అఖిలాండకోి బ్రహ్మాండనాయకి
'బెజవాడ - శ్రీ కనకదుర్గాదేవి'
ఇంద్రకీలాద్రి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. విజయవాికాపురి ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసిన శ్రీ కనకదుర్గాదేవి అఖిలాండకోి బ్రహ్మాండనాయకి అని పద్మ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, దేవీభాగవతం అద్భుతమైన తీరులో అభి వర్ణించాయి. పవిత్ర కృష్ణవేణీ నదీతీరాన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభువుగా వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం 'శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానం' మన రాష్ట్రంలోని అతి ముఖ్య దేవా లయాలలో ఇది ఒకి. కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుంటే చాలు జన్మజన్మలలో చేసిన పాపాలు పాపంచలవుతాయి. కోరిన కోరికలు తీరుతాయి.
పూర్వం రంభు, కరంభులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గురించి తపస్సుచేశారు. కరంభుడు నీిలోను, రంభుడు చెట్టుపైన తపస్సు చేశారు. అదిచూసి ఇంద్రుడు కోపం పట్టలేక, మొసలిరూపంలో వచ్చి కరంభుని తినివేయగా, రంభుడు తన తలని నరుక్కుని ఈశ్వరు నికి అర్పించాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకొమ్మనగా, మూడుజన్మల వరకు నువ్వే నా కొడుకుగా ప్టుాలని రంభుడు కోరుకున్నాడు. ఈశ్వరుడు తథాస్తని దీవించాడు. రంభుడు ఆనందంగా తిరిగివెళ్తుండగా, మార్గమధ్యంలో ఒక మహిషి కనిపిం చింది. ఆమెను మోహించాడు. అప్పుడు శివుడు తన అంశతో మహిషి గర్భంలో ప్రవేశించగా, ఆమెకు ప్టుినవాడే మహిషాసురుడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాక తన పినతండ్రికి జరిగింది తెలిసి ఉగ్రుడై, ఇంద్రుడి మీదకు దండెత్తి జయించి, ముల్లోకాలను గడగడలాడించాడు. కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి స్త్రీరూపం ధరించి మరీ బాధిస్తూ వుండటంతో ఆ మహర్షికి కోపం వచ్చి స్త్రీ చేతిలోనే హతమవుతావని శపించాడు.మహిషాసురుడి దురాగతాలు ఎక్కువైపోతుండటంతో ఆది పరాశక్తిని దేవతలు ప్రార్థించగా, ఆమె ఉగ్రచండీరూపమెత్తి మహిషాసురుని సంహరిస్తుంది. మరోజన్మలో రుద్రకాళిరూపంలో మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ మహాతల్లి దుష్టులపాలిట సింహస్వప్నం. ఈ అమ్మే సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, బాలా త్రిపురసుందరి, లలితా త్రిపురసుందరి, రాజరాజేశ్వరి, కుండలినీ మహాశక్తి.
శ్రీ మల్లేశ్వరస్వామివారు : ఇంద్ర కీలాద్రిపై బ్రహ్మాది దేవతలతో పూజలందుకునే అమ్మ శ్రీ కనక దుర్గగా కీర్తింపబడుతుంది. అలాం ిది ఆ పర్వతం పైన పరమేశ్వ రుణ్ణి కూడా కొలువుండేలా చేయా లనే సత్సంకల్పంతో బ్రహ్మదేవుడు నిష్ఠతో శతాశ్వమేథయాగాన్ని చేయగా అతని భక్తిశ్రద్ధలకు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో బ్రహ్మదేవునికి దర్శన మిచ్చాడు. ఇంద్రకీలాద్రిమీద దివ్యజ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన జా జూటధారి బ్రహ్మను అనుగ్రహించాడు. ఆ విధంగా బ్రహ్మచే ప్రథమంగా మల్లికా పుష్పాలతో అర్చించబడిన కారణంగా ఆ స్వామికి 'మల్లేశ్వరుడు' అనే పేరువచ్చింది. కాలక్రమంలో కలి ప్రభావంవల్ల జ్యోతిర్లింగం అంతర్హితమై ఉండాన్ని చూసిన శ్రీ ఆదిశంకరాచార్యులవారు శ్రీ కనకదుర్గాదేవికి ఉత్తరభాగంలో మల్లేశ్వరలింగాన్ని పునఃప్రతిష్ఠించారు.
ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రి పర్వత పాదభాగాన్ని తాకుతూ పరవళ్ళు తొక్కే కృష్ణవేణి చెంతగల ఈ పర్వతానికి ఈపేరు రావడానికి ఒక కారణం ఉంది. పూర్వం కీలుడు అనే యకక్షుడు ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి గూర్చి ఘోరతపస్సు చేయగా, తపస్సుకి మెచ్చిన అమ్మవారు వరం కోరుకోమనగా, ''అమ్మా! నీవు ఎల్లప్పుడూ నాపై నివసించి ఉండు'' అని కోరగా, ''నీవు పవిత్రమైన ఈ కృష్ణానది ఒడ్డున పర్వతరూపాన్ని ధరించు. కృతయుగంలో అసుర సంహారానంతరం నేను నీ పర్వతం మీద కొలువుాంను'' అని దుర్గాదేవి వరమిచ్చింది. అనంతరం కృతయుగంలో రాక్షసుడైన మహిషాసురుణ్ణి సంహరించాక ఆ దుర్గాదేవి కీలుడికిచ్చిన మాటప్రకారం మహిషాసురమర్దినీ స్వరూపంతో కీలాద్రిమీద ఆవిర్భవించగా. ఆ పర్వతంపైకి ఇంద్రాది దేవతలంతా ప్రతినిత్యం వచ్చి దేవికి పూజలు చేయసాగారు. ఆనాి నుంచి ఈ పర్వతానికి 'ఇంద్రకీలాద్రి' అనిపేరు వచ్చింది.
స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదిరోజు ఆశ్వయుజ శుద్ధపాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఒక పసిబాలుని మృతికి కారణమైన తన కుమారుడికి మాధవవర్మ అనే రాజు మరణశిక్ష విధిస్తాడు. ఆయన ధర్మబుద్ధికి మెచ్చి అమ్మ కనకవర్షం కురిపించింది. ఈ కారణంగా శరన్నవరాత్రుల తొలిరోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అలంకారంతో తీర్చిదిద్దుతారు.
శ్రీ బాలాత్రిపురసుందరీదేవి : బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, అతి ముఖ్యమైనది కూడా. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట ఈ బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో మొది అమ్నాయంలో ఉండే మొది దేవత ఈ బాలాదేవి.
శ్రీ గాయత్రీదేవి : సకలమంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యాదేవి.
శ్రీ అన్నపూర్ణాదేవి : అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువిం అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. నిత్యాన్నదానేశ్వరిగా, ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి మానవులకే గాక, జీవరాశులన్నికీ ఆహారాన్నందిస్తుంది.
శ్రీ లలితా త్రిపురసుందరీదేవి : త్రిమూర్తులకన్నా పూర్వంనుండి ఉన్నది కాబ్టి త్రిపురసుందరి అని పిలువబడుతుంది. ఈ దేవియే శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచ థాక్షరిగా, మహా మంత్రాధిదేవతగా తనని కొలిచే ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది.
శ్రీ సరస్వతీదేవి : మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోనే నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపజేయడమే మూలానక్షత్రం నాడు చేసే అలంకార ప్రత్యేకత. అమ్మవారి జన్మనక్షత్రంనాడు చేసే ఈ అలంకృతి భక్తజన ముక్తిదాయకం.
శ్రీ మహాలక్ష్మీదేవి : లోక స్థితి లయ కారిణిగా, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలకక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టి స్వరూపమైన అమృతస్వరూపిణిగా దుర్గమ్మను మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు.
శ్రీ దుర్గాదేవి : దుర్గతులను రూపు మాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అష్టమ తిథి రోజునే. అందుకే ఆ తల్లి 'దుర్గ' అని కీర్తించబడింది. అందువల్ల ఈ అష్టమిని 'దుర్గాష్టమి' అని అంారు.
శ్రీ మహిషాసురమర్దిని : చండీ సప్తశతిలో దుర్గాదేవి అష్ట భుజాలతో, దుష్ట రాక్షసుడైన మహిషాసురుని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైంది. అమ్మవారు సింహాసనంపై ఆసీనురాలై ఉగ్రరూపంతో పసుపుపట్టుచీర కట్టుకొని పాశాంకుశాలు ధరించి, ఒక చేతిలో త్రిశూలం కలిగి ఉంటుంది.
శ్రీ రాజరాజేశ్వరీదేవి : రాజరాజేశ్వరీదేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. చేతిలో చెరకుగడ ఉంటుంది. భక్తులకు అభయం ఇస్తూ కనిపిస్తుంది. ఈ దేవిని అపరాజితా దేవిగా పిలుస్తారు. విజయాదేవి చెడుపై సాధించిన విజయమే 'విజయథమి' పర్వదినం అయింది.
No comments:
Post a Comment