Friday, August 26, 2016

గోదావరీ నది మాహాత్మ్యము

    తీర్థభేదము తీర్థవైశిష్ట్యము తీర్థసేవన ఫలము సకల తీర్థశ్రేష్ఠత్వ విషయమును బ్రహ్మపురాణమున గౌతవిూ మాహాత్మ్యము అను రెండవ భాగమున నూా అయిదు అధ్యాయములలో విపులముగా వివరించబడినది. గౌతవిూనదిలో 92 తీర్థములు ఈ పురాణములో విపులముగా వర్ణించబడినది. గౌతవిూ మాహాత్మ్యము అనుపేరుతో విడిగా ఒక గ్రంథమునే అందించిన తెలుగురాష్ట్రప్రజలకు ఉత్తమసేవగా మారును. ఆ పని దేవాదాయధర్మాదాయశాఖనే చేయవలయును దానిలో మన గోదావరి మన గౌతమి అనుకొనే నదీమతల్లిలో ఎంతమంది మహానుభావులు మునిగితరించినారో ఎన్ని పుణ్యతీర్థములు ఎన్ని పుణ్యక్షేత్రములున్నవో తెలియునుకదా. ఈ పవిత్ర కార్యమునకు ఈ శాఖ నడుము కడుతుందని తలచు చున్నాను. అట్లు లేనినాడు ఒక్కొక్క నెల ఆరాదనలో ఒకో రెండో లేదా మూడు అధ్యాయములు ధారావాహికముగా ప్రసరించినను ఒక మూడు సంవత్సరములు ముగియును. ఆ పఠమును ప్రసాదమును అందించునని తలంచుచు ఈ వ్యాసమను అందించు చున్నాను.
    ఈ విభవము బ్రహ్మనారదసంవాద రూపమున బోధింపబడినది. అందున నారదభగవానుడు చతుర్ముఖ బ్రహ్మను తన తండ్రిని ఇట్లు ప్రశ్నించెను.
        తపసోయజ్ఞదానానాం తీర్థసేవనముత్తమమ్‌                                    ఇతిశ్రుతం మయాత్వత్తో జగద్యోనే జగత్ప్రభో                                     దైవాని ముని శార్దూల ఆసురాణ్యా ఋషాణి చ                                కి యద్భేదాని తీర్థాని కిం ఫలాని సురేశ్వర                                    సర్వేషామేవ తీర్ధానాం సర్వదాకిం విశిష్యతే.
    తపసులలో యజ్ఞం, దానములలో తీర్థములను సేవించుట ఉత్తమము అని నేను నీ నుండి వినియుింని, దైవములు ఆసురములు, ఆ ఋషములు ఇట్లు తీర్థభేదములు ఎన్ని విధములు. ఏ తీర్థములు యే యే ఫలములను ప్రసాదించును. అన్ని తీర్థహులలో విశిష్టతీర్థములు ఏవి అని నారదమహర్షి అడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పెను.
        చతుర్విధాని తీర్థాని స్వర్గే మర్త్యేరసాతలె                                    దైవాని ముని శార్దూల ఆసురాణ్యా ఋషాణిచ                                    మానుషాణి త్రిలోకేషు విఖ్యాతాని సురాది భి.
    తీర్థములు నాలుగు విధములుగానుండును. ఇవి స్వర్గమున, మర్త్యలోకమున, పాతాలమున నున్నవి. దైవములు, ఆసురములు, ఆర్షములు, మానుషములు. ఇవి మూడులోకములలో సురాదులచె ప్రసిద్ధిపొందినవి.
    మానుషతీర్థములకంటే ఆ ఋషతీర్థములు సర్వకామ ఫలప్రదములు ఆ ఋషతీర్థములకంటే ఆసుర తీర్థములు బహుపుణ్యఫలప్రదములు. ఆసుర తీర్థములకంటే దైవతీర్థములు సార్వకామికములు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలచే నిర్మించబడిన తీర్థములు దైవతీర్థములనబడును. ఆ మువ్వురిచేత ఒకటే నిర్మించబడినచో దానికన్నా శ్రేష్ఠమైనది ఇంకొకియుండదు. మూడు లోకములకు సేవించదగిన తీర్థము మానుష తీర్థము. మానవ తీర్థములలోకూడా జంబూద్వీపములోని తీర్థములు శ్రేష్ఠములు. జంబూద్వీపములోని తీర్థములకంటే భారతవర్ష తీర్థములు శ్రుతి ప్రసిద్ధములు. భారతవర్షములోనూ దండకారణ్యము సాిలేని సర్వతీర్థశ్రేష్ఠము. ఇది కర్మభూమిగాన సర్వోత్తమ తీర్థమందురు. ఇపుడు అక్కడున్న తీర్థముల నామములను సంక్షేపముగా చెప్పెదను వినుము. దైవమానుష ఆసుర భేదములతో హిమవత్‌ వింధ్య పర్వతముల మధ్య ఆరునదులున్నవి. ఇవి దైవసంభవములు. దక్షిణ సాగరవిన్ధ్యనదులమధ్యలో ఒక ఆరున్నవి. ఇట్లు ఈ 12 నదులు ప్రధానముగా కీర్తించబడినవి. ఇందు వలననే భారతవర్షము బహుపుణ్యప్రదము అని సురాసురనరులచే పూజింపబడు చున్నది. దేవతలు సైతము ఈ భూమికి వచ్చి ఆయా కర్మలను చరించి తమకు కావలసిన ఫలములను పొందెదరు. ఇట్లు అందరికి అభీష్ట ఫలములను వర్షించునదిగాన భారతమును వర్షమందురు. దైవతీర్థములను ఆసురులు ఆవరించినచో దానిని దైవాసుర తీర్థములందరు. దైవతీర్థములలో తపస్సు చేయుటకు ఋషులు నివసించిన తీర్థములు దైవార్షతీర్థములు అనబడును. తమ శ్రేయస్సునకు ముక్తికి పూజకు అభివృద్ధికి తమ ఫలభూతికి కీర్తిని పొందుటకు మానవులు చేసిన తీర్థములు మానవ తీర్థములందురు. ఇట్లు బ్రహ్మపలుకగా నారదమహర్షి ఇట్లు అడిగెను.
    బ్రహ్మ భగవానుడా. కృతయుగాదిలో తీర్థసేవకు మించిన ఇంకొక ఉపాయము అల్పాయాసముతో అభీష్టమును ప్రసాదించునదిలేదు. కావున ఆ తీర్థములలో అతిశ్రేష్ఠములైన తీర్థములను చెప్పుటకు నిన్ను మించిన శ్రేష్ఠమైన వక్త ఇంకొరులేరు. అనగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగెను.
    గోదావరీ భీమరధీ తుంగభద్రా వేణికా తాపీ పయోష్ణీ. ఈ నాదులు విన్ధ్యనదికి దక్షిణమున కలవు. భాగీరధీ నర్మదా యమునా సరస్వతీ విశోకా వితస్తా ఈ నదులు హిమవత్పర్వతమును ఆశ్రయించినవి. ఈ నదులు పుణ్యతమములు. దేవతీర్థములుగా చెప్పబడుచున్నవి.
    గయుడు కోలాసురుడు. వృత్రాసురుడు త్రిపురుడు అన్ధకుడు హయశీర్షుడు లవణుడు నముచి శృంగకుడు యముడు పాతాలకేతువు మధువు పుష్కరుడు. వీరిచే ఆవరించబడిన తీర్థములు ఆసురతీర్థములనబడును. ప్రభాసుడు భార్గవుడు అగస్తి నరనారాయణులు వసిష్ఠుడు భరద్వాజుడు గౌతముడు కశ్యపుడు మనువు ఇత్యాది మునిసేవితములు. ఋషితీర్థములు అంబరీషుడు హరిశ్చన్ద్రుడు నహుషుడు శ్రీరామచంద్రుడు కురువు కనఖలుడు భరతుడు సగరుడు అశ్వయూపుడు నాచికేతువు వృషాకపి అరిందముడు ఇత్యాది మానవులు నిర్మించిన తీర్థములు మానవతీర్థములు.
    ఎవరూ త్రవ్వని తీర్థమును దైవఖాతమందురు. ఇట్లు సంక్షేపముగా నీకు తీర్థభేదమును తెలిపితిని. దీనిని తెలిసిననూ నరుడు సకల పాపవినిర్ముక్తుడగును.
    ఇట్లు బ్రహ్మ పలుకగా నారదమహర్షి మరల ఇట్లు ప్రశ్నించెను. త్రిదైవత్యతీర్థము సర్వతీర్థములకంటే ఉత్తమోత్తమమని వినియుింని. ఆ త్రిదైవత్యస్వరూపమును బేదమును విస్తరముగా చెప్పగోరుచున్నాను. అనగా బ్రహ్మ ఇట్లు చెప్పుచున్నాడు. త్రిదైవత్యతీర్థము కనపడువరకే ఇతర తీర్థములు ఇతర పుణ్యభూములు సకల యజ్ఞాదులు వ్రతోపవాస కృచ్ఛ్రములకాంచే గంగాసేవగొప్ప ఫలమును ప్రసాదించునది. ఆయా సకల తీర్థములలో కృచ్ఛ్రకములు కనపడుచునేయుండును. ద్రవ్యము ఆత్మమాత జనకాదులు దేవతలకు శుద్ధిని కలిగింతురు. ఒక త్రిదైవత్యములేనినాడు పాపక్షయమెట్లు కలుగును? ఈ గంగ సకల నదులలో శ్రేష్ఠమైనది. స్మరించబడినను దర్శించిననూ స్పృశించిననూ సకల కాంక్షితములను సర్వనామములను ప్రసాదించునది. ఇక ఇపుడు ఈ త్రిదైవత్వము యొక్క పుట్టుకను వినుము. పదివేల సంవత్సరములకు పూర్వము  ఒక దైవకార్యము సంభవించినది. తారకాసురుడు మహాబలశాలి. నా వరముతో అతిగర్వితునిగా ఉండెను. ఆ బలీయునిచే దేవతల పరమైశ్వర్యము హరించబడినది. అంతనే దేవతలందరూ క్షీరసాగర శాయిని సకల జగత్తులకు ప్రపితామహుని శ్రీమన్నారాయణుని శరణువేడిరి. చేతులు జోడించినవాడై అనన్యమైన భక్తితో శ్రీ మహావిష్ణువుతో ఇట్లు పలికిరి. నాధా! జగత్తులను రక్షించువాడవు నీవే. దేవతలకీర్తిని పెంచువాడా సర్వేశ్వరా, జగత్కారణభూతా వేదస్వరూపా నీకు నమస్కారము. ఈ లోకములను సృజించువాడవు. అసురులను వధించువాడవు సకల జగములకు పతివి నీవే. సృష్టి స్థితి లయములకు కారణము నీవే. సకల విధములైన ఆపదలను వించినవారికి ఈ మూడు లోకములలో నీవు తప్ప ఇంకొక రక్షకుడులేడు. వుండరీకాక్షా! నీవు లేనినాడు తాపత్రయములను నివారించగలవాడింకొకడులేడు. అఖిల జగములకు తల్లివి తండ్రివి నీవే. సేవలకు సులభుడవునీవే. ఈశా ప్రసన్నుడవుకమ్ము! మహా భయముల నుండి కాపాడుము. ఈ ఆర్తిని హరించువాడు నీకంటే ఇతరుడు ఎవడున్నాడు? ఆది కర్తవైన వరాహమునీవే. మత్స్యము కూర్మము నీవే. మాకు భయము కలిగినపుడు ఇటువిం రూపభేదములను స్వీకరించి మమ్ములను రక్షించు చున్నావు. అధికారము హరించబడినది. మా భార్యలను హరించియున్నారు. మా నివాసములను హరించియున్నారు. ఇంకొక దిక్కులేని మమ్ములను ఎందుకు రక్షించలేదు. ఇట్లు దేవతలు ప్రార్థించగా శేషశాయి శ్రియః పతి ఇట్లు పలికెను. విూకేవరివలన భయము కలిగినదో దానిని చెప్పుడు. విూరు కలతను విడువుడు.
    అంతట ఆ దేవతలు శ్రియఃపతి శ్రీమన్నారాయణునితో ఆ దేవతలు తారకాసురవధను కూర్చి తెలిపిరి. భయంకరమైన రోమములు నిక్కపోరుచుకొను భయము తారకాసురునివలన సంప్రాప్తించినది. యుద్ధములో కాని తపస్సుతోకాని శాపముతోకాని ఇతని మేము వధించజాలము. పదిరోజులలోపు బాలుడు అతని  నుండి తారకాసురుడు మృత్యువును హరించును. అతడు ఇతరులవలన మృత్యువును పొందడు. కావున ఆ విషయమున  నీతిని ఏర్పరుచుడు. అపుడు నారాయణుడు ఇట్లు పలికెను. ఆ తరాకాసురుడు నా వలన కాని నా సంతానము వలనకాని దేవతలవలనకాని మరణించడు. శంకరుని వలన కలిగిన చాలాశక్తి కాలసంతానము వలన మాత్రమే తారకాసురుడు మృత్యువును పొందును. కావున దేవతలందరు ప్రయత్నించుటకు బయలుదేరారు. శంకరుని భార్యకొరకు దేవతలందరూ ప్రయత్నం చేయవలయును. అనగా దేవతలందరూ హివవత్పర్వతమును చేరిరి. అచట హిమవంతుని అతని ప్రియురాలైన మేనను చూచి వారితో ఇట్లు పలికిరి. దాక్షాయని జగన్మాత శివశక్తిగా ఉన్నది. బుద్ధప్రజ్ఞా ధృతిమేధ లజ్జ పుష్టి సరస్వతి ఇట్లు సకల లోకపావనిగా అనేక నామములతో రూపములతో నున్నది. దవేతల కార్యమును నెరవేర్చుటకు మా గర్భమున ప్రవేశించినది. జగన్మాత విూకు పుత్రికగా ప్టుినది. శంకరుని భార్యకాగలదు. మమ్ములను మిమ్ములనుకూడా రక్షించగలదు. ఆ మాటలను వినిన హిమవానుడు కూడ ఆ దేవతలను అభినందించెను. మేన కూడా చాలా ఉత్సాహము కలదై ఇట్లే అగుగాక అని పలికెను. అపుడు జగద్ధాపు గౌరిషిమవంతుని ఇంిలో ప్టుినది. ఆమె నిరంతరము శివధ్యానరతురాలు. శివప్రియ. శివపరాయణురాలు. ఆమెతో దేవతలు శంకరుని కొరకు తపము నాచరించుము అని ప్రార్థించిరి. అంతా ఆ గౌరి హిమవచ్ఛిఖరముపై శంకరుని కొరకు ఘోరమైన తపము నాచరించెను. అంతట దేవతలు మరల ఇట్లు ఆలోచించసాగిరి. ఈ శివుడు పార్వతిని ఎట్లు ధ్యానించును. శంకరుడు తననుకాని ఇతరమునికాని తలచుటలేదు. అయినపుడు మేనాసుతం ముందు పార్వతియందు చిత్తమునెట్లు నిలుపును. ఈ విషయమున నీతిని ఏర్పరచ వలయును. అపుడు మేలును పొందెదము. అంత మహామలు ఉదారబుద్ధి అయిన బృహస్పతి ఇట్లు పలికెను.
    బుద్ధిమంతుడైన మన్మథుడు కందర్వుడు పుష్పబాణములు కలవాడు శంకరుని పూల బాణములతో కొట్టవలయును. అట్లు కొట్టబడిన శివభగవానుడు పార్వతియందు మనసును నిలుపును. అపుడు హరుడు గిరిజను వివాహము చేసుకొనగలడు. జయశీలుడైన పంచబాణుని బాణములు ఎక్కడా మొక్కపోలేదు. అట్లు శంకరుడు ఆమెను వివాహము చేసుకొనినచో వారికి పుత్రుడు కలుగును. ప్టుిన పుత్రుడు తప్పక తారకాసురుని వధించగలడు. కావున మన్మథునికి సహాయము కొరకు వసంతుని శోభనకారుని పంపుడు. మనసుతో సతోషింప చేయు వానిని మన్మథునికి ఇండు. అంతట దేవతలు అట్లే కుసుమాకరుని అనగా వసంతుని మన్మథుని శివుని సన్నిధికి పంపిరి. ఆ మన్మథుడు కాళావసంతునితో ధనువును ధరించి త్వరగా రతీదేవితో కూడి సుదుష్కరమైన కార్యమును చేయుటకు వెళ్లెను. శరచాపములను ధరించి ఈశ్వరుని ముందు నిలిచెను. లోకగురువు సకల లోకములకు ప్రభువైన శంకరుడు కొట్టదగనివాడు. ఇతనిని ఇపుడు నేను కొట్టవలయును. లోకత్రయమును శయించు నా బాణములు శంకరునియందు దృఢములగునా? కావా? ఇట్లు తలచుచు బాణప్రయోగమును చేసెను. అంతట శంకరుడు కోపించి అగ్నినేత్రములతో మన్మథుని భస్మము చేసెను. ఆ గొప్ప కార్యమును చూచుటకు దేవతలందరు అక్కడికి వచ్చిరి. అపుడు అక్కడ అత్యాశ్చరకరమైనది జరిగినది. వినుము.
    దేవగణములు శంకరుని చూచి మన్మథుని చూచునంతలోనే భస్మమైన వాముని ప్రార్థించిరి. చేతులు జోడించి తారకాసరుని వలన భయము కలిగినది గిరిసుతను భార్యగా చేసుకొనుడు. అని అంతట శంకరుడు బాణముతో కొట్టబడిన మనసుకలవాడైనను, దేవతల మాటను నెరవేర్చ దలిచెను. మహానుభావులు పరుల కొరకు తమ హితాహితమును లెక్కించరుకదా! అపుడు దేవతలు శంకరుని వివాహము కొరకు అరుంధతీ వసిష్ఠులను లక్ష్మీనారాయణులను పంపిరి. అపుడు హిమవల్లోకన్నాథులకు సంబంధము కలిగినది.
    అంతట వసిష్ఠ అగస్త్య పేలస్త్య లోమశాదులు చేరియుండగా మహోత్సవ సమరోహమున శివపార్వతుల వివాహము జరిగినది. ఆ వివాహమున పార్వతి సౌందర్యమును చూచి నాకు రేతస్స్ఖలనమైన వీర్యమును చూర్ణము చేసితిని. అట్లు చూర్ణము చేయబడిన నా వీర్యమునుండి వాలఖిల్య మహర్షులు అవతరించిరి. అపుడు అక్కడ దేవతలందరు పెద్దగా హా హా కారమును చేసిరి. అపుడు సిగ్గుతోపరిభూతుడనై ఆసనము నుండిలేచి బయలు వెడలితిని. దేవతలందరూ చూచుచు ఊరకుండిరి. అట్లు వెళ్ళుచున్న నన్ను చూచి శంకరుడు నందితో ఇట్లు పలికెను. బ్రహ్మను ఇక్కడికి పిలువుము అతని పాపమును తొలగించెదను. అపరాధము చేసిన వాని విషయమున కూడా సజ్జనులు కృపామయులుకదా విషయములు విద్వాంసుని కూడా మోహింపచేయును కదా. అపుడు ఇట్లు పలికి పార్వతీసహితుడైన పరమేశ్వరుడు నామీద దయతో సకల లోకముల హితమునకై ఇట్లు చేసెను. నారదా వినుము.
    పాపులపాపములు తొలగుటకు భూమి జలములు సమర్థములు కాగలవు. ఆ భూజలముల సారసర్వస్వమును తీసుకొని పావనము చేసెదను. ఇట్లు నిశ్చయించిన శంకర భగవానుడు ఆ భూమి జలముల సారమును స్వీకరించెను. భూమిని కమండలముగా చేసి దానిల జలమునుంచి పావమానది సూక్తములచే అభిమంత్రించి త్రిజగత్పావనమైన శక్తిని దానిలో స్మరించెను. అంతట శంకరుడు నాతో ఇట్లనె నుపాకమాడలమును స్వీకరించుము.
        ఆపోవై మాతరోదేవ్యం భూమిర్మాతాతధాపరా                                    స్థిత్యుతృత్తి వినాశానాం హోతత్వముఖయోః స్థితమ్‌                                అత్రప్రతిష్ఠితో ధర్మః అత్రయజ్ఞస్సనాతన                                    అత్ర భుక్తిశ్చ ముక్తిశ్చ స్థావరం జంగమంచయత్‌                                స్మరణాన్మానసంపాపంవందనా ద్వాచికంతధా                                    స్నానపానా భిషేకాచ్చ వినశ్యత్యపికాయికమ్‌                                    ఏతదేవామృతం లోకేనైతస్మాతాృవనా పరమ్‌                                    మాయాభిమంత్రితం బ్రహ్మన్ధృహాణేమంకమండలమ్‌                                అత్రత్యం వారియః కశ్చిత్‌ స్మరేవపి పిచేదపి                                    ససర్వకామానాప్నోతి గృహాణేమం కమండలమ్‌.
    జలములు మాతృదేవులు. భూమి మరొక హార సృష్టి స్థితి లయములకు హోతుత్వము. రిెంకీ ఉన్నది ఇందులోనే ధర్మము ప్రతిష్ఠించబడినది. ఇందులోనే సనాతన యజ్ఞము ప్రతిష్ఠించబడినది. భుక్తి ముక్తి ఇందులోనే యున్నది. స్థావర జంగమములు ఇందులోనే ఉన్నవి. దీనిని స్మరించుట వలన మానస పాపము వందనము వలన వాచిక పాపము స్నాన పానాభిషేకముల వలన కాయికపాపము నశించును. లోకమున ఇదియే అమృతము. దీని కవంటే పావనమింకకొిలేదు. నేనభిమంత్రించిన ఈ కమండలమును నీవు స్వీకరించుము. దీనిలోనున్న ఈ జలమును స్మరించిననూ పానము చేసిననూ అతను అన్ని అభీష్టములను పొందును. కావున ఈ కమండలమును తీసుకొనుము. పంచభూతములలో ఆపోభూతమే మహాభివృద్ధికలది. ఆ జలములో ఇవి ఉత్కృష్టజలములు కావున ఈ కమండలమును స్వీకరించుము. ఇక్కడున్న జలము శోభనము. పుణ్యము, పావనము కూడా. కావున దీనిని స్పృశించి స్మరించి దర్శించి నీవు పాపమునుండి విముక్తుడవయ్యెదవు. ఇట్లు  ఇట్లు పలికి మహాదేవుడు నాకు కమండలమునిచ్చెను. అంతట దేవతాగణమంతయూ సంతోషముతో సురేశ్వరుని స్తుతించిరి. అక్కడ గొప్ప ఆహ్లాదవాతావరణము నెలకొనెను. జయ జయ ధ్వానములు నెలకొనెను. శివభగవానుని వివాహమున పార్వతీమాతపాద అగ్రభాగమును చూచి పాపబుద్ధితో పతితుడనైతిని. దయానిధియైన శంకరుడు స్మరించి పవిత్రమైన దానిని పుణ్యమైన కమండలమున కల గంగను స్మరించి నాకిచ్చెను. ఇట్లు చెప్పగా నారద భగవానుడు మరల ఇట్లు ప్రశ్నించెను.
    కమండలములోని జలము తమ పుణ్యమును పెంచునది మర్త్యలోకమునకు వెళ్ళిన విధానమును తెలుపుడు అని అంతట బ్రహ్మ ఇట్లు పలికెను.
    బలియనుదైత్యరాజు దేవశత్రువు. ఓటమి ఎరుగనివాడు ధర్మముతో యశస్సుతో ప్రజాసంరక్షణతో గురుభక్తితో సత్యముతో వీర్యముతో బలముతో త్యాగముతో క్షమతో మూడులోకములకు అతనికిసాి ఇంకొకరులేరు. అతని ఉన్నత సమృద్ధిని చూచి దేవతలు చింతాపరాయణులు అయిరి. వారు తమలో తాము ఇట్లు ఆలోచించుకొనసాగిరి. బలిని ఎట్లు గెలిచెదము. బలిచక్రవర్తి మూడులోకములను పాలించుచుండగా యే బాధలు లేకుండెను. శత్రువులేకుండిరి. వ్యాధులు లేవు. మానసిక చింతలులేవు. అనావృష్టిలేదు. అధర్మములేదు. నాస్తిశబ్దమే అతని రాజ్యమునలేదు. దుర్జనులులేరు. ఇది కలలోకూడా కనపడుటలేదు. అతని వైభవమును బలమును చూచిన దేవతలు విహ్వలులై శ్రీమహావిష్ణువును శరణుజొచ్చిరి. జగన్నాధా! శంఖ చక్ర గధాధరా! మేము ఆర్తులమైతిమి. నీవు మాకోసము ఆయుధములను ధరించుచున్నావు, నీవు మాకు నాధునిగా ఉన్ననూ మాకిలాిం దుఃఖమెట్లు కలుగుచున్నది. నిన్ను నమస్కరించు శిరస్సులు దైత్యుని ఎట్లు నమస్కారించవలయును. నీకై యజ్ఞములను చేసెదము. వాక్కులతో నిన్ను స్తుతించెదము. నీవే శరణుగా నున్న మేము దైత్యునికెట్లు నమస్కరించెదము. దేవతలు అందరూ నీ బలమునాశ్రయించినవారు ఇంద్రాదిదేవతలు నీవు ఇచ్చిన స్థానమును పొంది దైత్యునటెఉ్ల నమస్కరించెదము. నీవే బ్రహ్మవై సృజించెదవు. విష్ణువుగా రక్షించుచున్నావు. శంకరునిగా సంహరించుచున్నావు. అయినపుడు దైత్యునికి ఎట్లు నమస్కరింతుము.
    ఇట్లు పలికిన దేవతల మాటలను వినిన దైత్యాంతకుడు దేవతల కార్యసిద్ధికొరకు దేవతలతో ఇట్లు పలికెను. బలిదైత్యుడు కూడా నా భక్తుడే. సురాసురులచే గెలువశక్యముకానివాడు. మీరు నాచే పోషించబడువారు. అట్లే బలిదైత్యుడు కూడా నాచే పోషించదగినవాడే. కావున సంగ్రామము లేకుండగా త్రైలోక్యరాజ్యమును హరించి మంత్రోక్తిచే బలిని బంధించి విూకు విూ రాజ్యమును ప్రసాదించెదను. అంతట దేవతలు అట్లే ననిపలికి స్వర్గమునకు వెళ్ళిరి. శ్రీ మహావిష్ణువు అదితిగర్భమున ప్రవేశించెను. ఆ మహానుభావుడు అవతరించినపుడు ఉత్సవములు జరిగినవి. ఆ శ్రీహరి వామనునిగా పుట్టెను. అతనే యజ్ఞేశుడు. యజ్ఞపురుషుడు. ఇంతలో బలిచక్రవర్తి బలము కలవారిలో శ్రేష్ఠుడు ఋషిముఖ్యులతో కలిసి అశ్వమేధయాగమునకై దీక్షితుడాయెను. వేదవేదాంగములు చక్కగా తెలిసిన పురోహితుడైన శుక్రాచార్యులు ఆ యజ్ఞమును ప్రవర్తింప చేయుచుండెను. బ్రహ్మస్థానమును స్వీకరించి శుక్రాచార్యులు ఆసీనుడు కాగా దేవగంధర్వ పన్నగులు హవిర్భాగము కొరకు ఆసీనులు కాగా దానము చేయుడు. భుజించుడు, పూజించుడు. ఇది పూర్ణమైనది. మరల దీనిని పూర్ణము చేయుడు ఇట్లు పలుకు చుండగా మెల్లగా ఆ ప్రదేశమునకు సామగానము చేయుచు వానుడు వచ్చెను. ఛత్రమును కుండలములను ధరించిన వామనుడు ఆ యజ్ఞవాటమునకు వచ్చెను. ఆ యజ్ఞమును ప్రశంసించుచున్న వామనుని చూచిన శుక్రాచార్యులు బ్రహ్మరూపధరుని వామనదేవుని దైత్యసూదనుని యజ్ఞములను తపస్సులను ప్రసాదించువానిని రాక్షసులను సంహరించువానిని తెలిసి త్వరపడుచు బలిచక్రవర్తితో ఇట్లు పలికెను. వామనాకారముతో నీ యజ్ఞశాలకు వచ్చుచున్న ఈ బ్రాహ్మణుడు ఇతను వాస్తవముగా బ్రాహ్మణుడుకాడు. ఇతడు యజ్ఞేశుడు. యజ్ఞభావనుడు. ఇతను నిన్ను యాచించుటకు వచ్చుచున్నాడు. ఇతను పరమ పురుషుడు. నాతో ఆలోచించిన తరువాతనే అతనికి నీవు దానమును చేయవలయును. ఆ మాటలను వినిన బలిచక్రవర్తి ఇట్లు పలికెను. నేను ధన్యుడనైతిని. సాక్షాత్తుగా యజ్ఞేశ్వరుడే నేనూహించకుండానే నా ఇంికి వచ్చు చున్నాడా ఇట్లు యజ్ఞేశుడే వచ్చి యాచించినచో ఇంకా ఆలోచించవలసినదేమున్నది? ఇట్లు పలికిన బలిభార్యతో కలిసి పురోహితుడైన శుక్రాచార్యులతో కలిసి అదితినందనుడు వామనుడు బ్రాహ్మణుడునున్న ప్రదేశమునకు వెళ్లెను. చేతులు జోడించి ఎందుకు వచ్చితిరి. ఏమి కావలయును అని అడిగెను. అంతట వామనుడు కూడా మూడడుగుల భూమిని నివాసమునకు ఇమ్ము ఇంత కన్నా వేరేవాిని కోరను. బలిచక్రవర్తి అట్లే అని నానారత్నవిభూషితమైన కలశమునుండి వారి ధారను విడిచివామనునకు భూమిని ఇచ్చెను. ఋషలు, ముఖ్యులు పురోహితుడైన శుక్రాచార్యులు దేవతలు అందరూ చూస్తుండగా బలిచక్రవర్తి వామనునకు భూమినిచ్చెను. భూమిని తీసుకొనుడు అని బలిచక్రవర్తి పలికినంతనే జరిగిన దానిని వినుము. అట్లే అని బలిచక్రవర్తి వామనుని చూడగా యజ్ఞపురుషుడు చంద్రాదిత్యుతిస్తనాంతాములుగా నుండునట్లు పెరిగెను. విక్రమాకారముగా పెరిగెను అనంతుడు అచ్యుతుడు లోక కర్తాజగన్మయుడు. అతనిని చూచి భర్యతో నున్న బలి ఇట్లు పలికెను. వినయముతో జగన్మాయా? నీ శక్తిమేరకు విక్రమించుము. దేవేశా. నేను సర్వభావముతో నిన్ను గెలిచితిని. బలి అట్లు పలుకుచుండగానే శుక్రాచార్యులు ఇట్లు పలికెను. రాజేన్ద్రా నేను బుద్ధితో ఆలోచించి మొదటే బాధించితిని. ఆ మాటలతోనే శ్రీహరి ఇట్లు పలికెను.
    దైత్యేశ్వరా! మహాబాహా! దైత్యరాజా. పెరుగుచున్నాను చూడుము. అపుడు బలిపెరుగుము, పెరుగుమ అనిపలికెను. అంతట శ్రీ మహావిష్ణువు కూర్మపృష్ఠమున పాదమునుంచి బలాకుజ్ఞమున పాదమునుంచెను. రెండవ పాదమును నా లోకమునుంచెను. అసురేశ్వరా, మూడవపాదమునకు స్థానములేదు. ఎక్కడ ఉంచవలయును. భూమిని ఇమ్ము! అని బలిచక్రవర్తితో పలికెను. అంతట బలిచక్రవర్తి నవ్వుచు ఇట్లు పలికెను. ఈ జగత్తును సృష్టించినవాడవు నీవే. నేను సృష్టికర్తనుకాను సురేశ్వరా? ఈ జగత్తునీ దోషము వలననే అల్పమైనది. జగన్మయా నేనేమి చేతును. అయినా కేశవా! నేనెపుడు అసత్యమును పలుకను, నన్ను సత్యవాక్యునిగా చేయుచు నావీపున నీ పాదమునుంచుము. అంతట ప్రసన్నుడైన భగవానుడు వేదస్వరూపుడు దేవపూజితుడు, నీ భక్తికి సంతోషించిని. నీకు శుభమగుగాక. వరమును కోరుకొనుము అని పలికెను.
    అంతట బలిచక్రవర్తి శ్రీమహావిష్ణువుతో నేను యాచించను. త్రివిక్రమా అనెను. అపుడు శ్రీమహావిష్ణువు తనకు తానుగా అతనికి చక్కని మనసుతో కోరిన దానిని రసాతలాధిపత్యమును భవిష్యదిన్ద్రపదవిని ఆత్మాధిపత్యమును నశించని యశస్సును ప్రసాదించెను. ఇట్లు బలిచక్రవర్తికి అన్ని ఇచ్చి పుత్రునితో భార్యతో రసాతాలమున బలిని ఉంచి త్రైలోక్యరాజ్యమును ఇంద్రునికిచ్చెను. ఇంతలో దేవతలతో అర్చించబడిన పాదము పాతాలమువరకు వెళ్లెను. నా తండ్రి అయిన ఆ మహావిష్ణువు యొక్క రెండవ పాదము నా ఇంిలోకి వచ్చిన దానిని దర్శించి ఆలోచించితిని. శ్రీ మహావిష్ణువు పాదము నా ఇంికి వచ్చినపుడు యేమి చేసిన శుభము కలుగును. అని ఆలోచించి అంతా చూచితిని. అపుడు నా కమండలమును శ్రేష్ఠమును చూచితిని, దానిలోని జలము పరమపుణ్యతమము పూర్వము త్రిపురారి ప్రసాదించెను. ఈ జలము వరము వరేణ్యము వరదము శాంతము శాంతికరము శుభము శుభప్రదము. నిత్యము భుక్తి ముక్తి ప్రదము లోకములకు మాతృస్వరూపము. అమృతము. భేషజము పవిత్రము పావనము పూజ్యము జ్యేష్ఠము శ్రేష్ఠము శుభావహము. స్మరించినంతనే లోకములను పావనము చేయునవి. ఇక దర్శించిన చెప్పవలయున     , అంతచె పవిత్రమైన ఈ జలమును నేను పవిత్రుడనై నా తండ్రికి అర్ఘ ్యముగా కల్పించెదను. ఇట్లు ఆలోచించి ఆ జలమును తీసుకొని అర్ఘ్యమును కల్పించి శ్రీ విష్ణుపాదముపైనుంచెను. అట్లు శ్రీ విష్ణుపాదమున పడిన ఆ జలము మేరుపర్వతమునందు నాలుగుగా నాలుగు దిక్కులకు ప్రవహించెను. భూమికి చెరెను. దక్షిణ భాగమున పడిన ఆ శ్రీ విష్ణుపాద జలమును శంకరుడు తన జటలుకాల శిరముతో స్వీకరించెను. పశ్చిమమున ప్రవహించిన జలము మరల కమండలమున చేరెను. ఉత్తరమున పడినది శ్రీ మహావిష్ణువు స్వీకరించెను. పూర్వమున పడిన దానిని ఋషులు దేవతలు పితృదేవతలు లోకపాలకులు శుభప్రదమైనది శ్రీ విష్ణుపాదపతతమని స్వీకరించిరి. కావున ఆ జలము సర్వశ్రేష్ఠమైనది.
    ఇక దక్షిణమున ప్రసరించిన లోకమాతచైన జలములు శ్రీ మహావిష్ణుపాదము నుండి ప్రవహించినవి బ్రహ్మణులు లోకమాతలు మహేశ్వరుడు శిరస్సుతో గ్రహించి జాజూటము నిలుపుకొనినవి శుభాదాయములు పరమపావనములు పుణ్యప్రదములు అయినవి ఆ శ్రీ విష్ణుపాదోదకమును శివుని జాజూటమున నిలిచిన వాిని స్మరించినంతనే సకల కామనలు నెరవేరును. అపుడు నారదమహర్షి ఇట్లు పలికెను.
    శంకరునిచే సృష్టించబడినవి బ్రహ్మకమండలమును చేరినవి శ్రీ మహావిష్ణువు పాదమును కడిగినవి శ్రీ శంకరభగవానుని శిరమున లంకరించినవి జలములు మర్త్యలోకమునకు అనగ భూలోకమునకేట్లు వచ్చినవో తెలుపుడు. అనగా బ్రహ్మ ఇట్లు పలికెను.
    మహేశ్వరుని జటలను చేరిన జలములు భూమికి వచ్చుటకు రెండు గాధలు చెప్పుచున్నారు. ఆ జలములను భూమిపైకి ఇద్దరు తీసుకొనివచ్చినారు. దానిలో ఒకి గౌతమ ఋషి భగవానుడు తన వ్రతగాన సమాధులతో శంకరుని పూజించి భూమిపైకి గొనితేబడినది. ఇక రెండవది బలీయుడైన క్షత్రియుడు శంకరుని ఆరాధించి భగీరధుడు భూమిపై తీసుకొని వచ్చినది రెండవ అంశము. ఇలా గంగకు రెండురూపములు ఏర్పడినవి.
    ఈ మాటలను వినిన నారదమహర్షి ఇట్లు పలికెను. మహేశ్వరుని జా జూటమునుండి ఏ కారణముచే గౌతముడు భూమిపైకి తీసుకొని వచ్చెను. అట్లే క్షత్రియుడు భగీరథుడు ఎట్లు తీసుకొని వచ్చెను అని అడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగెను. బ్రాహ్మణుడు ఎట్లు తీసుకొని వచ్చెనో క్షత్రియుడు ఎట్లు తీసుకొని వచ్చెనో దాని నంతనూ నీకు వివరముగా చెప్పెదను వినుము.
    శంకర భగవానునకు పార్వతీదేవి భార్యయైనపుడు గంగ కూడా శంకరునికి ప్రియురాలాయెను. శివభగవానుడు నాదోషమును తొలగించుటకు ఆలోచించి పార్వతితో కలిసి ఉన్న శంకరభగవానుడు దేవిని చూచి విశేషముగా రసవృత్తిలోనున్నంచున ఉత్తమ రసమును నిర్మించెను. రసిక ప్రియ స్త్రీ పావన కావున అందరికంటే గంగ అధిక ్పఇయురాలాయెను. తన శిరమున గంగ యున్నదని పార్వతి తెలియునుకాదా అనియే ఆ గంగనే ఆలోచించు చుండెను. ఆమె అనగా ఆ గంగ మరియొక కార్యసిద్ధికొరకు జామార్గమునుండి అవతరించినది అని శంకరుడు పార్వతికి చెప్పలేదు. గంగను శిరమున ధరించుటను తెలిసి పార్వతి సహించలేకపోయెను. జాజూటమున నిలిచిన గంగను మరల మరల చూచుచు అసూయతో ఈర్ష్యతో పార్వతి ఆ గంగను పంపుము పంపుము అని మాి మాికి చెప్పుచుండెను. శంకరుడు రసికుడు కావున ఉత్తమ రసరూపమైన గంగను విడిచిపెట్టలేదు. అపుడు పార్వతీదేవి దుఃఖముతో అనాధను అని పలికెను. శంకరుడు గంగను తన జటలలోనేదాచి ఉంచుటను చూచి వినాయకుని జయను కుమారస్వామిని రహస్యముగా ఇట్లు పలికెను. ఈ త్రిథేశ్వరుడు శంకరుడు కాముకుడు గంగను విడుచుటలేదు. ఆమె కూడా శంకరునికి ప్రియురాలు శంకరుడు ఆ ప్రియురాలని లిట్లు విడుచును. ఇట్లు చాలా విదాలుగా ఆలోచించి వినాయకునితో ఇట్లు పలికెను.
    దేవతలు అసురులు యకక్షులు సిద్ధులు చివరకు విూరు రాజులు ఇతరులు ప్రయత్నించినను శంకరుడు గంగను విడువడు, కావున నేను మరల హిమవత్పర్వతమునకు వెళ్ళి తపము చేసెదను. లేదా తపస్సులతో కల్మషము తొలగిన బాహ్మిణలు తపస్సు చేసి శంకరుని ప్రార్థించినచో జాజూటస్థిత గంగ భూమికిచెచునేమో అపుడు తల్లి మాటను వినిన వినయకుడు తల్లితో ఇట్లు పలికెను. సోదరుడు కుమారస్వామితో జయతో ఆలోచించి జాజూటమునుండి శంకరుడు గంగను విడుచు ఉపాయమును నిశ్చయించు ఆచరించెదము అని.
    ఇంతలో భూలోకమున 12 సంవత్సరములు ఘోరమైన అనావృష్టి భయంకరమైన కరువు యేర్పడినది. అపుడు స్థావర జంగమాత్మకమైన జగత్తు నశించుచుండెను. ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమము మాత్రము సర్వనామప్రదము పచ్చగా ఉండెను. నేను పూర్వము సృజించగోరి దేవయజన పర్వతముపై నేను యజ్ఞమును ఆచరించితిని. ఆ పర్వతము అప్పినుండి నా పేరుతో బ్రహ్మగిరిగా ప్రసిద్ధిపొందినది. గౌతమమహర్షి ఆ బ్రహ్మగిరిని ఆశ్రయించినివసించుచున్నాడు. శుభప్రదమైన బ్రహ్మిగిరిపైన నున్న అతని ఆశ్రమమున పరమపావనమున ఆధులు వ్యాధులు దుర్భిక్షము అనావృష్టి భయశోకములు దారిద్య్రములు వినరావుకూడా ఆ గౌతమహర్షి ఆశ్రమములో తప్ప ఇంకొక చోట హవ్యకవ్యమబులభించుటలేదు. కావున మరెక్కడా హోత దాత యష్టపాకుండెను, గౌతమహర్షి దానము యాగముచేసినపుడే స్వర్గమున దేవతలకు ఆహారములభించి తృప్తి కలుగుచున్నది. లేనిచోలేదు. ఇట్లు దేవలోకమున మర్త్యలోకమున ఒక్క గౌతముని పేరే వినవచ్చు చున్నది. దాత అంటే గౌతమమహర్షియే, హోత అంటే గౌతమ మహర్షియే. ఆ విషయమును వినిన నా నాశ్రమనివాసులైన మునులు గౌతమాశ్రమమునకు వచ్చుచుండిరి. అట్లు తన ఆశ్రమమునకు వచ్చిన మునులు అందరికి గౌతమ మహర్షి శిష్యునివలె పుత్రునివలె తండ్రివలె పోషకుడాయెను. యధాక్రమముగా అనురూపముగా అందరికి మునులకు శుశ్రూష చేయుచుండెను. గౌతమ మహర్షి ఆజ్ఞతో లోకమాతలైన ఓషధులు (పైరులు) అక్కడ ఆవిర్భవించెడివి. గౌతమహర్షి బ్రహ్మవిష్ణు మహేశ్వరులను ఆరాధించి నందున ఓషధులు పెట్టెడివి. మునులు భుజించు చుండెడివారు. గౌతమమహర్షి తపోబలముతో సంకల్పించుట విత్తనములు చల్లుట నారుపోయుట నాటుట పెరుగుట పండుట అప్పుడే జరుగుచుండెడిది. గౌతమహర్షి మనసులోనున్న అన్ని సిద్ధులు ఆవిర్భవించుచున్నవి.
    గౌతమహర్షి తన ఆశ్రమమునకు వచ్చిన మునులలో వినయముతో ప్రతిదినము శిష్యునివలె పుత్రునివలె దాసునివలె తమకాసేత చేయవలయును అని అడుగు చుండెడివాడు. చాలా సంవత్సరములు వారినందరిని తండ్రివలె పోషించసాగెను. ఇట్లు గౌతమ మహర్షి గొప్పఖ్యాతిని పొందెను. అపుడు వినాయకుడు తల్లిలో సోదరునితో జయతో ఇట్లు పలికెను.
    తల్లీ! దేవతల సభలో గౌతమహర్షి గానము చేయబడుచున్నాడు. దేవతలు కూడ చేయలేనిదానిని గౌతమహర్షి చేసెను అని. ఆ బ్రాహ్మణుని తపోబలము ఇంతిదని నేను వింని. ఆ మహర్షి శివజాజూటమునున్న గంగను కదలించగలడు. ఆ ఋషి తపస్సుతోకాని మరియొక దానితోకాని శంకరుని పూజించి ఆ గౌతమహర్షియె శివుని జాజూట గంగనిమ్మని శివునియాచించవచ్చును. ఇట్లు గౌతమ మహర్షి శంకర భగవానుని గంగను యాచించు నీతిని యేర్పరచవలయును. ఆ గౌతమహర్షి ప్రభావమువలన నదీశ్రేష్ఠగంగ  శంకరుని జాజూటమునుండి భూమిపై అవతరించును. ఇట్లు తల్లితో పలికిన వినాయకుడు సోదరునితో జయతో యజ్ఞోపవీతమును ధరించి బ్రహ్మచారిగా గౌతమాశ్రమమునకు వెడలెను. గౌతమాశ్రమ మరడలమున కొన్నిదినములు ఉంటూ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. ఇక్కడ మనము ఎక్కువ దినములు ఉండరాదు. మనము మన శుభకరమైన ఆశ్రమములకు వెళ్ళెదము. గౌతమ అన్నముతో పుష్టిని పొందినాము. ఇట్లు అందరూ వినాయక వాక్యముతో తమలో తామాలోచించుకొనుచు గౌతమమహర్షిని అడిగిరి. అంతట గౌతమ మహర్షి వారియందు స్నేహబుద్ధితో వారించెను.
    చేతులు జోడించి వినయముతో ఇక్కడే ఉండుడు. ముని పుంగవులారా విూ పాథుశ్రూషను చేయు చుందును. నేను పుత్రునివలె మిమ్ములను సేవించు చుండగా విూరు ఇంకొక ఆశ్రమమునకు వెళ్ళుట ఉచితముకాదు. అందరికి ఈ ఆశ్రమమే ఉచితమని నా తలంపు కావున మునులారా ఇంకొక ఆశ్రమమునకు వెళ్ళు తలంపుచాలును. ఇట్లు గౌతమమహర్షి మాటలను వినిన గణాధిపుడు తాను చేయవలసిన విఘ్నకృత్యమును ఆలోచించుచు బ్రాహ్మణులతో చేతులు జోడించి ఇట్లు పలికెను.
    గౌతమమహర్షి మనను తన అన్నముతో కొనినాడా మనల నెందుకు వారించుచున్నాడు. సామోపాయములో మనము మన ఆశ్రమములకు వెళ్ళజాలము. ఉపకారము చేసిన ఈ బ్రాహ్మణశ్రేష్ఠుడు దండించ దగినవాడేకాడు. కావున బుద్ధితో ఆలోచించి చేసెదను. దానిని అందరూ ఆమోదించుడు. అంతట బ్రాహ్మణులందరు అట్లే చేయుడు అనిరి. ఈ గౌతమమహర్షికి ఉపకారమునకు లోకముల హితమునుకకోరి బ్రాహ్మణులందరికి శ్రేయస్సు కలుగు విధముగా చేయుము. బ్రాహ్మణుల వాక్యమును విని గుణానురూపముగా చేసెదనని పలికి గౌతమునికి అనుకూలముగా చేసెదనని బ్రాహ్మణుల అనుమతినిపొంది తానుకూడా బ్రాహ్మణుడై బ్రాహ్మణులకు మరల మరల నమస్కరించి తల్లి అభిప్రాయమున నలిని జయతో ఇట్లు పలికెను. శుభాననో ఇతరులు తెలియకుండగా చేయుము. గోరూపమును ధరించి గౌతముని ఆశ్రమమునకు వెళ్ళుము. పైరునుభుజించి నశింప చేయుము. గౌతమమహర్షి ప్రహారము చేసిననూ హుంకారముచేసిననూ కోపముగా చూచిననూ పెద్దగా అరిచి బ్రతుకకు. మరణించకుము. అపుడు జయ గణాధిపుని అభిప్రాయములోనుండి అట్లే చేసెను. గౌతముడున్న ప్రదేశమునకు గోరూపమును ధరించి వెళ్ళెను. వరిపైరును తింటూ సంచరించుచుండెను. ఆ గోవును గౌతమమహర్షి చూచెను. వికృతముగానున్న ఆ గోవును చూచి గతమమహర్షి ఆ గోవును ఒక గడ్డిపరకతో నివారించెను. అట్లు వారించబడిన గోవు పెద్దగా అరిచి పడిపోయెను. ఆ గోవుపడగానే గొప్ప హా హా కారము జరిగెను. ఆ అరూపును విని గౌతమమహర్షి చేసిన దానిని చూచిన మహర్షులు బాధపడినవారై వినాయకుని ముందుంచుకుని ఇట్లు పలికిరి. ఇక మేము ఇపుడు నీ ఆశ్రమమున ఉండము. ఇక్కడిను రాడివెళ్ళెదము. పుత్రుని వలె పోషించితివి అని పలికితివికదా. ఆ మునుల మాటలను వినిన గౌతమ మహర్షి వెళ్ళుచున్న బ్రాహ్మిణులను చూచి వజ్రాయుధముతో కొట్టబడినవానివలె ఆ బ్రాహ్మణులముందు పడిపోయెను. అతనితో బ్రాహ్మణులు అందరు ఇట్లు పలికిరి. ఈ గోవు పడిపోయినది చూడుము, ఈ గోవు రుద్రులమాత జగత్పావని. సకల తీర్థదేవస్వరూపిణి. ఇంతి గోవువిధి బలముతో పడిపోగా ఇక మేము వెళ్ళవలయును, నీ ఆశ్రమమున ఆచరించిన వ్రతము వస్త్రమువలె జీర్ణమగును. బ్రాహ్మణోత్తమా మాకు ఇంకోధనములేదు. తపస్సే మా ధనము. అపుడు గౌతమమహర్షి ఆ బ్రాహ్మణుల ముందునిలిచి వినయముతో ఇట్లు పలికెను. విూరే మాకు శరణము. నన్నుపవిత్రుని చేయుడు. అంతట గణాధిప భగవానుడు ఇట్లు పలికెను. ఇది మరణించలేదు. అట్లే అని బ్రతికిలేదు. ఈ సందేహమున నిష్క ృతిని ఎట్లు చెప్పగలము. అనగా గౌతముడు మరల ఇట్లు పలికెను.
    గోవెపుడూ మూర్ఛపొందదు. మరణించును. ఇందులో సందేహములేదు. ఈ గోవెట్లులేచును. అట్లే ఈ కర్మకు ప్రాయశ్చిత్తమేమి చెప్పుడు దానినంతిని చేతును అనగా ఆ బ్రహ్మర్షులందరూ ఇట్లు పలికిరి. మా అందరి అనుమతితో మా అభిప్రాయమునే ఈ బుద్ధిమంతుడు చెప్పును. ఇతని మాటయే మాకు నీకు ప్రమాణముగా నుండును. ఇట్లు బ్రాహ్మణులు గౌతమహర్షి ప్రేరేపించగా విఘ్నరాజు బ్రాహ్మణ రూపముతో అందరితో ఇట్లు పలికెను. అందరి అభిప్రాయానుసారముగా నేను చెప్పుచున్నాను. నా మాటను ఇక్కడి మునులు గౌతమమహర్షికూడా ఆమోదించాలి. అవ్యక్తజన్మయైన బ్రహ్మయొక్క కమండలములోని జలము శ్రీ విష్ణుపాదమును కడిగి మహేశ్వరుని జా జూటమున నిలిచి ఉన్నది అని వినియుింమి. విూరు తపస్సుచే నియమముతో ఆ జలమునుతీసుకొనిరండు! ఆ జలముతో అభిషేకము చేసినచో ఈ గోవులేచును. అపుడు మేము ఇక్కడ ఉందుము. ఎప్పివలె ఉందుము బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇట్లు పలుకగా బ్రాహ్మణుల సభలో పుష్పవర్షము కురిసినది. జయ జయ శబ్దము మార్మోగినది.
    అంతట గౌతమమహర్షి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను. తపస్సుతో అగ్నిహోత్రుని అనుగ్రహముతో నా సంకల్పము సిద్ధించునుగాక. అంతట ఆ బ్రాహ్మణులు అట్లే అగుగాక అని ఆశీర్వదించి అన్న జలములతో సమృద్ధములైన తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి. ఆ బ్రాహ్మణులు అందరూ వెళ్ళిన తరువాత సోదరునితో ఇజయతో కలిసి గణేశుడు బాగాప్రీతి చెంది కృతకృత్యుడై తిరిగివెళ్ళెను. ఇట్లు బ్రాహ్మణులు వెళ్ళిపోగా గణేశుడు వెళ్ళగా తపస్సుతో కల్మషము తొలగిన గౌతమమహర్షి ఆ సంఘటనను ధ్యానించసాగెను. ఇదేమి? నాకు సంభవించినది? ఇట్లు చాలావిధములుగా ధ్యానించి జ్ఞానముతో అంతయూ తెలుసుకొనెను. ఇది దేవకార్యము వలన తనకు ఈ కిల్బిషము సంప్రాంప్తించినది. లోకముల ఉపకారముకొరకు శంకరుని ప్రీతికొరకు పార్వతీదేవి సంతోషముకొరకు గంగను తీసుకుని రావలయును. ఇది అంతయు శ్రేయస్కరమే. జగత్తునకు అగును, అసలు నాకు యేకిల్బిషములేదు. ఇట్లు మనస్సుతో ధ్యానించి గౌతమహర్షి చక్కగా ప్రీతి చెందెను. భార్యతో సంప్రదించుకొని ఇట్లు పలికెను. జగదీశ్వరుని త్రినేత్రుని వృషభధ్వజుని ఆరాధించి నదీశ్రేష్ఠమును తీసుకుని వచ్చెదను. గిరిపుత్రికను సంతోషింపచేసెదను. జగదంబకు సపత్ని మహేశ్వరుని జాస్థిత. ఇట్లు సంకల్పించి ముని ప్రవీరుడు గౌతమమహర్షి బ్రహ్మగిరినుండి కైలాసమునకు వెళ్ళెను. అక్కడ అధిష్ఠించియున్న ఉగ్రమైన తేజస్సుకలవానిని సురార్చితుని శంకరుని ప్రీతుని చేయుకు కైలాస శిఖరమునకు వెళ్ళి గౌతమభగవానుడు మౌనమును అవలంబించి కైలాస పర్వతొత్తమున దర్భలను పరిచి పరిశుద్ధడై కూర్చొని శంకరుని స్తుతించెను. శంకరుని స్తుతించు చుండగా పుష్పవృష్టి కురిసెను.
        ధర్మంవ్యవస్థాపయితుం విభజ్య                                        ఋవ్సామ శాస్త్రాణియజుశ్చశాఖా                                        లోకేచగాధా! స్మ ృతయ పురాణం                                        ఇత్యాదిశబ్దాత్మకతాముపైతి                                            యష్టాక్రతుర్యాన్యపిసాధనాని                                            ఋత్విక్స్వరూపంఫలదేశకాలా                                        త్వమేవ శంభో! పరమార్ధతత్త్వం                                        వదన్తియజ్ఞాంగమయంవపుస్తే.
    ఇట్లు పదకొండు శ్లోకములు శంకరస్తుతి పదకొండు శ్లోకములు అమ్మపార్వతీ స్తుతి చేసెను. ఇది అద్భుతమైన స్తుతి. పరమార్ధప్రదము. పరమ జ్ఞానప్రదము. గ్రంధవిస్తరభీతిచే ఇక్కడ ఇచ్చుటలేదు. రావలసినవారు బ్రహ్మపురాణములో ఆరవ అధ్యాయమున 4వ శ్లోకమునుండి 24వ శ్లోకము వరకు చూచుకొనవచ్చును.
    పార్వతీస్తుతిలో రెండు శ్లోకములునిచ్చుచున్నాను. యథాయధాశంభురమేయ మాయా రూపాని ధత్తెజగతోషితాయ తద్యోగయోగ్యాని తధైవధత్సే పతివ్రతాత్విత్వయి మాతరేవమ
        కార్యక్రియాకారకసాధనానాం                                        వేదోదితానామధ్లఏకికానావు                                            యత్యాధ్యముత్క ృష్టతమంప్రియంచ                                        ప్రోక్తాచసా సిద్ధి అనాదికర్తు.
ఇట్లు స్తుతించగా వృషభద్వజుడు శంకర భగవానుడు పార్వతీ సహితుడై గణేశాది గణములతో కూడా సాక్షాత్కరించి అతనితో ఇట్లు పలికెను.
    గౌతమా నీ భక్తితో స్తోత్రముతో వ్రతములతో ప్రసన్నుడనైతిని. నీకేమి ఈయవలయును. దేవతలకు కూడా దుర్లభమైనదైననూ యాచించుము. ఇట్లు జగన్మూర్తి మాటలను వినిన గౌతమమహర్షి ఆనంద బాష్పరిప్లుతాంగుడై ఇట్లు ఆలోచించెను. దైవము ధర్మము బ్రాహ్మణపూజనము లోకగతి ఎంతచిత్రము. ఇంతి దుర్లభము సులభమైనది.
        జాస్థితాంశుభాంగంగా దేహిమేత్రిథార్చిత                                    యది తుష్టోసిదేవేశ త్రయీధామనిమోస్తుతే.
    త్రిథార్చితా! వేదాధారా నీకు నమస్కారము. నీవు సంతోషించినచో నీ జాజూటముననున్న గంగను నాకు ప్రసాదించుము. అనగా శంకరుడు ఇట్లు పలికెను. మూడు లోకముల ఉపకారముకొరకు కోరినావు. ఇపుడున్న ఉపకారమునకు యాచించుము. అనగా గౌతముడు ఇట్లు పలికెను. ఈ స్తోత్రముతో నిన్ను స్తుతించు భక్తులు సర్వకామసమృద్ధి కలిగి ఉండవలయును. ఇది నా కోరిక. శంకరుడు అట్లే అగుగాక అని పరితుష్టుడై పలికెను. నా నుండి దిగులుతో ఇతర వరములను కూడా యాచించుము. అనగా గౌతమమహర్షి సంతోషముతో ఇట్లు పలికెను.
    దేవా జగన్నాథా! నీ జాజూటములో పావని లోకమాతయైన ఈ గంగను నీ ప్రియురాలిని బ్రహ్మగిరిలో విడిచిపెట్టుము. ఇది అందరికి తీర్థభూతముగా ఉంటుంది. సముద్రమును చేరువరకు తీర్థముగా నిలుచుచు ఈ తీర్థము బ్రహ్మహత్యాది పాపములను మనోవాక్కాయములతో ఆచరించిన పాపములను స్నానమాత్రముననే నశించవలయును. చంద్రసూర్య గ్రహణములలో అయనములలో విషువములలో సంక్రాంతిలో వైధృతిలో ఇతర పుణ్యతీర్థములలో కలుగు ఫలము ఈ తీర్థరాజమును స్మరించినంతనే కలుగవలయును.
        శ్లాఘ్యంకృతే తపఃప్రోక్తం                                            త్రేతాయాం యజ్ఞకర్మచ                                            ద్వాపరేయజ్ఞదానేచ                                            దానమేవకలేయుగే.
    కృతయుగములో తపస్సు, త్రేతాయుగ మహాయజ్ఞము, ద్వాపరయుగములో యజ్ఞదానములు కలియుగములో ఒక్క దానమే ఇట్లు చెప్పబడిన యుగధర్మములు దేశధర్మములు. కాలధర్మములు. దేశకాలాది సంయోగము వలన కలుగు ధర్మములు స్నానదానాది నియమములలో ఇతరత్ర ఆచరించిన పుణ్యములు ఈ తీర్థమును ఈ గాథను స్మరించినంతనే కలుగవలయును. సముద్రమును చేరు వరకు ఈ నది అనేకానేక ప్రాంతములలో ప్రవహించునో ఆయన్ని ప్రదేశములలో నీవు వెంచేసి ఉండవలయును. ఈ తీర్థమునకు థయోజనముల పరిధిలో ఉండువారికి ఆలోపలికి వచ్చువారికి మహాపాతకులైననూ వారి పితరులకు వారికి స్నానము కొరకు వచ్చువారికి స్నానమాత్రముననే ఇతర మానవులు ముక్తిని కావించుచుందురుగాక. సకల తీర్థములు ఒకప్రక్క స్వర్గమర్త్యపాతాలములోనున్నవి ఈ తీర్థమువాి అన్నికంటే విశిష్టమైనది. కావలయును. ఇట్లు పలికిన గౌతమమహర్షి మాటలను వినిన శంకర భగవానుడు తథాస్తు అని పలికెను.
        అస్యాః పరతరం తీర్థం న భూతం న భవిష్యతి                                    సత్యం సత్యం పునస్సత్యం మేదేచపరినిష్ఠితమ్‌                                    గౌతమేనయధానీతా గౌతవిూ తేనసంస్క ృతా                                    గాందదాతిచ విప్రేభ్య తతః గోదాప్రకీర్తితా                                    అవనాత్‌ పుణ్యదానాచ్చ అవరీపరికీర్తితా                                    గోదా చ అవరీచైవ తతో గోదావరీ మతా                                    సర్వేషా గౌతవిూపుణ్యా ఇత్యుక్త్వాన్తర ధీయత.
దీనికంటే గొప్పదైన తీర్థము ఇది వరకులేదు. ఇకముందు ఉండదు. ఇది ముమ్మాికి సత్యమే. వేదములో ప్రతి పాదించబడినది. గౌతమమహర్షి తీసుకొనివచ్చినాడు గాన ఇది గౌతమి అను పేరుతో ప్రసిద్ధి చెందినది. మరణించినట్లు పడియున్న గోవును మరల బ్రాహ్మణులకు ఇచ్చినందున, సకలవేవేదాంతజ్ఞానరూపమైన వాక్కును అనగా గోవును ఇచ్చినందున గోదా, అవతి, రాతి అను వ్యుత్పత్తిచే రక్షించును, ఇచ్చును అనగా అమోఘమైన పుణ్యములనిచ్చును. పాపములనుండి రక్షించును. గాన అవరీ గోదా అవరీ కలిపితే గోదావరి అనుచున్నారు. ఈ గౌతవిూనది అందరికే పుణ్యప్రదమైనది అని చెప్పి శివుడు అంతర్ధానముచెందెను.
    ఇట్లు లోకపూజితుడైన శంకర భగవానుడు అంతర్థానము కాగా ఆ శివాజ్ఞతో పరిపూర్ణమైన బలము కలిగిన గౌతమమహర్షి ఆ నదీమతల్లి ఉన్నజటను తీసుకొని దేవతలతో కలిసి బ్రహ్మగిరిని చేరెను. అంతట జటను తీసుకొని గౌతమమహర్షిరాగా అక్కడ అనగా ఆ బ్రహ్మగిరిపై పుష్పవృష్టి కురిసినది. సురేశ్వరులందరూ అచికి వచ్చిరి, మహానుభావులైన ఋషులు బ్రాహ్మణులు క్షత్రియులు జయ శబ్దముతో ఆ గౌతమమహర్షిని పూజించుచు సంతోషముకలవారైరి.
    ఇట్లు చెప్పగా నారదమహర్షి మరల బ్రహ్మను ఇట్లు అడిగెను. మహేశ్వర జా జూటమునుండి గంగను తీసుకొని బ్రహ్మగిరికి వచ్చిన గౌతమమహర్షి ఆ తరువాతయేమి చేసెను. అనగా బ్రహ్మ ఇట్లు తెలుపుచున్నాడు. ఇట్లు గౌతమమహర్షి మహేశ్వరుని జా జూటమునుండి గంగను తీసుకొని వచ్చి పరిశుద్ధుడై ఏకాగ్రమైన మనస్సుకలవాడై దేవతలచేత గిరినివాసులచే పూజించ ప్రతిష్ఠించి త్రిలోచనదేవుని స్మరించుచు చేతులు జోడించుచు ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు గంగ నుద్దేశించి ఇట్లు పలికెను.
        త్రిలోచన జోద్భూతే సర్వకామప్రదాయిని                                    క్షమస్వమాతశ్శాన్తాసి సుఖంయాహిహితంకురు.
    త్రినేత్రుని జటనుండి ఉద్భవించినదానా! సకల కామనలను ప్రసాదించుతల్లీ! క్షమించుము. శాంతించుము. సుఖముగా వెళ్ళుము. హితమును చేయుము. ఇట్లు గౌతమమహర్షి పలుకగా గంగాదేవి దివ్యరూపమును ధరించి దివ్యమాల్యాఉపావనములను ధరించి గౌతమునితో ఇట్లు పలికెను. దేవసదనమునకు వెళ్ళెదనులేదా బ్రహ్మకమండలమునకు వెళ్ళెదను. రసాతలమునకైనా వెళ్ళెదను. నీవు సత్యమును మాటలాడువానిగా ప్టుితివి. అనగా గౌతమమహర్షి ఇట్లు పలికెను. మూడులోకములకుపకారమునకై నేను యాచించితిని. శంకర భగవానుడు కూడా అట్లే ఇచ్చెను. ఆ శంకర భగవానుని సంకల్పము ఇంకొక తీరుగాకాదుకదా! ఇట్లు గౌతమమహర్షి వాక్యమును వినిన గంగ బ్రాహ్మణవాక్యము సత్యమే అని తలచెను. అపుడు గంగ తనను మూడు విభాగములుగా విభజించుకొని స్వర్గమర్త్యరసాతలములను చేరెను. స్వర్గమున నాలుగు విధములుగా ప్రవహించి మర్త్యలోకమున ఏడుగా రసాతలమున నాలుగుగా ఇట్లు పంచాదార విధములుగా అయి ప్రవహించినది. అంతట అన్ని తానే అయినది. సర్వపాపవినాశిని. సర్వకామప్రద. ఇదే వేదమున గానము చేయబడుచున్నది. మానవులు మానవుల లోకమునున్న దానికే దర్శించెదరు. రసాతలగతమున నున్నదానిని దర్శించజాలరు. స్వర్గములోనున్న దానిని చూడజాలరు. సముద్రమునకు చేరువరకు ఇది దేవమయెను. గౌతమ మహర్షి వదలగా పూర్వసాగరమునకు వెళ్ళెను. అంతట దేవతలతో ఋషులతో సేవించబడుచున్న దానిని జగత్తునకు శుభమును కలిగించబడుచున్నదానిని జగత్తునకు శుభమును కలిగించి గోదావరీమాతను మునిశ్రేష్ఠుడైన గౌతమమహర్షి ప్రదక్షిణము నాచరించెను. సురేశుడైన త్రిలోచనుని మొదట పూజించి గౌతమ మహర్షి ఉభయతీరములలో స్నానము చేసెదనని సంకల్పించెను. స్మరించినంతనే అక్కడ కరుణాసాగరుడు అక్కడ సాక్షాత్కరించెను. చెతులు జోడించి భక్తితో వంగిన వాడై త్రిలోచనుని ఇక్కడస్నానమెట్లు సిద్ధించును అని శంకరుని అడిగెను.
    దేవదేవమహేశానా? లోకములహితమును కోరి గౌతవిూ తీర్థస్నానవిధిని నాకు చక్కగా తెలుపుము అనగా మహేశ్వరుడు ఇట్లు చెప్పెను. మహర్షీ గోదావరీస్నాన విధిని సమగ్రముగా చక్కగా వినుము. మొదట నాందీముఖము నాచరించి దేహశుద్ధిని ఆచరించి బ్రాహ్మణులను భుజింపచేసి వారి ఆజ్ఞను స్వీకరించి పతితులతో మాటలాడుటను విడిచిప్టిె బ్రహ్మచర్యముతో వెళ్ళవలయును.
        యస్య హస్తౌ చపాదౌ చ మనశ్చైవసు సంయతమ్‌                                విద్యాతపశ్చకీర్తిశ్చ సతీర్థఫలమశ్నుతే.
    హస్తములు పాదములు మనస్సు విద్యా తపస్సు కీర్తి నియమబద్ధముగా నున్న వాడు తీర్థఫలమును పొందును. దుష్టభావమును విడిచిప్టిె స్వధర్మపరినిష్ఠితుడై అలసినవారికి సేవ చేయుచు యధోచితముగా అన్నదానము చేయవలయును. ఏవిూలేని సాధువులకు వస్త్రదానమును చేయవలయును. దివ్యమైన గంగా సముద్భవమైన హరి వధను వినవలయును. ఈ విధితో వెళ్ళుచు సకల తీర్థఫలమును పొందును. శంకరుడు గౌతమమహర్షితో మరియొకమాట చెప్పియున్నాడు. ద్విహస్తమాత్రముననే తీర్థములు సంభవించగలవు. సర్వకామ ప్రదుడనైన నేను అన్నిచోట్ల సన్నిహితుడనై యుందును. గంగాద్వారే ప్రియాగమున సాగరసంగమమున ఈ తీర్థములలో గౌతవిూనది భాగీరధి నరులకు మోక్షమును ప్రసాదించునది.
        నర్మదాతు సరిచ్ఛ్రేష్ఠా పర్వత్వేమర కర్కాటకే                                    యమునాసంగతా తత్ర ప్రభాసేతు సరస్వతీ                                    కృష్ణా భీమరధీచైవ తుంగభద్రాతు నారద                                    తిసృణాంసంగమోయత్ర తీత్తీర్థం ముక్తిదంనృణామ్‌                                పయోష్ణీసంగతాయత్ర తత్రత్యాతత్రముక్తిదా                                    ఇయంతు గౌతవిూ వత్సయత్రక్వాపిమమాజ్ఞయా                                సర్వేషాం సర్వదా నౄణాం స్నానాన్ముక్తిం ప్రదాస్యతి                                కించిత్కాలేపుణ్యతమా కించిత్తీర్థే సురాగమా                                    సర్వేషాం సర్వదా తీర్థం గౌతవిూనాత్ర సంశయ.
అమర కంటక పర్వతమున నర్మదా ఉత్తమనది. అక్కడే యమునా సంగమము శ్రేష్ఠము. ప్రభాసమున సరస్వతీ శ్రేష్ఠనది. కృష్ణా భీమరధీ తుంగ భద్రా ఈ మూడునదులసంగమమ ఉన్నతీర్థము ముక్తిప్రదము. పయోషీసంగమము కల తీర్థము ముక్తిప్రద. ఇక ఈ గౌతతవిూనది యెక్కడ ఉన్ననూ నా ఆజ్ఞచె అందరికి అన్ని వేళలా అన్నిచోట్ల నరులకు స్నానమాత్రమున ముక్తిప్రద. కొన్ని నదులు కొన్ని కాలములలోనే పుణ్యతమలు. కొన్ని తీర్థములు దేవతలరాకలో పుణ్యప్రదములు. అందరికీ అన్నిచోట్ల అన్నివేళలా గౌతవిూ ముక్తిప్రదా.
        షష్ఠిర్వర్ష సహస్రాణి భాగీరధ్యవగాహనీమ్‌                                    సకృద్ఘోదావరీస్నానం సింహస్థే చ బృహస్పతౌ                                    విశేషాద్రామ చరణ ప్రదానాత్‌ తీర్థసంశ్రయాత్‌                                    సింహస్థితేసురగురౌ దుర్లభాగౌతవిూనృణామ్‌                                    భాగీరధీ నర్మదా చ యమునా చ సరస్వతీ                                    ఆయాన్తి భీమర ధ్వాద్యాః స్నాతుంసింహగతేగురే                                విహాయ గౌవిూం గంగాం తీర్ధాన్యన్యానిసేవితుమ్‌                                యేయాన్తి మూఢాస్తే యాన్తి నిరయంసింహగేగురే
అరవైవేల సంవత్సరములు గంగాస్నానము బృహస్పతిసింహరాశిలో ఉన్నపుడు కూడా వరీస్నానము సమాన ఫలప్రదము. రామచరణ ప్రదానము వలన తీర్థసంశ్రయము వలన బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు గౌతవిూస్నానము దుర్లభము. భాగీరధి నర్మదా యమునా సరస్వతి భీమర ధ్యాదినదులు సింహగతగురువులో గోదావరికి వచ్చును. బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు గోదావరిని విడిచి ఇతర తీర్థములను సేవించు మూఢులు నరకమునకు వెళ్ళెదరు.
        తిస్రఃకోట్యర్థ కోీచ యోజనానాం శతద్వయే                                    తీర్థాని ముని శార్దూల సంభవిష్యంతి గౌతమి                                    ఇయం మాహేశ్వరీ గంగా గౌతవిూ వైష్ణవీతిచ                                    భ్రాష్మీగోదావరీనందా సునందావామదాయినీ                                    బ్రహ్మతేజస్సమానీతా సర్వపాపప్రణాశినీ                                    స్మరణాదేవపాపేఘహన్త్రీ మమసదా ప్రియా                                    పంచానామపి భూతానామాపః శ్రేష్ఠత్వమాగతా.
మూడుకోట్ల 50 లక్షల తీర్థములు రెండువందలయోజనాలలో గౌతవిూనదిలో సింహబృహస్పతిలో సంభవించును. ఈ గోదావరి గంగా మాహేశ్వరి గౌతవిూ వైష్ణవీ బ్రాహ్మీ గోదావరీ నర్మదా సునందాకామదాయినీ బ్రహ్మతేజస్సుతో గొనితేబడినది. సర్వపాపప్రణాశినీ గోదావరిని స్మరించినంతనే సకలపాపరాశులను నశింపచేయును. నాకు సదా ప్రీతికరురాని. అయిదు భూతములు, జలము శ్రేష్ఠతముములు. ఆ జలములలో తీర్థభూత జలము ఇంకా శ్రేష్ఠములు. కావున జలములు సర్వశ్రేష్ఠములు.
        తస్మాత్‌ భాగీరథీశ్రేష్ఠాతాభ్యోయ గౌతవిూత్వయా                                ఆనీతాస జాగంగా అస్యానాన్యచ్ఛు భావహమ్‌                                స్వర్గే భువిలిచేవాపి తిర్థేసర్మార్ధదం మునే
కావున భాగీరథి జలములలో కెల్ల శ్రేష్ఠమైనది. భాగీరథా జలములకంటే గోదావరీ జలములు శ్రేష్ఠములు. శంకరుని జాసహితముగా నీవు తీసుకొని వచ్చితివి. దానికంటే శ్రేష్ఠిమింకొకిలేదు. స్వర్గములో భూలోకమున పాతాళమున సర్వార్థద గౌతమి పుత్రా ఇట్లు గౌతమమహర్షికి శంకర భగవానుడు అంతా చెప్పెను. శంకరుడు సంతోషించి చెప్పిన దంతయు నీకు తెలిపితిని. ఇట్లు గౌతవిూగంగ అన్నికంటే అధికమైనది శ్రేష్ఠమైనది. గౌతమి ఉత్పత్తిని ప్రభావమును స్వరూపమును కూడా చెప్పితిని. ఇంకాయేమేమి వినగోరుచున్నావు. ఇది సంగ్రహముగా గోదావరి ఉత్పత్తి. గౌతమి గోదావరి వైభవము. బ్రహ్మవిష్ణుమహేశ్వరుల త్రిమూర్తుల సంకల్పములతో సకల లోకహితమును కోరి ఆత్రిమూర్తులు సకల చరాచరప్రపంచహితమునకు అవతరింపచేసినది గోదావరి ఇక ఇపుడు పుష్కర ప్రభావమును పుట్టుకను చూతము.
పుష్కర ప్రాదుర్భావము
    శౌనకాది మహామునులు సూతమహర్షిని ఇట్లు అడిగిరి.
    మహామునీ గోదావరియొక్క అద్భుతమైన చరితమును వినిపించి మమ్ములను కృతార్ధులను చేసితిరి. తమ వాక్యామృతమును జుఱ్ఱుచున్న మాకు తృప్తి కలుగుటలేదు. ఇంకా వినాలి అ తహ తహ కలుగుచున్నది. ఇక ఇపుడు పుష్కరమంటే యేమి. అది 12 సంవత్సరములకే ఒక్కసారే ఎందుకొచ్చును. దీనిలోని అంతరార్ధమేమి. ఆ విధి విధానమును కూడా వినిపింపవేడుచున్నాము అని శౌనకాది మహామునులు కోరగా సూతమహర్షి ఇట్లు చెప్పసాగెను.
    సాధార ఋరదనీిని చిల్లగింజ (ఇండుపగింజ) శుద్ధి చేయునట్లు అఖిలచరాచర జగత్తులోని జావకంటే పాపాలను తమలో కలుపుకున్న మహానదులు ఆ పాపాలను తొలగించుకొని మళ్ళీ నిర్మలములు పరిశుద్ధములు పవిత్రములు పుణ్యప్రదములుగా అగునట్లు చేయునదే పుష్కరము. పుష్కరము అంటే కమండలమునకు పేరు. పుష్కరము అంటే పద్మము. పుష్కరము అంటే యేనుగుతొండము. పుష్కరము అంటే మహాలక్ష్మి. శ్రీ మన్నారాయణునకు పుష్కరాకక్షుడు అనిపేరు. మహాలక్ష్మికి పుష్కరాసన అని పేరు. సముద్రునకు పుష్కర నిలయుడు అనిపేరు. ఇట్లు ఇన్ని అర్థములు ఆంతర్యములున్న పుష్కర శబ్దము నామము ఇక్కడ ఎలా వించుకు వ్యవహరించబడుచున్నదో చూతము.
    జీవులందరూ తమపాపాలను నదులలో వదులుచున్నారు. మరి ఆ నదులు ఎట్లు పాపాలను వదిలించు కోవాలి అను సందేహము పుష్కరుడనే ఒక బ్రాహ్మణునకు కలిగినది. ఆ నదులపాపములను తొలగించు విధానమును తెలియుటకు ఆ పుష్కరుడు శివునికై ఘోరమైన తపమును ఆచరించినాడు. ఆ శంకరుని అష్టమూర్తులలో ఒకటైన జలత్వసిద్ధికై ప్రాదేయపడినాడు. ఆ భక్తుని ఉదారమైన సంకల్పము లోకహితమును ఆకాంక్షించుట అతని ఆవేదనను అర్ధము చేసుకొని శంకరభగవానుడు ఆ పుష్కరునికి అభయమునిచ్చి భక్తునకు పుష్కరమూర్తిగా పరిణమించి సాక్షాత్కరించినాడు. అది తెలిసిన బ్రహ్మశంకరుని ప్రార్థించి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ తీసుకొని ఆ పుష్కర తత్త్వాన్ని తనకమండల జలంలో నిక్షిప్తం చేసుకొనినాడు.
    ఇది ట్లు జరుగుచుండగా గౌతముని ధర్మపత్ని అయిన అహల్య పై కామవాంఛా కలుషితుడైన ఇంద్రుడు తన వాంఛను తీర్చుకొనుటకు ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరకు ఒకనాడు తన మాయచే కోడిపుంజురూపమున అతని ఆశ్రమమునకువెళ్ళి బ్రాహ్మిముహూర్తమునకు ముందే సమయమైనట్లుగా కూతకూసినాడు. బ్రాహ్మముహూర్తమైనదని తలచిన గౌతమమహర్షి వాచిస్నానార్ధియై నదీప్రాంతముకు వెళ్ళెను. అంతలో ఇంద్రుడు తాను ఆ ముని రూపమును ధరించి ఆహల్యను అనుభవించెను. స్నానార్ధమై వెళ్ళిన గౌతమమహర్షి సగము దారిలోనే ఇది రాక్షసవేళకాని బ్రాహ్మీముహూర్తముకాదని తెలిసి ఇది స్నానసమయముకాదని తెలిసి వెనుకకు మళ్ళీ ఆశ్రమమునకు చేరెను. అక్కడ తన వేషములో నున్న ఇంద్రుని అతని నున్న అహల్యను చూచి కోపించెను. అహల్యా నా భార్యవై తపస్సంపన్నురాలవై పవిత్రమైన గృహస్థధర్మమును పతివ్రతాధర్మమును మరిచి పరపురుషునితో క్రీడించుచున్న నీవు అందరికీ అదృశ్యురాలవై భస్మచ్ఛన్నముగా ఉండి ఆహార నిద్రలు మాని కఠినమైన తపమునాచరించుచు పాపమును తొలగించుకొనుము అని శపించెను. అట్లే ఇంద్రుని సురపతీ! ది...డవై యుండి జ్ఞానమును వివేకమును వాస్తవమును తెలియుస్థితిని కోల్పోయి కేవలము యోనిపట్ల తహతహతో ఇంతి అకృత్యమునకు పూనుకున్నావు. అందుకే నీ శరీరమంతా ఆ యోనులమయమై పోవుగాక అని శపించెను. అహల్య అదృశ్య అయినది రావతారమున రాముని రాకతో తన శాపము తొలగిపోయినది. ఇక ఇంద్రుని శరీరమంతా యోనులు ఏర్పడినది. మూడులోకములను పాలించు ఇంద్రుడు ఈ జుగుప్సాపాపమును కఠినమైన శాపమును భరించ జాలక తన ఆచార్యుడైన బృహస్పతిని చేరినాడు బృహస్పతి ఇంద్రుని తనవెంట తీసుకొని బ్రహ్మలోకమున బ్రహ్మవద్దకు వెళ్ళెను. బ్రహ్మను పలురీతులా ప్రార్థించెను. అయినా ఇంద్రుని వైరుచ్యము తొలగలేదు. అపుడు బ్రహ్మ మందాకినివద్ద ఒకసరస్సును నిర్మించి అందులో తన కమండలములోని పుష్కరజలమును కొద్దిగా ప్రోక్షించి మహోన్ద్రని ఆ సరస్సులో స్నానము చేయించినాడు. శంకరభగవానుని సంకల్పమున యేర్పడిన గంగ శ్రీ మహావిష్ణువు పాదములను కడిగిన గంగ శంకరుడు పుష్కరమూర్తిగానున్న గంగ బ్రహ్మకమండలములోచేరిన గంగ ఇంతాదిజలము ప్రోక్షించబడిన సరమున స్నానము చేసినంచున ఇంద్రుని వికృతరూపమునశించి యధావస్థిత రూపుడాయెను. ఆకాశగంగకన్నా అత్యంత ప్రభావసమన్వితమైన ఆ పుష్కరమహిమను దేవేంద్రుడు బృహస్పతికూడా ఆశ్చర్యమునందినారు.
    సకలలోకాలు ఆశ్చర్యమును పొందించిన ఈ పుష్కర మాహాత్మ్యము ఆనోా ఆ నోా జగమంతా ప్రచారమైనది. ఆకాశగంగకన్నా పరమపావనమైన ఆ పుష్కరసమ్మెలనమునకు నదులన్ని తహతహలాడినవి. గంగా గౌతవిూనదులను ముందర నుంచుకొని బ్రహ్మవద్దకువెళ్ళి బ్రహ్మను ప్రార్థించిసాగినవి. అదే సమయమున పుష్కర మహిమను తాను దగ్గర ఉండి కనులారా చూచాడు కావున ఆ పుష్కరత్వమును తనకు పొందింప చేయమని బ్రహ్మదేవుని ప్రార్థించియున్నారు. కాని పుష్కరుడు దీనికి అంగీకరించలేదు. అయినా నదుల ప్రార్ధనను బృహస్పతి ప్రార్ధనను మన్నించిన బ్రహ్మకర్తవ్యమునకు శ్రీ మన్నారాయణుని ప్రార్థించినాడు. అంతట శ్రీహరి గురువు ఆయా రాశులలో చేరిన మొది 12 రోజులు రాశిని విడిచు చివరి పన్నెండు రోజులు బ్రహ్మనిర్ణయించిన నదులలో ఉండుమని పుష్కరుని ఆదేశించిన శ్రీహరి ఆజ్ఞ మేరకు పుష్కరుడు అందులకు అంగీకరించెను. అపుడు బ్రహ్మ శ్రీహరి ఆజ్ఞమేరకు ఇట్లు నదీ నిర్ణయము పుష్కర ప్రవేశమును ఆదేశించెను. మేషాది ద్వాథరాశులయందు సర్వశుభగ్రహమగు గురుడు సంచరించునపుడు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరకాలముగా నిర్ణయంపబడినది.
బృహస్పతి    మేషరాశిలో ప్రవేశించినపుడు    గంగా నదికి
బృహస్పతి    వృషభరాశిలో ప్రవేశించినపుడు    నర్మదా నదికి
బృహస్పతి    మిధునరాశిలో ప్రవేశించినపుడు     సరస్వతీ నదికి
బృహస్పతి    కర్కాటకరాశిలో ప్రవేశించినపుడు     యమునా నదికి
బృహస్పతి    సింహరాశిలో ప్రవేశించినపుడు     గోదావరి నదికి
బృహస్పతి    కన్యారాశిలో ప్రవేశించినపుడు     కృష్ణా నదికి
బృహస్పతి    తులారాశిలో ప్రవేశించినపుడు     కావేరీ నదికి
బృహస్పతి    వృశ్చికరాశిలో ప్రవేశించినపుడు     భీమా(తామ్రపర్ణి)నదికి
బృహస్పతి    ధనురాశిలో ప్రవేశించినపుడు     పుష్కరిణి నదికి
బృహస్పతి    మకరరాశిలో ప్రవేశించినపుడు     తుంగభద్రా నదికి
బృహస్పతి    కుంభరాశిలో ప్రవేశించినపుడు     సింధు నదికి
బృహస్పతి    విూనరాశిలో ప్రవేశించినపుడు     ప్రాణహితనదికి
ఈ విధముగా పన్నెండు నదులకు పన్నెండు రాశులలో బృహస్పతి ప్రవేశించిసంచరించునపుడు పుష్కరుడు ప్రవేశించును. ఇట్లు ఒక్కొక్కనదికి 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరము లేర్పడును. ఆయా పుష్కరమున ఆయా నదీస్నానము పూజదానధర్మములు వ్రతములు శ్రాద్ధములు తర్పణములు పిండప్రదానములు చేయుట వలన తాము పాపవిముక్తులగుటయెకాక తమ పితృదేవతలకు కూడా ఊర్ధ్వగతిని లభింపచేతురు. ఇట్లు చెప్పగా శౌనకాది మహామునులు మరల ఇట్లు అడిగిరి. సర్వజ్ఞా! నీవు చెప్పిన 12నదులలో యేనదీ పుష్కరము ఉత్కృష్టమైనది తెలుపుడు అని అడుగగా సూతమహర్షి ఇట్లు చెప్పసాగెను.
గోదావరీ పుష్కరములు
    అన్ని పుష్కరములలో గోదావరి పుష్కరము సర్వోత్క ృష్టమైనది. సమస్త నదీపుష్కరములకన్ననూ గోదావరి పుష్కరములు అతి పవిత్రము. అతిపుణ్యప్రదము. అమితశక్తిమంతము. అంతేందుకు 'గోదావరి గోదావరి గోదావరి' అని మూడు మార్లు స్మరించినచాలును. సకలపాపములు తొలగును. అట్లు గురువు సింహరాశిలో ప్రవేచగనే మూడుకోట్ల యాబది లక్షల పుణ్యతీర్థములతో పుష్కరుడు గోదావరినదిని ఆశ్రయించును. ఆనాినుండి సంవత్సరాంతము వరకు సకల తీర్థములు గోదావరిలోనే నివసించు చుండును. పుష్కరుడు మాత్రము మొది పన్నెండు దినములు చివరి పన్నెండు దినములు మాత్రమే గోదావరిలో ఉండును. అందు వలన మొది పన్నెండు దినములు ఆదిపుష్కరమని చివరి పండ్రెండు దినములు అంత్యపుష్కరములని వ్యవహరించెదరు. ఈ అంత్యపుష్కరోత్సవములు అన్ని నదులకు జరుగుచు ఒక్క గోదావరినదికి మాత్రమే అంత్యపుష్కర ఉత్సవములు జరుగును. ఈ ఆచారముతో తక్కువ నదులకు కూడా అంత్యపుష్కరములను జరుపుచున్నారుకాని వాస్తవముగా జరుపవలసినది ఒక గోదావరీనదికి మాత్రమే.
    కావున సాధారణ సమయముననే గోదావరీస్నానము సర్వార్థసిద్ధిదము సర్వకామప్రదము. సర్వపాపహరము. అయినపుడు ఇక ఈ గోదావరీపుష్కర పుణ్యకాలమున గౌతవిూస్నానము తీరమున సాగించు జపహోమ దానధర్మ తర్పణ శ్రాద్ధపిండప్రదానాదికములు కోట్లధికఫలప్రదములు. అందుకే మహామహులగు ఎంతోమంది ఋషులు గోదావరిగురించి ఇట్లు చెప్పియున్నారు.
        రేవా తీరేతపః కుర్యాత్‌                                            మరనం జాహ్నవీతవే                                            దానంకుర్యాత్‌ కురుక్షేత్రే                                            గౌతమ్యాంత్ర తామం వరమ్‌.
    రేవానదీతీరమున తపమును ఆచరించ వలయును. గంగాతీరమున మరణము కురుక్షేత్రమున దానము గౌతవిూనదీ తీరమున పుణ్యప్రదములే.
        పుష్యార్కే జన్మనక్షత్రే వ్యతీపాతే దినత్రయే                                    సకృద్నాదావరీస్నానం కులకోి సముద్ధరేత్‌.
    పుష్యవిూ నక్షత్రమున్న ఆదివారమునాడు, ప్టుినరోజునాడు జన్మతారనాడు, వ్యతీపాతులలో కాని మామూలు రోజులలో మూడు మార్లు స్నానము గోదావరినదులో చేసినచో ఊర్ధ్వగతులు  లభించును.
        యాగతి ర్ధర్మ శీలానాం మునీనామూర్ధ్వరేతసామ్‌                                సాగతిస్సర్వజంతూనాం గౌతవిూ తీరవాసినామ్‌.
    ధర్మశీలులకు నైష్ఠికబ్రహ్మచారులకు లభించే ఉత్తమ గతి గౌతవిూతీరమున నివసించు సకలప్రాణులకు లభించును.
        పంచానామపి భూతానాం అపాంశ్రేష్ఠత్వ మాగతమ్‌                                తస్మిన్‌ భాగీరథీ జ్యేష్ఠా తస్యా జ్యేష్ఠాతు గౌతవిూ                                ఆద్యాతు గౌతవిూ గంగా పశ్చాత్‌ భాగీరథస్మ ృతా                                తయోరేకతరాసేవ్యా గౌతవిూ తత్రపావనీ.
    అయిదు భూతములలో జలములు శ్రేష్ఠములు. ఆ జలములలో భాగీరధిశ్రేష్ఠ. దానికంటే శ్రేష్ఠము గౌతమి. మొదట గౌతమి గంగా తరువాత భాగీరధి. ఆ రిెంలో ఒకి సేవించాలి. వాిలో గౌతమి పావని అయినది.
    యస్మిన్‌ దినే సురగురు సింహస్థాపియుతో భవేత్‌                                తస్మింస్తు గౌతవిూస్నానం కోి జన్మాఘనాశనమ్‌.
    బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు చేయు గౌతవిూ స్నానము కోిజన్మల పాపములను నశింప చేయును. ఈ గోదావరి నదీజలము గంగానది సైతము పవిత్రము చేయును అ తెలియవలయును. అందుకే కాశీకి పోయినవారు గంగోదకమును తెచ్చి గోదావరిలో కలుపు ఆచారము కలదు. ఇట్లు కలుపుట వలన గంగానది పాపవిముక్తియగునని పండుతుల నిర్ణయము. కావున గంగనే పావనము చేయుగల నది గోదావరియని తెలియవలయును. ఒక్కమాటలో చెప్పాటలంటే గోదావరి కాన్న గొప్పనది గోదావరిపుష్కరములకంటే గొప్ప పుష్కరములు గొప్ప పుణ్యకాలము ఈ సృష్టిలోనేలేవు అని తెలియుచున్నది.
ఇది అఖండ గౌతమి
    మహారాష్ట్రలో అవతరించిన గోదావరీనది నిజామాబాద్‌ జిల్లా నుండి తెలంగాణాలో తన తొలికెరటపు కాలుమోపినది. బాసరమహాక్షేత్రంలో సరస్వతీదేవి చల్లని చూపులు తనపై ప్రసరింప చేసుకొని వేములవాడ కాళేశ్వరములలో తన సోయగాలపై శివుడు చేసే చిలిపిసైగలకు సిగ్గుపడుతూ నవ నవ సర సరసమాధురీ భావజాలములను రంగరించుకొని అగ్నిమండలమైన భద్రాచలాన్ని ఆర్ద్రతా నిలయముగాచేసి తెలుగించి ఇలవేలుపులైన సీతారాముల పవిత్రానురాగాలను పరామర్శించుచు తూర్పుకనుమలద్వారా పాపికొండలను తరిచి తరించి మైదానప్రాంతానికి వచ్చి రాజమహేన్ద్రవరము విూదుగా బంగాలాఖాతంవైపు ప్రవహించినది. అత్యన్త విశాలప్రాంతములో ప్రవహించే గోదావరి ఈ ప్రాన్తంలోనే అఖండగౌతమిగా ఆరాధనలందుకుంటున్నది. సరస్వతి చల్లని చూపులను భావుకతలను పవిత్రానురాగబంధాలను రాజమహేన్ద్రవరములోనే భద్రపరిచి ధవళేశ్వరవైపు కదిలి ఆ పై నుండి అఖండగౌతమిగా సప్తగోదావరిగా యేడుపాయలుగా చీలిపోయినది.
సప్తగోదావరులు
    తుర్యాత్రేయీ భరద్వాజా గౌతవిూ వృద్ధ గౌతవిూ                                కౌశికాచ వశిష్ఠాచ సర్పరీతి సాగరం తధా.
1.తుల్య 2.ఆత్రేయ 3.భరద్వాజ 4.గౌతమి 5.వృద్ధగౌతమి 6.కౌశిక 7.వశిష్ఠ అను యేడు గోదావరి పాయలుగా సప్తగోదావరులందురు. ఈ ఏడు గోదావరులు వివిధ క్షేత్రములను పునీతమొనరించుచు సాగి తూర్పుసముద్రమున కలియుచున్నది. నాసిక్‌లో జన్మించి అంతర్వాహినిగా ప్రవహించి త్య్రంబకమందలి గోముఖముద్వారా పునరావిర్భూతమై సముద్ర సంగమము వరకు దాదాపు వెయ్యిమైళ్ళ విస్తీర్ణముగా ప్రవహించు గోదావరి అడుగడుగునా పవిత్రమైనదే. కణకణమునా పుణ్యమును నింపినదే, నిండినదే. అందుకే ఒకటేమాట. గోదావరీ పుష్కరముల పుణ్యకాలములో ఒక్కరోజు స్నానమాడిననూ అరువదివేల సంవత్సరములు గంగలో స్నానము చేసిన ఫలము లభించునని బ్రహ్మపురాణములో విస్పష్టముగా చెప్పియున్నారు. కావున తేది:14.7.2015 నుండి వచ్చు గోదావరీపుష్కరాలలో పవిత్రమైన గోదావరీ చరితమును చదివి, చదివించి, వినిపించి గోదావరీ పుష్కర ప్రభావమును తెలిసి పదిమందికి తెలిపి తమకు అనువైన ప్రాంతమున నున్న గోదావరీనదిలో ఒక్కరోజైనా స్నానమాడి దాన ధర్మ యాగ జప తప తర్పణ శ్రాద్ధ పిండ ప్రదానాదులను కావించుకొని తాము తరించి తమకోి కులములను తరింప చేసెదరను ఆశతో
స్వస్తి. సమస్త సన్మంగళాని భవరతు

No comments: