్మకముంది. అందుకే ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ముందుకు వెళ్లిపోయారు. అఘాసురుడి న్లోకి వెళ్లిన గోపాలురందరూ మరణించారు. కృష్ణుడు అగ్నిస్తంభంలా మారిపోయాడు. అఘాసురుడు చచ్చిపోయాడు. గోపాలబాలుర మృతదేహాలను తన కారుణ్యదృక్కులతో బ్రతికించాడు. మళ్లీ ఆటలు మొదలయ్యాయి. ఎవరికీ ఆకలి వేయటం లేదు. అందరిలోనూ ఏదో సంతోషం. చెప్పలేని ఆనందం. కానీ కృష్ణుడు వారికి ఆకలి వేస్తోందనే విషయాన్ని గమనించి...
ఎండన్‌ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా రండో బాలకులార! చల్డి గుడువన్‌ రమ్యస్థలం బిక్కడీ దండన్‌ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్‌ మేయుచుం దండం బై విహరించుచుండఁగ నమంద ప్రీతి భక్షింతమే? (భాగ.10ప.493)
''ఒరేయ్‌, మీ అందరికి ఆకలి వేస్తోంది.. ఈ పక్కనే సరోవరం ఉంది. దాని గట్టున గడ్డి ఉంది. ఆవులన్నీ పచ్చి గడ్డి తిని నీళ్లు తాగుతాయి. మనం కూడా కూర్చుని అన్నం తిందాం'' అని అందరినీ పిలిచాడు. అందరూ బిలబిలమంటూ కృష్ణుడి చుట్టూ చేరారు. అందరూ కృష్ణుడికి తాము తెచ్చినవన్నీ పెడుతున్నారు. ఈ అద్భుతాన్ని దేవతలందరూ చూస్తూ నిలబడిపోయారు. మొత్తం లోకాలన్నీ  వింతను చూస్తూ ఉండిపోయాయి.  సత్యలోకంలో కూర్చుని జపం చేసుకుంటున్న బ్రహ్మకు కూడా ఈ కోలాహలం వినబడింది. దేవతలందరూ బ్రహ్మను చూసి, ''పరబ్రహ్మం రాశీభూతమై గోపాలబాలుడిగా తిరుగుతోంది..'' అన్నారు. బ్రహ్మ నమ్మలేదు. చద్దనం తినేవాడు పరబ్రహ్మ ఎలా అవుతాడనుకున్నాడు. అతనిని పరీక్షించానికి ఆవులు, దూడల్ని దాచేశాడు. గోపాలబాలురు వచ్చి కృష్ణుడితో ఆ విషయం చెప్పారు. కృష్ణుడు ఆవులను చూసి వస్తానని వెళ్లాడు. ఇంతలో బ్రహ్మ పిల్లలను దాచేశాడు. కృష్ణుడికి బ్రహ్మ మాయ తెలిసిపోయింది. అన్నీ తానైపోయాడు. గోవులు కృష్ణుడే. వారి చేతిలో బూరాలు కృష్ణుడే. గోపాలబాలురు కృష్ణుడే. వారందరినీ కృష్ణుడే ఇంికి తీసుకుని వెళ్లిపోయాడు. గోపాలబాలుర అమ్మలకు కూడా తేడా తెలియలేదు. బ్రహ్మకు ఒక రోజైయింది. గోకులంలో ఒక ఏడాదయింది. బ్రహ్మ గోకులంలో ఏం జరుగుతుందో చూడాలని వచ్చాడు. అక్కడ అంతా మామూలుగానే ఉంది. తాను దాచేసిన వారందూ గోకులంలో కనిపించేసరికి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. కృష్ణుడే పరబ్రహ్మమని తెలుసుకున్నాడు. ఆవులను కాసుకుంటున్న కృష్ణుడి దగ్గరకు వెళ్లి, నాకెందుకీ బ్రహ్మ పదవి..? నీతో ఆడుకుంటున్న గోపాలబాలుడిని అయిపోతే చాలు అని వేడుకున్నాడు. పరమేశ్వరుడి అనుగ్రహాన్ని అందరూ అనుభవించిన ఆ లీలే వనభోజనం.
లీ లీ లీ
కార్తికంలో శివ విష్ణు తత్వం!
కార్తికమాసంలో శివకేశవుల ఆలయాల్లో ఏక కాలంలో ఉత్సవాలు జరుగుతూ ఉంాయి. అయితే, శివాలయాలలో మారేడు దళాలతో, విష్ణ్వాలయాలలో తులసి దళాలతో పూజలు జరుగుతాయి. ఈ శివ కేశవులకు తేడా ఏమి? శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు- పరమశివుడు వామదేవుడు, శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అని చెప్పేవారు. ఇద్దరికీ ఒక్కటే అక్షరం తేడా. ఈయనకే ...మ. ఉంది ఆయనకి ...సు.. ఉంది. ఇక్కడ ఇంకో చమత్కారం ఉంది. ఈ రెండు అక్షరాలు కలిస్తే- సు+మ=సుమ అవుతుంది. సుమం అంటే పువ్వు. అంటే ఇద్దరూ ఇచ్చేది పువ్వే. ఇక్కడ పువ్వు అంటే జ్ఞానం. పరమాత్మ ఒక్కడే అనే పరమపూనికతో ఈశ్వరుణ్ణి చూసి పరవశించిపోగలిగిన హృదయం ఉంటే ఆ ఆనందం లభ్యమవుతుంది. లేకపోతే ఆ ఆనందాన్ని అనుభవించలేరు.
ఈశ్వరానుగ్రహాన్ని అన్నిచ్లోా ఒక్కలా అనుభవించగలిగిన మనఃస్థితి అంకురించదు. అందుకనే మహాత్ములైనవారు పరమేశ్వరుని స్వరూపాన్ని కీర్తించవలసి వచ్చినప్పుడు ఆ ఈశ్వర స్వరూపాన్ని ఒకిగానే చెబుతారు. చిన్ని కృష్ణుడు ఒంి మీద మ్టి పోసుకుని ఆడుకుంటున్న ఘ్టాన్ని ఆంధ్రీకరిస్తూ పోతన గారు, కృష్ణుడిని చూస్తుంటే శివుడిని చూసినట్లుందని అంారు. పోతనగారికి చిన్నికృష్ణుడు ఒంి మీద మ్టిపోసుకుంటే, ఆ ధూళి పరమశివుడు రాసుకున్న విభూతిలా ఉంటుంది. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పువేసి ముత్యాలసరాలు చుడితే, తదియనాి చంద్రరేఖ పెట్టుకున్న్టి పరమశివుని కొప్పులా ఉందని వర్ణిస్తారు. యశోద చిన్ని కృష్ణుడికి మెడలో హారం వేస్తే ఆ నీలమణి కాంతిలో తనకు నీలకంఠుడైన పరమశివుడు కనబడుతున్నాడాంరు. పోతన అంత  ఆనందాన్ని అనుభూతిని పొంది భాగవతాన్ని రాశారు. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన కూడా తన కలలో నాభి కమలంలోకి చూస్తే శ్రీమహావిష్ణువు, తల మీదికి చూస్తే చంద్రవంకతో పరమశివుడు, కంఠం చూస్తే నీలకంఠం. ఇక్కడ చూస్తే కౌస్తుభమణి, ఒక పక్కచూస్తే తెల్లి గంగానది, ఒక పక్క చూస్తే నల్లి యమునానది. రెండూ కలిసి వచ్చినట్టుగా తెలుపు నలుపు వర్ణాలతో హరిహరమూర్తి దర్శనమిచ్చారని రాసుకున్నారు. శంకరాచార్యులవారి జీవితంలో మొట్టమొది శ్లోకం కనకధార. అప్పుికి సన్యాసం తీసుకోలేదు. ఇంకా పిల్లవాడే. వృద్ధ బ్రాహ్మణి ఇంి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలవవలసి వస్తే-
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి సృష్టిస్థితి ప్రలయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై- అన్నారు.
అమ్మా! గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, శాకంబరీతి శశిశేఖర వల్లభేతి అని ముగ్గురు అమ్మలకు స్తోత్రం చేశారు. ఆ ముగ్గురు మూర్తుల శక్తి స్వరూపాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరించారు. ఈ శ్లోకం చెప్పిన వెంటనే లక్ష్మీదేవి పలికి కనకధారలు కురిపించింది. ఈ విధంగా ప్రపంచం శక్తిమయం కాబ్టి కార్తికంలో శివకేశవుల భేదం లేకుండా ఉత్సవాలు జరుగుతాయి.
గరికెందుకు ముఖ్యం?
మన శాస్త్రాలలో గరికకు చాలా ప్రాముఖ్యం ఉంది. ముఖ్యమైన పూజలలోకూడా దీనిని వాడతారు. గరికను ముట్టుకుంటే మొత్తం పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతాయి. అందుకే గణపతిని గడ్డిపరకలతో పూజ చేస్తారు. సుందరకాండలో సీతమ్మ తల్లి-''తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మితా నివర్తయ మనో మత్తః స్వజనే...'' అంటుంది. అని గడ్డిపరకను ముట్టుకుంటుంది. సీతమ్మ గడ్డిపరకను ఎందుకు ముట్టుకుంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. భర్త పక్కన లేనప్పుడు కామవాంఛతో తనవంక చూస్తున్న రావణుడికి సీత జవాబు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అంిన పాపం పోవడానికి సీత గరికను ముట్టుకుంటుంది. అంటే ఆ గరికకు అంత విశిష్టత ఉందని అర్థం.
పరమేశ్వరుడెవ్వడు?
పరమేశ్వరుడెవరు? నిజంగా విభూతి రాసుకొనే ఉంాడా? ఇలాిం ప్రశ్నలు అప్పుడప్పుడు కొందరికి ఉదయిస్తూ ఉంాయి. వేదంలో పరమేశ్వరుడిని ''సర్వభూతాధివాసః'' అని నిర్వచిస్తారు. అంటే సర్వభూతాలలోనూ ఉండేవాడు ఈశ్వరుడని అర్థం. ''సర్వ భూతం తదాత్మా కర్మసాక్షీ కేవలోపతిర్గుణశ్చా'' అని చెబుతారు. అంటే ఆయన నిర్గుణుడు. అన్ని కర్మలకూ సాక్షి. దీనిని మరొక ఉదాహరణతో కూడా చెప్పవచ్చు. పాలలో వెన్న ఎక్కడ ఉందండీ అని అడిగారనుకుందాం. వెన్న ఎక్కడ ఉందని చెప్పగలం? పాలంతా వెన్న ఉంటుంది. కానీ పైకి కనబడదు. ఎవరైతే పాలను తోడు ప్టిె, దానిని చిలికి బయటకు తీస్తారో వారికి మాత్రమే లభ్యమవుతుంది. ఈశ్వరుడు కూడా అంతే!
లీ లీ లీ
కార్తికంలో నాగతత్వం !
సనాతన ధర్మంలో ప్రతిదేవతా స్వరూపానికి కూడా పాముతో సంబంధం ఉంటుంది. ప్రతి దేవతా స్వరూపం పాముని యజ్ఞోపవీతంగా వేసుకుంటుంది. ఇక పరమశివుడు నాగాభరణుడు. ఆయన కర్ణ కుండలాలు పాములు. ఆయన చేతులకి పెట్టుకునే ఆభరణాలు పాములు. అమ్మవారి సరసన ఉండగా కూడా ఆయన శరీరానికి పాములు చుట్టుకొనే ఉండేవి. శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో 'హరాహిభ్యోభీతా...' అని వర్ణిస్తారు. శివుడి చేతికి ఉన్న పాము పిల్ల పాకితే దానిని చూసి అమ్మవారు భయపడిందని, ఆ భయం ఆమె కళ్లలో కనబడిందని దాని అర్థం. ఈశ్వరుడికి అంత ప్రీతిపాత్రమైన నాగు పాముల్ని పూజించటం అంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నింనీ మిత్రభావనతో చూడటమే! దీని కోసమే కార్తికమాసంలో నాగుల చవితిని ప్రత్యేకంగా నిర్దేశించారు. ''ఈశ్వరుడు సృష్టించిన ప్రతి ప్రాణిలోనూ మిత్రత్వాన్ని చూడగలుగుతున్నాం. ఇదే మా మానవ జన్మ గొప్పదనం'' అని అందరికి చాి చెప్పానికే ఈ పండగను జరుపుకుాంరు.
పాము ఆభరణమా?
పాము పరమశివుడికి ఆభరణం అవడానికి ఒక కారణముంది. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై పవళిస్తాడు. ఒక రోజు మహావిష్ణువు బరువు విపరీతంగా పెరిగిపోతోంది. ''స్వామీ, మీరు ఎందుకిలా బరువు పెరిగిపోతున్నారు. నేను భరించలేకపోతున్నా'' అని ఆదిశేషుడు మొర పెట్టుకున్నాడు. ''నేను అజపతాండవం (శివనర్తనం) చూస్తున్నా. దాని వల్ల కలిగే ఆనందంతో బరువు పెరుగుతున్నా'' అని విష్ణువు సమాధానమిచ్చాడు. తనకి కూడా ఆ తాండవం చూడాలని ఉందని, అనుగ్రహించమని ఆదిశేషుడు కోరాడు. విష్ణువు వరం ఇచ్చాడు. ఆ వరం మేరకు చిదంబరంలో నటరాజ సభలో శివుడి నృత్యాన్ని చూడానికి ఆదిశేషుడు వెళ్లాడు. నటరాజ సభలో వ్యాఘ్రపాదుడు, పతంజలి తప్ప మిగిలిన ఆహూతులందరూ శివుడికి ఏదో ఒక విధంగా సహకరించేవారే! వీరిద్దరూ మాత్రం ఆ నాట్యం చూస్తూ, నమస్కారం చేస్తూ ఉండిపోయేవారు. వీరిద్దరిని చూసి నందీశ్వరుడు, ''మేమందరం ఏదో ఒక పని చేస్తాం. మీరు మాత్రం నమస్కారం చేస్తూ ఉండిపోతారు'' అని ఎగతాళి చేశాడు. ఈ మాటలకు పతంజలిని చూసిన తర్వాత ఆదిశేషుడికి ఏదో చేయాలనిపించింది. వెళ్లి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. అందుకే తాండవ శివుడి కాలికి ఒక పాము చుట్టుకొని ఉంటుంది.
శివకేశవ తత్త్వం
శివుడి దగ్గర నాగపాము ఉంటుంది. విష్ణువు దగ్గరా పాము ఉంటుంది. ఒకరు లోకాల్ని పాలించేవారు. మరొకరు జ్ఞానమూర్తి. వీరిద్దరి దగ్గర పాములు ఎందుకుాంయి? అసలు శివకేశవుల గొప్పతనమంతా దీనిలోనే ఉంటుంది. తనలో తాను రమిస్తూ జ్ఞానమూర్తిగా ఉండాల్సిన శివుడు రంగస్థల మెక్కి నటరాజుగా ఆడతాడు. ఎప్పుడూ లోకాల్ని పరిపాలించవలసిన మహావిష్ణువు రంగనాథుడిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంాడు. ఈ అభేదాన్ని సర్పం ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇక మన శాస్త్రాల్లో కూడా పామును విశేషమైన లక్షణానికి ప్రతీకగా పేర్కొాంరు. శాస్త్ర ప్రకారం పాములు రెండు రకాలు. ఒకి ఊర్ధ్వముఖ చలనం చేసే పాము. రెండోది అధోముఖ చలనం చేసే పాము. ఒకి పుట్ట లోపలికి వెళ్ళిపోతుంటుంది. మరొకి ఊర్ధ్వ ముఖంగా పైకి లేస్తూ ఉంటుంది. ఇలా పైకి లేచే పాము తేజస్సుని ఓజస్సుగా మార్చే ప్రక్రియకి సంకేతం. దేహంలో మనం తీసుకొన్న ఆహారంలో అత్యంత సారవంతమైన భాగంతో ఒక తోట పెంచి, దానిలోని పువ్వుల సౌరభాన్ని దాచి దానితో అత్తరు చేస్తే ఎలా ఉంటుందో,  అలాిందే ఈ తేజస్సు. దీనిని ఓజస్సుగా మార్చే శక్తి పాముకి ఉంటుంది.
భక్తుడికి సముదాయింపు
ఒకసారి శృంగగిరి పీఠాధిపతులు చంథ్రేఖర భారతీస్వామి వారి దగ్గర చాలా మంది కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కళ్లని పిలిచి ఆయన మ్లాడుతున్నారు. అందరూ తమ పేర్లను చెప్పారు. ఒకాయన మాత్రం అందరూ వెళ్లిపోయిన తర్వాత చెబుతానన్నాడు. అందరూ వెళ్లిన తర్వాత స్వామి అతనిని పిలిచి పేరు అడిగారు. ''నా పేరు నాగభూషణం. ఆ పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంటుంది.'' అన్నాడాయన. అప్పుడు స్వామి, ''నీ పేరే చాలా గొప్పది. పరమశివుడికి నువ్వు ఆభరణానివి కాబ్టి ఆయన నిన్ను జాగ్రత్తగా దాచుకుాండు. ఇక నువ్వు మహావిష్ణువుకు శయనానివి. ఇంో్ల ఏమున్నా లేకపోయినా పక్క మాత్రం బావుండాలి. అందువల్ల ఆయన కూడా నిన్ను బాగా చూసుకుాండు'' అని సముదాయించారు.
లీ లీ లీ
దైవ నిద్ర అంటే ఏమి !
మహా విష్ణువు ఆషాఢమాసంలో ఏకాదశి రోజున పడుకుాండు. కార్తిక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ధి ద్వాదశి నాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం చేస్తాడు. అందుకే ఆ రోజు తులసి చెట్టుకు, ఉసిరిచెట్టుకు పూజలు చేస్తారు. ఈ మాటలు విన్న వెంటనే మీలో కొందరికి మహావిష్ణువు నిద్రపోతే లోకాల్ని ఎవరు పరిపాలిస్తారు? అయినా దేవుడు నిద్రపోవటమేమి? ఇలాిం ప్రశ్నలు తలెత్తి ఉంాయి. ''కృతఘ్నఘ్నాయ దేవాయ బుద్ధిషాం పతయే నమః...'' ఉదయాన్నే ఈశ్వరుడు వచ్చే సమయానికి లేచి స్వాగతం చెప్పాలి. ఎవరైతే లేవరో వారు కృతఘ్నులే. ఈశ్వరుడికి స్వాగతం చెప్పకుండా నిద్రపోతే జీవుడు పరమేశ్వరస్వరూపం కాలేడు. కేవలం నిద్రపోయినట్లు నిస్తాడు. అందరినీ భ్రమింపచేస్తాడు. కానీ అనుక్షణం కనిపెట్టుకొనే ఉంాడు. అయినా వాసుదేవుడు, వామదేవుడు ఒకరేనని ముందే చెప్పుకున్నాం. అందుకే కార్తికమాసాన్ని వైష్ణవులు కూడా జరుపుకుాంరు. కార్తిక దామోదరుడిని కొలుస్తారు. అసలు కార్తిక దామోదరుడు అంటే ఎవరు? ''ఉదరే దామ యస్యేతి...'' అని అమరకోశం చెబుతుంది. కడుపు మీద తులసిమాల ఉన్నటువింవాడిని దామోదరుడు అని పిలుస్తారు. అలాిం వాడు ఎవరు? దీనికి కూడా ''దామ్నా ఉదర మాత్రం బద్ధ ఇతి దామోదరః'' అని అమరకోశంలో ఒక శ్లోకం ఉంది. ''అమ్మతో, ఒక తాితో కట్టబడి నడుం ఒరిసిపోయినవాడు దామోదరుడు.'' అంటే శ్రీకృష్ణుడు. అయితే ఇదంతా విన్న తర్వాత ''అసలు పరమేశ్వరుడికి అమ్మ ఎవరు?' అనే అనుమానం కూడా రావచ్చు. పరమేశ్వరుడు లేనినాడు ఈ లోకాలే లేవు. ఆయన ఎప్పుడు ప్టుాడో కూడా ఎవరికి తెలియదు. అలాిం వాడికి తల్లేమి? ఈ భూమిపైకి వచ్చిన తర్వాత పరమేశ్వరుడికి తల్లి ప్రేమ తెలిసి వచ్చింది. ఆయన ఆ ప్రేమబంధంలో చిక్కుకుపోయాడు. అప్పి దాకా ఆయనకు అమ్మ తెలియదు. అమ్మ పాలు తెలియదు. యశోదపాలు తాగటం మొదలు ప్టిెన తర్వాత ఆ బంధంలో చిక్కుకుపోయాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోతన తన భాగవతంలోని దామోదర లీలలో అత్యద్భుతంగా వర్ణించాడు. దామోదర లీల విశేషమేమిటంటే- బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు- ఈ నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవారు దీనిని వింరు.
ఈశ్వర రూపం
ఈశ్వరుడి రూపం ఎలా ఉంటుంది? ఇది చాలామందికి వచ్చే అనుమానం.
ఏకో దేవః గూఢః సర్వభూతేషు..... సర్వభూతాంతరాత్మా, సర్వభూతాధివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ, కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః- అని చెబుతారు. ''పరమేశ్వరుడికి రూపమే లేదు. నిర్గుణుడు. నిర్జనుడు..'' అని దీని అర్థం. అలాిం వాడు కూడా మానవులకు ఒక ఆధారం దొరకాలి కాబ్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. అందుకే గీతలో కృష్ణ భగవానుడు.
'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్క ృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే'' అని చెబుతాడు. ''నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకునే పరమ భాగవతోత్తములైన వారి కోర్కె తీర్చడం కోసం వారి మాంస నేత్రానికి దర్శనమవానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపం కాదు. నా అసలు స్వరూపం కాదు. నా అసలు స్వరూపం వ్యాపకత్వం. అంతా నిండి నిబిడీకృతమైపోయాను'' అనేది ఈ శ్లోక తాత్పర్యం. దీనిని భాగవతంలో మరింత సరళంగా ప్రహ్లాదుడి నోట-
ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెండు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి వింటే..(భాగ.7-275) అని పలికిస్తాడు. ''నాన్నా, నువ్వు విష్ణువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంావేిం? వ్యాపకత్వం వల్ల అంతా నిండిపోయాడు'' అని హిరణ్యకశపుడికి వివరిస్తాడు. మనం ఈశ్వర స్వరూపంలో కూడా శివకేశవుల ఐక్యతను చూడవచ్చు.
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్‌ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళమ్‌.. 
అని ఒక శ్లోకం ఉంటుంది. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు వున్నాయో అంతవరకు మహావిష్ణువు పెరిగిపోయి ఉంాడు. శివుడు ఈ బ్రహ్మాండమంతా నిడిపోయి ఉంాడు. మనకు ఏది ప్రీతిపాత్రమో ఆ నేత్రం నుంచి ఆ దేవుడిని చూస్తాం.
కానీ ఈ రెండింకీ ఉన్న భేదం ఏమీలేదు. వస్తువు ఒకటే. దానిని నిర్ధారించేది మార్గశీర్షం. ఉపాసనలో చిట్టచివరకు వెళ్లిపోయిన తర్వాత ద్యోతకాలు కావాల్సినది అదే. అందుకోసమే ఉపాసనా కాలమైన కార్తికం తర్వాత మార్గశీర్షం వస్తుంది.
లీ లీ లీ
పాపాలు పరిహరించే కోదండ శివుడు !
శంకరుడికి 'పినాకి'అనే పేరు కూడా ఉంది. రామచంద్రమూర్తి చేతిలో కోదండం ఉంటుంది. కోదండం లేని రామచంద్రమూర్తి అరుదుగా కనిపిస్తాడు. కోదండం పట్టుకున్న శివుడు అరుదుగా కనిపిస్తాడు. పరమశివుడు మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుాండు. మహావిష్ణువు చేసేటటువిం రాక్షస సంహారానికి, శంకరుడు చేసేటువిం రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. మహావిష్ణువు రాక్షస సంహారం చేసేటప్పుడు ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో వాికి మినహాయింపుగా చంపడానికి వీలయినటువిం శరీరాన్ని స్వీకరిస్తాడు. శంకరుడు తన రూపంలోనే రాక్షస సంహారం చేస్తాడు. కానీ శివుడు ధనుస్సును పట్టుకున్నట్టు సాధారణంగా కనబడడు. అయితే, ఈ విషయం మనకు శాబ్దికంగా తెలుస్తుంది. యజుర్వేదములోని శ్రీరుద్రము (రుద్రధ్యాయం)
'నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః యా త ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః శివాశరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ'-  
అని ప్రారంభమవుతుంది. కోపంగా ఉన్న శివుడికి నమస్కారం చేసి శరణు కోరటం ఈ స్తోత్రం ప్రధానోద్దేశం. కోపంతో ఉన్నవాడు తన చేతిలో ఉన్నటువిం ఆయుధం నుండి బాణాలను విడిచిపెడతాడు. అవి మనల్ని బాధిస్తాయి. రుద్రుడు మేరుపర్వతమనే బంగారు ధనుస్సును, దానిని సంధించానికి రెండు పక్కలా తూణీరాలను పట్టుకొని ఉన్నాడు. దీనిని ఈశ్వరుని ఘోరరూపమాండు. అటువిం ఘోర రూపంలో ఉన్న ఈశ్వరుడు తన ధనుస్సును తీసి ఎక్కుప్టిెనట్లయితే ఉత్తర క్షణం అందరి కళ్లలో అశ్రుధారలు కారతాయి. ఈ జగత్తుకు తల్లీ తండ్రీ ఆయనే. అలాిం వ్యక్తి అందరినీ ఎందుకు బాధపెడతాడు? మనం చేసిన పాప ఫలితం ఉంటుంది. అది బాధపడితే తప్ప పోదు. కాబ్టి శివుడు మనసు ఏడిపిస్తాడు.
'నేను పాపం చేశాను. కానీ నన్ను అంత ఏడిపించకు. నేను తట్టుకోలేను. నేను ఏడిస్తే చివరకు నీ పాదాల మీద విస్కృతి కలుగుతుంది. నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. నా మనస్సుకు ఏదో బాధ కలుగుతుంది. నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరమయిపోతాను. నిష్ఠతో నీ పాదాలను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబ్టి ఈశ్వరా, నీ కోపానికి ఒక నమస్కారం. ఈశ్వరా నీ ధనుస్సుకు ఒక నమస్కారం. ఈశ్వరా, నీ బాణాలకు ఒక నమస్కారం.
'యా త ఇషుపశ్శివతమా శివం బభూవ తే ధను'
'కాబ్టి నువ్వు మేం సంతోషించే బాణాలను వేయాలి. మేము ఏదో కొద్దిగా పుణ్యం చేసుకున్నాం. నువ్వు సర్వస్వతంత్రుడివి. నువ్వు తలుచుకుంటే నన్ను నీ భక్తుడిని చేసుకుంటే ఎవరూ అడ్డురారు. నా మీద దయ ఉంచి నన్ను నీ మార్గంలో పెట్టుకో. ఈశ్వరా, నువ్వు మమ్మల్ని అలా అనుగ్రహించు' అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనుస్సుకు, మొద్లో పట్టుకున్న ధనస్సుకు తేడా కనిపిస్తుంది. మొదిది ఘోర రూపం. 'నీవు నీఘోర రూపాన్ని వదిలి శాంత రూపాన్ని స్వీకరించు. తండ్రీ, మా పట్ల ప్రసన్నుడవు కావలసింది' అని అడుగుతాం. అసలు పినాకిని అనే శబ్దాన్ని మీ జీవితానికి అన్వయం చేసుకోవడానికి మొదట రుద్రం ఇదే విధంగా వివరించింది. ఇదీ అసలు ధనుస్సు. ఈ ధనుస్సును మీరు జీవితంలోకి అన్వయం చేసుకోవాలి. మీరు తప్పు చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది. అసలు తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి? మీరు మీ జీవితంలో శాంతమయిన శివ దర్శనాన్ని కోరుకున్నవారయి ఉండాలి. అంటే మీరు తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి.
శివతత్త్వం చాలా గంభీరంగా ఉంటుంది. ఆయన వెండి ధనుస్సును పట్టుకుని ఏం ఏస్తున్నాడు? మీరు చేసిన పాపాలకు తగిన శిక్షను విధిస్తూ మీ పాపలములను పరిహారం చేస్తున్నాడు. రాష్ట్రపతి ఉదారుడైప్టిెన క్షమాభిక్షతో విడుదలయిన ఖైదీ ఎంత పాపం చేసినా కొట్టుకుపోయినట్టు, ఎంత పాపం చేసినవాడయినా ఈశ్వరుని పాదాలు పట్టుకున్నవాడయితే ఆయన పాదాల మీద విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు. కాబ్టి ఇప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్టు చూసి కొడతాడు. కాబ్టి 'ఈశ్వరా మేం పాపం చేశాం. మీరు కోపంతో కూడిన ధనుస్సుతో మాకు కనపడవద్దు. మీరు ప్రసన్నమూర్తియై మాకు కనపడండి' అని కోరుకుాంం.
అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి మీరు చేసే పాపాలనికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు, మీ భయం తీయడానికి ఒకడు వేర్వేరుగా ఉండరు. 'భయకృత్‌ భయనాశనః' భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే. భయాన్ని తీసివేసేవాడూ పరమాత్మే. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువిం జీవధార. మీకు ఒక కష్టం కలిగించడానికి, కష్టాన్ని తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు. ఆ కష్టాన్ని మీరు మరిచిపోయేటట్టు చేసేటటటువిం కాల స్వరూపుడు కూడా ఈశ్వరుడే. గురు స్వరూపియై మళ్లీ యథా మార్గంలో మళ్లీ తిప్పినవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని కారుణ్యానికి అంతులేదు. కాబ్టి శాస్త్ర ప్రకారం, ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎప్పుడూ రక్షణే కల్పిస్తుంది. కాబ్టి శాబ్దీకం 'పాతీతి పినాకీ' అని చెప్పింది. ఈ ధనుస్సు మీకు ఘోర రూపంలో పాప ఫలితాన్నిచ్చినా, అఘోర రూపంతో సుఖాన్నిచ్చినా అది చేస్తున్నది మీ రక్షణే! కనుక ఆ ధనుస్సు లోకాలను రక్షించగలిగినటువింది. ఆ ధనుస్సు ఎన్ని కోట్లమంది ఉన్నారో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్నినీ రక్షిస్తుంది. అదీ ఆయన చేతిలో ఉన్న ధనుస్సు ప్రత్యేకత. అందుకే రుద్రం ఆ ధనుస్సును అంత స్తోత్రం చేసింది. రుద్రుడు అటువిం ధనుస్సును కలిగి ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నది పినాకము.
లీ లీ లీ
ఉపాసనకు ఉత్తమమైన కాలం కార్తికం!
ఆషాఢం నుంచి కార్తికం వరకూ ఉన్న కాలాన్ని ఉపాసనా కాలం అంారు. ఈ సమయంలో భక్తులందరినీ పరమేశ్వరుడు గమనిస్తూ ఉంాడు. వారి భక్తికి తగినట్లుగా అనుగ్రహిస్తూ ఉంాడు. భక్తి అపారమైనప్పుడు ఆయన వశమయిపోతాడు. వారు త్టినా, క్టొినా ప్రీతిగా స్వీకరిస్తాడు. ఈ ఉదాహరణ కోసం ఎక్కడి దాకానో వెళ్లాల్సిన అవసరంలేదు. మహా పుణ్యక్షేత్రం తిరుమలలో అనంతాచార్యుల వారు గునపం విసిరితే శ్రీవారి గడ్డానికి తగిలింది. అందుకే ఇప్పికీ స్వామివారి గడ్డానికి గంధం పెడతారు. శివార్జునుల యుద్ధం కూడా అలాిందే. భగవంతుడికి, మనకు మధ్య ఉన్న ప్రేమానుబంధం తెలియనప్పుడు చేసే పూజ యాంత్రికమవుతుంది. ఇప్పుడు మీలో కొందరు మనకు భగవంతుడిపై ప్రేమ ఎందుకుండాలి అని అడగవచ్చు. మనలో చాలా మందికి కుటుంబమంటే ప్రేమ ఉంటుంది. మనం ఏ పని చేసినా వారిని కూడా గుర్తు పెట్టుకుాంం. వారిని నొప్పించే పనులు చేయం. మనకు వారిపై ఉన్న ప్రేమ ఈ విధంగా చేయిస్తుంది. కానీ మనకు కనిపించని పరమేశ్వరుడిపై ప్రేమెందుకు ఉండాలి? ఎందుకంటే మన జీవం, జీవిక ఆయన ప్రసాదమే.  దీనిని అన్నమాచార్యుల వారు- ''వడిబాయక తిరిగే ప్రాణబంధుడా!'' అని అద్భుతంగా చెప్పారు. మన శ్వాసకు, మన పుట్టుకకు, మన అస్తిత్వానికి అన్నింకీ కారణం ఆయనేనని దీని అర్థం. మానవ జన్మలో జీవుడు ఉన్నంతకాలం శరీరంతో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం ఉన్నంత కాలం ఈశ్వరుడిపై ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు ఒక రూపం భక్తి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భక్తి అంటే అరగంటసేపు పూజా మందిరంలో కూర్చోవటం కాదు. ఈ ప్రపంచాన్నే ఒక పూజామందిరంగా చూడగలగటం. అలా ఉపాసన చేయగా చేయగా పరమేశ్వర కృప కలుగుతుంది. ఇది ఒక రోజో, రెండు రోజులో చేసే ప్రక్రియకాదు. జీవితాంతం చేయాల్సిన యజ్ఞం. దక్షిణాయనంలో ఉపాసన చేశాం, పరమేశ్వర సాక్షాత్కారం కలగలేదని ఆగిపోకూడదు. ప్రయత్నిస్తూ ఉంటే పరమేశ్వరుడిని చేరుకుాంం.
భక్తులకు ఒక లక్ష్యం నిర్దేశించానికి ఒక ఆకృతిని సృష్టిస్తారు. ఉదాహరణకు, కర్రతో గోడను దూకే వారు ఉంారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరుగెత్తుకొస్తారు. కర్రను భూమికి తాించి ఆ కర్రను ఆధారం చేసుకొని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెళతారు. గోడ మీద వరకు వెళ్ళిన తరువాత కర్రను ఇటువదలి తానటు పడిపోతాడు. అప్పుడు కర్ర కిందపడి పోతుంది. అంతే తప్ప, ''ఓ కర్రా! గోడ దూకడానికి నాకింత దూరం సహకారంగా వచ్చి, నా శరీరాన్ని పైకెత్తడానికి ఉపయోగపడ్డావు. నువ్వు కూడా నాతో రా అనడు.'' అంటే కర్రతో పాటు ఆ వ్యక్తి కూడా కిందపడిపోతాడు. ఈశ్వర ఉపాసన కూడా అలాిందే.
అనుగ్రహం ఎలా పొందాలి?
వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా ప్టిె వ్యాపారం చేస్తాడు. ఉపాసన క్రమంలో మొది పెట్టుబడి పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరం. స్నానం చెయ్యడం. ఓ మడిబట్ట కట్టుకోవడం. జీవుని కష్టపెట్టడం. సామగ్రి తెచ్చుకోవటం, కూర్చోవడం, పూజ చెయ్యడం, పుష్పార్చన చెయ్యడం- ఇవన్నీ శరీరాన్ని కష్టపెట్టడానికి. ఈశ్వరుడి అనుగ్రహం అంత సులభం కాదనే విషయాన్ని తెలియజేయానికి. ఉపాసనలో తొలి అడుగు అమ్మవారి అనుగ్రహం పొందటం. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఇంద్రియలౌల్యం మీద భ్రాంతి పోదు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు-
''సింధూరారుణ విగ్రహాం త్రినయనాం, మాణిక్యమౌళిస్ఫురత్‌ తారానాయక శేఖరాం, స్మితముఖీం ఆపీనవక్షోరుహాం, పాణిభ్యామలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం'' 
అని వర్ణిస్తారు. ''అమ్మవారు చేతిలో ఒక అమృత పాత్రవిం పాత్రను పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలో వాడికి భక్తి పాశాలు వేస్తుంది. ఎవడు భక్తిభావన లేకుండా కేవలం లౌల్య బుద్ధితో ఉంాడో అటువిం వాడికి ఆమె భక్తి పాశాలు దొరకవు. వాడు ఇంద్రియ లౌల్యంతో నశించిపోతాడు'' అని దీని అర్థం. అందుకే ఉపాసనను అశ్వనీ నక్షత్రంతో కూడుకున్న అశ్వయుజ మాసంతో మొదలుపెట్టమాంరు. దీని వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆషాఢ మాసంలో అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో గురు పూర్ణిమ వస్తుంది. ఆ తర్వాత మనల్ని అన్ని విధాలుగా అనుగ్రహించాల్సిన తల్లి లక్ష్మీదేవి. శరీరంలో బలం, తేజస్సు, ఉపాసనను కొనసాగించే శక్తి అన్నీ ఆమె ఇవ్వాలి. అందుకే ఆమెను శ్రావణ మాసంలో కొలుస్తారు. ఇక కార్తీకం ఉపాసనా కాలం కాబ్టి పార్వతీదేవిని కొలవమని చెబుతారు.
లీ లీ లీ
అపార ఐశ్వర్యానికి ఈశ్వరార్చన!
మనం అందరం ఒక సరోవరంలో కదులుతున్న తరంగాలలాింవాళ్లం. మనం ఉదయం నిద్రలేవగానే మనస్సు పరమాత్మ నుండి విడివడుతుంది. ఆ రోజు చేయాల్సిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుాంయి. ఇటువిం సంకల్పములకు అతీతుడై, ఈ సంకల్పములు దేనిలోనుండి పడుతున్నాయో అది తానై, నిరంజనస్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడే పరమాత్మ. ఆయనే శంకరుడు. సమస్తమును చూస్తూ ఉంాడు. అంటువిం ఆనందఘనమునకు 'శివ' అని పేరు. ఆ ఆనందఘనముతో విలీనం కావటమే మనుష్యజన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువిం మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే  ఆరాధ్య దైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాంస్యస్మిన్నితి'... అనే ఒక శ్లోకం ఉంది. సజ్జనుల మనస్సు ఎవరిలో రమించునో ఆయన శివుడు అని ఈ శ్లోక అర్థం. పరమాత్మను పట్టుకున్నవాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్థుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరుకున్నదేదీ యివ్వకపోవడం అనేది ఉండదు. అంతే కాదు. మన కోరికను మళ్లీ అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! ఇది లోక మర్యాద కూడా. ఈ మర్యాద ప్రకారం అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. అడగకుండా ఇచ్చినవాడిదే పైచేయి. ఒకరి దగ్గరకు వెళ్ళి వాచికంగా 'నాకిది యిప్పించండి' అని అడగాన్ని చాలా మంది ఆత్మహత్యా సదృశ్యంగా తీసుకుాంరు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టుప్టిె అప్పు తెచ్చుకునేవారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకుని అప్పు యిచ్చేవారు. మీరు శివస్వరూపమును ఎలాపట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. తన మహిమలు చూపిస్తాడు. దీనికి ఉదాహరణగా గుగ్గిల నాయనార్‌ కథను చెప్పుకోవచ్చు. గుగ్గిలం నాయనార్‌ జీవించే చోట ఒక శివలింగం ఉంది. అది ఎత్తుగా వున్న పీఠం మీద ఉంది. ఒక చిన్నపిల్ల ఆ శివలింగం దగ్గరకు వెళ్ళింది. ఆమె అరమరికలు తెలియని పిల్ల. ఆ శివలింగం మీద తనచేతిలోవున్న తుమ్మిపువ్వును వేయాలనుకుంది. ఆ పీఠం పట్టుకుని ఎక్కింది, ఎగిరింది కాని శివలింగం పైభాగం అందలేదు. అప్పుడు ఆ పిల్ల ఏడుపు మొదల్టెింది. ఏడుస్తూ 'శివా! శివా! నీవు నాకు అందడంలేదు, పూవు ఎలా వెయ్యను?' అంది. శంకరుడు ఆమె భక్తికి పరవశించిపోయాడు. భగవంతుడు ఎప్పుడూ భక్తికి కట్టుబడతాడు. వెంటనే నిరుగావున్న శివలింగం పక్కకి వంగిపోయింది. ఆ చిన్నపిల్లకి ఆ విషయం తెలియదు. వెంటనే చప్పట్లు కొట్టేసి ఆనందంతో శివలింగం మీద పువ్వులు వేసేసి అక్కడినుండి వెళ్ళిపోయింది. శివాలయ ప్రాంగణంలో అనేక శివలింగములు ఉంాయి. పిల్ల పువ్వు వేసిన శివలింగము వంగడంతో ప్రధాన ఆలయంలోని శివలింగం కూడా వంగిపోయింది. శివలింగం యిలా వంగిపోయినదేమిటని అర్చకస్వామి చూసి భయపడిపోయాడు. ఈ విషయం మహారాజుకి తెలిసింది. శివలింగం వంగడం వలన ఏదో అరిష్టం జరుగుతుందని భయపడ్డారు. ఈ శివ లింగమునకు ఒంపుదిద్ది పైకి తియ్యాలని ఆ శివలింగమునకు పెద్దపెద్ద ఇనుపగొలుసులు వేసి లాగించి వంపును తీసివేయడానికి ప్రయత్నించారు. శివలింగం వంపు దిద్దబడలేదు సరికదా అలా లాగుతున్న గొలుసులు తెగిపోయాయి. ఈ విషయమును ఎవరో గుగ్గిల నాయనారుకి చెప్పారు. ఈ విషయమును విని ఆయన మిక్కిలి బాధపడిపోయి ఏడుస్తూ క్రిందపడి దొర్లేశారు. 'శంకరా, నీ కంఠమునకు ఇనుప గొలుసులు వేసి ఏనుగులతో లాగారా! నీ కంఠం ఎంత ఒరిసిపోయిందో కదా' అని విన్నచోటునుండే గుడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళిపోయాడు. ఆ గుళ్ళోకి వెళ్ళి 'ఈశ్వరా, నీ శరీరమునకు జరిగిన అపరాధము నా శరీరము పొందేి ఖేదంతో పోవాలి. నీ వంపుదిద్దడానికి నీకు ఇనుపగొలుసులువేసి లాగినప్పుడు నీ కంఠం నొచ్చుకుని ఉంటుంది. ఆ శిక్ష నేను అనుభవిస్తాను' అని శివలింగము వంపును తీయడం కోసమని వేసిన ఒక గొలుసుచివర తనమెడకు బిగించుకుని, తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠంతో గ్టిగా లాగాడు. కంఠం తెగలేదు. శివలింగం వంపుపోయి అది నిరుగా అయిపోయింది. ఆ విధంగా ఆ వంపును దిద్దినవాడు గుగ్గిల నాయనారు. ఆ తర్వాత శంకర కృపవలన ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. అంత ఐశ్వర్యంతో జీవిస్తూ గుగ్గిలనాయనారు శివభక్తిని విడిచిపెట్టలేదు. అంత్యమునందు తేలికగా శరీరం వీడి హాయిగా పరమశివుని పాదములలో కలిసిపోయాడు.
లీ లీ లీ
హరిహరుల ప్రాధాన్యమేమి?
పరమశివుని లీలామూర్తులలో పదమూడవ మూర్తి హరిహర మూర్తి. అంటే ఆయన శరీరంలో సగ భాగాన్ని మహా విష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకుని శరీరంలో సగభాగాన్ని స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంారు. 'నువ్వు ఎటువిం భక్తితో ఎటువిం ఉపాసన చేసి శంకరుడి అర్ధభాగాన్ని పొందావో ఆ ఉపాయాన్ని నాకు చెప్పవలసినది' అని పార్వతీదేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామస్తోత్రం. ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఆధారం చేసుకొని పార్వతీదేవి శంకరుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది. అది పద్నాలుగవ స్వరూపం. దానిని అర్ధనారీశ్వర స్వరూపం అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రదోష వేళలో చదివితే ఈ ప్రపంచంలో మనకున్న కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడి కోరికలను తీర్చటం మాత్రమే కాదు- పరలోక సుఖాన్ని, భగవంతుడి అనుగ్రహాన్ని కూడా ప్రసరింపచేస్తుంది.
ముగ్గురూ ఒక్కరే
'శివో మహేశ్వరః' అని మనం చాలాసార్లు వింటూ ఉంాం. ఇక్కడ మహేశ్వరః అనే నామం చాలా చిత్రమైనది. మంత్ర పుష్పం చెప్పినప్పుడు-
ఈశానస్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్‌ బ్రహ్మణో-ధిపతిర్‌ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్‌... 
అని స్తుతిస్తారు. ''సర్వమంగళాలకు కారణమయినవాడు, సర్వజగన్నియామకుడు, సృష్టి స్థితి లయలు చేసే వాడు ఒక్కడే. అయితే సృష్టి చేసినప్పుడు, స్థితికారకుడిగా ఉన్నప్పుడు, లయకారకుడిగా వ్యవహరిస్తున్నప్పుడు మూడుగా కనబడతాడు. ఈ ముగ్గురు వేర్వేరు కారు... ఒకరే అనే జ్ఞానం ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు'' అని దీని అర్థం. ఇక్కడ సృష్టి అంటే పూర్వం లేని దానిని మనకింకి కనపడేటట్టుగా ఒక కొత్త వస్తువు తయారు చేయటం. స్థితి అంటే ఆ పదార్థాన్ని కొంత కాలము అలా క్షేమంగా ఉంచటం. లయమంటే ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడం.
ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. మనలో చాలా మంది రుద్రుడు సంహారకర్త. లయకారకుడు, ఆయన సంహరిస్తాడు అని అనుకుాంరు. లయం అనే శబ్దానికి అర్థం కేవలం చంపివేయడం మాత్రమే కాదు. పరమశివుడు చాల ఉదారుడై ఉంాడు. మనకు లయంలో 'స్వల్పకాలిక లయం' అని ఒక మాట ఉంది. దీని అర్థం నిద్ర. మనసు ఆత్మతో విలీనమయిపోయి, శరీరంలోని ఇంద్రియాల శక్తి అంతా మనసుకు చేరితే దానిని నిద్ర అంారు. ఆ స్థితిలో బాహ్యప్రపంచానికి సంబంధించిన విషయాలేమి తెలియవు. అప్పుడు కలిగే ఆనందమే శంకరుడు. తెల్లవారి నిద్రలేవగానే మనసు మేల్కొంటుంది. మేల్కొనడం అంటే ఆత్మనుంచి విడివడుతుంది. యథార్థానికి సృష్టి స్థితి లయ అనే వాిని ఇక్కడే దర్శనం చెయ్యాలి. తెలివి రాగానే మనం చేయవలసిన పనులను సంబంధించి మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ లోచన అనేది మనసు స్వరూపం. దాని స్వరూపాన్ని తెలుసుకో గలిగితే అంతఃదర్శన మవుతుంది. ఇలా అంతఃదర్శనమయిన తర్వాత ఆ రోజు మనం చేయాల్సిన కార్యాలన్నింనీ విడగొట్టుకోవాలి. మంచి పనులకు ఉపక్రమించగలగాలి. చెడు పనులకు ఎదురు తిరగాలి. ఇలా చేయాలంటే నిర్వహణ సమర్థత కావాలి. అలాిం శక్తి కలిగిన వాడు స్థితి కారకుడు. ఈ శక్తిని స్త్రీగా చెపితే నారాయణి అమ్మవారు. పురుషుడిగా చెపితే మహావిష్ణువు. ఆయన స్థితికారుడు.  అందుకే ఉదయాన్నే విష్ణునామాన్ని చెప్పమాంరు. ఆ విధంగా చేయటం వల్ల ఆలోచనలను చక్కదిద్దుకొనే శక్తి మనకు వస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు పదకొండు సార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానానికి శరీరాన్ని చేర్చాలి. పడుకున్న తరువాత ఇక మ్లాడకూడదు. అప్పుడు స్వల్పకాలిక లయం జరుగుతుంది. ఈ విధంగా చేయటం ద్వారా మనం ఒక రోజును మహేశ్వర అర్చనగా మారుస్తున్నాం. అందుకే ఉదయానే లేచిన వెంటనే దేవతా స్వరూపాన్ని చూడమని చెబుతారు. ఆ స్వరూపం లక్ష్మీనారాయణులు కావచ్చు, పార్వతీ పరమేశ్వరులు కావచ్చు లేక మరొక దేవతా స్వరూపం కావచ్చు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం కాబ్టి రూపం ఏదైనా అభ్యంతరం లేదు. ఈ విధంగా మనసుకు అలవాటు చేస్తే మంచి ఆలోచనలు రావానికి వీలవుతుంది.
లీ లీ లీ
మాయ నుంచి తప్పించుకోవటం ఎలా?
మానవుడికి మోక్షాన్ని ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉంది. ఆయన శక్తి క్షీణించిపోనిది. నిరంతరం ఉత్సాహభరితమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతా ఈశ్వరునిదే. ఈ విషయం తెలుసుకునే పెద్దలు 'అంతా ఈశ్వరునిదే... ఈశ్వరుడిది కానిది ఏదీ లేదు' అనే భావనతో బతుకుతారు. ఈశ్వరుడిని చేరుకోవటం ఎంత సులభమో... అంత కష్టం కూడా. ఆయన మాయ మనను అడ్డగిస్తూ ఉంటుంది. ఈశ్వరుడి అనుగ్రహం వల్లే ఆ మాయ తొలగుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. మేఘం సూర్యుడి వల్లే ఏర్పడుతుంది. సూర్యుడు సముద్రంలో నీిని గ్రహిస్తే ఆ నీరు ఆవిరిగా మారి మేఘ రూపంలో ఏర్పడుతుంది. ఆ మేఘం సూర్యుడికి అడ్డువస్తుంది. అప్పుడు సూర్యుడు కనబడడు. ఈ విధంగానే ఈశ్వరుడు సృష్టించిన మాయ-మనకు అడ్డుపడుతుంది. ఇది ఈశ్వరుడి ఆరాధన వల్ల, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వల్ల తొలగుతుంది. అందుకే మన పెద్దలు గురువులేని విద్య గుడ్డి విద్య.. అంారు.
మాయా స్వరూపం
ఈ మాయ చాలచిత్రంగా ఉంటుంది. దీని వల్ల కామక్రోధాలు వస్తాయి. ఈశ్వరునితో ఉన్న పట్టు పోతుంది. అంతా తన ప్రజ్ఞగానే కనిపిస్తుంది. గొప్ప మహాత్ములయినవారు కూడా ఒక్కొకసారి మాయకు వశులయిపోతూ ఉంారు. అలాిం వాిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మహాత్ములెవరూ తన జీవితంలోని సంఘటనలను దాచరు. వారి అన్ని విషయాలనూ రాసేస్తారు. మహాత్మా గాంధీ తన జీవితంలో ఎలాిం సంఘటననూ దాచలేదు. చంథ్రేఖర పరమాచార్య తన 73వ ఏట- 'ఇప్పికీ అశ అప్పుడప్పుడు నన్ను వశపరుచుకోవానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది' ఆని చెప్పుకున్నారు. దీనికి సంబంధించి శివపురాణంలో ఒక గొప్ప కథ ఉంది. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమాలయాల కింది భాగంలో, పరమ శివుడు తపస్సు చేసిన ప్రాంతంలో కూర్చుని- పరబ్రహ్మాన్ని గురించి తపస్సు చేశారు. నారదుడిని పరీక్షించానికి ఇంద్రుడు మన్మథుడిని పంపాడు. మన్మథుడి ప్రయత్నాలకు నారదుడు లొంగలేదు. నారద మహర్షి తపస్సు సఫలీకృతం అయింది. ఆ తపస్సు పూర్తిచేసి ఆయన బయటకు వచ్చి శంకరుడి దగ్గరకు వెళ్లాడు. 'ఈశ్వరా, హిమాలయాల్లో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మథుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ మన్మథ బాణాలను లెక్కపెట్టలేదు. కామాన్ని జయించి నేను తపస్సులో సిద్ధిని పొందాను' అన్నాడు. నారదుని మాటలు విని శంకరుడు నవ్వాడు. 'నారదా, నువ్వు చాలా చక్కి మాట చెప్పావు. నువ్వు కాముడినే జయించావా? కాముడిని జయించడమంటే మాటలు కాదు. నేను చాలా సంతోషించాను. కానీ నారదా నీకొకి చెబుతాను, గుర్తు పెట్టుకో. నా దగ్గర చెప్పినట్లు నారాయణుడితో చెప్పకు'అని సలహా ఇచ్చాడు. కానీ నారదుడు శంకరుడి మాటలను పెద్దగా ప్టించుకోలేదు. గురువుల మాటను తిరస్కరించడం అంటే ఇదే! నారదుడు వైకుంఠానికి బయలుదేరాడు. మధ్యలో తన తండ్రి, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తాను చేసిన తపస్సు గురించి, మన్మథుడు వచ్చి బాణాలు వేసినా తాను చలించని విషయాన్ని గురించి చెప్పాడు. అప్పుడు బ్రహ్మ 'నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇంతకు పూర్వం పరమ శివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మథుడు వస్తే ఆయన తన మూడవ కిం మంటతో అతన్ని కాల్చేశాడు. అపుడు మన్మథుడు బూడిద అయిపోయాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవడానకి కారణం, నువ్వు కాముడిని గెలవడానికి కారణం ఇంతకు పూర్వం ఈశ్వరుడు అక్కడ తపస్సు చేయడం. అది శివ ప్రజ్ఞ. నీ ప్రజ్ఞ కాదు'' అని మందలించాడు. అందువల్ల మనం ఎప్పుడైనా ఏదైనా సాధిస్తే అది ఈశ్వరానుగ్రహం వల్ల జరిగిందనే అనుకోవాలి. అంతేకానీ మన ప్రతిభగా చెప్పుకోకూడదు. ఆ సాధించిన దానిని మనలో నిక్షేపించుకోకూడదు.
లీ లీ లీ
శంభు నామ మాహాత్మ ్యం
పరమ శివుడిని 'శంభుః' అని ఒక చిత్రమయిన నామంతో పిలుస్తారు. 'శం' అంటే నిరతిశయమయిన సుఖం. 'భావయతి' అంటే కల్పించేవాడు. ఒక వస్తువును అనుభవించినప్పుడు దాని వల్ల కొంత సుఖానుభూతి కలుగుతుంది. ఒక వస్తువు అస్తిత్వంలో ఉండడానికి, అది అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈ శక్తిని ప్రసాదించేవాడు ఈశ్వరుడు. అందుకే 'ఈశ్వరాత్‌ జ్ఞానమన్విచ్ఛేత్‌ జ్ఞానదాతా మహేశ్వరః' అంారు. ఈశ్వరుని అనుగ్రహం వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుందని దీని అర్థం. శంభునామాన్ని గ్టిగా పట్టుకుని ఆ నామంతో పిలిస్తే, ఆయన మన భావాల్ని మార్చి మనసును ఈశ్వరుడి వైపు త్రిప్పుతాడు. సత్ప్రవర్తన కల్పిస్తాడు. అందుకే ప్రతిరోజూ శంభునామాన్ని చెప్పుకుంటూ ఉంటూ శంభుని అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడు శంభుడు- ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్థ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని అందరూ అనుకుంటున్నారో అన్నీ ఇస్తాడు. దీనినే కామకోి అని పిలుస్తారు. కామకోి అంటే కోర్కెలను ఇవ్వడంతో మొదలుప్టిె కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి, ఆ తరువాత పుణ్యాన్ని ఇచ్చి, పుణ్యం వల్ల ఊర్థ్వలోకప్రాప్తి వరకు ఇచ్చి, తరువాత మరల తిరిగి రానవసరం లేని పునరావృతరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని అనుగ్రహిస్తాడు.
లోకములు మూడు...
ఈ లోకంలో సుఖంగానే జీవిస్తున్నాం. మిగిలిన విషయాల గురించి అప్పుడే చింత ఎందుకనే భావన కొందరిలో ఉంటుంది. అందుకే మన పెద్దలు లోకాలను మూడుగా విభజించారు. ఒక లోకం కేవలం సుఖాలను అనుభవించడానికి మాత్రమే ఉంటుంది. అక్కడ దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం - నరకంలో- సుఖమన్నది ఉండదు. ఎప్పుడూ ఏడుపులు, పెడబొబ్బలు, కేకలు, అరుపులతో భయంకరంగా ఉంటుంది. అది నరకలోకం. ఇక భూలోకంలో సుఖం, దుఃఖం రెండూ ఉంాయి. ఒక రోజు మనిషి చప్పట్లు కొట్టేస్తూ, పొంగిపోతూ, అన్నీ నేను అనుకుంటూ ఉంాడు. మరొక రోజు కుమిలిపోతూ ఏడుస్తూ ఉంాడు. అదే భూలోకం. ఇక్కడ జీవుడు సుఖదుఃఖాలను రెండినీ అనుభవిస్తూ ఉంాడు. ఇక్కడి నుంచి పూర్ణ దుఃఖం కలిగిన లోకం లోకయినా వెళ్ళవచ్చు లేదా పూర్తి సుఖం కలిగిన లోకం లోకయినా వెళ్ళవచ్చు. కానీ స్వర్గానికి వెళ్లాలంటే పాపం చేయకుండా ఉండాలి. అది అంత తేలికైన పనికాదు.
మనం సాధారణంగా 'చతుర్ముఖ బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాతప్రకారం మనం పనులు చేసేస్తూ ఉంాం' అని అనుకుాంం. కానీ అది తప్పు. మన పూర్వికులు మనం అనుక్షణం శివుడిని ప్రార్థించాలని కోరుకున్నారు. అందుకే తిలకధారణాన్ని సూచించారు. విభూతి తీసుకొని నుదుటను బొట్టు పెట్టుకుంటే- పార్వతీ పరమేశ్వరుల్ని నుదిపై పెట్టుకున్నట్లే! 'లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం నశక్యతే' అనేది సామాన్య సిద్ధాంతం. అంటే బ్రహ్మ రాసిన రాత మారదు అని చెప్పటం. కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే, ఆ లోచనా సరళిలో మార్పు వస్తుంది. తప్పుడు పనులను మానేయాలనే భావన కలుగుతుంది. అటువిం తప్పుడు పనులను చేయకూడదనే పూనిక రావడం ప్రారంభమవుతుంది. మనసును జయించానికి ముందు శరీరాన్ని అలంకృతం చేస్తారు. అలా చేయడం ప్రారంభిస్తే దుఃఖాన్ని స్వీకరించి దుఃఖం నుండి బయటపడతారు. ఇది వినానికి చాలా చిత్రంగా ఉంటుంది. ఈ లోకంలో సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు ఉన్నాయి. ఈ త్రిగుణాలు మన మనసును సుఖాలను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంాయి. ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంాయి. ఉన్నతిని పొందకుండా బాధించే త్రిగుణాల బాధ నుండి బయటపడడానికే చాలా మంది సంసారమనే కొత్త బాధను ఎంచుకుాంరు. సంసారంలో ఉండి తరించడం చాల కష్టం. అలా తరించాలంటే దానికి మార్గం తెలియాలి. మరి బాధపోవడానికి సుఖంలోకి కదా వెళ్ళాలి? మరి బాధపోవడానికి బాధలోకి వెళ్లమనడంలో ఉద్దేశం ఏమి? సత్వరజస్తమోగుణాలనే మూడు గుణముల నుండి బయటపడడానికే సంసారంలోకి ప్రవేశించి సుఖాలను అనుభవించి, ఈ సుఖాలు సుఖాలు కావు, నిజమయిన సుఖం ఈశ్వరుడే అనే లక్షణాన్ని ఏర్పరచుకుని, వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం. దీని వల్ల ఇక ఇంద్రియాలు, మనసు చలించని స్థితికి వెడతాడు. దీనిని ఒక ఉదాహరణతో చెప్పవచ్చు. గాలి మల్లెపూల మీదుగా వెళ్తుంది. తాను మల్లెపూవుల మీద నుండి వస్తున్నాని పొంగిపోదు. అశుద్ధం మీదుగా వెళ్తుంది. తాను అశుద్ధం మీదుగా వెళ్ళాలని బాధపడదు. దేని మీద నుంచి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది. దానికేమీ బాధలేదు. అలాగే పూర్ణ వైరాగ్యం పొందిన వారికి సుఖ దుఃఖాల బాధ ఉండదు.
లీ లీ లీ

No comments: