Friday, August 26, 2016

గాయత్రీ జపం

హిందూ ధర్మంలో శాస్త్రం అందరి ఆధ్యాత్మిక సాధనకీ మార్గాలు నిర్దేశించింది. ఎవరెవరు ఎలాిం అభ్యాసాలు చేయవచ్చో, ఎవరు చేయకూడదో కూడా శాస్త్రంలో చెప్పబడింది. మహిళలకు సైతం ఆచరించ దగినవి, ఆచరించదగనివి స్పష్టంగా చెప్పబడ్డాయి.
అయితే గాయత్రీ జపం బ్రాహ్మణులకు మాత్రమే ఎందుకు పరిమితం చేయబడాలి? ఇతర వర్గాల వారు ఈ జపం ఎందుకు చేయకూడదు? ఇలా కొందరికి సందేహం వస్తూ ఉంటుంది. ఇది శాస్త్రం తెలియని వారు చేసే వ్యాఖ్య. శాస్త్ర నియమాలని, ఈ ఒక్క జన్మకే పరిమితం చేసి చూస్తూ, సంకుచిత వ్యాఖ్యానాలు చేయడం శాస్త్రజ్ఞానం లేకపోవడమే. నిజానికి గాయత్రీ జపం యథాతథంగా ఆచరించడానికి పాించవలసిన విధి, నిషేధాలు కఠినంగా ఉంాయి. కొన్ని నియమాలు ఉంాయి. అవి పాించని వాళ్ళకి మళ్ళీ జన్మలో ఉత్తమ సాధనా శరీరం లభ్యం కావడం దుర్లభం.
అందరూ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఏ జీవీ శాశ్వతంగా ఒకే వర్ణంలో మళ్ళీ మళ్ళీ పుడుతుందని చెప్పలేం. క్రింది జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో బ్రాహ్మణుడుగా ప్టుినప్పికీ, ఆ విధి, నిషేధాలు ఆచరించని, ''లోకాస్సమస్తాః సుఖినో భవంతు'' ''సర్వేజనాః సుఖినో భవంతు'' అని కాంక్షించే తన సాధనా బాధ్యతను నిర్వర్తించని జీవి, మళ్ళీ జన్మలో, ఎంతి అథమ జన్మ ఎత్తాల్సి వస్తుందో చెప్పలేం. అలాగే ఈ జన్మలో, ఈ కాలానికి తగినట్లుగా, భగవంతుడి నామజపం చిత్తశుద్ధితో చేసే ఏ వర్ణం వాళ్ళైనా అత్యధిక పుణ్యం సంపాదించవచ్చు. మళ్ళీ పుట్టుకలో ఉత్తమ జన్మ పొందవచ్చు.
గాయత్రీ మంత్ర ఫలాన్ని సంపూర్ణంగా ఇచ్చే, ఈ ''అందరికీ సంధ్యావందనం''ని చిత్తశుద్ధితో, క్రమం తప్పకుండా సాధన చేసే ఏ వర్ణం వారైనా, నిశ్చయంగా, విధి నిషేధాలు పాించని ద్విజులకంటే అధిక పుణ్యఫలాన్ని పొందుతారనీ, మోక్షసాధనలో ముందుకు వెళతానీ భాగవతం/శాస్త్రం స్పష్టంగా చెప్పాయి.

No comments: