అంగదేశమును రాజు మిత్రజిత్ అతని పుత్రుడు సత్యజిత్. తండ్రి తర్వాత అంగదేశమునకు రాజుగా ప్టాభిషిక్తుడయ్యెను. ప్రజలందరిని ధర్మముగా పాలించెడువాడు అతని ప్రారబ్ధకర్మము వలన అతనికి పాషండజనులతో సహవాసమేర్పడెను. సహవాస దోషము వలన అతడు అధర్మాచరణుడు అయ్యెను. వేథాస్త్ర పురాణములను నిందించుట మొదలుపెట్టెను. బ్రాహ్మణులయందు ద్వేషబుద్ధి వలన చాలా కాలమట్లే జీవించి మృతుడయ్యె. యమదూతలచే బంధింపబడి నరకమును జేరెను. చాలాకాలము నరక దుఃఖముననుభవించి పాపశేషమువలన పిశాచి జన్మము నొందెను. అచ్చటయు అతనికి ఆకలిదప్పులచే చిత్రహింస మొదలయ్యెను. చివరికి ఒక వైశ్యునియందు ప్రవేశించి మధురాపట్టణమును జేరెను. ఆ పుణ్యపట్టణములో ఉండలేక అతని దేహమునుంచి బయటకు వచ్చి మరల అడవులలో సంచరించు చుండెను. అప్పుడొక ఆశ్రమమందు ఋషులు చేయుచున్న విశేషపూజ చూచెడి యోగము వచ్చెను. ఆ రోజు కృష్ణాష్టమి దానిని చూచిన వెంటనే ప్రారబ్ధకర్మ అయిపోవుటవలన పిశాచి యోనిపోయెను. ఆ తర్వాత విష్ణులోకమును చేరెను. కారణం?
శ్రీకృష్ణాష్టమి వ్రతము చూసినందున లభించిన ఫలము. ఇంత విద్యుక్తముగా కృష్ణాష్టమి వ్రతము ఆచరించి వచ్చు ఫలమును యూహించుటకసాధ్యము.
ఇది స్వయముగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వినిపించిన కృష్ణాష్టమి వ్రతము యొక్క గొప్ప మహిమ.
No comments:
Post a Comment