వివాహం - ఆవశ్యకత, విశిష్టత
ఇహలోకంలో మానవుని మనుగడను నిర్దేశిస్తూ, ఆనాికి సామాజిక జీవన వ్యవస్థ సమస్యాత్మకం కాకుండా సుఖ-శాంతులతో జీవనయాత్ర సాగడానికి ఏర్పడినది ఈ భారతీయ వివాహ వ్యవస్థ. మన వివాహ వ్యవస్థ, యావత్ప్రపంచానికి మార్గదర్శకమై జీవన దిశా నిర్దేశము చేయు ఒక గొప్ప వ్యవస్థ. ఎక్కడో ఒక సత్సంప్రదాయంలో ప్టుిన ఆడపిల్ల, మరెక్కడో మరొక సత్సంప్రదాయంపరంపరలో జన్మించిన మగపిల్లవాడు. మరి కుటుంబాలను, ఈ వధూవరుల హృదయాలను ఒకే ఆలోచనతో ముడివేసి ఇరుకుటుంబములలో వెలుగు విరజిమ్మే విధంగా శాశ్వత బంధంగా మార్చి ఆనందముతో జీవన యాత్ర సాగుటకు మూలము ఈ వివాహము.
వైదిక ధర్మాచరణమునకు యోగ్యతను అధికారమును ఒన గూర్చునది గృహస్థాశ్రమము. అందుకే ధర్మార్ధకామములనే పురుషార్ధములను ఆచరించడంలో, అనుభవించడంలో తన ధర్మపత్నిని అతిక్రమించి ప్రవర్తించనని మామగారికి వాగ్దానము చేస్తాడు. ఎంతో అల్లారుముద్దుగా, ఎంతోగారాబంతో, ప్రేమతో పెంచుకున్న కూతురును సర్వధా తనకు దానము చేస్తున్న మామగారికి కన్యాదాన సమయంలో ప్రతిజ్ఞాపూర్వకంగా చేయు వాగ్దానమిది. యావజ్జీవము ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి జీవనయాత్ర సాగించడానికి వేసిన ఒక అద్భుతమైన బంధమీ కన్యాదానము.
ఇంత గొప్పదైన గంభీరమైన అంతరార్ధము కలిగియున్నది మన భారతీయ వివాహ వ్యవస్థ.
వైవాహిక ప్రక్రియ
2. గోదాన వ్రతం
గురుకులంలో బ్రహ్మచర్య దీక్షతో విద్యాభ్యాసం పూర్తిచేసిన బ్రహ్మచారి ఆ దీక్షను విరమించడం స్నాతకవ్రతం, అంతవరకు పెరిగిన కేశములను తీసివేయడమే గోదాన వ్రతం. గోదానమంటే ఆవులను దానం చేయడం కాదు. కేశఖండనమన్నమాట. పుట్టు వెంట్రుకలును తల్లిదండ్రులు తీయిస్తారు. కాని ఈ కేశఖండనం గురువు చేయిస్తాడు. సప్త సింధువులు ఇతని ఆయుష్యాన్ని ఇంకా ఇంకా పెంచాలని ఈ సందర్భంలో గురువు ఆశీర్వదిస్తాడు.
3. రక్షాసూత్ర బంధనము
పాణిగ్రహణాధికార యోగ్యతాసిద్ధికై, అశౌచద్వయ పరిహారార్ధమై వధూవరులకు కంకణధారణ చేయిస్తారు.
వరుడి కుడి చేతికి, వధువుకు ఎడమచేతికి కంకణం కడతారు. జరగబోయే పాణిగ్రహానికి ఇది అంగం.
4. స్నాతకం
గురుకులంలో బ్రహ్మచర్యాశ్రమాన్ని నిర్వహిస్తూ, కష్టపడి దీక్షతో విద్యలన్నింని అభ్యసించిన తరువాత గృహస్థాశ్రమంలో ప్రవేశించమని గురువుగారు ఆదేశించిన ఆజ్ఞను గైకొని చేయునది స్నాతక వ్రతము. ఈ మొది పద్ధతినే ఈనాడు విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవమనే పేరుతో (................) నిర్వహిస్తూాంరు.
వేదాధ్యయనం పూర్తి చయించిన గురువు
శిష్యుణ్ణి గృహస్థాశ్రమంలోకి పంపిస్తూ ఇలా శాసిస్తున్నాడు!
సత్యమును పలుకుము! ధర్మమార్గములో పయనించుము!
తల్లిని దైవంగా అర్చించు!
తండ్రిని దైవంగా ఆరాధించు!
గురువును దైవంగా గౌరవించు!
అతిధిని దైవంగా ఆదరించు! మంచి పనులని మహనీయులు చెప్పిన వాినే ఆచరించు!
చెడుపనుల జోలికి పోవద్దు. మనసా, వాచా నువ్వే సర్వస్వం అని నమ్ముకుని వచ్చిన భార్యను సకలవేళల సంరక్షిస్తూ, సంతృప్తి పరుస్తూ
ఆమెద్వారా సత్ సంతానాన్ని పొంది నీ వంశానుగతమైన ఆచార సంప్రదాయములను కాపాడుము.
ఇదే మా ఆదేశం, ఉపదేశం, వేదసారభూతమైన ఉపనిషత్ అనుశాసనం.
5. సమావర్తనం
సమావర్తనమంటే తిరిగిరావడం, విద్యాభ్యాసం పూర్తిచేసి స్నాతక వ్రతం చేప్టిన ఒక సంవత్సరానికి స్నాతకుడు గురుకులాన్నుంచి పాదయాత్రతో లౌకిక ప్రపంచంలోకి తిరిగి రావడాన్నే సమావర్తనమాంరు. ఈ సందర్భంగా స్నాతకుడు
1. మణికుండలాలు
2. పంచెల చాపు
3. గొడుగు
4. చెప్పులు
5. కమండలం
6. పూలదండ
7. నలుగుపిండి
8. తలనూనె
9. కాటుక
10. తలపాగాలను గురువుకు సమర్పించి తానుకూడా తీసుకుాండు.
ఈశాన్యదిశగా కాశీయాత్రకు బయలుదేరుతాడు.
6. శ్రీరంగ యాత్ర (కాశీయాత్ర)
పూర్వం విద్యార్జనకై బ్రహ్మచారులు కాశీకి వెళ్ళేవారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఇది శ్రీరంగ యాత్ర. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్ళవలసి వచ్చేది. ఎండ, వాన నుండి రక్షణ కోసం గొడుగు పట్టుకొని బట్టలు తీసుకొని వెళ్ళేవారు. యోగ్యుడైన స్నాతకుడైన అతనికి తన కూతురును కన్యాదానం చేస్తే బాగుండునని భావించిన మామగారు మా అమ్మాయి పాణిగ్రహణము చేయుమని కోరుతారు.
నాలుగు కాళ్ళను ఒకే లక్ష్యంవైపు నడిపించే భవ్యశక్తి 'పెండ్లి'
7. స్వర్ణయజ్ఞోపవీతధారణం
ఉపనయన కాలంలో యజ్ఞోపవీతంకాక, గృహస్థాశ్రమాధికారయోగ్యతకై రెండో యజ్ఞోపవీతాన్ని వరుడు ఈ సందర్భంలో ధరిస్తాడు.
ధర్మబద్ధమైన ఇహలోక భోగాలు అనుభవిస్తూ, శాశ్వతమైన పరలోక సుఖసోపానాల ఆరోపణకు
తొలిమెట్టు 'పెండ్లి'
8. వరాన్వేషణం
వధువుకు అనురూప గుణగణములుకల వరుని అన్వేషించుట వరాన్వేషణ. అలాిం సత్సంబంధమును తన బంధువులు, మిత్రులు, ఆప్తుల ద్వారా అన్వేషించుట.
పురాణగాధల్లో శివుడు హిమవంతుని వద్దకు సప్తర్షులను పంపుట, శ్రీనివాసుడు ఋషులను పంపుట, ర్ముణి శ్రీకృష్ణుని వద్దకు బ్రాహ్మణోత్తములను పంపుటను చూస్తే ఈ ఆచారమే కొనసాగుతున్నదని తెలుస్తున్నది.
9. వరాగమనం
సుముహూర్తం నిశ్చయమైన తరువాత తగినంత ముందుకు వరుడు బంధుమిత్రులతో కలిసి మంగళగీత వాద్యాలతో శుభశకునాలతో కన్యాదాత యిచ్చిన విడిది ఇంికి తరలిరావడమే వరాగమనం. అందంగా అలంకరించిన వాహనంలోకాని, గుర్రముపైనకానీ, అనేక వేడుకలతో, నృత్యగీతాలతో, టపాసులతో, విద్యుద్దీపాలతో రంగరంగ వైభంగా వచ్చినపుడు ఒకవైపు మంగపెళ్ళివారి దర్పం, మరొకవైపు యువతీయువకుల ఉత్సాహవంతమైన ఆటపాటలు చూసి ఆనందించవలసిందే.
10. మహా సంకల్పం
సామాన్య మానవులకు అసామాన్య, అసాధారణ పుణ్యఫలం దక్కడానికి మహాసంకల్పం.
మహా సంకల్పం మూడు భాగాలు
మొది భాగం
కన్యాదాత ఉన్న ప్రదేశానికి పూర్వరంగం, ఇందులో సప్త ఆవరణాలు, పదునాలుగు లోకాలు, అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల పట్టణాలు, అష్టదిక్పాలకుల పేర్లు, భరతఖండ విస్తీర్ణతల ప్రస్తావన.
రెండవ భాగం
కన్యాదాత కన్యాదానం చేస్తున్న సంవత్సర, మాస, తిధి, వార, నక్షత్ర వివరాలు
మూడవ భాగం
కన్యాదాత కన్యాదానం చేయడంలో ఉన్న అంతరార్ధ ఉద్దేశం. జన్మజన్మల నుండి మరీ ఈ జన్మలో మహా పాతకాలు మటుమాయం కావడానికి. శ్రీహరి, ఆదిత్య, బ్రహ్మలోక, ధ్రువలోక, గోలోక నివాసం కోసం నూరుయాగాల పుణ్యఫలాల కోసం కన్యాదానం చేస్తున్నానని చెప్పడం.
అస్య శ్రీ భగవతో మహా పురుషస్య : శ్రీమదాదినారాయణస్యాచింత్యాపరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమాణానా మనేకకోి బ్రహ్మాండానామేకతమే వ్యక్తా వ్యక్త మహ దహంకార పృథి వ్యాప స్తేజో వాయు రాకాశా ద్యావరణై రావృతే స్మిన్ మహతి బ్రహ్మాండఖండమధ్యే | సకలాధిష్ఠాత్రాది వరాహ దంష్ట్రాంకుర మృణా నస్య జగన్మూల శక్తి కూర్మానంతా ద్యైరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అసుప్రతీకా ఖ్యాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య | అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తపాతాళానాముపరితలే | భూలోక భువర్లోక సువర్లోక జనలోక తపోలోక సత్యలో కానా మథోభాగే | అమరావ త్యశోకవతీ భోగవతీ నయవతీ గాంధర్వవతీ సిద్ధవతీ కాశీ కాంచీ అవం త్యాది పుణ్యపురీ విరాజితే | ఇంద్రాగ్ని యమ నిరృతి వరుణ వాయు కుబేరేశానా ఖ్యాష్టలోకపాల పాలితే | లోకా లోకాచల వలయితే | మహేంద్ర మలయ సహ్య శక్తి మదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకులాచల మధ్యే | మతంగ మాల్యవ త్కిష్కింధ హేమకూట ఋష్యమూకాఖ్య పంచమహానగ వరాధిష్టితే | వలయాకార లవణేకక్షు సురా సర్పి దధి క్షీరోద కార్ణవ పరివృతే | జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాక శాల్మల పుష్కరాఖ్యోత్తర ద్విగుణీకృత సప్తద్వీపై ర్దీపితే | ఆంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ బంగాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్టాట నాట కరాట పానాట పాండ్య పుళిం దాంధ్రహూణ శార్ణవ విదర్భ విదేహ బాహ్లీక బర్బర కేకయ కోసల కుంతల కిరాత శూరసేన ింకణ కొంకణ మత్స్య మద్ర సైంధవ పారసీక ఘార్జర యువన సాల్వ చేది సింధు కురు పాంచాల భోజ కటకేత్యాది మధ్యదేశ ద్యనేకదేశ భాషా విశేష భూపాల విరాజితే | ఇంద్రద్వీప కశేరు తామ్ర గభస్తి నాగసౌమ్య గంధర్వచారణ భారతేత్యాది నవ ఖండాత్మకే | ప్రత్యేక నవసహస్ర యోజన విస్తృత భారతే | కింపురుష హరివర్ష కురు భద్రాశ్మక రమణక మందహరణ ఖల హారన పాంచజన్య సింహదళన నవవర్ష హర్షితే | కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యా ద్యరి షడ్వర్గ రహితానాం | యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమా ధ్యష్టాంగయోగ నిరతానాం | మునిసేవిత దండక వింధ్యా చంపక బదరికా నహుష గుఙా దేవదారు కారణ్యకదళీ కేదారారణ్యాది థారణ్యయుతే | భాగీరథీ గౌతమీ నర్మదా యమునా కృష్ణవేనీ బాహుధా భీమరథీ తుంగభద్రా వేణుకా మలాపహారీ కృతమాలా తామ్రపర్ణీ చంద్రభాగా వరుణా వాపీ పయోష్ణీ వక్రగా ప్రమా వేలావతీ వేగవతీ వేదస్మృతివిశోక కౌశికీ గంగా గండకీ గోమతీ పినాకినీ వసిష్ఠా ప్రవరా చిత్రకా కాశ్యపీ సరయూ సరస్వతీ పాపహారీ కుశావతీ గయా ద్వారకా మధురా శ్రీరంగ ధర్మపురీ శ్రీవేంకాచల సింహాచల పాండురంగాది పుణ్యనగర దివ్యదేశ దేవాలయైః పరివృతే | మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్యాఖ్యై ర్దశావతారై ర్విరాజితే | శ్రీ యాదవాచల ఘికాచల వానాచల కురంగాచల శ్రీశైలాది పుణ్యాచలై స్సమధిష్ఠితే | పంచాశ త్కోి విస్తీర్ణ జంబూ ద్వీపే | భరత వర్షే | భరత ఖండే | శ్రీరామ క్షేత్రే | భౌమ భౌమౌ | వివిధ సురతరు క్రీడావన బహుళ పరిమళ భ్రమ ద్భ్రమర పటల ఠంకార కరంబిత కలకంఠ కూజిత కేకీకృత కేకారవ ముఖరీకృత సారతర తరుషండే | అతుల విమల కమల కలధౌత కల్పతరు చ్ఛాయావృత దేశే | దివ్య సింహాసనోపరిస్థిత యంత్రరాజ చతుర్దశ వర్ణ వర్ణిత సహ స్రదళ కమల కర్ణికోపవిష్ట సారస్వతీ నిలయ దండ కారణ్యే | సమభూమౌ | మధ్యరేఖయాః పూర్వ దిగ్భాగే | భూ ప్రష్ఠ సహస్ర యోజనోన్న తస్య ద్వాత్రింశత్సహస్ర యోజన మూర్థ్ని విన్యస్త సకలదేవతావాస భూతస్య మేరో ర్దిక్షిణ దిగ్భాగే | శ్రీరంగ స్యోతరప్రదేశే | లంకాయాః ఉదగ్భాగే | శ్రీ గంగా కావేర్యోర్మధ్యదేశే | శంఖ చక్ర గదా శాజ్గ కృపాణ పంచాయుధ దివ్యరత్న ఖచిత కిరీట కేయూర మార నూపుర కౌస్తుభ మణి కుండల మండిత శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసార భూత మహదాహ్వయ భక్తిసార శఠకోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్యసూరభిః | నాథార్య పంకజాక్ష రామమిశ్ర యామున గోష్ఠీపూర్ణ వరరంగ కాంచీపూర్ణాది జ్ఞానసూరభిః | రామానుజాది స్వాచార్యవర్గైః | వసిష్ఠ భృగు పులస్త్య పులహ క్రతు మరీచి దోఆంగిరసాత్రి సంజ్ఞికైర్మహర్షిభిః నవ బ్రహ్మాదిభిశ్చస్తూయమానస్య సనక సనందనసనత్కుమార పరాశరపుండరీక వ్యాసాంబరీష బలిరుక్మాంగదార్జున విభీషణ మనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవత స్తూయమానస్య | కమలాసన పార్వతీ శేంద్రాది త్రయస్త్రిశ త్కోి సురచక్ర చూడామణి శ్రేణి విరాజిత పాదాంభోరుహస్య | అకిల లోకాను గ్రహ బుధ్యా స్వీకృత నానావతారస్య | క్షీర పారావారావతీర్ణ మణిమయ మండిత మంట పాంతరాళానంత భోగి భోగతల్ప శ్రీ భూ భుజావల్లీ సంశ్లేష సంక్రాంత పీనస్తనాంభోజ పత్రావళీ లాంచితోరః స్థలస్య కాక్ష వీక్షణ మాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనక్యాః కమలాలయాయాః కరకమల సలీల సంవాహిత మృదుచరణ కమలస్య శ్రీమన్నారాయణస్య దివ్యనాభీకమల సంభూతస్య దేవ తిర్య ఙ్మనుష్యాది సకల జగత్స్రష్టుః పరార్థ ద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ఏకపంచాశ ద్వత్సరే | ప్రథమ మాసే | ప్రథమ పక్షే | ప్రథమ దివసే | అహని ద్వితీయ యామే | తృతీయ ముహూర్తే | ప్రథమ ప్రణవకాలే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కలిశకానాం మధ్యే | శాలివాహన శకే | స్వాయంభువ స్వారోచి షోత్తమోత్తమ తామస రైవత చాకక్షుషవైవస్వత సూర్యాగ్ని ధర్మ బ్రహ్మ రుద్ర కాచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే | సప్తమే వైవస్వత మన్వంతరే | సప్తవింశ హాయుగేషు గతేషు నత్సు | ఇదానీం అష్టావింశతితమే మహాయుగే | కృత త్రేతా ద్వాపర యుగేషు గతేషుసత్సు | కలియుగే ప్రథమ పాదే | పార్థివ కూర్మ శ్వేత వరాహ సావిత్రి మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పనాం మధ్యే | తృతీయే శ్వేతవరాహ కల్పే | బ్రహ్మదైన మను పితృ సౌర సారస చాంద్ర నాక్షత్ర బార్హస్పత్యమానానాం మధ్యే | చాంద్రమానేన ప్రభాది షష్ఠి సంవత్సరాణాం మద్యే | శ్రీ ............ సంవత్సరే .............................ఋతౌ ............మాసే............పక్షే.........శుభ తిథౌ.........వాసరే..........యోగే........ కరణే | ఏవం గుణ విశేషణ విశిష్టాయా మస్యాం శుభతిథౌ | మమ అనా ద్యవిద్యా వాసనయా ప్రవర్తమానే స్మిన్ సంసారచక్రే విచిత్రాభిః కర్మగతిభిః సుయోనిషు పునః పున దంపత్యోః జనిత్వా | ఇదానీం పుణ్యవిశేషణ విశిష్టగోత్ర సంభూతస్య ..........గోత్రస్య | ..................మమ జన్మప్రభీ త్యేతక్షణ పర్యంతం సంభావితానాం పాపానాం త్వ క్చకక్షు శ్వ్రోత్ర జిహ్వా ఘ్రాణానాం జ్ఞానేంద్రియాణాం వాక్పాణి పాద పా యూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం ఏతేషాం ప్రేరక స్వాంతః కరణస్య మనోగోచరై స్సంబంధైః | త త్తద్యవికల్పక జ్ఞానప్రభృతి కామ క్రోధ లోభ మోహ మద వత్సరై స్సంభావితై రాంతరైః మహాభగవతాపచార భగవ దపచారాసహ్యాపచారైర్మిలితానాం మహా పాతకాది ప్రకీర్ణానాం మమ దురితక్షయద్వారా గంగా వాలుకాభి స్సప్తర్షి మండల పర్యంతం కృతరాశే ర్వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర రాశ్యపకర్షణ సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం | తిలై స్సూర్యమండల పర్వంతం కృతరాశే ర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వా రాశ్యపకర్షణ సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం | యవైర్గ్రహ మండల పర్వంతం కృతరాశే ర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం | మాఘై ధ్రివ మండల పర్యంతం కృతరాశే ర్వర్ష సహస్రావసానే ఏకైక మాషాపకర్ష క్రమేణ సర్వ రాశ్యపకర్షణ సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం | పంచాశ ద్గవ్యూతి గణష్ట్ర సమ్మితదేశే వృషలో మభిర్నక్షత్ర మండల పర్యంతం ఏకైక లోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం | త్రిగునీ కృతా గ్నిష్టోమా తిరాత్రా ప్తోర్యామ సాంతనన వాజపేయ పౌండరీ కాశ్వ మేధాది శతక్రతు పుణ్య ఫలా వాప్త్యర్థం | మయా సహ థ పూర్వేషాం థాపరేసాం మ ద్వంశ్యానాం పితౄణాం నరకా దుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం | ఇహ జన్మని రాజాధిరాజో భూత్వా సమస్త సుఖా న్యనుభూయ తతో విష్ణు సాయుజ్య ఫలావాప్త్యర్థం | శ్రీ లక్ష్మీనారాయణ ముద్దిశ్య | శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం : స్వగృహోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదాన మహం కరిష్యే ||
పెళ్ళంటే....సృష్టి యజ్ఞంలో జీవుడు తన ధర్మబద్దమైన కామ్యములను (కోరికలు) పొందుతూ లోక సంక్షేమంకోసం బాధ్యత కర్తవ్యములతో జీవనం కొనసాగించడం.
13. మంగళాష్టకాలు
శ్రీ సీతారామచంద్రాయ నమః
మంగళాష్టకాలు : నూతన వధూవరులకు మంగళం కలిగించే మంగళాష్టకాలకే మరొకపేరు లగ్నాష్టకాలు.
శ్లో|| శ్రీరామ స్సకలాగమాది వినుత : కోదండ హస్తాంకితో ధీమా న్పంకజలోచనో గుణనిధి స్సీతా మనోవల్లభః | కౌసల్యా ప్రియనందనో జననుత శ్శ్రీమా నయోధ్యాధిపః కాకుత్థ్సాన్వయసంభవ శ్చ భవతాం కుర్యాత్సదా మంగళమ్||
(సుముహూర్తే సావధానాః, శుభలగ్నే సావధానాః, శ్రీలక్ష్మీ నారాయణ చింతన సావధానాః||)
శ్లో|| వైదేహీ వర రామచంద్ర రమణీ పుల్లారవిందేక్షణా-సాధ్వీ శీలవతీ సులక్షణయుతా సర్వంసహా సంభవా | పూర్ణాచార విచార చారు సుమతిః పూర్ణేందుబింబాననా-సీతా భవ్యగుణా సుఖేన భవతాం కుర్యా త్సదా మంగళమ్||
శ్లో|| ధీర స్తోమ మన శ్చకోర రజనీనాథః కవేరాత్మజా - ద్వీపాభ్యంతర శేషభోగశయన స్సందర్శ కాభీష్టదః | కారుణ్యాలయ హృ త్సురాసుర వరై స్సేవ్యో2నిశం శ్రీధర - శ్శ్రీరంగాధిపతి శ్శ్రియా సహ సదా కుర్యాత్య దాంమంగళమ్||
శ్లో|| హైమాకార విమాన మధ్య విలస న్మంగాపతి శ్శ్రీకర-శ్శ్యామాంగః కరదర్శి తాత్మవిభవ శ్శేషాచలాధీశ్వరః | సోమో హస్సరలోచన స్సురవరై స్సంపూజితాంఘ్రిద్వయ-శ్శ్రీమద్వేకంట నాయక స్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ ||
శ్లో|| ప్రహ్లాదం దురవాస దుఃఖజలధే రుత్తారయ న్నై గమాం బాహ్యాంతః పరిపూర్ణాతాం ప్రకటయన్ స్తభం విభి(దన్ బలాత్ | హేమాక్షాగ్రజ మాజఘాన నఖరై ర్యో మంగళానాం నిధి శ్శ్రీమాన్ శ్రీ విభు రీశ్వరో నరమరిః కుర్యా త్సదా మంగళమ్ ||
శ్లో|| మీనః కచ్ఛప సూకరో నర మృగః కుబ్జో మహాన్ భార్గవో రామో యాదవనాయకో రతిసుఖః కృష్ణ శ్చ కల్క్యాదయః | లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః పాయా ద్వో భగవాన్ పురాణపురుషః కుర్యా త్సదామంగళమ్ ||
శ్లో|| క్షీరాంభోనిధి కన్యకా సుమనస స్సంఘై స్సమారాధితా భక్తాభీష్ట ఫలప్రదాన విభవా లోకైకమాతా రమా | పద్మా పద్మనికేతనా కరలస త్పద్మాసు పద్మాసనా పద్మాక్ష్మీ సుగుణా సుఖేన భవతాం కుర్యా త్సదా మంగళమ్ ||
శ్లో|| ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీపుత్రశ్చ చంద్రాత్మజో దేవాద్యశ్చ బృహస్పతి ర్భృగుసుతో ఛాయాసతీ నందనః | రాహుః కేతు నవగ్రహా నవశుభా ఏకాథస్థా స్సదా నక్షత్రాని చ లగ్న యోగ తిథయః కుర్వంతు వాం మంగళమ్ ||
సుముహూర్తే సావధానా | శుభలగ్నే సావధానా | శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధానా ||
మానవ జీవితానికి మూడు ముళ్ల బంధంతో, ఏడు అడుగులు కలసి నడవడం ద్వారా పరిపూర్ణత్వం సిద్ధింపచేసేది 'పెండ్లి'
14. కన్యా-వర గోత్ర-ప్రవరలు
వధువు ప్రవర వరుని ప్రవర
15. కన్యాదానం
అన్ని దానముల కన్నా కన్యాదానం మిన్న
వరుని చేతిలో జలధారను పోస్తూ ''నీతోకలసిమెలసి అర్ధాంగిగా ఉండి సత్సంతానాన్ని కని నీ వంశాన్ని వృద్ధి పొందడానికి మా కూతురు ''.............''ను నీకు దానం చేస్తున్నాని చెప్పి వధువు తల్లిదండ్రులు కన్యాదానం చేస్తూ ''బాబూ! ..............''నీకు ఈమె అర్ధాంగి ధర్మమైనా, అర్ధమైనా, కామమైనా మీరిద్దరు కలసి సంపాదించాలి. ఈమెను ''..............''ను అతిక్రమించి వెళ్ళకు. అని కన్యాదాత వరునితో ప్రమానం చేయించగా వరుడు అతిక్రమించను అని వాగ్ధానం చేయడం కన్యాదాన ఘట్టంలో విశేషం.
వివాహంలో కన్యాదాన ఘట్టమే ప్రధానమైనది.
16. మధుపర్కం
పెరుగు, తేనె కంచు పాత్రలో సమంగా కలపడమే మధుపర్కం. మధుపర్కం ప్రధానంగా చేసే పూజ కాబ్టి మధుపర్క పూజ అంారు.
మయా క్రియామాణ కన్యాదానం గత్వేనా !
వరం మధుపర్కేణ పూజయిష్యే కూర్చం ప్రయచ్ఛతి !
మంత్రపూర్వకంగా కన్యాదాత వరుని కాళ్ళు కడిగి మధుపర్కమును వరునికి ప్రాశనముచేయిస్తారు. తేనె లాగా నేను కూడా అందరితో మధురమైన స్వభావం కలిగి అందరికీ ఇష్టుణ్ణి అయి పాలలాగా స్వచ్ఛమైన మనస్సుగల వాడినై నా మాటలతో, నా చేతలతో, ఎవరిని గాయపరచకుండా, బాధించకుండా గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతాను. అనే గూఢార్ధం ఈ మధుపర్కపూజలో దాగి ఉంది.
17. గూడజీరస్థాపనము మరియు సమీక్షణం
వధువు, వరుడు సుముహూర్తకాలంలో పరస్పరం చూచుకోవడమే సమీక్షణం. తదుపరి ఆ శుభవేళ జీలకర్ర బెల్లం అనే మంగళ ద్రవ్యాన్ని వధూవరులు పరస్పరం శిరస్సున ధరిస్తారు.
వధువు, వరుల మధ్య అడ్డుగా తెల్లి తెరను పట్టుకొని ఇద్దరిచేతుల్లో జీలకర్ర బెల్లం సిద్ధంగా ఉంచి, సకల మంగళవాద్యాలు, మ్రోగుతుండగా, వేదఘోష జరుగుతుండగా శుభముహూర్త కాలంలో తెరను తొలగిస్తారు. వధూ వరులు పరస్పరం చూచుకుాంర.
వధువు '....................' వరుడు '......................' పరస్పరం శిరస్సుపై జీలకర్ర బెల్లం ధరిస్తారు.
జీలకర్ర బెల్లం సమ్మేళనం ఒక కొత్రశక్తిని ప్టుిస్తుంది. ఒకరికళ్ళలోకి మరొకరు చూస్తూ బ్రహ్మరంధ్రంపైన పెట్టుకోవడం ద్వారా స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి అందమైన, ధృడమైన భావి వైవాహిక జీవితానికి పునాది పడుతుంది.
చిరునవ్వులు మూటక్టి అక్షితలుచేతప్టి కళ్యాణవేదిక చుట్టుమ్టుి తమ అమృత హస్తాలతో నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుచున్నాము.
18. యోక్త్ర ధారణ
యోక్త్ర మంటే దర్భత్రాడు. వరుడు ఈ త్రాడును వధువు నడుముకు చ్టుి ముడివేస్తాడు. ఈ కర్మను పత్నీ వ్రతోపనయనం అంారు. దంపతులిద్దరు కలసి ఈ జీవితయజ్ఞాన్ని నిర్వహించడానికి భర్త దీని ద్వారా భార్యకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ సందర్భంలో వరుడు ఈ మంత్రాన్ని చెబుతాడు.
ఆశాసానా సౌమనసం ప్రజాగ్‌ం సౌభాగ్యం తనూమ్ |
ఆగ్నేరనువ్రతా భూత్వా సన్నహ్యే సుకృతాయ కమ్ ||
మంచి మనస్సు, యోగ్యమైన సంతానం, చక్కని సౌభాగ్యం, శుద్ధమైన శరీరం తనకు ఏర్పడాలని ఈ వధువు అగ్నిహోత్రుణ్ణి ఆరాధిస్తున్నది. ఈ జీవితయజ్ఞమనే శుభకార్యం కోసం ఈమె నడముకు దర్భత్రాడు కడుతున్నాను.
19. మంగళసూత్రం
సకల శుభములకు నిలయమైన సూత్రం మంగళసూత్రం. అందుకే దీనిని మాంగల్యమన్నారు.
మాంగల్యాలను పసుపు తాడుతో ముడివేసి అందు మంగళదేవత, లక్ష్మీదేవిని ఆవాహనంచేసి పూజించి వరుడు '..........' వధువు '............'మెడలో మంగళసూత్రధారణ చేస్తాడు.
ధర్మ-అర్ధ-కామములను పురుషార్థముల సంపాదనలో నిన్ను అతిక్రమించి ప్రవర్తించననడానికి ప్రతీక ఈ మూడుముడులబంధం.
మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా !
కంఠే బద్నామి సుభగే! సం జీవ శరదాం శతమ్ !
గార్హస్థ్య జీవన సాఫల్యతకై నీమెడలో ఈ మంగళ సూత్రధారణ చేస్తున్నాను. నీవు నూరేళ్ళు వర్ధిల్లు.
పవిత్రమైన పరిణయ బంధానికి చిహ్నం మాంగళ్యసూత్రము.
20. తలంబ్రాలు - అక్షతారోపణము
పుణ్యస్త్రీలు బియ్యం, నెయ్యి, పసుపు కలిపి తలంబ్రాలను తయారుచేస్తారు. వీిని వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు ధరిస్తారు.
పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత పెరమరలి నవ్వేను పెండ్లి కూతురు
పేరాంండ్ర నడుమ పెండ్లికూతురు విభు పేరు చెప్ప సిగ్గుపడే పెండ్లికూతరు
పెండ్లికి వచ్చిన బంధుమిత్రులంతా వివాహంలో ఏ ఘ్టాన్ని చూచినా చూడకపోయినా దీన్ని మాత్రం చిన్నా-పెద్దా అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకగా చూస్తూ సంతోష పడతారు.
యాజ్ఞీకులు వధువు '.............' వరుడు '..................' దోసిళ్లను అక్షితలతో నింపి వేదమంత్రాలను సంధిస్తూ వధూవరులతో
మొది పర్యాయము ప్రజామే కామః సమృద్ధ్యతామ్
మాకు సత్సంతానము కలగాలని
రెండో పర్యాయము పశవోమే కామ స్సమృద్ధ్యతామ్ !
పాడి పంటలు, సమృద్ధిగా ఉండాలని
మూడో పర్యాయము యజ్ఞోమే కామ స్సమృద్ధ్యతామ్
భగవదారాధనాత్మక యజ్ఞాదులు చక్కగా నిర్వహించుకోవాలని అనిపిస్తూ పరస్పరము అక్షతలను శిరస్సున ధరింపజేస్తారు.
నాలుగవ పర్యాయము శ్రీయోమే కామ స్సమృద్ధ్యతామ్ !
సకల సంపదలు కలగాలని తలంబ్రాలు పరస్పరం ధరిస్తారు.
వరుడు చేసిన బాసలు అతిక్రమించనని పసుపు బియ్యంతో శపధం చేయడమే తలంబ్రాలు పరమార్ధం.
21. బ్రహ్మముడి
వధువు '............' చీర అంచును వరుని '...............' ఉత్తరీయం అంచును కలిపి సమంత్రకంగా వేసే ముడి బ్రహ్మముడి. దీనినే బ్రహ్మగ్రంథి అంారు. మన తెలుగువాళ్ళ కొంగుముడి అన్నా ఇదే.
భార్యా భర్త సంబంధం విడదీయరానిది అనే సత్యానికి సాక్ష్యం ఈ బ్రహ్మముడి.
శ్లో|| కండమూలై ం ఫలైర్యుక్తం క్రముకై : దక్షిణాదిభి : |
వధూవరేణవర్దంతే బ్రహ్మగంధిర్విదీయతే ||
శ్లో|| శ్రీకరౌ జగదానందకారకౌ కరుణాకరౌ | శ్రీలక్ష్మీనారాయణౌ నిత్యం సంరక్షేతాం వధూవరౌ ||
22. ప్రధాన హోమం
కొత్త దంపతులు ఇద్దరు గృహస్థాశ్రమంలో మొట్టమొదట చేసే వైదిక కార్యక్రమమైన హోమము ప్రధాన హోమం. ప్రధాన హోమం పూర్తయిన తరువాత వరుడు '...............' వధువును '............' రెండు చేతులతో భుజాలపై తాకి ఈ కన్యవల్ల నాకు మంచి సంతానము కలగాలి. వాళ్ళు చిరాయుష్మంతులుగా ఉండాలి అని కోరుకుాంరు.
23. పాణిగ్రహణం
వివాహంలో పాణిగ్రహణమే ముఖ్యమైనది. వధువు '........' వరుడు '.............' హస్తాన్ని పట్టుకొని, జీవితాంతం అతన్ని సంత్సంతానాన్ని, సౌభాగ్యాన్ని పొంది తన స్త్రీత్వాన్ని సార్ధకం చేసుకుంటుంది.
వరుడు '............' వధువు '.............' హస్తాన్ని పట్టుకొని
గృభ్నామితే తే సుప్రజాస్త్వాయ హస్తం
మయా పత్యా జరదష్టిర్యధా సహ !
భగో అర్యమా సవితా పురన్ధి
ర్మహ్యం త్వాదుర్గార్హపత్యాయ దేవాః !!
మా పెద్దల లాగానే నేను కూడా మంచి సంతానం కోసం నీ ప్రాణిగ్రహణం చేస్తున్నాను.
భగుడు, అర్యముడు, సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసి నిన్ను నా గృహిణిగా చేస్తున్నారు.
24. సప్తపది
వధూవరులు పరమపావనుడైన అగ్నిహోత్రుని సాక్షిగా పాణిగ్రహణం చేసిన తరువాత వరుడు వదువుచేత అగ్నిహోత్రునికి ఉత్తర దిశగా తూర్పునకుగాని, ఉత్తరమునకుగాని ఏడడుగులు వేయిస్తాడు. దీన్నే సప్తపది అంారు.
వరుడు '............' వధువు '..............'తో
ఓ చిన్నదానా! నీవు నా వెంట నడువుము.
విష్ణుమూర్తి నీవువేసే
మొది అడుగు వల్ల అన్నాన్ని !
రెండవ అడుగు వల్ల బలాన్ని !
మూడవ అడుగు వల్ల మంచి పనులను !
నాలుగవ అడుగు వల్ల సౌఖ్యాన్ని !
ఐదవ అడుగు వల్ల పశు సమృద్ధిని !
ఆరవ అడుగు వల్ల ఋతు సంపదను !
ఏడవ అడుగు వల్ల ఏడుగురు పుత్రులను ఇచ్చునుగాక అనేది పూర్వకాలంలో, నేి మన కాలానికి మనం ఇద్దరం మనకు ఇద్దరు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఇచ్చునుగాక అంటూ ఏడు అడుగులు వేస్తాడు.
''తమ స్వరూపాలకు ప్రాణాలుపోసి, ఆపసి ప్రాణాలను అరచేతుల్లోప్టి,
ముద్దాడే మాటలకు అందని ఆనందాన్ని పొందాలంటే ఏడు అడుగులు వేయ్యాల్సిందే!''
వధువు '...........' వరుడు '..............'తో అంటుంది. నీవు పొరపాటు లేకుండా ఉండు! నేనుకూడాఏ పొరపాటు రాకుండా చూసుకుాంను. నీవు ఆకాశానివి. నేను పృధ్విని. నీవు శుక్రధాతువు. నేను శుక్రాన్ని ధరిస్తాను. నీవు మనస్సును నేను మాటను అవుతాను.
జీవితాంతం అన్యోన్య దాంపత్య సంబంధానికి పునాది 'పెండ్లి'
25. లాజహోమం
మా దాంపత్యం చల్లగా వర్ధిల్లాలి. భార్యకు ఎలాిం అనారోగ్యం, ఆపద, రానీయనని భర్తమాట ఇస్తాడు. ప్టుినిం మమతానురాగాలకి, సోదర ఆత్మీయతాభావానికి ప్రతీక లాజహోమం.
26. ధువ, అరుంధతి నక్షత్ర దర్శనము
వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంిబయట తూర్పునకు గాని,
ఉత్తరానికి గాని తీసుకువెళ్ళి మొదట ధ్రువ నక్షత్రాన్ని తరువాత
అరుంధతి నక్షత్రాన్ని చూపించుట.
ధ్రువక్షితిః ధ్రువ యోనిః ధ్రువ మసిధ్రువతః స్థితః
త్వం నక్షత్రాణాం మేధ్యసి సమాపాహి పృతన్యతః
ధ్రువ నక్షత్రం ఏవిధంగా అయితే స్థిరంగా ఉంటుందో, నూతన వధూవరులైన
.......................లు నిశ్చలమైన అనురాగంతో స్థిరంగా ఉండాలని ఆశించుట.
ఈ మంత్ర సారాంశం.
సప్తర్షయః ప్రథమా కృత్తికానాం అరుంధతీం యత్ ధ్రువతాం హవిన్యుః
షట్కృత్తికా ముఖ్యయోగం వహంతీయం అస్మాకం ఏతత్వష్టమీ
వశిష్టుడు జీవితం మీద విరక్తి చెందినప్పుడు ఆయనను ఓదార్చి తిరిగి జీవితం మీద ఆసక్తి కలిగించిన సాధ్వి అరుంధతిలా మాకన్యా (............) మహా పతివ్రత కావాలనే ఆకాంక్ష.
27. వధూవరుల బాసలు
వివాహ సమయంలో వధువు-వరుడు ఎన్నో బాసలు 'ప్రమాణాలు' చేసుకుాంరు.
వధువు :.............
ఓ స్వామీ మిమ్ము .........నా అభిప్రాయం తెలిసినవారిగాను, మంచి సంస్కార కుటుంబంలో జన్మించిన వారుగాను
మంచి నియమ నిష్ఠలతో నిజాయితీతో వర్చస్వులైన యశస్స్వులైన వారుగాను గ్రహించాను, సంతానార్ధులైన మీరు ఉపనిషత్తు ఆదేశించిన విధంగా నావల్ల సత్సంతానమును పొంది, ఆర్షధర్మముననుసరిస్తూ సిరిపంపదలతో సుఖమయ జీవితాన్ని గడపాలని నా ఆకాంక్ష.
వరుడు :..........
ఓ మనసా! బ్రహ్మ, సుమంగళిగా, సౌభాగ్యవతిగా, దీర్ఘాయుష్యంతో ఉండే ఈ చిన్నదాన్ని 'సుప్రజ'ను నాకు భార్యగా సృష్టించాడు! నన్ను ఈమెకు భర్తగా సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడు మా ఇద్దరికి సకల సంపదలను ఇచ్చి అనుగ్రహించాలి.
ఇద్దరు వధువు..........., వరుడు..........
విశ్వదేవతలు, పవిత్రజలాలు, వాయువు, బ్రహ్మ మనస్సులను ఎప్పుడూ స్నేహంతో కలిసి పోయేటట్లు చేయాలి.
వాగ్ధేవత సరస్వతి మనమెప్పుడు ప్రేమతో అభిమానంతో అనుకూలంగా మ్లాడుకొనేటట్లు చూడాలి.
భార్యాభర్తలకి ఆశ, ఆశయం ఒకిగా మార్చే అపురూపశక్తి 'పెండ్లి'
28. పెద్దల ఆశీస్సులు
వేదమంత్రముల ప్రభావమువల్ల వాక్‌శుద్ధిగల భాగవతోత్తములనిండైన ఆశీస్సులవల్ల నూతన వధూవరులు ................లు సర్వదోషములు తొలగి సత్సంతానవంతులై ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లుదురుగాక.
పెద్దలు : పదహారు వన్నెల బంగారంలాగా పచ్చగా ప్రకాశిస్తున్న ఈ కొత్త దంపతులు .............. పిల్లాపాపలతో, ధన, కనక, వస్తు, వాహనాది సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఇటు ప్టుిింవారమైన మాకు, అటు అత్తింవారిని సంతోషాన్ని కలిగించాలి.
ఈ దంపతులు సకల సంపదలతో, సర్వ సమృద్ధులతో ఆదర్శవంతమైన దాంపత్య జీవితంతో దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లుగాక.
శ్రీ ఉభయాభయహస్త విజయలక్ష్మీ, రంగనాధుల, ఆచార్య, పరపూర్ణ, కృపా, కాక్ష సిద్ధిరస్తు దీర్ఘాయురస్తు సమస్త సన్మంగళాని భవంతు, శుభమస్తు.
భగవత్, భాగవత, ఆచార్య మంగళాశాసనములతో - బంధువుల ఆశీస్సులతో - మిత్రుల అభినందనలతో
1 comment:
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు
Post a Comment