Tuesday, August 30, 2016

శుచిప్రకరణము

శుచి-పరిచయము
శుచి రెండువిధములు 1.శారీరశుచి 2.మానసికశుచి
శారీరశుచి మళ్ళీ రెండురకములు. 1.బాహ్యము మరియు 2. శరీరాంతర్గతము.
రుద్రభూముల (శ్మశానవాటికల) పరిసర పర్యటనము, మలమూత్రాది విసర్జనము, జాతానౌచము, మృతాశౌచము, రజస్వలాశౌచము, మొదలగు అశుచులలో నుండి, లేదా అట్లున్నవారి తాకిడి, శునక-గార్దభాదుల తాకుట వలన కలిగిన ఆశౌచాదులనుండి శుచియగుట శారీరికశుచి.
దుష్టములైన జల-వాయు-అన్న-శాకగ్రహణములవలన గలిగిన ఆశౌచమునుండి శుచియు గుట అంతఃశుచి యనబెడుతుంది. (వైరస్, బ్యాక్టీరియా, కీటకాలు మొదలైన జీవుల లక్షణాలను తెలసినవారు ఈ మ్శుచియునుదానిని ఒప్పకుంటారు)
స్నానాదులతో శారీరిక బాహ్యశుచి యేర్పడుతుంది. ఆచమన, జప, ప్రాణాయామ, పంచగవ్యప్రాశన, సాతి కాహార సేవన, కృత్రచాంద్రాయ ణాది ప్రాయశ్చిత్త, అష్టాంగయోగ, శాస్త్రియప్రవర్తన, దైవధ్యానములతో శరీరాంతరత శుచి కలుగుతుంది.
వ్రత నియమములందు శుచి వ్రతనియమములందు ఉన్నపుడు అనగా జ్ఞానార్డనము, ధ్యానము, దానము, హోమము, జపములనబడు వ్రతములను చేయుస్తీలు పురుషు లును కాటుక, గోరోజనము, గంధము, పూలు వీటిని ధరించరాదు.
కన్నీరు కార్చడం, కోపించడం, కలహించడం, చేయరాదు. దీర్ఘకాలిక వ్రతనియమ ములను చేపట్టియున్నపుడు మధ్యలో జాతాశాచ మృతాశాచాదులు טס..) డినను వ్రతానికి ఆటంకమును కలిగించవు. ధ్యానారచనలను నూని వ్రత
నిత్యార|్చకదోష ప్రాయశి|్చత్తములు (పాద్మము- జయాఖ్యము-మదనపారిజాతములయందు)
సర్వేశ్వరుడగు పుండరీకాక్షుని తలంచిచుండువాడు సర్వదా శుచియైన వాడు. దాఫ్లిక్లో మంత్రానుష్టానపరులు, కోరికలు లేనివారు కనుక వారికి శవస్పర్శ షము, సూతకముల దోషము లేవు. శివవిష్ణువులను ఎల్లపుడు అర్చించు వారికి అశుచియుండదు.
ఈనియమము శివదీక్షాపరులలో పాటింపు బడుచున్నదో లేదో తెలుయదు. కాని వైష్ణవులు మాత్రము అశుచిని తప్పక పాటించుచున్నారు. అమేధ్యకేశలో మాదిస్పర్శే అప ఉపస్పృశేత్. అని గృహ్యధర్మముల యందు చెప్పబడినట్లు శరీరములనుండి వేరైన గోళుృ, వెంట్రుకలు, రోమములు, రక్తము, ఎముకలు, మలమూత్రాదులయొక్క స్పర్శ జరిగినచో తగినట్లుగా జలములను తాకి శుచి చేసికొనవలయును. అనగా - గోళుo వెంట్రుకలు, రోమములు రక్తములను తాకిన చేతులను కడుగుకొనవలయును. ఎముకలు మలమూత్రాదులను తాకిన స్నానమును చేయవలయును.
గోమూత్రానికి మాత్రం దోషం లేదు. కుక్క, గాడిద, కాకి, పంది, వేదమును అమ్ముకొనువాడు, ఛండాలుడు, మద్యమును సేవించినవాడు, సత్యము అహింస మున్నగు ఆత్మగుణములు ప్రాణులు, మున్నగువాటిని తాకినచో స్నానమును చేయవలయును. ఉమ్మి తుమ్ము ఆవలింతలు తనకు కలిగినపుడు నీటితో మూడుసార్లు ఆచమనమును చేయ వలయును లేదా తన కుడిచేతితో తన కుడిచెవిని తాకవలయును. కప్ప, ఎలుక, పిల్లి, పాములచే తాకబడిన, మరియు మిడత, ఈగ, మొదలగునవి పడిన పాలు, ఆహారములను భగవనివేదన చేయరాదు. ఎవరికిని పెట్టరాదు, తాను లివరాదు. ప్రాణిపడి మరణించిన బావిలోని నీటిని పూర్తిగా తోడివేసి పుణ్యాహవాచనము చేసిన తరువాత వాడుకొనవలయును.
మనము వాడుకొనదగినంత యోగ్య మైన తైలమునే లేదా నేయినే దైవదీపమునకు వాడవలయును. విధితో ప్రతిష్టచేయని, పరికిణీలు లేదా వస్త్రములు ధరింపజేయబడని, కారణాంతరమున ఒకరోజైనా పూజపడిపోయిన, పిల్లలు స్త్రీలు-శూద్రులు తాకిన, చేజారి కిందబడిన, అవయవ లోపము మేర్పడిన విగ్రహమును పూజించరాదు.
ఆలయవిథి కలసియున్నంత వరకు ఏయింటియందైన మరణము సంభవించినచో శవమున్నంతవరకు ఆలయమును తెరవరాదు. బ్రాహ్మణులున్న వాడయైనచో లేదా నగర మైనచో గ్రామాశాచముండదు. గ్రహణమున నిత్య పూజలకు 48 నిమిషములు ఉత్సవాదులకు 96 నిమిషములు ముందు వెనకల వదలి దేవాలయ పూజల చేసికొనవలయును.

జయ జయ హనుమాన్


శత్రు భయంకరుడు హనుమానుడు


శత్రునాశన హనుమాన్స్తోత్రమ్


పంచవక్తం మహాభీమంత్రిపంచ
నయ నైర్యుతమ్ దశభిర్ణాహుభిర్యక్తం
సర్వకామార్థసిద్దదమ్
పూర్వేతు వానరంవక్తం
హృదయం సూర్య సన్నిభమ్
సూర్యకోటి కరాభాసం
కపివక్తం సు తేజసమ్
దంప్తాకరాళ వదనం భృకుటీ
కుటిలేక్షణమ్ అస్యప్రదక్షిణం
వక్తృం నారసింహం మహాద్దుతమ్
అత్యుగ్రతేజోజ్జ్వలితం భీషణం
భయనాశనమ్ పశ్చిమంగారుడం
వక్తం వజ్రతుండం మహాబలమ్
సర్వరోగ ప్రశమనం విష భూత
నివారణమ్ ఉత్తరం సూకరం
వక్తం కృష్ణదీప్తం నభోనిభమ్
సిద్ధిదం నృణాం జ్వర
కృంతనమ్ ఊర్ద్వం హయాననం
ఫటోరం దానవాంతరకంపరమ్
యేన వక్షేణ విపేంద్ర సర్వవిద్యా
వినిర్యయః ఏతత్పంచముఖం
తస్య ధ్యాయతా మభయంకరమ్
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం
పాశమంకుశ పర్వతాయ೦.
కౌమోదకీ మండం దధానం
హాలా ముత్కట೦ ద్వౌమష్టి
సంగతెూ మూర్ణ్ని సాయుదైర్థశభిరుజై 

ఏతాన్యాయుధజాలాని ధారయంతం యజామహే

సర్వవేదాంతవేద్యాయ పూర్ణాయ పరమాత్మనే


సచ్చి దానంద రూపాయ భవిష్యద్ధహ్మణే నమః
ఆంజనేయ మతి పాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాత తరుమూల వాసినం
భాపయామి పవమాననందనమే
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రకృతమస్తకాంజలిమ్
బాష్పవారిపరిపూర్ణలోచనమ్
మారుతిమ్ నమత రాక్షసాంతకమ్

మారుతి స్త్రోత్రం



ఓం నమోభగవతే విచిత్ర వీరహనుమతే ప్రళయ కాలానల ప్రజ్వల నాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్ధ సంభూతాయ ప్రకటవిక్రమ వీరధైత్యదానవయక్షరక్షోగణగ్రహబంధనాయభూత గ్రహబంధనాయ ప్రేత గ్రహబంధనాయు పిశాచ గ్రహబంధనాయ శాకినీ ధాకినీ గ్రహబంధనాయకాకినీకామినీగ్రహబంధనాయబ్రహ్మగ్రహబంధనాయ బ్రహ్మరాక్షస గ్రహబంధ నాయు చోరగ్రహబంధ నాయు మారీ గ్రహబంధనాయు పహి ఏహి ఆగచ ఆగచ ఆవేశయు ఆవేశయు మమహృదయే ప్రవేశయ ప్రవేశయ స్పురస్పర ప్రస్పురప్రస్పుర సత్యం కథయ వ్యాప్రముఖబంధన, సర్పముఖబంధన, రాజముఖబంధన, నారీముఖబంధన, సభాముఖబంధన, శత్రుముఖబంధన, సర్వముఖబంధన, లంకాప్రాసాద భంజన అముకంమే వశమానయ క్షీం క్షీం క్షీం ప్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీం ప్రీం క్షీం స్త్రీణాం ఆకర్షయ ఆకర్షయ శత్రూనర్ణయమర్ణయమారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే, ఖే శ్రీరామచంద్రాజ్ఞయా మమకార్య సిద్ధిం కురు కురు ఓం హ్రంట్రాం హ్రూం హైం ప్రశాం హ్రఃఫట్ స్వాహా విచిత్ర వీరహనుమాన్ మమ సర్వశత్రూన్ భస్మ కురు కురు హనహన హం ఫట్ స్వాహా, (గురూపదేశం లేకుండా పఠించకూడదు)

పంచముఖ హనుమద్ అష్టోత్తర శతనామ స్త్రోత్రం


శృణు మైత్రేయః మంత్రజ్ఞః అషోత్తరశతసంజ్ఞకః
నామ్నా హనుమతత్మైవ స్తోత్బణాం శోకనాశనమ్
పూర్వం శివేన పార్వత్యా కధితం పాపనాశనం
గోపా దోప్యతరం చైవ సర్వేప్పిత ఫలప్రదమ్
ఋషి సదాశివః ప్రోకో ఛందో నుపు బుదాహృతః
హనూమన్ దేవతాప్రోక్లో హ్రం బీజమితి చ స్మృతః
ప్రీం శక్తిరూం కీలకంచ ప్రసాదే చవినియోగః
వందేవాయతనూభవంసుచరితం వందే
జగద్రూపిణం వందే వజ్రతనుం సురారిదళనం
వందేదయాసాగరం వందే పంచముఖం
సుకుండలధరం వందేకపీనాం పతిం వందే
సూర్యసుతాసఖం ప్రియఫలం వందే హనూమత్రభుం
హనూమాన్ స్థిరకీర్తిశ్ర తృణీకృత జగత్తయ
సురపూజ్య స్ఫురశ్రేషాళ్ల సర్వాధీశ సుఖప్రదః
జ్ఞానప్రదో జ్ఞానగమ్యో విజ్ఞానీ విశ్వ వందితః
వజ్రదేహో రుద్రమూర్తీ దద్ద లంకావరప్రద
ఇంద్రజిద్ధయకర్తా చరావణస్యభయంకరః
కుంభకర్ణస్యభయదోరమాదాసో కపీశ్వరః
లక్షణానందకరో దేవో కపిసైన్యస్య రక్షకః
సుగ్రీవ సచివో మంత్రీపర్వతోత్పాటనో ప్రభుః
ఆజన్మబ్రహ్యచాలీ చ గంభీరధ్వని భీతిదః
సర్వేశః జ్వరహాలీ చ గ్రహకూట వినాశకః
ధాకినీ ధ్వంసక స్సర్వభూతప్రేత విదారణ
విషహరాచ నిత్య స్సర్వ లోకనాథః
భగవాన్కుండలీదండీస్వర్ణయజ్జోపవీతధృత్
అగ్నిగర్ధస్వర్ణకాంతిః ద్విభుజస్తు కృతాంజలి
బ్రహ్మాస్త్రవారణ శ్శాంతో బ్రహ్మడ్యోబ్రహ్మరూపధృత్
శత్రుహనా కార్యదక్షో లలాటాక్లో పరేశ్వరః
లంకోద్దీపో మహాకాయఃరణశూరో మితప్రభః
వాయువేగీ మనోవేగీ గరుడస్యనమోజవే
మహాత్మా విష్ణుభక్తళ్ల భక్తాభీష్టఫలప్రదః
సంజీవినీ సమాహరా సచిదానంద విగ్రహః
త్రిమూర్తీ పుండరీకాక్లో విశ్వజిద్విశ్వభావనః
విశ్వహరా విశ్వకర్తా భవ దుఃఖైక భేషజ
వహ్ని తేజో మహాశాంతో చంద్రస్య సదృశో భవః
సేతుకర్తా కార్యదక్షోభక్తపోషణ తత్పరః
మహయోగీ మహాదైర్యో మహాబలపరాక్రమః
అక్షహంతా రాక్షసఘ్నాధూమ్రాక్షవధకృన్మునే
గ్రస్తసూర్యోశాస్త్రవేత్తా వాయుపుత్రః ప్రతాపవాన్
తపస్వీధర్మనిరతో కాలనేమి వధోద్యమః

Monday, August 29, 2016

హనుమాన్ చాలీసా


అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యమ్ సకలగుణనిధానం వానరాణా మధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి

గోష్పదీకృత వారాశింమశకీకృత రాక్షసమ్ 

రామాయణమహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ 
యత్రయత్ర రఘునాథ కీర్తనమ్ తత్ర తత్రకృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్ మారుతిం నమతరాక్షసాంతకమ్

శ్రీ గురుచరణసరోజరజ, నిజమన ముకుర సుధారి 

వరణా రఘువర విమల యశ, జోదాయక ఫలచారి 
బుద్ధిహీనతను జానికే, సుమిరౌఁపవన కుమార్ 
బల బుద్ధి విద్యా దేహు మోహి, హరహుకలేశ వికార్

జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశ తిహులోక ఉజాగర
రామదూత అతులిత బలధామా అంజని పుత్ర పవన సుత నామా

మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతికే సంగీ
కంచన వరణ విరాజ సువేశా కానన కుండల కుంచితకేశా
హాథ వజ్ర ఔధ్వజావిరాజై మూంజ జనేవూ
శంకర సువన కేసరీ నందన తేజప్రతాప మహాజగ వందన
 

విద్యావానగుణీ అతిచాతుర రామకాజ కలివేకో 
ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతా 
మన బసియా సూక్ష్మరూపధరి సియహిదిఖావా 
వికటరూపధరి లంకజరావా
భీమరూపధరి అసురసంహారే రామచంద్రకే కాజసంవారే
లాయ సజీవన లఖన జియారయే శ్రీరఘువీర హరపి ఉరలాయే
రఘుపతి కీనీ బహుత బడాయీ తుమ మమ 


ప్రియ భరతహి సమభాయిూ సహసవదన తుపురో 
యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై
సనకాదిక బ్రహ్మాదిమునీశా నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిగపాల జహాతే కవికోవిద కహి సకై కహాతే 

తుమ ఉపకార సుగ్రీవహికీన్హా రామ మిలాయ రాజపద దీనా 

తుమూరో మంత్ర విభీషణమానా లంకేశ్వర భయే సబ 
జగజానా యుగ సహస్రయోజన పరభానూ లీల్యో తాహి 
మధుర ఫలజానూ ప్రభుముద్రికా మేలిముఖ మాహీ 
జలధి లాంఘిగయే అచరజనాహీ దుర్గమ కాజ జగత
 సుగమ అనుగ్రహ తుమురేతేతే హాత ఆజ్ఞాబిను సబ 
సుఖలహై తుమూర్రీ శరణా తుమ రక్షక కాహూకో డరనా


ఆపనతేజసమారో ఆపై తీనో లోక హాంకతేకాంపై 

భూతపిశాచ నికట నహిఆవై మహావీర జబనామ 
సునావై నాశైరోగ హరై సబపీరా జపత నిరంతర 
హనుమత వీరా సంకటసే హనుమాన ఛుడావై 
మన క్రమ వచన  ధ్యాన జో లావై సబపర రామ 
తపస్వీరాజా తినకే కాజ సకల తుమ సాజా
ఔర మనోరథ జో కోయి లావై సాయి అమిత జీవన ఫల పావై
చారోఁయుగ పరతాప తుమ్లారా పరసిద్ధ జగత ఉజియారా
సాధు సంతకేతుమ రఖవారే అసుర నికందన రామదులారే
అష్టసిద్ధి నవ నిధి కేదాతా అసవర దీన్ల జానకీ మాతా
రామ రసాయన తువురే సదా రహో రఘుపతికే దాసా
తుపురే భజన రామకో పావై జన్మజన్మకేదుఃఖబిసరావై
అంతకాల రఘుపతి పుర జాయిరా  జహా జన్మ హరిభక్త 

కహాయణ ఔర దేవతా చిత్తన ధరయీ హనుమత సేయి 
సర్వసుఖ కరయీ సంకట హటై మిటై సబపీరా సుమిరై 
హనుమత బలవీరా హనుమాన్ గోసాయివా  కృపాకరో 
గురుదేవకీ నాయిూ యహశతవార పాఠకర జోయీ 
ఛూటహి బంది మహాసుఖహోయీ జోయహ పడై 
హనుమాన్ చాలీసా ! హోయ సిద్ధి సాఖీ గౌరీసా
తులసీదాస సదా హరి చేరా ! కీజై నాథ హృదయ మహడేరా !
పవన తనయ సంకటపరిరణ మంగళమూరతి రూప్ రామ లఖన సీతాసహిత హృదయ బసహుసురభూప్.

వజ్ర మర్కట స్త్రోత్రం


ఓం నమో వాయుపుత్రాయ 
భీమరూపాయ ధీమతే నమస్తే 
రామదూతాయకామరూపాయ శ్రీమతే
మోహశోకవినాశాయ సీతాకోక వినాశినే 
భగ్నాశోకవనాయాస్తు దగ్గలంకాయ వాగ్మినే
గతినిర్ధితవాతాయ లక్ష్మణప్రాణదాయ 
చ వనౌకసాం వరిషాయ వశినేవననాసినే
తత్త్వజ్ఞానసుధాసింధు నిమగ్నాయ 
మహీయసే ఆంజనేయాయ శూరాయ
సుగ్రీవ సచివాయతే
జన్మమృత్యుభయఘ్నాయ 
సర్వక్షేశహరాయచ నేదిషాయ 
ప్రేతభూతపిశాచభయహరిణే
యాతనానాశయాస్తు నమో 
మర్కటరూపిణే యక్షరాక్షసశారూలసర్పవృశిక భీహ్భతే
మహాబలాయ వీరాయ చిరంజీవిన 
ఉద్దతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినామగ్రగణ్యాయ నమో నః పాహి 
మారుతే లాభదోసి త్వమే వాశు హనుమాన్ రాక్షసాస్త్రక
యశోజయంచమే దేహి శతృన్ నాశయనాశయ
స్వాశ్రీతానామభయదం య ఏవస్తాతి 
మారుతిమ్ హానిః కుతో భవేత్తస్య 
సర్వత్ర  విజయీ  భవేత్
 
 

ఆపదుద్ధారక స్త్రోత్రం


వామే కరే వైరిభిదాం వహంతం శైలం పరేశృంఖల హారిటంకమ్, దధానమచచవియజ్ఞసూత్రం భజేజ్వలత్కుండలమాంజనేయమ్
సంవీతకౌపీనముదంచితాంగుళం సమజ్జ్వలనౌంజిమధోపవీతినమ్, సకుండలం లంబిశిఖా సమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే
ఆపన్నాఖిలలోకార్తిహారినే శ్రీహనూమతే 

అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోనయః
సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖ భయాపహ

తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోస్తుతే
మారి గ్రహపీడా పహారిణే, దైత్యానాం రామప్రాణాత్మనే నమః
ఆధివ్యాధిమ సంసారసాగరావర్త కర్తవ్యభ్రాంతచేతసామ్

శరణ్యాయ నమోస్తుతే లాగ్నిరుద్రాయామిత తేజసే
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీ రుద్రమూర్తయే. 
శామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయాపహమ్
శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకమ్. 
కారాగృహే ప్రయాణేవా సంగ్రామే శత్రుసంకటే
జలేస్టలేతధాకాశేవాహనేషు చతుష్పథే.
గజసింహమహావ్యాప్తుచోర భీషణకాననే, యే స్మరంతి 

హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్
సర్వవానర ముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః

శరణ్యాయపరేణ్యాయ వాయు పుత్రాయతేనమః
ప్రదోషేవా ప్రభాతేవా స్మరంత్యంజనాసుతమ్
అక్టసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతిన సంశయంః
జఫ్గ్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పరేన్నరః 
రాజస్థానే సభాస్థానే ప్రాస్తే వాదేలభేజ్ఞయమ్. 
భీషణకృతం స్తోత్రం యః పరేత్ ప్రయతో 
నరః రాజపద్ద్య విముచ్యతే నాత్రకార్యావిచారణా

కపిరాజస్తోత్రమ్


హనుమనూర్తయే తస్మై నరనారాయణాత్మనే అంజనాగర్ధ సంభుత్యైరక్షసాం వధహేతవే పంపాతీర నివాసాయ మారుతాయ నమోనమః
కపివరేశ్వరం కామితార్థదంత్రిపుర హాత్మజం దీన పోషకమ్ విపుల వక్షసం విమలచేతసం కామితార్ణదం కమల లోచనమ్
పవన నందనం పావక ప్రభం భవవిదారణం భాగ్యకారణమ్ ప్లవగ నాయకైర్గావితోద్యమం నవ కవిత్వవాజ్నాయకంభజే
జలిగ్రహీతాతదైవతం మంజుభాషితైర్యానవోత్తమమ్ రాజయన్ సదారామభూపతిం అంజనా యశఃపుంజమాశ్రయే
సుందరాననం సూర్య తేజసం నందినాథవ నందితాఖిలమ్ మందరాద్రివద్దంధురాకృతిం వందితం భజే వానరోత్తమైః

హనుమత్ భుజంగ ప్రయత స్త్రోత్రం



ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం 
జగద్ధితి శౌర్యం తుషారాద్రిదైర్యమ్, 
తృణీభూతహేతిం రజోద్యద్విభూతిం 
భజే వాయుపత్రం పవిత్రాప్తమిత్రమ్

భజే పావనం భావనానిత్యవాసం 
భజేబాలభాను ప్రభాచారుభాసమ్, 
భజేచంద్రికాకుంద మందార హాసం 
భజే సంతతం రామభూపాల దాసమ్.

భజే లక్ష్మణప్రాణరక్షాతి దక్షం 
భజేతోషితానేక గీర్వాణపక్షమ్,
భజేఘోర సంగ్రామ సీమాహతాక్షం 
భజేరామనామాతి సంప్రాప్తరక్షమ్

కృతాభీలనాదం క్షితిక్షిప్తపాదం 
ఘనక్రాంతభృంగం కటిస్టోరుజంఘమ్, 
వియద్వ్యాప్తకేశం భుజాళ్లేషితాశం 
జయశ్రీ సమేతం భజే రామదూతమ్.

చలద్వాలఘాతం భ్రమచక్రవాళం 
కరోరాట్టహాసం ప్రభినాబ్దకాండమ్, 
మహాసింహనాదా ద్విశీర్ణత్రిలోకం 
భజేఆంజనేయం ప్రభుం వజ్రకాయమ్

మహావీర శక్తి పంజర స్త్రోత్రం


సుగ్రీవ సచివః పాతు మస్తకం మమ సర్వదా 

వాయునందనః ఫాలం మే మహావీరః భ్రూమధ్యమమ్
నేత్రఛాయాపహారీచ పాతు త్రోత్రేప్లవంగమః
కపోలౌకర్ణమూలేచ పాతు శ్రీరామకింకరః
నాసాగ్రమంజినాసూనుః పాతు వక్తృహరీశ్వర 

పాతు కంఠం చ దైత్యారిః స్కంధౌ పాతు సురార్జితః
జానౌ పాతు మహాతేజః కూర్బరౌ చరణాయుధః 

నఖాన్ నఖాయుధః పాతు కక్షం పాతు కపీశ్వరః
సీతాకోకాపహారీ తు స్తనౌ పాతు నిరంతరం 

లక్ష్మణ ప్రాణదాతా అసః కుక్షింపా త్వనిశం మమ
వకై ముద్రావహారీచ పాతు పార్వే భుజాయుధః 

లంభిణీ భంజనః పాతు పృష్ఠదేశే నిరంతరమ్
నాభిం చ రామదాసస్తు కటిం పాత్వనిలాత్మజః 

గుహ్యం పాతు మహాప్రాజ్ఞసనె పాతు శివప్రియః 
ఊరూ చ జానునీ పాతు లంకాప్రాసాద భంజనః 
జంఘాపాతు కపి శ్రేష్ఠఃగుల్ఫౌ పాతు మహాబలః
అచలోద్గారకః పాతు పాదౌ భాస్కర సన్నిభః 

న్యమిత సత్వాడ్యః పాతు పాదాంగుళి స్సదా

సంజీవ హనుమాన్ స్త్రోత్రం

సంజీవ పర్వతోద్దార

మనోదుఃఖం నివారయ ప్రసీద 

సుమహాబాహోత్రాయస్వహరిసత్తమ
హనుమన్నితి మే స్నానం హనుమన్నితి మే జపః
హనుమన్నితి మే ధ్యానం హనుమత్కీర్తనం
సదా రామాధీనాం రణీఖ్యాతిం దాతుం యో 
రావణాదికాన్ నావధీత్వయమే వైకస్తం
వందే హనుమత్రృభుమ్
బుద్దిర్జలం యశోదైర్యం నిర్ణయత్వ 
మరోగతా అజాద్యం వాక్పటుత్వం 
చ హనుమత్స్మరణాద్ధవేత్
అంజనా వరపుత్రాయ రామేషాయ
హనూమతే సర్వలోకైక వీరాయ 
భవిష్య ద్ధహ్మణే నమః
కరుణారస పూర్ణాయ జగదానందహేతవే 
కుక్షిస్థాఖిల లోకాయ హనూమద్ధహ్మణే నమః
సప్తషష్టిరత్రాన్ కోటి వానరాణాంతరస్వినాం
యస్సంజీవనయామాస తం 

వందే మారుతాత్మజమ్
రసనే రససారజ్ఞమధురాస్వాద కాంక్షిణి

హనుమన్నామ పీయూషం సర్వదా 
రసనే పిబ సువర్ణ శైలస్య గవాం చ కోటి 
సతస్య కోటేశ శతస్య యచ్ల దానస్యనై 
వాస్తి సమం ఫలం చ ధృవం చ తన్మారుతి దర్శనేన

హనుమత్ సూక్తమ్




శ్రీమాన్సర్వలక్షణ సంపన్నో జయప్రదః 
సర్వాభరణ భూషిత ఉదారో మహోన్నత ఉప్రారూఢః
కేసరీ ప్రియనందనో వాయుతనూజో యథేచ్చం పంపాతీర
విహారీ గంధమాదన సంచారీ హేము ప్రాకారాంచిత కనక
కదళీ వనాంతర నివాసీ పరమాత్మా మకరీ శాపవిమోచనో,
హేమవర్లో నానారత్నఖచితా మమూల్యం మేఖలాంచ
స్వర్లోపవీతం కౌశేయవస్త్రం చ బిబ్రాణం సనాతనో
మహాబలాప్రమేయ ప్రతాపశాలీ రజతవర్ణః
శుద్ధ స్ఫటిక సంకాశః పంచవదనః
పంకజదళనేత్రస్సకలదివ్యాస్త్రధారీశ్రీసువర్షలారమశో
మహేంద్రాద్యష్ట దిక్పాలకత్రయ స్త్రింశద్దీర్వాణ
మునిగణ గంధర్వ యక్ష కిన్నెర పన్నగాసుర
పూజిత పాదపద్యయుగళ నానావర్ణః
కామరూపః కామచారీ యోగిధ్యేయః
శ్రీహనుమాన్ ఆంజనేయః విరాడ్రూపీ
విశాత్మాపవన నందనః పార్వతీపుత్రః
ఈశ్వర తనూజః సకల మనోరధాన్నోదదాతు.

వానర రక్షా స్త్రోత్రం

 వానరః పూర్వతః పాతు దక్షిణే నరకేసరిః

ప్రతీచ్యాం పాతు గరుడః
ఉత్తరే పాతు సూకరః
ఊర్ధ్వం హయాననః
పాతు సర్వతః పాతు మృత్యుహా
వానరః పూర్వతః పాతు
ఆగ్నేయ్యాం వాయునందన
దక్షిణే పాతు హనుమాన్ నిరృతే కేసరీ ప్రియః
ప్రతీచ్యాం పాతు దైత్యారిః
వాయవ్యాం పాతు మంగళః
ఉత్తరేరామదాసస్తు నిమ్నయుద్ద విశారదః
ఊర్డ్వే రామసఖః
పాతు పాతాళేచ కపీశ్వరః
సర్వతః పాతు పంచాస్యః
సర్వరోగ వికృంతనః
హనూమాన్ పూర్వతః
పాతు దక్షిణే పవనాత్మజః 
పాతు ప్రతీచి మక్షఘ్నా ఉదీచ్యాం సాగరతారకః
ఊర్ద్వం కేసలీనందనః పాత్వధస్తాద్విష్ణు భక్తః 
పాతు మధ్యప్రదేశే తు
సర్వలంకా విదాహకః
ఏవం సర్వతో మాం పాతు
పంచవక్తః సదా కపిః

కార్యసాధక హనుమాన్ స్త్రోత్రం



ఓం నమో వాయుపుత్రాయ పంచవక్రాయ తేనమః

నమోస్తుదీర్ఘవాలాయ రాక్షసాంతకరాయ చ
వజ్రదేహ నమస్తుభ్యం శతానన మదాపహ
తా సంతోషకరణ  నమో రాఘవకింకర
సృష్టి ప్రవర్తక నమో మహాస్తిత నమోనమః
కాష్ఠ స్వరూపాయ మూస సంవత్సరాత్మక
నమస్తే బ్రహ్మారూపాయ శివరూపాయతేనమః
నమో విష్ణుస్వరూపాయ సూర్యరూపాయతేనమః
పాయ నమో గగనచారిణే
స్వర రంభావన చర
అశోకవన నాశక
నమో కైలాసనిలయ
మలయాచల సంశ్రయ
నమో రావణనాశాయ ఇంద్రజిధ్వధకారిణే
మహాదేవాత్మక నమో నమో వాయు తనూభవ
నమసుగ్రీవసచివ
సీతా సంతోషకారణ
సముద్రోల్లంఘన నమో సౌమిత్రేః ప్రాణదాయక
మహావీర! నమస్తుభ్యం దీర్ఘబాహో
నమో నమః దీర్ఘవాల
నమస్తుభ్యం వజ్రదేహ
నమోనమః  ఛాయాగ్రహ హర
నమో వర సౌమ్యముఖేక్షణ
సర్వదేవ సుసంసేవ్యమునిసంఘ నమస్కృత
అర్జునధ్వజ సంవాస! కృష్ణార్జున సుపూజిత
ధర్మార్థకామ మోక్ష్యాఖ్య పురుషార్థ ప్రవర్తక
బ్రహ్మాస్త్రవంద్య భగవన్ ఆహతాసురనాయక
భక్త కల్పమహాభూజ
భూత భేతాళ నాశక
దుష్టగ్రహ హరానంత
వాసుదేవ నమోస్తుతే శ్రీరామ కార్యే చతుర
పార్వతీ గర్ధ సంభవ
నమః పంపావన చర
ఋష్యమూక కృతాలయ
ధాన్యమాలీ శాపహర
కాలనేమి నిబర్టణ
సువర్టలా ప్రాణనాథ
రామచంద్రపరాయణ
నమో వర్గస్వరూపాయ
వర్ణనీయ గుణోదయ
వరిష్ణాయ నమస్తుభ్యం వేదరూప
నమోనమః నమస్తుభ్యం నమస్తుభ్యం
భూయో భూయో నమామ్యహమ్

మహా బలశాలి ఆంజనేయుడు


ఆంజనేయుడు గొప్ప రామ భక్తుడు. అలాగే అయన భక్తులకు ఎప్పటికీ లోటు లేదు.

ఎటువంటి  ఆటంకాలనైనా క్షణంలో తొలగించ గల మహా యోధుడు రామబంటు.

అన్ని రకాల దుష్ట శక్తులకు  ఆంజనేయుడు  సింహస్వప్నం.
అలాంటి శక్తులు ఎక్కడికి పారిపోయినా  అవన్నీ ఆంజనేయుని బుజాల నుండి తప్పించుకోలేవు.
ధర్మమార్గం తప్పి దురహంకారంతో విర్రవీగే  దుర్మార్గుల్ని తుదముట్టించి అణగద్రోక్కే గొప్ప తనం ప్రసన్నాంజనేయునికే  ఉంది.
వాతావరణ కాలుష్యాన్ని, రకరకాల శనిపీడల్ని అతి తేలికగా తొలగించే సత్తా కేవలం హనుమన్మంత్ర శక్తికే  ఉంది. అతని అనుగ్రహాన్ని సాధించ గలిగితే శత్రుభయం అనేదే ఉండదు.
ఇతరత్రా భయాలు పరిసరాలలో సంచరించవు
ఆయనతో కూడితే మనకు మంత్రబలంతో, మహాబలంతో - నిశ్చల భక్తితో, నిస్వార్ధ సేవతో ప్రపంచాన్ని జయించగలిగే సంకల్పం లభిస్తుంది.
హనుమంతుణ్ణి సేవిస్తే మనకు పాపభయం, రోగ భయం, ఋణ భయం, ద్వైత భయాలుండవు.
ఆంజనేయుని ఎవరు సేవిస్తారో వారికి జీవితంలో ఏలోటూ కానరాదు.

Friday, August 26, 2016

హిందూ దేవాలయము - ఆరోగ్య మరియు విద్య మార్గదర్శకములు

హిందూ దేవాలయముల ద్వారా సామాన్యమానవుల కొరకు 
చేయవలసిన ఆరోగ్య మరియు విద్యకు సంబంధించిన మార్గదర్శకములు 

1. వేదపాఠశాలను ఏర్పాటు చేయుట.
2. సంస్క ృత కళాశాలను ఏర్పాటు చేయుట.
3. సూర్యనమస్కారములను చేయుటలో తర్ఫీదు ఇచ్చుట.
4. ఉచిత వైద్యశాలలను ఏర్పరచి వారంలో ఒకరోజు వైద్యులచేత ఉచితవైద్యసేవలను ఇప్పించుట.
5. యోగాకు సంబంధించిన తరగతులను నిర్వహించుట.
6. ఆధ్యాత్మిక మరియు పౌరాణిక సదస్సులను నిర్వహించుట.
7. ఆధ్యాత్మిక మరియు పౌరాణిక విషయములను పిల్లలకు తెలియపరచి, పోీలను నిర్వహించి బహుమతులను పంచుట.
8. వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించుట.
9. పిల్లలకు వక్త ృత్వ మరియు వ్యాసరచన పోీలను నిర్వహించుట.
10. వేసవికాల శిబిరములను నిర్వహించి పిల్లలకు నీతిశతకములను బోధించి వల్లె వేయించుట. పోీలను నిర్వహించుట.
11. దేవతా వృక్షములకు సంబంధించిన ఔషధ (తులసి, వేప, రావి) మొక్కలను ఉచితముగా పంచుట.

హిందూ దేవాలయము- పవిత్ర కార్యక్రమము

హిందూ దేవాలయమునందు ధార్మికత మరియు పవిత్ర కార్యక్రమములను సామాన్యమానవునికి తెలియపర్చు పద్దతులు

1. దేవాలయమునందు ధార్మిక ప్రసంగములను చేయించుట.
2. ప్రతిదినము దేవాలయమునందు లలితాసహస్రనామ స్తోత్రములు, విష్ణు పారాయణ చేయించుట.
3. భక్తులను భజన కార్యక్రమంలో పాల్గొన చేయుట.
4. మాసశివరాత్రినాడు అభిషేకములు, పౌర్ణమినాడు సత్యనారాయణస్వామి వ్రతములు మొదలగు కార్యక్రమములను సామూహికముగా నిర్వహింపచేయుట.
5. ధార్మిక పుస్తకములను, సహస్రనామ పుస్తకములను, హనుమాన్‌ చాలీసా పుస్తకములను ఉచితముగా ప్రజలకు పంపిణి చేయుట.
6. వనభోజనములను ఏర్పాటు చేయుట.
7. గోశాలలను ఏర్పాటు చేసి, భక్తులచేత గోపూజలను చేయించుట.
8. నీతిపద్యములను పిల్లలకు చదివి వినిపించి దాని అర్థములను చెప్పి వాిని వల్లె వేయించుట.
9. సంగీతము, నాట్యము, పౌరాణిక నాటకములు ప్రోత్సహించుట.
10. సంగీతము, నాట్యము, పౌరాణిక, తిరుప్పావై పఠనము, నీతిపద్యములయందు పోీలను నిర్వహించుట.
11. ప్రజలకొరకు హిందూ ధార్మిక విషయములకు సంబంధించిన గ్రంథాలయాలను ఏర్పాటు చేయుట.
12. నగరసంకీర్తన చేయించుట.
13. పెద్దదేవాలయముల ప్రచార రథములను మారుమూల గ్రామములకు పంపి ధర్మ ప్రచారము చేయించుట మరియు సంబంధిత ఆలయమునకు సంబంధించిన పూజాదికములను ఎటువిం రుసుమును తీసుకోకుండా సామూహికముగా నిర్వహింపచేయుట.

ఆదిత్య కవచము

జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం |
సిందూరాంబర మాల్యంచ రక్తగంధానులూనం |
మాణిక్యరత్నఖచిత సర్వాభరణభూషితం |
సప్తాశ్వ రథవాహంతు మేరుంచైవ ప్రదక్షిణం |
దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితం |
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచంముదా |
ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకం |
ఆదిత్యో లోచనేపాతు శృతీపాతు దివాకరః |
ఘ్రాణంపాతు సదాభానుర్ముఖంపాతు సదారవిః |
జిహ్వాంపాతు జగన్నేత్రః కంఠేపాతు విభావసుః |
స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌపాతు ప్రభాకరః |
కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః |
ద్వాథాత్మ కింపాతు సవితాపాతు సక్థినీ |
ఊరూపాతు సురశ్రేష్ఠో జానునీపాతు భాస్కరః |
జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌపాతు త్విషాంపతిః |
పాదౌ దినమణిఃపాతు పాతు మిత్రో...ఖిలం వపుః |
ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభం |
సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః |
సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్‌ ||
ధ్యానమ్‌ :
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణం |
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియం ||
అశేషరోగశాంత్యర్థం ధ్యాయే దాదిత్యమండలం |
తప్తకాంచనసంకాశం సహస్రకిరణావృతమ్‌ ||
సిందూరవర్ణాయ సుమండలాయ
సువర్ణరత్నాభరణాయ తుభ్యం |
పద్మాదినేత్రేచ సుపంకజాయ
బ్రహ్మేంద్ర నారాయణ శంకరాయ ||
సుంరక్తచూర్ణం ససువర్ణతోయం
సుకుంకుమాభం సకుశం సపుష్పం |
ప్రదత్తమాదాయచ హేమపాత్రే
ప్రశస్తనాదం భగవంతమీడే ||

రాజమహేంద్రపురం

    ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులు, సామంతులు, మాండలికుల గురించి రాజనీతిజ్ఞలు, ప్రజలు మొదలైనవాి గురించి చరిత్ర అధ్యయనము ద్వారా తెలుసుకొనగలము. క్రీ.పూ. నుండి స్వాతంత్య్ర సముపార్జనవరకు ఆంధ్రదేశ చరిత్రను పరిశీలించిన, ప్రసిద్ధి చెందిన రాజవంశాలైన శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు, కళింగ గాంగులు, దుర్జయులు, పల్లవులు, తూర్పుచాళక్యులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, చాళుక్యచోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, డచ్‌వారు, ఫ్రెంచివారు మరియు ఆంగ్లేయులు మొదలైనవారు వారి పాత్రలు గణనీయంగా ఉన్నట్లు రాజకీయాంశాలను పరిశీలించుట వలన ఏ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధిచెందినది ఎందువలన అనే విషయాలు కూడా ముఖ్యంగా తెలియుచున్నవి.
    నగరాల గురించి తెలుసుకొన్నట్లయితే నగరాలనేవి ఒక్కసారిగా ఉద్భవించినవికావు. కొన్నేళ్ళ గూడెం, పల్లె అయి, పల్లె పెద్ద ఊరై, ప్రజల బ్రతుకు అవసరాల నేపథ్యంలో ఆ ఊర్ళు పట్టణాలై, పట్టణాలు విద్య సాంస్క ృతిక వికాసచైతన్యదీపాలై నగరాలవుతాయి. నగరం ఏర్పడానికి ఇంత పరిణామశీలవంత చరిత్ర ఉంది. ప్రాచీన 'రాజమహేంద్రపురం' నేడు 'రాజమండ్రి'అను నామంతో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదికి తూర్పు ఒడ్డున కలదు. ఇచ్చట గోదావరి నది 3 కిలోమీటర్లు వెడల్పు కలిగి అఖండ గోదావరిగా ఉండి గౌతమవి, వశిష్ట, వృద్ధగౌతమి, తుల్య, ఆత్రేయ, భరద్వాజ, కౌశిక అను ఏడు పాయలుగా విభజించబడి 40 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలియుచున్నది. ఈ ప్రాంత పరిసరాలలో 1979 సం||లో జరిపిన త్రవ్వకాలలో లభ్యమైన ఇటుకలు, కుండపెంకులు, పాత్రలు మొదలగువాిని బ్టి ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రంగా చరిత్రకారులు అభిప్రాయపడిరి. పవిత్ర గోదావరి నదికి వేదకాలం నుండి పుష్కర ఉత్సవాలు జరుగుచున్నందున ఈ ఒడ్డున ఏర్పడిన ఈ నగరం ప్రత్యేకమైనటువిం ప్రాముఖ్యతను పవిత్రతను సంతరించుకున్నట్లుగా తెలియుచున్నది. నదీతీరాలు నగరికతకు జన్మక్షేత్రాలు. రాజమండ్రిలోని జీవస్పర్శ ఎన్నెన్ని తరాల నాిదో! యుగాలనాిదో! తెలుగునాట సంస్కరణేచ్చకు, సిద్ధాంత చర్చకు, కళావికాసానికి, కార్యదక్షతకు, శౌర్యానికి, పరాక్రమానికి, క్రీడలకు, క్రీడాస్ఫూర్తికి, ఆధ్యాత్మిక భావజాలపరంపరకు, సేవకు, సమర్పణ భావానికి ఈ రాజమండ్రి గరిమనాభి.
    చాళుక్యలకు పూర్వం ఈ నగరం ఏ నామంతో ఉచ్చరించబడినదో ఇదిమిద్ధమైన ఆధారములు మనకు లభించనప్పికి శాతవాహనుల నామకరణములు మరియు శాతవాహన చక్రవర్తియైన హలుని 'గాధాసప్తసతి' ద్వారా ఈ ప్రాంతం క్రీ.పూ.నుండి గొప్ప ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు తెలియుచున్నప్పికీ తూర్పు చాళుక్యులకాలంలో ఈ నగరం రాజధానిగా గుర్తించబడినట్లుగా వివిధ ఆధారాల వలన తెలియుచున్నది. క్రీ.శ.624లో తూర్పు చాళుక్య మొది రాజైన కుబ్జవిష్ణువర్ధనుడు తన సామ్రాజ్యానికి వేంగీపురమును (ప్రస్తుత ఏలూరు నగరం ప్రక్కన గల పెదవేగి)ని రాజధానిగా చేసుకొని వేంగి రాజ్యస్థాపన చేసెను. చాళుక్య వంషాజులలోని అంతఃకలహముల వలననూ రాష్ట్రకూటులు దాడుల వలననూ మొది అమ్మరాజు విష్ణువర్ధనుడు క్రీ.శ.921-27 సం||ల మధ్య 'వేంగీ' కంటే 'రాజమహేంద్రపురం' సురక్షితమైన ప్రాంతంగా భావించి రాజమహేంద్రపురమునకు రాజధానిని తరలించి పరిపాలనను కొనసాగించినారు. రాజమహేంద్ర బిరుదాంకితుడైన మొది అమ్మరాజు తన బిరుదునకు 'పురం'చేర్చి ఈ ప్రాంతమును 'రాజమహేంద్రపురం'గా నామకరణచేసెను. కాని కొంతమంది చరిత్రకారులు ఈ రాజమహేంద్రపురం నామంపై విభిన్న నామాలు అయిన రాజమహేంద్రవరం, రాణ్మహేంద్రవరం, రాజమహేంద్రి, రాజమందిరి, రాజమండ్రి అని అభిప్రాయపడినప్పికి చారిత్రక ఆధారములను బ్టి ఈ నగరం తొలుత రాజమహేంద్రపురంగానే గుర్తించబడినది. సాధారణంగా చాళుక్యకాలంలో వెల్లిసిల్లిన నగరములు అయిన వేంగిపురం, పిష్ఠపురం, నిరవంధ్యపురం, జననాథపురంల నామములను విశ్లేషించినట్లయితే చాళుక్యుల కాలంలో ఎక్కువ ప్రాంతాలకు 'పురం' చేర్చినట్లు తెలియుచున్నది. తదుపరి పాలకులైన రెడ్డి రాజులు కాలంలో కొన్ని పాంతాలకు చివర 'పురం'కి బదులుగా 'వరం' చేర్చినట్టు తెలియుచున్నది. వాికి ఉదా:-
అన్నవరం, భీమవరం, వేమవరం, రాజమహేంద్రవరంలను చెప్పవచ్చు. ఈ నగరంలో
    1. కమలగిరి 2.పుష్పగిరి 3.శేషగిరి లేక శోణగిరి 4. హేమగిరి (వేమగిరి) 5. ధవళగిరి (ధవళేశ్వరం)లు ఉండుట వలన 'పంచగిరి' అనే నామంతో కూడా వ్యవహరించెడివారు. కనుక ప్రముఖ చరిత్రకారుడైన సీవెల్‌ రచనలు బ్టి ఈ నగరం తూర్పు చాళుక్యుకాలంలో ప్రసిద్ధి చెందిన దుర్గంగా గుర్తించబడినది.
    ''అఖిల జలధివేలాపలయ వలయిత వసుమతీ వనితా విభూషణంబైన                     వేంగీదేశంబునకు నాయకరత్నంబునుం బోని రాజమహేంద్రపురంబు నందు''
    రాజరాజనరేంద్రుని ఆస్థానంలో నన్నయ్యభట్టు, నారాయణభట్టు యొక్క సహాయంతో మహాభారతంను ఆంధ్రీకరించినందువలన రాజమహేంద్రవరము గొప్ప పరిపాలనా కేంద్రంగాను, ప్రఖ్యాత సాస్కం ృతిక కేంద్రముగాను చెప్పబడుతూ ప్రశంసించబడినది.
    తదుపరి కాలంలో రాజమహేంద్రపురం పై చాళుక్యచోళులు, కళింగ గాంగులు, కాకతీయులు, ముస్లిలు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు, ఫ్రెంచివారు, ఆంగ్లేయుల ప్రభావం కలదు. రెడ్డిరాజుల కాలంలో ఈ ప్రాంతం తగిన ప్రాముఖ్యత సంతరించుకున్నట్లుగా కాటయవేమారెడ్డి స్వయంగా విద్వాంసుడై కావ్యములు రచించుటయేగాక పలువురు విద్వాంసులను పోషించుట, చుట్టుప్రక్కల గ్రామాలలో అనేక విద్యాసంస్థలు ఏర్పరచినట్లు తెలియుచున్నది. శ్రీనాథునిచే రచింపబడిన భీమేశ్వరపురాణంలో 1వ అధ్యాయం 32వ ప్రకరణంలో ఈ క్రింది విధంగా వర్ణించబడినది.
    ''అల్లాడ భూపల్లభుండు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రి పర్వంతం ఉత్కల, కళింగ, యువన, కర్ణాట, లాోంతర్దీపంబై....... విశ్వంభరా భువన మండలంబు.....''
    ఈ చరిత్ర ప్రసిద్ధి కల్గిన రాజమండ్రి పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉండుట వలన శాతవాహనుల కాలం నుండి ఈ సప్తగోదావరి ప్రస్తావన వచ్చుచున్నందున ఈ పరిసర ప్రాంతాలలో వ్యవసాయం అభివృద్ధి చెంది, వాణిజ్య పంటలు విస్తారంగా పండుట వలన శాతవాహనుల నాణెంలు ఓడ గుర్తును కలిగియుండుటవలన గోదావరిలో పడవలపైన వర్తక, వాణిజ్యాలు, జరిగినట్లు తెలియుటవలననూ, తూర్పు చాళుక్యుల కాలంలోని 'వరాహం' చిహ్నంగల బంగారు నాణెములు బర్మాదేశంలోని అరకాన్‌ ప్రాంతంలోను మరియు సయాం ప్రాంతంలోను దొరికినందున ఈ ప్రాంతంలో ప్రధాన రేవు ఉండి విదేశాలకు కూడా వర్తక వాణిజ్యం వ్యాప్తి చెందినట్లు తెలియడమేగాక, రాజమహేంద్రవరం నగరంగా రూపొందించడానికి కూడా దోహదపడినట్లుగా చెప్పవచ్చును. మతపరంగా పరిశీలించినట్లయితే రాజమహేంద్రరం పరిసర ప్రాంతాలలో ప్రాచీన యుగం నుండి హిందూ మతంతో పాటు జైన, బౌద్ధ మతములు ఉన్నప్పికి కాలక్రమేనా జైన, బౌద్ధమతాలకు ఆదరణ తగ్గి మధ్యయుగంలో చాళుక్యులు, చాళుక్య చోళులు, కాకతీయులు పరిపాలనా కాలంలో హైందవ మతము అభివృద్ధి చెందినట్లుగా చెప్పవచ్చును.
    కాకతీయులు అనంతరం 1323వ సం||లో ఈ రాజమండ్రి తుగ్లక్‌ స్వాధీనంలో ఉన్న కొద్దికాలములోనే మొట్టమొదిసారిగా ముస్లింలు ప్రవేశించి జనజీవనంలో కలిసిపోయిరి. తదుపరి రెడ్డిరాజుల కాలం నుండి గజపతుల కాలంవరకు హిందూమతంనకు గోల్కొండనవాబుల కాలంలో ముస్లింలకు ప్రాముఖ్యత కల్గినది. 17వ శతాబ్దము నుండి మొదటగా డచ్‌వారు ఇచ్చట ప్రవేశించి ఒక స్థావరమేర్పరచుకొనిరి. అదియే ఇప్పి  సైంట్రల్‌జైలు. తదుపరి ఫ్రెంచివారు కొంతకాలము తదుపరి ఆంగ్లేయులు ఈ ప్రాంతమును స్వాధీనపరచుకొని మనకు స్వాతంత్య్రం ఇచ్చువరకు ఈ రాజమండ్రిలో క్రైస్తవ మతమునకు ప్రాముఖ్యతనిచ్చి ఈ ప్రాంతమును అభివృద్ధి పరచినారు.
    ఈ క్రింద వివరించిన అనేక గ్రంథముల వలన రాజమండ్రి నగర భౌగోళిక చారిత్రక, రాజకీయ అంశాల సమాచారం లభించినప్పికిని సంపూర్ణ సమగ్రమైన చరిత్ర, సంస్కృతిని ప్రాచీన యుగం నుండి ఆధునిక యుగం వరకు వివరించే ప్రయత్నం ఏ రచయిత, పరిశోధకుడు చేయలేదు. దీనిని దృష్టిలో వుంచుకొని ''రాజమండ్రి సమగ్ర చరిత్ర - ఒక పరిశీలన'' అనే అంశంపై అధ్యయనం చేయుటకు ఈ పరిశోధనాంశమును ఎంపిక చేసుకోవడం జరిగినది.
సాహిత్యపరిశీలన :
    రాజమండ్రిపై వెలువడిన ఈ క్రింది ఆధునిక రచనలను పరిశీలించినట్లయితే ఏటుకూరి బలరామమూర్తిగారు రచించిన ''ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర''లో క్రీ.శ.921-27 సం||ల మధ్య పరిపాలించిన మొది అమ్మరాజు విష్ణువర్ధనుని కాలంలో రాజమహేంద్రవరం చాళుక్యులకు రాజధాని అయినదనీ, అంతవరకు వేంగినగరం వారి రాజధానిగా యుండెడిదని, నది అవతర రాజధానిని నిర్మించుట ద్వారా శత్రురాజుల నుండి రక్షణ ఏర్పడగలదనే ఉద్దేశ్యంతో అమ్మరాజు విష్ణువర్ధనుడు రాజమహేంద్రవరాన్ని నిర్మించినట్టుగా చెప్పబడినది.
    సురవరం ప్రతాపరెడ్డిగారు రచించిన ''ఆంధ్రుల సాంఘీక చరిత్ర''లో మన వాజ్ఞయ చరిత్ర నన్నయభట్టుతో ప్రారంభమయినదనియు అతడు తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని కులబ్రాహ్మణుడనియు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రపురమును రాజధానిగా వేంగిదేశమును క్రీ.శ.1022 నుండి 1063 వరకు పరిపాలించెననియు, నన్నయ కాలము తర్వాతనే బ్రాహ్మణులలో వైదిక నియోగిశాఖలేర్పడెననియు ఆభేదము నన్నయకాలమందుగాని అంతకు పూర్వంగా లేకుండెననియు, నన్నయకు 100 ఏండ్లు పూర్వం అమ్మరాజ విష్ణువర్ధనుడు పరిపాలించినట్టునూ, అప్పి వరకు తూర్పు చాళుక్యుల రాజధాని వేంగింపురమనియు అమ్మరాజే రాజమహేంద్రవరమునకు రాజధానిని తరలించెనని కావున మనకీ కాలమందు తూర్పు తీరమందలి (అప్పి సర్కారులు) జిల్లాలోని స్థితిగతులు కొంతవరకు తెలియవచ్చినవని వివరించబడెను.
    ఆంధ్రప్రదేశ్‌ సమాచార పౌరసంబంధాల శాఖవారి ''రాజమహేంద్రవరం చరిత్ర''లో వేదకాలం నుండి ఈనాి వరకు నిరంతరం సాగుతున్న జీవన స్రవంతి సాంస్క ృతిక ప్రతీక గోదావరి పుష్కరాలు అని తెలియుచున్నదని తెలుపబడెను.
    యాతగిరి శ్రీరామ నరసింహారావుగారి ''రాజమహేంద్రిలో చారిత్రక విశేషాలు''లో ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా ప్రఖ్యాతి పొందిన పట్టణం రాజమహేంద్రి. ఇచ్చట చారిత్రక ప్రదేశాలు అనేకం ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసెను.
    పురాణపండ శ్రీనివాస్‌గారి ''అమరధామంలో శోభిల్లే రాజమహేంద్రి''లో శతాబ్ధాల నాగరికతకు సాక్షీభూతంగా బాసిల్లే పవిత్రగౌతమీ తీరాన దక్షిణకాశీక్షేత్ర పవిత్రతను సంతరించుకున్న నగరి రాజమహేంద్రి రాజకులైన భూషణుడు, చాళుక్యకీర్తి వర్ధనుడు రాజరాజ నరేంద్రునిచే పరిపాలించబడ్డ నగరం రాజమహేంద్రవరం అనియు, సహస్రసంవత్సరాల మార్గకవిత్వం వెలుగుతున్న పురం 'రాన్మహేంద్రపురం' అనియు చెప్పబడింది.
    కె. వెంకటపద్మనాభ శాస్త్రిగారి ''ఆంధ్రదేశ చరిత్ర''లో ఈ రాజమహేంద్రపురము వేంగి రాజ్యములో మధ్యభాగమున ఉండుట చేత రాజరాజనరేంద్రుడు ఇందొక కోటను క్టి తనకు రాజధానిగా చిరకాలముగా రాజ్యపాలన చేసెనని, ఈ పట్టణముకు కలిగిన ప్రఖ్యాతి, రాజరాజనరేంద్రుని మూలమున కలిగినదే కాని మరియొకరి మూలమున కలిగినది కాదు అని చెప్పుచూ విన్నకోట పెద్దన కవితన 'కావ్యాలంకారచూడామణి'లో 'రాజమహేంద్రవర స్థాత రాజనరేంద్రుడెక్కువ తాతయే విభునకు'' అని వివరించినట్లు చెప్పబడెను.
    కుందూరి ఈశ్వర దత్తుగారి ''ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళము''లో రాజమహేంద్రవరం ఆంధ్రదేశములోని స్థల దుర్గములలో నొకిగాను, రాజరాజ ఇచ్చటనే ప్టాభిశక్తుడైనట్లుగాను, శ్రీమదాంధ్రమహాభారతము నందు భీమేశ్వర పురాణంలోను, శివయోగసారపీఠిక, శివలీలావిలాసంలోను రాజమహేంద్రవరం గురించి ఏ విధంగా ఉందో ఆ వర్ణనను తెలియజేసెను.
    నేలటూరి వెంకటరమణయ్యగారి ''ది ఈస్ట్రన్‌ చాళుక్యాస్‌ ఆఫ్‌ వేంగి''లో మొది అమ్మరాజు విష్ణువర్ధనుడు రాజమహేంద్ర బిరుదాంకితుడు రాజమహేంద్రవర స్థాపకుడని, రాష్ట్రకూటలు దాడులకు వేంగి ప్రాంతం కన్నా గోదావరి అవతలి ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం సురక్షితంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేసెనని చెప్పబడుచున్నదని కాని చాళుక్య రాజులలో రాజమహేంద్ర బిరుదములు రెండవ అమ్మరాజుకు మరియు రాజరాజనరేంద్రునకు కూడా కలవు. కాబ్టి రాజరాజనరేంద్రుడు ఆనాి పరిస్థితులను బ్టి రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరానికి మార్చియుండవచ్చును అని అభిప్రాయపడిరి.
    భావరాజు వెంటక కృష్ణారావుగారి ''రాజరాజనరేంద్ర ప్టాభిషేక సంచిక''లో క్రీ.శ.982న ఒక శాసనము గలదని దానియందు ఆ కాలమున వృద్ధి (వడ్డీ) గ్రహించినారని తెలియుచున్నదని, నాల్గు 'గద్యాణములకు' నెలకొక 'హాగ' యని యున్నదని, దానిని బ్టి నూరు గద్యాణములకు సంవత్సరమునకు 12 þ 25 లేక 300 హాగలు వృద్ధియగునని, ఈ హాగలను గద్యాణములకు మార్చిన 300þ20/768 లేక 7þ13/16 సాలునకు ఎనిమిది వంతున కాలాంతరమున పుచ్చుకొనువాడుక గలదని, అందుచే దేశమున పరిపాలనము బహుధర్మయుక్తముగ జరుగుచున్నదని చెప్పనొప్పునని, గ్రామ న్వాథమును, వర్తక శ్రేణులును, శిల్పికారాది సంఘములును, నగర మహాజన సంఘమును మొదలగు సంఘముల మూలమున కేంద్రపరిపాలనా విప్లవములు జెడనిశాంతి దేశమున నెలకొనియున్నట్లు తెలియుచున్నదని చెప్పబడెను.
    జి. కృష్ణగారి ''ద స్టోరీ ఆఫ్‌ తెలుగూస్‌ అండ్‌ దెయిర్‌ కల్చర్‌''లో అమ్మరాజ రాజమహేంద్రుడు, రాజమహేంద్రపుర నగరాన్ని నిర్మించెననియు, అదే ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి అని చెప్పబడెను.
    డా|| ఎన్‌. రమేషన్‌ గారి ''ద ఈస్ట్రన్‌ చాళుక్యాస్‌ ఆఫ్‌ వేంగి''లో మొది అమ్మరాజు రాజమహేంద్ర బిరుదాంకితుడు, తన తండ్రి నాల్గవ విజయాదిత్యుని అనంతరం రాజుగా ప్రకించబడెనని, ఇతని అనుయాయులు పినతండ్రి అయిన రెండవ విక్రమాదిత్యుడు రాష్ట్రకూటుల సహకారంతో తిరుగుబాట్లు చేయుట వలన గోదావరి తూర్పుగట్టునకు రాజధాని కేంద్రమును మార్చినట్టు, అది రాజమహేంద్రపురంగా ప్రసిద్ధి చెందినట్టు తెలియుచున్నదని వివరించెను.
    బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావుగారి ''ఆంధ్ర చరిత్ర'' (ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు)లో స్వల్పకాలములో ఆరుగు రాజకుమారులు సింహాసనమెక్కి మరణించారని, చాళుక్యులు స్వహస్తాలతోనే వేంగి నగరాన్ని పరశురామ ప్రీతి చేసినారనియు, ఇి్ట పరిస్థితులలో కొల్లబిగండని కొడుకైన అమ్మరాజు పితృపితామహుల మూలబలాన్ని తన వైపుత్రిప్పుకొని సింహాసనం 921-27 సం||ల మధ్య అధిష్టించినట్లు ఈతని ఈడేరు శాసనం నుండి గ్రహిస్తున్నామని, ఇతనికి రాజమహేంద్ర బిరుదు ఉన్నదని, నాి పరిస్థితులలో వేంగి సురక్షితమైన నగరం కాదని గోదావరి తీరంలో తన పేరున రాజమహేంద్రినగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడనియు,  రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రపురం నుండి పాలిస్తూ వేంగిరాజ్య ఐక్యాన్ని పునరుద్ధరించుటకు చోళ సైన్య సహాయంతో తన సవతి తమ్ముడు విజయాదిత్యుని పై కలిదిండి వద్ద ఘోరయుద్ధం చేసి జయించెనని, పశ్చాత్తాపము చెందిన తమ్ముని క్షమించెనని, యుద్ధంలో మృతులైన చోళ సేనాపతులు స్మారకార్ధం కలిదిండిలో 3 శివాలయములు నిర్మించెనని చెప్పబడినది.
    భావరాజు వెంకట కృష్ణారావుగారి ''రాజరాజ నరేంద్రుడు''లో విమలాదిత్యుడు తన అశ్వదళమును పంపి శత్రు భూములపై దాడి చేయించి ఆ దాడులలో మరణించిన శత్రువుల శిరములను శూలమునకు గొనివచ్చి రాజమహేంద్రవరమున రాజప్రసాద ప్రాంగణమున పాతించెనని భీమనభట్టు నుడివెననియు, రాజమహేంద్రవరమున గోదావరి పావనోదకములందు గంగ నీిని కలిపి రాజేంద్రచోళుడు జలకమాడి నిజరాజధానికి మరలివెల్లెననియు, గోదావరీ పావనోదకములను భగీరథీ జలమును కొని తెచ్చి గంగయికుండ చోళపురమున ప్రదేశించి వాిని ప్రత్యేక పవిత్రకుండ యందు నింపయాతోకమునకు గంగయికుండ అని పేరడిడెను. అనియు చెప్పబడినది.
    కప్పగంతుల మల్లిఖార్జునరావుగారిచే రచించబడిన ''తరతరాల రాజమహేంద్రపుర చరిత్ర''లో మొది అమ్మరాజు విష్ణువర్ధనుని కాలములో రాజమహేంద్రపురం అతనిచే నిర్మించబడినదని, 'అమ్మ మహీపతి గండర గండో రాజమహేంద్రవర ఐతి విఖ్యాతః' అనే చేవూరి శాసనంలో అమ్మరాజు విష్ణువర్ధనుడు ప్రశంసించబడెనని, ఏలూరు శాసనం అమ్మరాజును విష్ణువర్ధనుని రాజమహేంద్రవరనామ' అని పేర్కొనిరని, కనుక చాలా మంది అమ్మరాజు విష్ణువర్ధనుని కాలంలోనే 919-20 సం||లలో రాజమహేంద్రపురం నిర్మితమై, తూర్పు చాళుక్యుల రాజధాని అయినదని విశ్వసిస్తున్నారనియు, ప్రస్తుతం రాజమండ్రిగా వ్యవహరించబడుచున్న ఈ పట్టణం యొక్క భౌగోళిక పరిస్థితి అఖండ గోదావరి నదికి తూర్పు ఒడ్డున 160-18|, 170-38| రేఖాంశములపై 810-7|, 820-40| అక్షాంశములపై నిర్మించబడినదనియు తెలుపబడినది.
    డా|| వెలమల సిమ్మన్నగారి ''తెలుగుభాషా చరిత్ర''లో 'భాష్‌' (þþþþþþ) అనే సంస్క ృత ధాతువు నుండి వచ్చిన 'భాష' అనే పదానికి మ్లాడడానికి మ్లాడబడేది అని అర్థం. 'భాష్యతే ఇతి భాషా' భాషించబడేది భాష అని, హేతువాద దృక్పథంలో నిశితంగా పరిశీలిస్తే 'స్వతస్సిద్ద వాదం' భాషావిర్భావాన్ని బాగా నిరూపించినదని, సుమారు 5000 భాషలు ఉన్నాయని ''ఆంధ్ర'' శబ్దం సంస్క ృత పదం అని తెల్పియున్నారు.
    డా|| గుండవరపు లక్ష్మీనారాయణగారి ''శ్రీనాథమహాకవి విరచిత శ్రీ భీమేశ్వరపురాణం''లో రాజమహేంద్రవరమునకు పంచగిరి దుర్గమని ప్రసిద్ధి అని అవి (1)వేమగిరి, (2)ధవళగిరి, (3)పద్మగిరి, (4)భద్రగిరి, (5)రామగిరి అని వివరించెను.
    ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డా|| జి.యస్‌.భాస్కరరావుగార్లచే వెలువడిన ''నన్నయభారతి''లో రాజరాజు నాికే 'లకులీశపాశుపత' ప్రభావం చేత జైనం శైవంగా మారిపోయిందని బౌద్ధులు, జైనులు అంతవరకు ఆరాదిస్తూ వచ్చిన శక్తి స్వరూపాలు పానవ్టాలుగా మారాయని, జైనుల వృషభ ఆరాధన నంది పూజగా మారినదని, పశుపతీనాధుడు పార్వతీనాధుడైనాడని, గోమఠేశ్వర ఆరాధకులే గోమఠులు, కోమట్లయ్యారని, అవి ఉభయుమతస్తులను ఏకోన్ముఖులుగా చేసెననియూ, బౌద్ధారామాలలోని ఆయక స్తంభాలు శివలింగాలుగా మారాయని, గుళ్ళు గోపురాలు లేచి బౌద్ధం, జైనం, శైవం సమ్మిశ్రతమయ్యెనని తెల్పెను.
    కె. సోమశేఖర్‌ గారిచే సమర్పించబడిన పరిశోధకవ్యాసం ''రాజమండ్రి మున్సిపాలిీ 1866-1947''లో శ్రీకృష్ణదేవరాయలు 1515 సం||లో ఈ ప్రాంతాన్ని జయించెనని 1572 సం||లో గోల్కొండ నవాబులు పరిపాలనలోనికి, 1687 సం||లో ఔరంగజేబు పరిపాలనలోనికి వెళ్ళెననియు 1866 సం|| డిశంబరు నెలలో రాజమండ్రి మున్సిపాలిీగా అవతరించెను.
    ఆంద్రేతిహాస పరిశోధక మండలి, వడ్డాది అప్పారావుగారి సంపాదకీయం ''రెడ్డి సంచిక''లో 1328 సం||లో తుగ్లక్‌ కాకతీయ ప్రతాపరుద్రుని ఓడించి రాజమహేంద్రవరమును ఆక్రమించి తన ప్రతినిధిగా సాలార్‌ ఉల్వీని నియమించగా అతను వేణుగోపాలస్వామి దేవాలయంను మసీదుగా మార్చెననియు, తదుపరి కొప్పుల కాపయనాయకుడు ఈ ప్రతినిధిని ఓడించి ఈ ప్రాంతంను స్వాధీనం చేసుకొనెనని 1388 సం||లో కాటయ వేమారెడ్డి ఈ ప్రాంతంను జయించి స్వాధీనపర్చుకొని వేమవీరభద్రారెడ్ల అనంతరము విజయనగర చక్రవర్తి  ప్రౌడదేవరాయలు అధీనములో ఈ ప్రాంతం కొద్దికాలం ఉన్నాదని తెల్పెను.
    గంథం నాగ సుబ్రహ్మణ్యంగారి సంపాదకీయం ''సమాచారం 40వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక''లో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో రాజమండ్రి నగరానికి ఉన్నంత చారిత్రక ప్రాశస్త్య, పురావస్తు నేపథ్యం మరే ప్రాంతానికి లేదని, క్రీ.పూ.3వ శతాబ్ధములో మౌర్యుల కాలంనాడు గోదావరి తీరాన గల 'మహేంద్ర'అనే పట్టణం రాజమహేంద్రియే అన్నది ఒక బలమైన వాదన అని దానికి తగ్గట్టుగా పాత స్ట్‌ే బ్యాంక్‌ దిబ్బ (మహలక్ష్మీ హోటల్‌ ఎదుట గల దొమ్మేరు జమిందారుగారి స్థలం) నుండి గోదావరి అంచులోకి దిబ్బ అక్కడున్న పురాతన కుడ్య శకలాలు 'ట్రయల్‌ ట్రెంచ్‌ వేయగా 2þ11/2þ1/4 అడుగుల కొలత గల ఇటుకలతో గోడ బయటపడిందని, దాని వర్తులాకార కదలికను బ్టి అదంతా ఒక బౌద్ధ స్థూపాన్ని (చైత్వము) పోలి ఉన్నదని తెల్పియున్నారు.
    ఈ క్రింద వివరించిన జర్నల్స్‌ నందు రాజమహేంద్రవరం గురించి వెలువడిన వ్యాసములను పరిశీలించినచో జె.ఎ.హెచ్‌.ఆర్‌.యస్‌. సంపుి 2, 3, 5లలో బి.వి.కృష్ణారావుగారిచే వెలువడిన ''హిస్టరీ ఆఫ్‌ రాజమండ్రి''లో వేంగి దేశం బంగాళాఖాతం ఒడ్డున ఉండుటవలన సముద్రయానం ద్వారా వాణిజ్య సంబంధాలు అరకాన్‌, పెగూ, చైనా, సయీమ్‌ మొదలైన దేశాలతో పెంపొందించుకున్నట్లు ఆయా ప్రాంతాలలో దొరికిన చాళుక్యుల కాలంనాి బంగారు నాణెముల వలన తెలియుచున్నదనియు, రాజరాజనరేంద్రుడు క్రీ.శ.16 ఆగష్టు 1022 గురువారం నాడు రాజమహేంద్రవరంలో ప్టాభిషక్తుడైనాడనియు, కులోత్తుంగ చోళుడు రాజమహేంద్రవరానికి రాజ్యాన్ని ఏలుటకు వచ్చియుండలేదనియు తన తనయులను రాజప్రతినిధిలుగా నియమించెనని చెప్పబడినది.
    జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌. సంపుి 5 నందు జి.జె.డుబ్రియల్‌ గారిచే వెలువడిన ''రూయిన్స్‌ ఆఫ్‌ ది బుద్దిస్ట్‌ పీరియడ్‌ ఆన్‌ ది మ్‌ౌం ఆఫ్‌ సారంగధర ఎ్‌ రాజమండ్రి''లో రాజమహేంద్రవరమున ప్రాచీన కాలమునందు ఒక బౌద్ధ సంఘారామముండెననియు, ఈ ప్రాంతమును నేడు సారంగధర మెట్ట అని పిలుచుచున్నారనియు, ఇచ్చట బౌద్దకాలము నాి వెడల్పు అయిన ఇటుకలు బయల్పడినవని తెల్పబడినది.
    జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌. సంపుి 7లో ఆర్‌.ఎస్‌. సుబ్బారావుగారిచే వెలువడిన ''రీస్‌ెం ఆర్యియాలాజికల్‌ ఫైండ్స్‌ ఎ్‌ రాజమండ్రి''లో 1933 జనవరిలో రాజమహేంద్రవరం ప్రస్తుత మున్సిపాలిీ ప్రాంతం గోదావరి నది ఒడ్డున (పూర్వపుష్పగిరిప్రాంతం) జరిగిన త్రవ్వకములో 6 ముఖములు 12 చేతులు కల్గిన కుమారస్వామి గ్రానైటు రాతి విగ్రహము లభ్యమైనదని, ఇంకను తల లేని నంది, స్థంభములు, 7వ విజయాదిత్యుని శాసనము దొరికినవని తెలియజేసెను.
    జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌. సంపుి 30 నందు సి.హెచ్‌. ముత్యాలయ్యనాయుడు గారిచే వెలువడిన ''బిగినింగ్స్‌ ఆఫ్‌ విడో రీమేరేజెస్‌ మూమ్‌ెం ఇన్‌ ఇండియా''లో మొట్టమొదట వితంతు పునర్వివాహముల గూర్చి ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ ఉద్యమించగా బ్రిీష్‌ ప్రభుత్వం వారు యాక్ట్‌ 15 ఆఫ్‌ 1856 ద్వారా అనుమతించిరని, కందుకూరి వీరేశలింగంగారు 11 డిసెంబరు 1881 సం||మున మొట్టమొది వివాహం జరిపించినారని తెల్పెను.
    జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌.సంపుి 31నందు వై. విఠల్‌రావుగారిచే వెలువబడిన ''సోషియో-ఎకనమిక్‌ కండిషన్స్‌ ఇన్‌ ఆంధ్రా ఇన్‌ ద కంపెనీ పీరియడ్‌ ిల్‌ 1858''లో గోల్కొండరాజ్యం 24 పరగణాలుగా విభజించబడినదని అందులో రాజమండ్రి ఒక పరగణా అని, అన్వరుద్దీన్‌ అనునతడు రాజమండ్రి పరగణాకు జమిందారుగా నియమించబడెనని ఇతనిపాలన పాశవికంగా జరిగినదని తెలుపబడెను.
    మొదిలి నాగభూషణశర్మగారి సంపాదకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే వెలువబడిన ''హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ది ఆంద్రాస్‌''లో 1880వ సం||లో మొట్టమొదట రాజమండ్రిలో మోడ్రన్‌ తెలుగు థియేటర్‌ కందుకూరి వీరేశలింగం గారిచే ఏర్పాటు చేయబడినట్లు, వడ్డాది సుబ్బారాయుడుగారిచే 1884వ సం||లో ''హిందూ నాటకోజ్జివాక సమాజం'' రాజమండ్రిలో ప్రారంభించబడినదని తెలుపబడెను.
    గోదావరికి తూర్పు ఒడ్డున రాజమహేంద్రవరంలో చిత్రాంగి మేడ దిగువన 1978 సం||లో త్రవ్వకములో ఒక నందీశ్వరుని గ్రానైటు రాతి విగ్రహం బయటపడి పీఠభాగమున 'మృకండు లింగానకు మారెళ్ళ భీమన సమర్పించిన నంది' అని శాసనం ఉందని దానిని బ్టి ఇది క్రీ.శ.13-14 శతాబ్ధములకు చెందినదిగా చెప్పవచ్చునని, దీనితోపాటు ఎన్నో శిల్ప శకలాలు బయటపడ్డాయని, ఇచ్చటనే 10 మీటర్ల పొడవున గోడ, మ్టి వలయాలతో కూడిన భావి, ఖనన మృణ్మయపాత్ర లభ్యమైనవని, ఇందులో రకరకాల పరిమాణాలతో పింగాణీ పొర సైతం ఊడిపోయిన ఎముకలు ఉండటం వలన ఈ ఖనన సామాగ్రి అత్యంత ప్రాచీనమైనదని నిశ్చయముగా చెప్పవచ్చునని, చారిత్రకయుగ ఆరంభానికి చెందిన మ్టి మూకుడులు కానవచ్చినవని, లభ్యమైన సామాగ్రి దృష్ట్యా ఈ పురం తూర్పు చాళుక్యుల కాలం నాికి పూర్వమే యున్నదని చెప్పవచ్చునని తెలియజేసెను.
    భారతి (సాహిత్య మాస పత్రిక) ఏప్రియల్‌ 1987 సం||లో కె.యస్‌.కోదండ రామయ్యగారిచే వెలువడిన ''రాజరాజ ఆనతికి నన్నయ రంగమును సిద్ధము చేసిన వైనము''లో తన వంశమున ప్రసిద్ధులైన, విమల సద్గుణశోభితులైన పాండవోత్తముల చరిత్రను, తెలుగున వినవలయునను అభీష్టము రాజరాజునకు మక్కువగా నుండుటయేగాక తన ప్రజలు సైతము భారత కథను స్వయంగా చదువుకొనవలయునను ఆకాంక్ష కూడా ఆతనికుండెనని, తెనుగులో వ్రాసిన తన ప్రజలెల్లరు సంతోషింతురని, ప్రజల తృప్తి మరియు సంతోషము పాలకులకు మంచివరము వింవనియు, రాజరాజ నరేంద్రుడు బాల్యం నుండి తన రాజధాని నగరమైన రాజమహేంద్రపురమునందే యుండి నన్నయ పర్యవేక్షణ క్రిందనే విద్యాభ్యాసము గావించెనని రాజరాజు వేయించిన కలిదిండి తామ్ర శాసనము ద్వారా చెప్పబడినట్టుగా తెలియజేయబడెను. సమాలోచన (జాతీయ సాంస్కృతిక పక్షపత్రిక) సంపుీలు 5, 8 సంచికలు 1, 2, 10 లలో జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారిచే వెలువబడిన ''రాజమండ్రినామ పద చర్చ''లో తొలుత రాజమహేంద్రపురంగా పిలువబడ్డ ఈ పట్టణం క్రమంగా రాజమహేంద్రవరముగా మారి ఆ తరువాత మహ్మదీయుల, ఆంగ్లేయుల పాలనలో భ్రష్ట రూపాలను సంతరించుకొని రాజమహేంద్రము, రాణ్మహేంద్రము, రాజమంద్రము, రాజమందిరము, రాజమండ్రిగా మారినదనీ, కొందరు ఇీవల రాజమహేంద్రి అని కూడా వ్యవహరించుచున్నట్లుగా చెప్పబడినది.
2. భౌగోళిక పరిస్థితులు - స్థానిక చరిత్ర
    ఏదైన ఒక ప్రాంతం చరిత్ర-సంస్క ృతి ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి యుండును. ఆ ప్రాంత ప్రజల రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక జీవన పరిస్థితులను భౌగోళిక పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. బర్టన్‌ స్టెయిన్‌, జి.జె.బేకర్‌, డి.ఎ.వాష్‌బ్రూక్‌, డేవిడ్‌ లుడ్డెన్‌, మొర్టన్‌ జె బ్రెయిన్‌ మొదలైనవారు తమ తమ గ్రంథములలో భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ప్రజల జీవన గమనాన్ని ప్రభావితం చేస్తాయో చెప్పటం జరిగింది.
    రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఉన్నది. ఇది 160-18|, 170-38| రేఖాంశములపై 810-7|, 820-40|, అక్షాంశముల పైననూ, పడమర గోదావరి, దక్షిణమున ధవళగిరి, వేమగిరి, తూర్పున రాజానగరం, ఉత్తరమున సీతానగరంల మధ్యన  జాతీయ రహదారి నె.5పై చెన్నైకు 560 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 520 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 205 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హౌరా-చెన్నైరైల్వేలైను ఇందు గుండా వెళ్ళుచున్నది. ఇండియాలో అతిపెద్ద 2743 మీటర్ల పొడవుగల రైల్‌ కమ్‌ రోడ్డు బ్రిడ్జి ఇచ్చట కలదు. ఇచ్చట 1944 నుండి విమానాశ్రయం కూడా కలదు.
శీతోష్ణస్థితి :
    పరిసర ప్రాంతంలో కొండలు, అడవి, ఒకప్రక్కనది, కొంచెం దూరంలో సముద్రతీరం యుండుటవలన ఈ ప్రాంతం సమ శీతోష్ణస్థితిని కలిగియుండును. సగటున 1057.2 మి.మీటర్లు వర్షపాతము, వేసవిలో 390, శీతాకాలంలో 120 ఉష్ణోగ్రత కల్గివున్నది.
ప్రకృతి :
    ఈ ప్రాంతంలో గ్రాఫైటు, బంకమన్ను (క్లే), వుల్ఫమైటు, మెటల్‌ మొదలైన ఖనిజ సంపదలతో పాటుగా ఉత్తర దిక్కున అడవి ప్రాంతం హెచ్చుగా యుండుట వలన కలప, వెదురుతోపాటుగా తాిచెట్లు, పండ్లతోటలు మరియు ఆహార దాన్యాలు, వాణిజ్యపంటలు పండించుటకు అత్యంత అనుకూలమైన ప్రదేశమైనది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నాగరికతలు, సంస్క ృతులు నదీ తీరాల్లోనే ఉద్భవించినవి. ఎందువలనంటే ప్రతి జీవికి గాలి, నీరు, ఆహారం ముఖ్యం. ఏ ఒక్కి లేకపోయిననూ జీవనం ప్రశ్నార్ధకం. భూమిపై గాలి సర్వాంతర్యామి ఇక పోత నీరు అనేది భూగర్భంద్వారా, వర్షపాతం ద్వారా లభ్యమగుచుండును. భూగర్భ జలం అనేది అన్నిచోట్ల వచ్చే అవకాశంలేదు. ప్రాచీన ప్రజలకు భూగర్భజలం పై పెద్దగా అవగాహన ఉండి ఉండకపోవచ్చు. వర్షపాతం, మంచు ద్వారా నదులలో నీరు ప్రవహించి పల్లపు ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఇది బాహ్యంగా కనబడుతుంది. నీరు లభ్యమైతే పంటలు పండించుకొని ఆహారాన్ని ఏర్పాటు చేసుకొనవచ్చును. కాబ్టి పూర్వులు బాహ్యంగా లభ్యమయ్యే నీరు (నదులు) వెంటే పయనించిరి.
    మానవుడికి నదీ జలాలకు అవినాభావ సంబందం ఉంది. నైలునది, యూఫ్రిటస్‌, టైగ్రిస్‌, సింధూ, గంగ, గోదావరి మొదలైన నదీ తీరాల్లోనే నాగరికతలు వెలసిల్లి మానవ మనోవికాసం జరిగింది. ప్రపంచంలోని అనేక నదులు వేల సంవత్సరాలనుండి నేి వరకు మానవుడి సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక, వికాసాభివృద్ధికి తోడ్పడుచున్నాయి.
    భారతీయుల నాగరికతా సాంస్కృతుల వికాసానికి 'సింధూ' నది ప్రధాన పాత్రపోషించింది. అలాగే ఆంధ్రుల లేదా తెలుగు జాతి వెలుగులకు కృష్ణా, గోదావరి నదులే జీవగర్రలుగా వెలువడ్డాయి. ప్రకృతిలో మానవుడు ఒక భాగమైనప్పికిని తన యొక్క అసమానమైన మేదస్సుతో మొత్తం ప్రకృతినే అనేక రకాలుగా  ప్రభావితం చేయగలుగుచున్నాడు. ప్రకృతిలోని మార్పులకు కొంతవరకు కారకుడిగా మారినాడు. ఇవి తనకు తనవారికి అనుకూలంగా ఉండేలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆదిమకాలం నుండి మానవుడికి సంస్కృతి ఉంది. ఆనాడు మానవుడి ఆదిపత్యం ప్రకృతి మీదలేదు కాని నేడు ప్రకృతినే అనుకూలంగా మలచుకుంటున్నాడు.
    భారతదేశంలో ప్రవహించే జీవనదులలో గంగానది అతిపెద్దది అంతేగాక యమునతో సంగమించి మరింత పెద్దదిగా మారినది. భారతీయ నాగరికతా సాంస్కృతులకు ఆధ్యాత్మిక భావనకు ఈ నది ప్రతీక. ఈ నదీతీరంలోనే సువిశాల సామ్రాజ్యాలు ఏర్పడి అనేకమంది చక్రవర్తులు ఈ భూభాగ ప్రజలను పరిపాలించి ఎంతో అభివృద్ధినొందించారు. ఈ నదీతీరంలోనే భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలయిన ఋషికేష్‌, హరిద్వార్‌, ప్రయాగ, వారణాసిలు శతాబ్దాల తరబడిగా విలసిల్లుచున్నవి.
    దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది తన సుజల ప్రవాహంతో ఆకులు అలములు తినే ఆదిమానవుడి దగ్గర నుండి ఆధునిక ఇరవై ఒకటవ శతాబ్ది నాగరికతా స్థాయి వరకు అపూర్వమైన సాంఘీక, ఆర్ధిక, రాజకీయ, సాంస్క ృతిక మార్పులను తీసుకువచ్చినది. కృష్ణా గోదావరి నదీతీరాల్లోని ప్రాచీనులు ఎవరు వారి నాగరికత, సంస్కృతులు ఏమి అనేవిషయంలో పండితులు అనేక రకాలయిన అభిప్రాయాలను వెల్లడించారు.
    ప్రాచీనాంద్ర భూభాగాలలో అనాగరిక, కిరాతక, ఆటవిక జాతులు నివసించారని వారిలో ఆంధ్రులు లేరని పేర్కొన్నారు. ఆంధ్ర నామాంకితమైన జాతి ఒకి ఉన్నట్లుగా 'ఐతరేయ బ్రాహ్మణం' పేర్కొన్నది. విశ్వామిత్రుడికి నూరుమంది పుత్రులని వారిలో యాభైమందిని శపించి కృష్ణా గోదావరి ప్రాంతాలలో జీవించమని పంపించాడని 'మత్స్యపురాణం' పేర్కొన్నది. ఆంధ్ర, పుండ్ర, శబరి, పులింద జాతులు వీరేనని చెప్పబడినది. విశ్వామిత్రుడు ఆర్యుడైనందున ఆయన సంతతిని ఆర్యసంతతికి చెందినవారని కొందరు పేర్కొంటున్నారు. అనార్యులే ఈ ఆదిమ తెగలవారని మరికొంతమంది పండితులు పేర్కొంటున్నారు.
    కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతంలో అనాదిగా నాగజాతి ప్రజలు జీవించినట్లుగా బౌద్ధ వాంఙ్మయం తెలియజేయుచున్నది. ఈ జాతివారు సమానత్వాన్ని బోధించిన బౌద్ధమతాన్ని స్వీకరించారు. మౌర్య అశోకుని కన్నా ముందే ఆంధ్రదేశంలో వీరు బౌద్ధాన్ని స్వీకరించారని, బౌద్ధవాస్తును నిర్మించారని తెలియుచున్నది. గోదావరీ నదీ పరీవాహక ప్రాంతంలో మానవులు నివసించ శక్యంకాని 'దండకారణ్యం' ఉండేదని అది అంధకారబందురమైన ప్రాంతం కనుక 'అంధ' దేశమని దానిలో నివసించిన జాతులు అంధులు తర్వాత ఆంధ్రులు అయ్యారని 'ఆంధ్రాక్షర తత్వం'లో తెలుపబడినది.
    బ్రహ్మాండ పురాణం కృష్ణా గోదావరి పరీవాహక ప్రదేశాన్ని 'త్రిలింగ దేశసీమా' అని పేర్కొన్నది. ఆంధ్ర దేశానికి ఆరంభం నుండి నేికి పిలువబడుచున్న పేరు 'తెలుగు' ఈ పేరు ప్రథమంలో త్రికలింగంగా ఉండేదని క్రమంగా 'త్రిలింగం'గా మారిందని పండితుల అభిప్రాయం. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం త్రిలింగాలు. శ్రీశైలం కృష్ణానదీతీరంలోనూ, కాళేశ్వరం, ద్రాక్షారామం గోదావరీ తీరంలోనూ సుప్రసిద్ధ దేవాలయాలు ఈ మూడు ప్రాంతాల విస్తీర్ణమే త్రిలింగ దేశం.
    నన్నయ్య భ్టారకుడు ''ఆంధ్ర మహాభారతం''లో తెనుగు అనే మాటను ప్రయోగించెను. అది క్రమేణా తెలుగు అయింది. తెలంగిరి, తెలంగాణ్యులు అనేపేర్లు ప్రాచీన కాలానికి చెందినవని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం.
    క్రీ.శ.1-2 శతాబ్దాల కాలంలో కృష్ణా గోదావరి నదుల ముఖద్వారం నుండి పెద్ద పెద్ద పడవలు ప్రయాణించేవని, ప్రయాణికులకు సరుకుల రవాణాకు అనేకరకాలైన పడవలుండేవని ఆంధ్ర దేశం నుండి విదేశీ వర్తక వాణిజ్యాలు కొనసాగుచున్నట్లుగా 'ోలమీ'అను చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ ఆంధ్రదేశంలో గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఏర్పడిన నగరమే రాజమండ్రి. మెగస్తనీస్‌ పేర్కొన్న ఆంధ్రదేశ పట్టణాలలో రాజమండ్రి ఒకి ఉందని తెలుయుచున్నది.
    గోదావరి నదికి రాజమండ్రికి అవినాభావ సంబంధం వుంది. గోదావరి నది వలన ఎన్నో ఏండ్లుగా ఈ నగరం అభివృద్ధి చెందటమేకాక అనేక సందర్భాలలో తనలో కలుపుకొని స్వరూప స్వభావాలనే మార్చివేసింది. ఆ చరిత్ర కాలాతీతమైనది. అయినా ఈ పురప్రజలకు గోదావరిమాతన్నా ఆమె పుష్కరాలన్నా ఎంతో ఇష్టం.

శ్రీ సద్గురు శివానందమూర్తి


    ఉర్దాం జమిందారు వంశంలో శ్రీ కుందుకూరి శివానందమూర్తిగారు 1928 డిసెంబరు 20 అర్ధరాత్రి 12.38ని.లకు రాజమండ్రిలో శ్రీ కందుకూరి వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళ దంపతులకు పుత్రునిగా జన్మించారు. వారిది ఆర్వేల నియోగివంశము, లోహితస గోత్రము, సంప్రదాయము లింగధారణాది శైవదీక్షయుతమగు శైవాచారము.
    శ్రీ శివానందులు బాల్యంలో ఎంతో ముద్దుగా గారాబంగా పెరిగారు. తల్లి ప్రథమ గురువై రామాయణ, భారత, భాగవత కథలతోపాటు నీతి శతకాలను నూరిపోయడంతో పూవు పుట్టగానే పరిమళించినట్లు బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతన అలవడింది. తల్లి కృష్ణ భక్తురాలు. తండ్రి శ్రీరామభక్తుడు, కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వేడుగ్గా శ్రద్ధా భక్తితో నిర్వహించేవారు. శ్రీ శివానందమూర్తిగారికి హరిహరాద్వైత భావన జన్మతః లభించిన మహోత్తమ వైశిష్ట్యము.
    గురుదేవుల విద్యాభ్యాసము రాజమండ్రిలోనే కొనసాగింది. బాల్యం నుండి యోగాభ్యాసం పై అభిరుచి ఉండడం వలన తరచు ప్రాణాయామం, ధ్యానం వింవి చేస్తూ ఉండేవారు. గురువుగారు 12 ఏళ్ళ వయసులో ఒకరోజు కొవ్వూరు గోదావరినదిలో స్నానం చేస్తూ ఉండగా, ఉత్తరదేశం నుండి వచ్చిన ఒక యోగి ఈ బాలుని ముఖంలో తేజస్సు చూసి దగ్గరకు పిలిచి ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో పఠించడం చూసి ఆ యోగి మొత్తం 32 మంత్రాలను ఉపదేశించి, 32 రోజులలో గొప్ప సిద్ధి లభిస్తుందని ఆశీర్వదించారు. తరువాత ఆ యోగి శ్రీ శివానందమూర్తిగారిని పిలిచి నువ్వు గొప్ప యోగి అవుతావని చెప్పి. అతని చేతిలో 16 గింజలను ఉంచి, ఒక్కొక్క మంత్రము చెబుతూ గోదావరిలో పడవేయమన్నారు. భయపడకుండా ఆ కార్యం నిర్వహిస్తే యోగసిద్ధులు లభిస్తాయని చెప్పి ఆశీర్వదించి ఆ యోగి నిష్క్రమించాడు.
    గురుదేవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యోగిచెప్పినట్లు మంత్రాలను పఠిస్తూ 16 గింజలు గోదావరి నదిలో వేయగానే 4 వైళ్ళపొడువైన వెయ్యి పడగల సర్పం ఒకి తనవైపు రావడం చూసి నిర్భయంగా కళ్ళుమూసుకొని, నమస్కారం చేసేసరికి ఆ సర్పం అమాంతం గురుదేవునిపై పడి శరీరంలో లీనమైపోయింది. ఆ విధంగా కుండలినీ శక్తి స్వామివారిలో జాగృతమయింది.
    గురువుగారు బాల్యంలో కొన్నాళ్ళు నెల్లూరులో ఉన్నప్పుడు, అక్కడ శ్రీరమణ కేంద్రంలో సామూహిక ధ్యానంలో ఉండగా శ్రీ రమణమహర్షి ఎదుట సాక్షాత్కరించి, ఎదురుగా నిలబడి గురువుగారి తలపై జుత్తులోనుండి అయివేళ్ళు పోనిచ్చి శిరస్సుపై హస్త ఉంచడంతో దివ్యానుభూతిని పొందేరు. ఆ విధంగా గురువుగారికి శ్రీరమణ మహర్షువారి ఆశీస్సులు కృప లభించింది.
    గురువుగారికి దేశ భక్తి మెండు ఒక సందర్భంలో 'కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పడుకుని పొర్లాలనిపిస్తోంది' అన్నారు. ఆ మాటలే భారతదేశంపై వారికున్న ప్రేమ, సంసార బంధనాలు తెంచుకోకుండా కాషాయాన్ని ధరించకుండా ఉత్తమ సంప్రదాయాలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనతో పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చని తెలియజేసి, నిరాడంబరంగా ఆధ్యాత్మిక చింతనాపరులను చేరదీసి వరంగల్‌లో 'శ్రీగురుధామ్‌ భీమునిపట్నంలో 'ఆనందవనం' పేరుతో రెండు ఆశ్రమాలు నెలకొల్పి 'సుపధ' ఆధ్యాత్మిక పత్రికను కూడా నడుపుతున్నారు.
    మొత్తం ప్రపంచంలో విశ్వశాంతి నెలకొలపడానికి అనేకచోట్ల కాశీ, ప్రయాగ, నైమిశం, ప్రభాస, శ్రీశైలం, కన్యాకుమారి, గోకర్ణం, ఉజ్జయినీ, బదరికాశ్రమం, కేదారి, జోగీశ్వర్‌, మున్నగు పుణ్యక్షేత్రాలలో 400 రుద్రయాగాలు నిర్వహించి, భారతీయ సంస్క ృతిని పునరుద్ధరింపజేసారు. 1994లో 28 రోజులపాటు రుద్రయజ్ఞాన్ని భీమునిపట్నం ఆనందవనంలో నిర్వహించారు. మహాలక్ష్మిదేవి కాక్షం అందరికి ఉండి, భారతదేశం సుసంపన్నంగా ఉండాలని భీమునిపట్నం ఆనందవనంలో ఉత్కళ సాంప్రదాయ పద్ధతిలో చక్కని దేవాలయం నిర్మించారు.
    'మనకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము. సంతోషమే కానీ అంతకన్నా ముఖ్యమైనది మన దేశ క్షేమం. మన క్షేమం గురించి ప్రార్థించేకన్నా దేశ క్షేమంను గురించి ప్రార్థించే వారి క్షేమాన్ని భగవంతుడు ప్రధానంగా అనుగ్రహిస్తాడు. మానవసేవే మాధవ సేవని గుర్తుచేసి, అనే సేవాకార్యక్రమాలను ఇంా, బయట ప్రోత్సహించి సద్గురువగా పలువురిచేత పూజలందుకొంటున్నారు. శివాయ గురువే నమః.
    రాజకీయ, సాంస్క ృతిక ఆధ్యాత్మిక చరిత్రమీద ఆయన రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుాలుగా ముద్రితమయ్యాయి. కఠోపనిషత్‌ మీద ఆయన రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాటరాసిన డేవిడ్‌ ఫ్రాలీ ''అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శ్రీ శివానందమూర్తి'' అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమబుద్ధ (2008) ఆయన ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానంపట్ల సామాన్యుడికి సూర్తినిస్తూ ఆంధ్రభూమిలో ఆయన రాసిన 450 పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్‌లో 13 భాగాలుగా ప్రసారమైంది.
    సనాతన ధర్మ చారిటబుల్‌ ట్రస్టుకు ఆయన ప్రధాన ధర్మకర్త. లలితకళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ప్రతి సంవత్సరము శ్రీరామనవమినాడు ఘనంగా సన్మానించడం ఒక సాంప్రదాయంగా వస్తూంది.
    భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, న్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్‌ అకాడెమీని స్థాపించారు. రికార్డులకోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్‌ హాల్‌ను నిర్మించారు. ఇక్కడ వర్క్‌ షాపులను నిర్వహిస్తుాంరు.
    చెన్నైలోని శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్‌ ఆయనను 2000లో రాజలక్ష్మి ఆవార్డుతో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్‌ేతో సన్మానించాయి.
    ఆయన ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుాంయి. సనాతన ధర్మాన్ని చిత్త శుద్ధితో పాిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెబుతుాంరు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అంారు.
    శ్రీ శివానందమూర్తిగారు కల్చరల్‌ ట్రస్ట్‌, ఆంధ్రా మ్యూజిక్‌ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలు సహా ఎన్నో సాంస్క ృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించారు.
    శ్రీ శివానందమూర్తిగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్‌ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
    సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త సద్గురు శ్రీ శివానందమూర్తిగారు 10.06.2015 బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలప్పుడు (87 ఏట) వరంగల్‌లోని ములుగురు రోడ్డులో ఉన్న గురుధామ్‌లో శివైక్యం చెందారు.

గోదావరీ నది మాహాత్మ్యము

    తీర్థభేదము తీర్థవైశిష్ట్యము తీర్థసేవన ఫలము సకల తీర్థశ్రేష్ఠత్వ విషయమును బ్రహ్మపురాణమున గౌతవిూ మాహాత్మ్యము అను రెండవ భాగమున నూా అయిదు అధ్యాయములలో విపులముగా వివరించబడినది. గౌతవిూనదిలో 92 తీర్థములు ఈ పురాణములో విపులముగా వర్ణించబడినది. గౌతవిూ మాహాత్మ్యము అనుపేరుతో విడిగా ఒక గ్రంథమునే అందించిన తెలుగురాష్ట్రప్రజలకు ఉత్తమసేవగా మారును. ఆ పని దేవాదాయధర్మాదాయశాఖనే చేయవలయును దానిలో మన గోదావరి మన గౌతమి అనుకొనే నదీమతల్లిలో ఎంతమంది మహానుభావులు మునిగితరించినారో ఎన్ని పుణ్యతీర్థములు ఎన్ని పుణ్యక్షేత్రములున్నవో తెలియునుకదా. ఈ పవిత్ర కార్యమునకు ఈ శాఖ నడుము కడుతుందని తలచు చున్నాను. అట్లు లేనినాడు ఒక్కొక్క నెల ఆరాదనలో ఒకో రెండో లేదా మూడు అధ్యాయములు ధారావాహికముగా ప్రసరించినను ఒక మూడు సంవత్సరములు ముగియును. ఆ పఠమును ప్రసాదమును అందించునని తలంచుచు ఈ వ్యాసమను అందించు చున్నాను.
    ఈ విభవము బ్రహ్మనారదసంవాద రూపమున బోధింపబడినది. అందున నారదభగవానుడు చతుర్ముఖ బ్రహ్మను తన తండ్రిని ఇట్లు ప్రశ్నించెను.
        తపసోయజ్ఞదానానాం తీర్థసేవనముత్తమమ్‌                                    ఇతిశ్రుతం మయాత్వత్తో జగద్యోనే జగత్ప్రభో                                     దైవాని ముని శార్దూల ఆసురాణ్యా ఋషాణి చ                                కి యద్భేదాని తీర్థాని కిం ఫలాని సురేశ్వర                                    సర్వేషామేవ తీర్ధానాం సర్వదాకిం విశిష్యతే.
    తపసులలో యజ్ఞం, దానములలో తీర్థములను సేవించుట ఉత్తమము అని నేను నీ నుండి వినియుింని, దైవములు ఆసురములు, ఆ ఋషములు ఇట్లు తీర్థభేదములు ఎన్ని విధములు. ఏ తీర్థములు యే యే ఫలములను ప్రసాదించును. అన్ని తీర్థహులలో విశిష్టతీర్థములు ఏవి అని నారదమహర్షి అడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పెను.
        చతుర్విధాని తీర్థాని స్వర్గే మర్త్యేరసాతలె                                    దైవాని ముని శార్దూల ఆసురాణ్యా ఋషాణిచ                                    మానుషాణి త్రిలోకేషు విఖ్యాతాని సురాది భి.
    తీర్థములు నాలుగు విధములుగానుండును. ఇవి స్వర్గమున, మర్త్యలోకమున, పాతాలమున నున్నవి. దైవములు, ఆసురములు, ఆర్షములు, మానుషములు. ఇవి మూడులోకములలో సురాదులచె ప్రసిద్ధిపొందినవి.
    మానుషతీర్థములకంటే ఆ ఋషతీర్థములు సర్వకామ ఫలప్రదములు ఆ ఋషతీర్థములకంటే ఆసుర తీర్థములు బహుపుణ్యఫలప్రదములు. ఆసుర తీర్థములకంటే దైవతీర్థములు సార్వకామికములు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలచే నిర్మించబడిన తీర్థములు దైవతీర్థములనబడును. ఆ మువ్వురిచేత ఒకటే నిర్మించబడినచో దానికన్నా శ్రేష్ఠమైనది ఇంకొకియుండదు. మూడు లోకములకు సేవించదగిన తీర్థము మానుష తీర్థము. మానవ తీర్థములలోకూడా జంబూద్వీపములోని తీర్థములు శ్రేష్ఠములు. జంబూద్వీపములోని తీర్థములకంటే భారతవర్ష తీర్థములు శ్రుతి ప్రసిద్ధములు. భారతవర్షములోనూ దండకారణ్యము సాిలేని సర్వతీర్థశ్రేష్ఠము. ఇది కర్మభూమిగాన సర్వోత్తమ తీర్థమందురు. ఇపుడు అక్కడున్న తీర్థముల నామములను సంక్షేపముగా చెప్పెదను వినుము. దైవమానుష ఆసుర భేదములతో హిమవత్‌ వింధ్య పర్వతముల మధ్య ఆరునదులున్నవి. ఇవి దైవసంభవములు. దక్షిణ సాగరవిన్ధ్యనదులమధ్యలో ఒక ఆరున్నవి. ఇట్లు ఈ 12 నదులు ప్రధానముగా కీర్తించబడినవి. ఇందు వలననే భారతవర్షము బహుపుణ్యప్రదము అని సురాసురనరులచే పూజింపబడు చున్నది. దేవతలు సైతము ఈ భూమికి వచ్చి ఆయా కర్మలను చరించి తమకు కావలసిన ఫలములను పొందెదరు. ఇట్లు అందరికి అభీష్ట ఫలములను వర్షించునదిగాన భారతమును వర్షమందురు. దైవతీర్థములను ఆసురులు ఆవరించినచో దానిని దైవాసుర తీర్థములందరు. దైవతీర్థములలో తపస్సు చేయుటకు ఋషులు నివసించిన తీర్థములు దైవార్షతీర్థములు అనబడును. తమ శ్రేయస్సునకు ముక్తికి పూజకు అభివృద్ధికి తమ ఫలభూతికి కీర్తిని పొందుటకు మానవులు చేసిన తీర్థములు మానవ తీర్థములందురు. ఇట్లు బ్రహ్మపలుకగా నారదమహర్షి ఇట్లు అడిగెను.
    బ్రహ్మ భగవానుడా. కృతయుగాదిలో తీర్థసేవకు మించిన ఇంకొక ఉపాయము అల్పాయాసముతో అభీష్టమును ప్రసాదించునదిలేదు. కావున ఆ తీర్థములలో అతిశ్రేష్ఠములైన తీర్థములను చెప్పుటకు నిన్ను మించిన శ్రేష్ఠమైన వక్త ఇంకొరులేరు. అనగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగెను.
    గోదావరీ భీమరధీ తుంగభద్రా వేణికా తాపీ పయోష్ణీ. ఈ నాదులు విన్ధ్యనదికి దక్షిణమున కలవు. భాగీరధీ నర్మదా యమునా సరస్వతీ విశోకా వితస్తా ఈ నదులు హిమవత్పర్వతమును ఆశ్రయించినవి. ఈ నదులు పుణ్యతమములు. దేవతీర్థములుగా చెప్పబడుచున్నవి.
    గయుడు కోలాసురుడు. వృత్రాసురుడు త్రిపురుడు అన్ధకుడు హయశీర్షుడు లవణుడు నముచి శృంగకుడు యముడు పాతాలకేతువు మధువు పుష్కరుడు. వీరిచే ఆవరించబడిన తీర్థములు ఆసురతీర్థములనబడును. ప్రభాసుడు భార్గవుడు అగస్తి నరనారాయణులు వసిష్ఠుడు భరద్వాజుడు గౌతముడు కశ్యపుడు మనువు ఇత్యాది మునిసేవితములు. ఋషితీర్థములు అంబరీషుడు హరిశ్చన్ద్రుడు నహుషుడు శ్రీరామచంద్రుడు కురువు కనఖలుడు భరతుడు సగరుడు అశ్వయూపుడు నాచికేతువు వృషాకపి అరిందముడు ఇత్యాది మానవులు నిర్మించిన తీర్థములు మానవతీర్థములు.
    ఎవరూ త్రవ్వని తీర్థమును దైవఖాతమందురు. ఇట్లు సంక్షేపముగా నీకు తీర్థభేదమును తెలిపితిని. దీనిని తెలిసిననూ నరుడు సకల పాపవినిర్ముక్తుడగును.
    ఇట్లు బ్రహ్మ పలుకగా నారదమహర్షి మరల ఇట్లు ప్రశ్నించెను. త్రిదైవత్యతీర్థము సర్వతీర్థములకంటే ఉత్తమోత్తమమని వినియుింని. ఆ త్రిదైవత్యస్వరూపమును బేదమును విస్తరముగా చెప్పగోరుచున్నాను. అనగా బ్రహ్మ ఇట్లు చెప్పుచున్నాడు. త్రిదైవత్యతీర్థము కనపడువరకే ఇతర తీర్థములు ఇతర పుణ్యభూములు సకల యజ్ఞాదులు వ్రతోపవాస కృచ్ఛ్రములకాంచే గంగాసేవగొప్ప ఫలమును ప్రసాదించునది. ఆయా సకల తీర్థములలో కృచ్ఛ్రకములు కనపడుచునేయుండును. ద్రవ్యము ఆత్మమాత జనకాదులు దేవతలకు శుద్ధిని కలిగింతురు. ఒక త్రిదైవత్యములేనినాడు పాపక్షయమెట్లు కలుగును? ఈ గంగ సకల నదులలో శ్రేష్ఠమైనది. స్మరించబడినను దర్శించిననూ స్పృశించిననూ సకల కాంక్షితములను సర్వనామములను ప్రసాదించునది. ఇక ఇపుడు ఈ త్రిదైవత్వము యొక్క పుట్టుకను వినుము. పదివేల సంవత్సరములకు పూర్వము  ఒక దైవకార్యము సంభవించినది. తారకాసురుడు మహాబలశాలి. నా వరముతో అతిగర్వితునిగా ఉండెను. ఆ బలీయునిచే దేవతల పరమైశ్వర్యము హరించబడినది. అంతనే దేవతలందరూ క్షీరసాగర శాయిని సకల జగత్తులకు ప్రపితామహుని శ్రీమన్నారాయణుని శరణువేడిరి. చేతులు జోడించినవాడై అనన్యమైన భక్తితో శ్రీ మహావిష్ణువుతో ఇట్లు పలికిరి. నాధా! జగత్తులను రక్షించువాడవు నీవే. దేవతలకీర్తిని పెంచువాడా సర్వేశ్వరా, జగత్కారణభూతా వేదస్వరూపా నీకు నమస్కారము. ఈ లోకములను సృజించువాడవు. అసురులను వధించువాడవు సకల జగములకు పతివి నీవే. సృష్టి స్థితి లయములకు కారణము నీవే. సకల విధములైన ఆపదలను వించినవారికి ఈ మూడు లోకములలో నీవు తప్ప ఇంకొక రక్షకుడులేడు. వుండరీకాక్షా! నీవు లేనినాడు తాపత్రయములను నివారించగలవాడింకొకడులేడు. అఖిల జగములకు తల్లివి తండ్రివి నీవే. సేవలకు సులభుడవునీవే. ఈశా ప్రసన్నుడవుకమ్ము! మహా భయముల నుండి కాపాడుము. ఈ ఆర్తిని హరించువాడు నీకంటే ఇతరుడు ఎవడున్నాడు? ఆది కర్తవైన వరాహమునీవే. మత్స్యము కూర్మము నీవే. మాకు భయము కలిగినపుడు ఇటువిం రూపభేదములను స్వీకరించి మమ్ములను రక్షించు చున్నావు. అధికారము హరించబడినది. మా భార్యలను హరించియున్నారు. మా నివాసములను హరించియున్నారు. ఇంకొక దిక్కులేని మమ్ములను ఎందుకు రక్షించలేదు. ఇట్లు దేవతలు ప్రార్థించగా శేషశాయి శ్రియః పతి ఇట్లు పలికెను. విూకేవరివలన భయము కలిగినదో దానిని చెప్పుడు. విూరు కలతను విడువుడు.
    అంతట ఆ దేవతలు శ్రియఃపతి శ్రీమన్నారాయణునితో ఆ దేవతలు తారకాసురవధను కూర్చి తెలిపిరి. భయంకరమైన రోమములు నిక్కపోరుచుకొను భయము తారకాసురునివలన సంప్రాప్తించినది. యుద్ధములో కాని తపస్సుతోకాని శాపముతోకాని ఇతని మేము వధించజాలము. పదిరోజులలోపు బాలుడు అతని  నుండి తారకాసురుడు మృత్యువును హరించును. అతడు ఇతరులవలన మృత్యువును పొందడు. కావున ఆ విషయమున  నీతిని ఏర్పరుచుడు. అపుడు నారాయణుడు ఇట్లు పలికెను. ఆ తరాకాసురుడు నా వలన కాని నా సంతానము వలనకాని దేవతలవలనకాని మరణించడు. శంకరుని వలన కలిగిన చాలాశక్తి కాలసంతానము వలన మాత్రమే తారకాసురుడు మృత్యువును పొందును. కావున దేవతలందరు ప్రయత్నించుటకు బయలుదేరారు. శంకరుని భార్యకొరకు దేవతలందరూ ప్రయత్నం చేయవలయును. అనగా దేవతలందరూ హివవత్పర్వతమును చేరిరి. అచట హిమవంతుని అతని ప్రియురాలైన మేనను చూచి వారితో ఇట్లు పలికిరి. దాక్షాయని జగన్మాత శివశక్తిగా ఉన్నది. బుద్ధప్రజ్ఞా ధృతిమేధ లజ్జ పుష్టి సరస్వతి ఇట్లు సకల లోకపావనిగా అనేక నామములతో రూపములతో నున్నది. దవేతల కార్యమును నెరవేర్చుటకు మా గర్భమున ప్రవేశించినది. జగన్మాత విూకు పుత్రికగా ప్టుినది. శంకరుని భార్యకాగలదు. మమ్ములను మిమ్ములనుకూడా రక్షించగలదు. ఆ మాటలను వినిన హిమవానుడు కూడ ఆ దేవతలను అభినందించెను. మేన కూడా చాలా ఉత్సాహము కలదై ఇట్లే అగుగాక అని పలికెను. అపుడు జగద్ధాపు గౌరిషిమవంతుని ఇంిలో ప్టుినది. ఆమె నిరంతరము శివధ్యానరతురాలు. శివప్రియ. శివపరాయణురాలు. ఆమెతో దేవతలు శంకరుని కొరకు తపము నాచరించుము అని ప్రార్థించిరి. అంతా ఆ గౌరి హిమవచ్ఛిఖరముపై శంకరుని కొరకు ఘోరమైన తపము నాచరించెను. అంతట దేవతలు మరల ఇట్లు ఆలోచించసాగిరి. ఈ శివుడు పార్వతిని ఎట్లు ధ్యానించును. శంకరుడు తననుకాని ఇతరమునికాని తలచుటలేదు. అయినపుడు మేనాసుతం ముందు పార్వతియందు చిత్తమునెట్లు నిలుపును. ఈ విషయమున నీతిని ఏర్పరచ వలయును. అపుడు మేలును పొందెదము. అంత మహామలు ఉదారబుద్ధి అయిన బృహస్పతి ఇట్లు పలికెను.
    బుద్ధిమంతుడైన మన్మథుడు కందర్వుడు పుష్పబాణములు కలవాడు శంకరుని పూల బాణములతో కొట్టవలయును. అట్లు కొట్టబడిన శివభగవానుడు పార్వతియందు మనసును నిలుపును. అపుడు హరుడు గిరిజను వివాహము చేసుకొనగలడు. జయశీలుడైన పంచబాణుని బాణములు ఎక్కడా మొక్కపోలేదు. అట్లు శంకరుడు ఆమెను వివాహము చేసుకొనినచో వారికి పుత్రుడు కలుగును. ప్టుిన పుత్రుడు తప్పక తారకాసురుని వధించగలడు. కావున మన్మథునికి సహాయము కొరకు వసంతుని శోభనకారుని పంపుడు. మనసుతో సతోషింప చేయు వానిని మన్మథునికి ఇండు. అంతట దేవతలు అట్లే కుసుమాకరుని అనగా వసంతుని మన్మథుని శివుని సన్నిధికి పంపిరి. ఆ మన్మథుడు కాళావసంతునితో ధనువును ధరించి త్వరగా రతీదేవితో కూడి సుదుష్కరమైన కార్యమును చేయుటకు వెళ్లెను. శరచాపములను ధరించి ఈశ్వరుని ముందు నిలిచెను. లోకగురువు సకల లోకములకు ప్రభువైన శంకరుడు కొట్టదగనివాడు. ఇతనిని ఇపుడు నేను కొట్టవలయును. లోకత్రయమును శయించు నా బాణములు శంకరునియందు దృఢములగునా? కావా? ఇట్లు తలచుచు బాణప్రయోగమును చేసెను. అంతట శంకరుడు కోపించి అగ్నినేత్రములతో మన్మథుని భస్మము చేసెను. ఆ గొప్ప కార్యమును చూచుటకు దేవతలందరు అక్కడికి వచ్చిరి. అపుడు అక్కడ అత్యాశ్చరకరమైనది జరిగినది. వినుము.
    దేవగణములు శంకరుని చూచి మన్మథుని చూచునంతలోనే భస్మమైన వాముని ప్రార్థించిరి. చేతులు జోడించి తారకాసరుని వలన భయము కలిగినది గిరిసుతను భార్యగా చేసుకొనుడు. అని అంతట శంకరుడు బాణముతో కొట్టబడిన మనసుకలవాడైనను, దేవతల మాటను నెరవేర్చ దలిచెను. మహానుభావులు పరుల కొరకు తమ హితాహితమును లెక్కించరుకదా! అపుడు దేవతలు శంకరుని వివాహము కొరకు అరుంధతీ వసిష్ఠులను లక్ష్మీనారాయణులను పంపిరి. అపుడు హిమవల్లోకన్నాథులకు సంబంధము కలిగినది.
    అంతట వసిష్ఠ అగస్త్య పేలస్త్య లోమశాదులు చేరియుండగా మహోత్సవ సమరోహమున శివపార్వతుల వివాహము జరిగినది. ఆ వివాహమున పార్వతి సౌందర్యమును చూచి నాకు రేతస్స్ఖలనమైన వీర్యమును చూర్ణము చేసితిని. అట్లు చూర్ణము చేయబడిన నా వీర్యమునుండి వాలఖిల్య మహర్షులు అవతరించిరి. అపుడు అక్కడ దేవతలందరు పెద్దగా హా హా కారమును చేసిరి. అపుడు సిగ్గుతోపరిభూతుడనై ఆసనము నుండిలేచి బయలు వెడలితిని. దేవతలందరూ చూచుచు ఊరకుండిరి. అట్లు వెళ్ళుచున్న నన్ను చూచి శంకరుడు నందితో ఇట్లు పలికెను. బ్రహ్మను ఇక్కడికి పిలువుము అతని పాపమును తొలగించెదను. అపరాధము చేసిన వాని విషయమున కూడా సజ్జనులు కృపామయులుకదా విషయములు విద్వాంసుని కూడా మోహింపచేయును కదా. అపుడు ఇట్లు పలికి పార్వతీసహితుడైన పరమేశ్వరుడు నామీద దయతో సకల లోకముల హితమునకై ఇట్లు చేసెను. నారదా వినుము.
    పాపులపాపములు తొలగుటకు భూమి జలములు సమర్థములు కాగలవు. ఆ భూజలముల సారసర్వస్వమును తీసుకొని పావనము చేసెదను. ఇట్లు నిశ్చయించిన శంకర భగవానుడు ఆ భూమి జలముల సారమును స్వీకరించెను. భూమిని కమండలముగా చేసి దానిల జలమునుంచి పావమానది సూక్తములచే అభిమంత్రించి త్రిజగత్పావనమైన శక్తిని దానిలో స్మరించెను. అంతట శంకరుడు నాతో ఇట్లనె నుపాకమాడలమును స్వీకరించుము.
        ఆపోవై మాతరోదేవ్యం భూమిర్మాతాతధాపరా                                    స్థిత్యుతృత్తి వినాశానాం హోతత్వముఖయోః స్థితమ్‌                                అత్రప్రతిష్ఠితో ధర్మః అత్రయజ్ఞస్సనాతన                                    అత్ర భుక్తిశ్చ ముక్తిశ్చ స్థావరం జంగమంచయత్‌                                స్మరణాన్మానసంపాపంవందనా ద్వాచికంతధా                                    స్నానపానా భిషేకాచ్చ వినశ్యత్యపికాయికమ్‌                                    ఏతదేవామృతం లోకేనైతస్మాతాృవనా పరమ్‌                                    మాయాభిమంత్రితం బ్రహ్మన్ధృహాణేమంకమండలమ్‌                                అత్రత్యం వారియః కశ్చిత్‌ స్మరేవపి పిచేదపి                                    ససర్వకామానాప్నోతి గృహాణేమం కమండలమ్‌.
    జలములు మాతృదేవులు. భూమి మరొక హార సృష్టి స్థితి లయములకు హోతుత్వము. రిెంకీ ఉన్నది ఇందులోనే ధర్మము ప్రతిష్ఠించబడినది. ఇందులోనే సనాతన యజ్ఞము ప్రతిష్ఠించబడినది. భుక్తి ముక్తి ఇందులోనే యున్నది. స్థావర జంగమములు ఇందులోనే ఉన్నవి. దీనిని స్మరించుట వలన మానస పాపము వందనము వలన వాచిక పాపము స్నాన పానాభిషేకముల వలన కాయికపాపము నశించును. లోకమున ఇదియే అమృతము. దీని కవంటే పావనమింకకొిలేదు. నేనభిమంత్రించిన ఈ కమండలమును నీవు స్వీకరించుము. దీనిలోనున్న ఈ జలమును స్మరించిననూ పానము చేసిననూ అతను అన్ని అభీష్టములను పొందును. కావున ఈ కమండలమును తీసుకొనుము. పంచభూతములలో ఆపోభూతమే మహాభివృద్ధికలది. ఆ జలములో ఇవి ఉత్కృష్టజలములు కావున ఈ కమండలమును స్వీకరించుము. ఇక్కడున్న జలము శోభనము. పుణ్యము, పావనము కూడా. కావున దీనిని స్పృశించి స్మరించి దర్శించి నీవు పాపమునుండి విముక్తుడవయ్యెదవు. ఇట్లు  ఇట్లు పలికి మహాదేవుడు నాకు కమండలమునిచ్చెను. అంతట దేవతాగణమంతయూ సంతోషముతో సురేశ్వరుని స్తుతించిరి. అక్కడ గొప్ప ఆహ్లాదవాతావరణము నెలకొనెను. జయ జయ ధ్వానములు నెలకొనెను. శివభగవానుని వివాహమున పార్వతీమాతపాద అగ్రభాగమును చూచి పాపబుద్ధితో పతితుడనైతిని. దయానిధియైన శంకరుడు స్మరించి పవిత్రమైన దానిని పుణ్యమైన కమండలమున కల గంగను స్మరించి నాకిచ్చెను. ఇట్లు చెప్పగా నారద భగవానుడు మరల ఇట్లు ప్రశ్నించెను.
    కమండలములోని జలము తమ పుణ్యమును పెంచునది మర్త్యలోకమునకు వెళ్ళిన విధానమును తెలుపుడు అని అంతట బ్రహ్మ ఇట్లు పలికెను.
    బలియనుదైత్యరాజు దేవశత్రువు. ఓటమి ఎరుగనివాడు ధర్మముతో యశస్సుతో ప్రజాసంరక్షణతో గురుభక్తితో సత్యముతో వీర్యముతో బలముతో త్యాగముతో క్షమతో మూడులోకములకు అతనికిసాి ఇంకొకరులేరు. అతని ఉన్నత సమృద్ధిని చూచి దేవతలు చింతాపరాయణులు అయిరి. వారు తమలో తాము ఇట్లు ఆలోచించుకొనసాగిరి. బలిని ఎట్లు గెలిచెదము. బలిచక్రవర్తి మూడులోకములను పాలించుచుండగా యే బాధలు లేకుండెను. శత్రువులేకుండిరి. వ్యాధులు లేవు. మానసిక చింతలులేవు. అనావృష్టిలేదు. అధర్మములేదు. నాస్తిశబ్దమే అతని రాజ్యమునలేదు. దుర్జనులులేరు. ఇది కలలోకూడా కనపడుటలేదు. అతని వైభవమును బలమును చూచిన దేవతలు విహ్వలులై శ్రీమహావిష్ణువును శరణుజొచ్చిరి. జగన్నాధా! శంఖ చక్ర గధాధరా! మేము ఆర్తులమైతిమి. నీవు మాకోసము ఆయుధములను ధరించుచున్నావు, నీవు మాకు నాధునిగా ఉన్ననూ మాకిలాిం దుఃఖమెట్లు కలుగుచున్నది. నిన్ను నమస్కరించు శిరస్సులు దైత్యుని ఎట్లు నమస్కారించవలయును. నీకై యజ్ఞములను చేసెదము. వాక్కులతో నిన్ను స్తుతించెదము. నీవే శరణుగా నున్న మేము దైత్యునికెట్లు నమస్కరించెదము. దేవతలు అందరూ నీ బలమునాశ్రయించినవారు ఇంద్రాదిదేవతలు నీవు ఇచ్చిన స్థానమును పొంది దైత్యునటెఉ్ల నమస్కరించెదము. నీవే బ్రహ్మవై సృజించెదవు. విష్ణువుగా రక్షించుచున్నావు. శంకరునిగా సంహరించుచున్నావు. అయినపుడు దైత్యునికి ఎట్లు నమస్కరింతుము.
    ఇట్లు పలికిన దేవతల మాటలను వినిన దైత్యాంతకుడు దేవతల కార్యసిద్ధికొరకు దేవతలతో ఇట్లు పలికెను. బలిదైత్యుడు కూడా నా భక్తుడే. సురాసురులచే గెలువశక్యముకానివాడు. మీరు నాచే పోషించబడువారు. అట్లే బలిదైత్యుడు కూడా నాచే పోషించదగినవాడే. కావున సంగ్రామము లేకుండగా త్రైలోక్యరాజ్యమును హరించి మంత్రోక్తిచే బలిని బంధించి విూకు విూ రాజ్యమును ప్రసాదించెదను. అంతట దేవతలు అట్లే ననిపలికి స్వర్గమునకు వెళ్ళిరి. శ్రీ మహావిష్ణువు అదితిగర్భమున ప్రవేశించెను. ఆ మహానుభావుడు అవతరించినపుడు ఉత్సవములు జరిగినవి. ఆ శ్రీహరి వామనునిగా పుట్టెను. అతనే యజ్ఞేశుడు. యజ్ఞపురుషుడు. ఇంతలో బలిచక్రవర్తి బలము కలవారిలో శ్రేష్ఠుడు ఋషిముఖ్యులతో కలిసి అశ్వమేధయాగమునకై దీక్షితుడాయెను. వేదవేదాంగములు చక్కగా తెలిసిన పురోహితుడైన శుక్రాచార్యులు ఆ యజ్ఞమును ప్రవర్తింప చేయుచుండెను. బ్రహ్మస్థానమును స్వీకరించి శుక్రాచార్యులు ఆసీనుడు కాగా దేవగంధర్వ పన్నగులు హవిర్భాగము కొరకు ఆసీనులు కాగా దానము చేయుడు. భుజించుడు, పూజించుడు. ఇది పూర్ణమైనది. మరల దీనిని పూర్ణము చేయుడు ఇట్లు పలుకు చుండగా మెల్లగా ఆ ప్రదేశమునకు సామగానము చేయుచు వానుడు వచ్చెను. ఛత్రమును కుండలములను ధరించిన వామనుడు ఆ యజ్ఞవాటమునకు వచ్చెను. ఆ యజ్ఞమును ప్రశంసించుచున్న వామనుని చూచిన శుక్రాచార్యులు బ్రహ్మరూపధరుని వామనదేవుని దైత్యసూదనుని యజ్ఞములను తపస్సులను ప్రసాదించువానిని రాక్షసులను సంహరించువానిని తెలిసి త్వరపడుచు బలిచక్రవర్తితో ఇట్లు పలికెను. వామనాకారముతో నీ యజ్ఞశాలకు వచ్చుచున్న ఈ బ్రాహ్మణుడు ఇతను వాస్తవముగా బ్రాహ్మణుడుకాడు. ఇతడు యజ్ఞేశుడు. యజ్ఞభావనుడు. ఇతను నిన్ను యాచించుటకు వచ్చుచున్నాడు. ఇతను పరమ పురుషుడు. నాతో ఆలోచించిన తరువాతనే అతనికి నీవు దానమును చేయవలయును. ఆ మాటలను వినిన బలిచక్రవర్తి ఇట్లు పలికెను. నేను ధన్యుడనైతిని. సాక్షాత్తుగా యజ్ఞేశ్వరుడే నేనూహించకుండానే నా ఇంికి వచ్చు చున్నాడా ఇట్లు యజ్ఞేశుడే వచ్చి యాచించినచో ఇంకా ఆలోచించవలసినదేమున్నది? ఇట్లు పలికిన బలిభార్యతో కలిసి పురోహితుడైన శుక్రాచార్యులతో కలిసి అదితినందనుడు వామనుడు బ్రాహ్మణుడునున్న ప్రదేశమునకు వెళ్లెను. చేతులు జోడించి ఎందుకు వచ్చితిరి. ఏమి కావలయును అని అడిగెను. అంతట వామనుడు కూడా మూడడుగుల భూమిని నివాసమునకు ఇమ్ము ఇంత కన్నా వేరేవాిని కోరను. బలిచక్రవర్తి అట్లే అని నానారత్నవిభూషితమైన కలశమునుండి వారి ధారను విడిచివామనునకు భూమిని ఇచ్చెను. ఋషలు, ముఖ్యులు పురోహితుడైన శుక్రాచార్యులు దేవతలు అందరూ చూస్తుండగా బలిచక్రవర్తి వామనునకు భూమినిచ్చెను. భూమిని తీసుకొనుడు అని బలిచక్రవర్తి పలికినంతనే జరిగిన దానిని వినుము. అట్లే అని బలిచక్రవర్తి వామనుని చూడగా యజ్ఞపురుషుడు చంద్రాదిత్యుతిస్తనాంతాములుగా నుండునట్లు పెరిగెను. విక్రమాకారముగా పెరిగెను అనంతుడు అచ్యుతుడు లోక కర్తాజగన్మయుడు. అతనిని చూచి భర్యతో నున్న బలి ఇట్లు పలికెను. వినయముతో జగన్మాయా? నీ శక్తిమేరకు విక్రమించుము. దేవేశా. నేను సర్వభావముతో నిన్ను గెలిచితిని. బలి అట్లు పలుకుచుండగానే శుక్రాచార్యులు ఇట్లు పలికెను. రాజేన్ద్రా నేను బుద్ధితో ఆలోచించి మొదటే బాధించితిని. ఆ మాటలతోనే శ్రీహరి ఇట్లు పలికెను.
    దైత్యేశ్వరా! మహాబాహా! దైత్యరాజా. పెరుగుచున్నాను చూడుము. అపుడు బలిపెరుగుము, పెరుగుమ అనిపలికెను. అంతట శ్రీ మహావిష్ణువు కూర్మపృష్ఠమున పాదమునుంచి బలాకుజ్ఞమున పాదమునుంచెను. రెండవ పాదమును నా లోకమునుంచెను. అసురేశ్వరా, మూడవపాదమునకు స్థానములేదు. ఎక్కడ ఉంచవలయును. భూమిని ఇమ్ము! అని బలిచక్రవర్తితో పలికెను. అంతట బలిచక్రవర్తి నవ్వుచు ఇట్లు పలికెను. ఈ జగత్తును సృష్టించినవాడవు నీవే. నేను సృష్టికర్తనుకాను సురేశ్వరా? ఈ జగత్తునీ దోషము వలననే అల్పమైనది. జగన్మయా నేనేమి చేతును. అయినా కేశవా! నేనెపుడు అసత్యమును పలుకను, నన్ను సత్యవాక్యునిగా చేయుచు నావీపున నీ పాదమునుంచుము. అంతట ప్రసన్నుడైన భగవానుడు వేదస్వరూపుడు దేవపూజితుడు, నీ భక్తికి సంతోషించిని. నీకు శుభమగుగాక. వరమును కోరుకొనుము అని పలికెను.
    అంతట బలిచక్రవర్తి శ్రీమహావిష్ణువుతో నేను యాచించను. త్రివిక్రమా అనెను. అపుడు శ్రీమహావిష్ణువు తనకు తానుగా అతనికి చక్కని మనసుతో కోరిన దానిని రసాతలాధిపత్యమును భవిష్యదిన్ద్రపదవిని ఆత్మాధిపత్యమును నశించని యశస్సును ప్రసాదించెను. ఇట్లు బలిచక్రవర్తికి అన్ని ఇచ్చి పుత్రునితో భార్యతో రసాతాలమున బలిని ఉంచి త్రైలోక్యరాజ్యమును ఇంద్రునికిచ్చెను. ఇంతలో దేవతలతో అర్చించబడిన పాదము పాతాలమువరకు వెళ్లెను. నా తండ్రి అయిన ఆ మహావిష్ణువు యొక్క రెండవ పాదము నా ఇంిలోకి వచ్చిన దానిని దర్శించి ఆలోచించితిని. శ్రీ మహావిష్ణువు పాదము నా ఇంికి వచ్చినపుడు యేమి చేసిన శుభము కలుగును. అని ఆలోచించి అంతా చూచితిని. అపుడు నా కమండలమును శ్రేష్ఠమును చూచితిని, దానిలోని జలము పరమపుణ్యతమము పూర్వము త్రిపురారి ప్రసాదించెను. ఈ జలము వరము వరేణ్యము వరదము శాంతము శాంతికరము శుభము శుభప్రదము. నిత్యము భుక్తి ముక్తి ప్రదము లోకములకు మాతృస్వరూపము. అమృతము. భేషజము పవిత్రము పావనము పూజ్యము జ్యేష్ఠము శ్రేష్ఠము శుభావహము. స్మరించినంతనే లోకములను పావనము చేయునవి. ఇక దర్శించిన చెప్పవలయున     , అంతచె పవిత్రమైన ఈ జలమును నేను పవిత్రుడనై నా తండ్రికి అర్ఘ ్యముగా కల్పించెదను. ఇట్లు ఆలోచించి ఆ జలమును తీసుకొని అర్ఘ్యమును కల్పించి శ్రీ విష్ణుపాదముపైనుంచెను. అట్లు శ్రీ విష్ణుపాదమున పడిన ఆ జలము మేరుపర్వతమునందు నాలుగుగా నాలుగు దిక్కులకు ప్రవహించెను. భూమికి చెరెను. దక్షిణ భాగమున పడిన ఆ శ్రీ విష్ణుపాద జలమును శంకరుడు తన జటలుకాల శిరముతో స్వీకరించెను. పశ్చిమమున ప్రవహించిన జలము మరల కమండలమున చేరెను. ఉత్తరమున పడినది శ్రీ మహావిష్ణువు స్వీకరించెను. పూర్వమున పడిన దానిని ఋషులు దేవతలు పితృదేవతలు లోకపాలకులు శుభప్రదమైనది శ్రీ విష్ణుపాదపతతమని స్వీకరించిరి. కావున ఆ జలము సర్వశ్రేష్ఠమైనది.
    ఇక దక్షిణమున ప్రసరించిన లోకమాతచైన జలములు శ్రీ మహావిష్ణుపాదము నుండి ప్రవహించినవి బ్రహ్మణులు లోకమాతలు మహేశ్వరుడు శిరస్సుతో గ్రహించి జాజూటము నిలుపుకొనినవి శుభాదాయములు పరమపావనములు పుణ్యప్రదములు అయినవి ఆ శ్రీ విష్ణుపాదోదకమును శివుని జాజూటమున నిలిచిన వాిని స్మరించినంతనే సకల కామనలు నెరవేరును. అపుడు నారదమహర్షి ఇట్లు పలికెను.
    శంకరునిచే సృష్టించబడినవి బ్రహ్మకమండలమును చేరినవి శ్రీ మహావిష్ణువు పాదమును కడిగినవి శ్రీ శంకరభగవానుని శిరమున లంకరించినవి జలములు మర్త్యలోకమునకు అనగ భూలోకమునకేట్లు వచ్చినవో తెలుపుడు. అనగా బ్రహ్మ ఇట్లు పలికెను.
    మహేశ్వరుని జటలను చేరిన జలములు భూమికి వచ్చుటకు రెండు గాధలు చెప్పుచున్నారు. ఆ జలములను భూమిపైకి ఇద్దరు తీసుకొనివచ్చినారు. దానిలో ఒకి గౌతమ ఋషి భగవానుడు తన వ్రతగాన సమాధులతో శంకరుని పూజించి భూమిపైకి గొనితేబడినది. ఇక రెండవది బలీయుడైన క్షత్రియుడు శంకరుని ఆరాధించి భగీరధుడు భూమిపై తీసుకొని వచ్చినది రెండవ అంశము. ఇలా గంగకు రెండురూపములు ఏర్పడినవి.
    ఈ మాటలను వినిన నారదమహర్షి ఇట్లు పలికెను. మహేశ్వరుని జా జూటమునుండి ఏ కారణముచే గౌతముడు భూమిపైకి తీసుకొని వచ్చెను. అట్లే క్షత్రియుడు భగీరథుడు ఎట్లు తీసుకొని వచ్చెను అని అడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగెను. బ్రాహ్మణుడు ఎట్లు తీసుకొని వచ్చెనో క్షత్రియుడు ఎట్లు తీసుకొని వచ్చెనో దాని నంతనూ నీకు వివరముగా చెప్పెదను వినుము.
    శంకర భగవానునకు పార్వతీదేవి భార్యయైనపుడు గంగ కూడా శంకరునికి ప్రియురాలాయెను. శివభగవానుడు నాదోషమును తొలగించుటకు ఆలోచించి పార్వతితో కలిసి ఉన్న శంకరభగవానుడు దేవిని చూచి విశేషముగా రసవృత్తిలోనున్నంచున ఉత్తమ రసమును నిర్మించెను. రసిక ప్రియ స్త్రీ పావన కావున అందరికంటే గంగ అధిక ్పఇయురాలాయెను. తన శిరమున గంగ యున్నదని పార్వతి తెలియునుకాదా అనియే ఆ గంగనే ఆలోచించు చుండెను. ఆమె అనగా ఆ గంగ మరియొక కార్యసిద్ధికొరకు జామార్గమునుండి అవతరించినది అని శంకరుడు పార్వతికి చెప్పలేదు. గంగను శిరమున ధరించుటను తెలిసి పార్వతి సహించలేకపోయెను. జాజూటమున నిలిచిన గంగను మరల మరల చూచుచు అసూయతో ఈర్ష్యతో పార్వతి ఆ గంగను పంపుము పంపుము అని మాి మాికి చెప్పుచుండెను. శంకరుడు రసికుడు కావున ఉత్తమ రసరూపమైన గంగను విడిచిపెట్టలేదు. అపుడు పార్వతీదేవి దుఃఖముతో అనాధను అని పలికెను. శంకరుడు గంగను తన జటలలోనేదాచి ఉంచుటను చూచి వినాయకుని జయను కుమారస్వామిని రహస్యముగా ఇట్లు పలికెను. ఈ త్రిథేశ్వరుడు శంకరుడు కాముకుడు గంగను విడుచుటలేదు. ఆమె కూడా శంకరునికి ప్రియురాలు శంకరుడు ఆ ప్రియురాలని లిట్లు విడుచును. ఇట్లు చాలా విదాలుగా ఆలోచించి వినాయకునితో ఇట్లు పలికెను.
    దేవతలు అసురులు యకక్షులు సిద్ధులు చివరకు విూరు రాజులు ఇతరులు ప్రయత్నించినను శంకరుడు గంగను విడువడు, కావున నేను మరల హిమవత్పర్వతమునకు వెళ్ళి తపము చేసెదను. లేదా తపస్సులతో కల్మషము తొలగిన బాహ్మిణలు తపస్సు చేసి శంకరుని ప్రార్థించినచో జాజూటస్థిత గంగ భూమికిచెచునేమో అపుడు తల్లి మాటను వినిన వినయకుడు తల్లితో ఇట్లు పలికెను. సోదరుడు కుమారస్వామితో జయతో ఆలోచించి జాజూటమునుండి శంకరుడు గంగను విడుచు ఉపాయమును నిశ్చయించు ఆచరించెదము అని.
    ఇంతలో భూలోకమున 12 సంవత్సరములు ఘోరమైన అనావృష్టి భయంకరమైన కరువు యేర్పడినది. అపుడు స్థావర జంగమాత్మకమైన జగత్తు నశించుచుండెను. ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమము మాత్రము సర్వనామప్రదము పచ్చగా ఉండెను. నేను పూర్వము సృజించగోరి దేవయజన పర్వతముపై నేను యజ్ఞమును ఆచరించితిని. ఆ పర్వతము అప్పినుండి నా పేరుతో బ్రహ్మగిరిగా ప్రసిద్ధిపొందినది. గౌతమమహర్షి ఆ బ్రహ్మగిరిని ఆశ్రయించినివసించుచున్నాడు. శుభప్రదమైన బ్రహ్మిగిరిపైన నున్న అతని ఆశ్రమమున పరమపావనమున ఆధులు వ్యాధులు దుర్భిక్షము అనావృష్టి భయశోకములు దారిద్య్రములు వినరావుకూడా ఆ గౌతమహర్షి ఆశ్రమములో తప్ప ఇంకొక చోట హవ్యకవ్యమబులభించుటలేదు. కావున మరెక్కడా హోత దాత యష్టపాకుండెను, గౌతమహర్షి దానము యాగముచేసినపుడే స్వర్గమున దేవతలకు ఆహారములభించి తృప్తి కలుగుచున్నది. లేనిచోలేదు. ఇట్లు దేవలోకమున మర్త్యలోకమున ఒక్క గౌతముని పేరే వినవచ్చు చున్నది. దాత అంటే గౌతమమహర్షియే, హోత అంటే గౌతమ మహర్షియే. ఆ విషయమును వినిన నా నాశ్రమనివాసులైన మునులు గౌతమాశ్రమమునకు వచ్చుచుండిరి. అట్లు తన ఆశ్రమమునకు వచ్చిన మునులు అందరికి గౌతమ మహర్షి శిష్యునివలె పుత్రునివలె తండ్రివలె పోషకుడాయెను. యధాక్రమముగా అనురూపముగా అందరికి మునులకు శుశ్రూష చేయుచుండెను. గౌతమ మహర్షి ఆజ్ఞతో లోకమాతలైన ఓషధులు (పైరులు) అక్కడ ఆవిర్భవించెడివి. గౌతమహర్షి బ్రహ్మవిష్ణు మహేశ్వరులను ఆరాధించి నందున ఓషధులు పెట్టెడివి. మునులు భుజించు చుండెడివారు. గౌతమమహర్షి తపోబలముతో సంకల్పించుట విత్తనములు చల్లుట నారుపోయుట నాటుట పెరుగుట పండుట అప్పుడే జరుగుచుండెడిది. గౌతమహర్షి మనసులోనున్న అన్ని సిద్ధులు ఆవిర్భవించుచున్నవి.
    గౌతమహర్షి తన ఆశ్రమమునకు వచ్చిన మునులలో వినయముతో ప్రతిదినము శిష్యునివలె పుత్రునివలె దాసునివలె తమకాసేత చేయవలయును అని అడుగు చుండెడివాడు. చాలా సంవత్సరములు వారినందరిని తండ్రివలె పోషించసాగెను. ఇట్లు గౌతమ మహర్షి గొప్పఖ్యాతిని పొందెను. అపుడు వినాయకుడు తల్లిలో సోదరునితో జయతో ఇట్లు పలికెను.
    తల్లీ! దేవతల సభలో గౌతమహర్షి గానము చేయబడుచున్నాడు. దేవతలు కూడ చేయలేనిదానిని గౌతమహర్షి చేసెను అని. ఆ బ్రాహ్మణుని తపోబలము ఇంతిదని నేను వింని. ఆ మహర్షి శివజాజూటమునున్న గంగను కదలించగలడు. ఆ ఋషి తపస్సుతోకాని మరియొక దానితోకాని శంకరుని పూజించి ఆ గౌతమహర్షియె శివుని జాజూట గంగనిమ్మని శివునియాచించవచ్చును. ఇట్లు గౌతమ మహర్షి శంకర భగవానుని గంగను యాచించు నీతిని యేర్పరచవలయును. ఆ గౌతమహర్షి ప్రభావమువలన నదీశ్రేష్ఠగంగ  శంకరుని జాజూటమునుండి భూమిపై అవతరించును. ఇట్లు తల్లితో పలికిన వినాయకుడు సోదరునితో జయతో యజ్ఞోపవీతమును ధరించి బ్రహ్మచారిగా గౌతమాశ్రమమునకు వెడలెను. గౌతమాశ్రమ మరడలమున కొన్నిదినములు ఉంటూ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. ఇక్కడ మనము ఎక్కువ దినములు ఉండరాదు. మనము మన శుభకరమైన ఆశ్రమములకు వెళ్ళెదము. గౌతమ అన్నముతో పుష్టిని పొందినాము. ఇట్లు అందరూ వినాయక వాక్యముతో తమలో తామాలోచించుకొనుచు గౌతమమహర్షిని అడిగిరి. అంతట గౌతమ మహర్షి వారియందు స్నేహబుద్ధితో వారించెను.
    చేతులు జోడించి వినయముతో ఇక్కడే ఉండుడు. ముని పుంగవులారా విూ పాథుశ్రూషను చేయు చుందును. నేను పుత్రునివలె మిమ్ములను సేవించు చుండగా విూరు ఇంకొక ఆశ్రమమునకు వెళ్ళుట ఉచితముకాదు. అందరికి ఈ ఆశ్రమమే ఉచితమని నా తలంపు కావున మునులారా ఇంకొక ఆశ్రమమునకు వెళ్ళు తలంపుచాలును. ఇట్లు గౌతమమహర్షి మాటలను వినిన గణాధిపుడు తాను చేయవలసిన విఘ్నకృత్యమును ఆలోచించుచు బ్రాహ్మణులతో చేతులు జోడించి ఇట్లు పలికెను.
    గౌతమమహర్షి మనను తన అన్నముతో కొనినాడా మనల నెందుకు వారించుచున్నాడు. సామోపాయములో మనము మన ఆశ్రమములకు వెళ్ళజాలము. ఉపకారము చేసిన ఈ బ్రాహ్మణశ్రేష్ఠుడు దండించ దగినవాడేకాడు. కావున బుద్ధితో ఆలోచించి చేసెదను. దానిని అందరూ ఆమోదించుడు. అంతట బ్రాహ్మణులందరు అట్లే చేయుడు అనిరి. ఈ గౌతమమహర్షికి ఉపకారమునకు లోకముల హితమునుకకోరి బ్రాహ్మణులందరికి శ్రేయస్సు కలుగు విధముగా చేయుము. బ్రాహ్మణుల వాక్యమును విని గుణానురూపముగా చేసెదనని పలికి గౌతమునికి అనుకూలముగా చేసెదనని బ్రాహ్మణుల అనుమతినిపొంది తానుకూడా బ్రాహ్మణుడై బ్రాహ్మణులకు మరల మరల నమస్కరించి తల్లి అభిప్రాయమున నలిని జయతో ఇట్లు పలికెను. శుభాననో ఇతరులు తెలియకుండగా చేయుము. గోరూపమును ధరించి గౌతముని ఆశ్రమమునకు వెళ్ళుము. పైరునుభుజించి నశింప చేయుము. గౌతమమహర్షి ప్రహారము చేసిననూ హుంకారముచేసిననూ కోపముగా చూచిననూ పెద్దగా అరిచి బ్రతుకకు. మరణించకుము. అపుడు జయ గణాధిపుని అభిప్రాయములోనుండి అట్లే చేసెను. గౌతముడున్న ప్రదేశమునకు గోరూపమును ధరించి వెళ్ళెను. వరిపైరును తింటూ సంచరించుచుండెను. ఆ గోవును గౌతమమహర్షి చూచెను. వికృతముగానున్న ఆ గోవును చూచి గతమమహర్షి ఆ గోవును ఒక గడ్డిపరకతో నివారించెను. అట్లు వారించబడిన గోవు పెద్దగా అరిచి పడిపోయెను. ఆ గోవుపడగానే గొప్ప హా హా కారము జరిగెను. ఆ అరూపును విని గౌతమమహర్షి చేసిన దానిని చూచిన మహర్షులు బాధపడినవారై వినాయకుని ముందుంచుకుని ఇట్లు పలికిరి. ఇక మేము ఇపుడు నీ ఆశ్రమమున ఉండము. ఇక్కడిను రాడివెళ్ళెదము. పుత్రుని వలె పోషించితివి అని పలికితివికదా. ఆ మునుల మాటలను వినిన గౌతమ మహర్షి వెళ్ళుచున్న బ్రాహ్మిణులను చూచి వజ్రాయుధముతో కొట్టబడినవానివలె ఆ బ్రాహ్మణులముందు పడిపోయెను. అతనితో బ్రాహ్మణులు అందరు ఇట్లు పలికిరి. ఈ గోవు పడిపోయినది చూడుము, ఈ గోవు రుద్రులమాత జగత్పావని. సకల తీర్థదేవస్వరూపిణి. ఇంతి గోవువిధి బలముతో పడిపోగా ఇక మేము వెళ్ళవలయును, నీ ఆశ్రమమున ఆచరించిన వ్రతము వస్త్రమువలె జీర్ణమగును. బ్రాహ్మణోత్తమా మాకు ఇంకోధనములేదు. తపస్సే మా ధనము. అపుడు గౌతమమహర్షి ఆ బ్రాహ్మణుల ముందునిలిచి వినయముతో ఇట్లు పలికెను. విూరే మాకు శరణము. నన్నుపవిత్రుని చేయుడు. అంతట గణాధిప భగవానుడు ఇట్లు పలికెను. ఇది మరణించలేదు. అట్లే అని బ్రతికిలేదు. ఈ సందేహమున నిష్క ృతిని ఎట్లు చెప్పగలము. అనగా గౌతముడు మరల ఇట్లు పలికెను.
    గోవెపుడూ మూర్ఛపొందదు. మరణించును. ఇందులో సందేహములేదు. ఈ గోవెట్లులేచును. అట్లే ఈ కర్మకు ప్రాయశ్చిత్తమేమి చెప్పుడు దానినంతిని చేతును అనగా ఆ బ్రహ్మర్షులందరూ ఇట్లు పలికిరి. మా అందరి అనుమతితో మా అభిప్రాయమునే ఈ బుద్ధిమంతుడు చెప్పును. ఇతని మాటయే మాకు నీకు ప్రమాణముగా నుండును. ఇట్లు బ్రాహ్మణులు గౌతమహర్షి ప్రేరేపించగా విఘ్నరాజు బ్రాహ్మణ రూపముతో అందరితో ఇట్లు పలికెను. అందరి అభిప్రాయానుసారముగా నేను చెప్పుచున్నాను. నా మాటను ఇక్కడి మునులు గౌతమమహర్షికూడా ఆమోదించాలి. అవ్యక్తజన్మయైన బ్రహ్మయొక్క కమండలములోని జలము శ్రీ విష్ణుపాదమును కడిగి మహేశ్వరుని జా జూటమున నిలిచి ఉన్నది అని వినియుింమి. విూరు తపస్సుచే నియమముతో ఆ జలమునుతీసుకొనిరండు! ఆ జలముతో అభిషేకము చేసినచో ఈ గోవులేచును. అపుడు మేము ఇక్కడ ఉందుము. ఎప్పివలె ఉందుము బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇట్లు పలుకగా బ్రాహ్మణుల సభలో పుష్పవర్షము కురిసినది. జయ జయ శబ్దము మార్మోగినది.
    అంతట గౌతమమహర్షి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను. తపస్సుతో అగ్నిహోత్రుని అనుగ్రహముతో నా సంకల్పము సిద్ధించునుగాక. అంతట ఆ బ్రాహ్మణులు అట్లే అగుగాక అని ఆశీర్వదించి అన్న జలములతో సమృద్ధములైన తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి. ఆ బ్రాహ్మణులు అందరూ వెళ్ళిన తరువాత సోదరునితో ఇజయతో కలిసి గణేశుడు బాగాప్రీతి చెంది కృతకృత్యుడై తిరిగివెళ్ళెను. ఇట్లు బ్రాహ్మణులు వెళ్ళిపోగా గణేశుడు వెళ్ళగా తపస్సుతో కల్మషము తొలగిన గౌతమమహర్షి ఆ సంఘటనను ధ్యానించసాగెను. ఇదేమి? నాకు సంభవించినది? ఇట్లు చాలావిధములుగా ధ్యానించి జ్ఞానముతో అంతయూ తెలుసుకొనెను. ఇది దేవకార్యము వలన తనకు ఈ కిల్బిషము సంప్రాంప్తించినది. లోకముల ఉపకారముకొరకు శంకరుని ప్రీతికొరకు పార్వతీదేవి సంతోషముకొరకు గంగను తీసుకుని రావలయును. ఇది అంతయు శ్రేయస్కరమే. జగత్తునకు అగును, అసలు నాకు యేకిల్బిషములేదు. ఇట్లు మనస్సుతో ధ్యానించి గౌతమహర్షి చక్కగా ప్రీతి చెందెను. భార్యతో సంప్రదించుకొని ఇట్లు పలికెను. జగదీశ్వరుని త్రినేత్రుని వృషభధ్వజుని ఆరాధించి నదీశ్రేష్ఠమును తీసుకుని వచ్చెదను. గిరిపుత్రికను సంతోషింపచేసెదను. జగదంబకు సపత్ని మహేశ్వరుని జాస్థిత. ఇట్లు సంకల్పించి ముని ప్రవీరుడు గౌతమమహర్షి బ్రహ్మగిరినుండి కైలాసమునకు వెళ్ళెను. అక్కడ అధిష్ఠించియున్న ఉగ్రమైన తేజస్సుకలవానిని సురార్చితుని శంకరుని ప్రీతుని చేయుకు కైలాస శిఖరమునకు వెళ్ళి గౌతమభగవానుడు మౌనమును అవలంబించి కైలాస పర్వతొత్తమున దర్భలను పరిచి పరిశుద్ధడై కూర్చొని శంకరుని స్తుతించెను. శంకరుని స్తుతించు చుండగా పుష్పవృష్టి కురిసెను.
        ధర్మంవ్యవస్థాపయితుం విభజ్య                                        ఋవ్సామ శాస్త్రాణియజుశ్చశాఖా                                        లోకేచగాధా! స్మ ృతయ పురాణం                                        ఇత్యాదిశబ్దాత్మకతాముపైతి                                            యష్టాక్రతుర్యాన్యపిసాధనాని                                            ఋత్విక్స్వరూపంఫలదేశకాలా                                        త్వమేవ శంభో! పరమార్ధతత్త్వం                                        వదన్తియజ్ఞాంగమయంవపుస్తే.
    ఇట్లు పదకొండు శ్లోకములు శంకరస్తుతి పదకొండు శ్లోకములు అమ్మపార్వతీ స్తుతి చేసెను. ఇది అద్భుతమైన స్తుతి. పరమార్ధప్రదము. పరమ జ్ఞానప్రదము. గ్రంధవిస్తరభీతిచే ఇక్కడ ఇచ్చుటలేదు. రావలసినవారు బ్రహ్మపురాణములో ఆరవ అధ్యాయమున 4వ శ్లోకమునుండి 24వ శ్లోకము వరకు చూచుకొనవచ్చును.
    పార్వతీస్తుతిలో రెండు శ్లోకములునిచ్చుచున్నాను. యథాయధాశంభురమేయ మాయా రూపాని ధత్తెజగతోషితాయ తద్యోగయోగ్యాని తధైవధత్సే పతివ్రతాత్విత్వయి మాతరేవమ
        కార్యక్రియాకారకసాధనానాం                                        వేదోదితానామధ్లఏకికానావు                                            యత్యాధ్యముత్క ృష్టతమంప్రియంచ                                        ప్రోక్తాచసా సిద్ధి అనాదికర్తు.
ఇట్లు స్తుతించగా వృషభద్వజుడు శంకర భగవానుడు పార్వతీ సహితుడై గణేశాది గణములతో కూడా సాక్షాత్కరించి అతనితో ఇట్లు పలికెను.
    గౌతమా నీ భక్తితో స్తోత్రముతో వ్రతములతో ప్రసన్నుడనైతిని. నీకేమి ఈయవలయును. దేవతలకు కూడా దుర్లభమైనదైననూ యాచించుము. ఇట్లు జగన్మూర్తి మాటలను వినిన గౌతమమహర్షి ఆనంద బాష్పరిప్లుతాంగుడై ఇట్లు ఆలోచించెను. దైవము ధర్మము బ్రాహ్మణపూజనము లోకగతి ఎంతచిత్రము. ఇంతి దుర్లభము సులభమైనది.
        జాస్థితాంశుభాంగంగా దేహిమేత్రిథార్చిత                                    యది తుష్టోసిదేవేశ త్రయీధామనిమోస్తుతే.
    త్రిథార్చితా! వేదాధారా నీకు నమస్కారము. నీవు సంతోషించినచో నీ జాజూటముననున్న గంగను నాకు ప్రసాదించుము. అనగా శంకరుడు ఇట్లు పలికెను. మూడు లోకముల ఉపకారముకొరకు కోరినావు. ఇపుడున్న ఉపకారమునకు యాచించుము. అనగా గౌతముడు ఇట్లు పలికెను. ఈ స్తోత్రముతో నిన్ను స్తుతించు భక్తులు సర్వకామసమృద్ధి కలిగి ఉండవలయును. ఇది నా కోరిక. శంకరుడు అట్లే అగుగాక అని పరితుష్టుడై పలికెను. నా నుండి దిగులుతో ఇతర వరములను కూడా యాచించుము. అనగా గౌతమమహర్షి సంతోషముతో ఇట్లు పలికెను.
    దేవా జగన్నాథా! నీ జాజూటములో పావని లోకమాతయైన ఈ గంగను నీ ప్రియురాలిని బ్రహ్మగిరిలో విడిచిపెట్టుము. ఇది అందరికి తీర్థభూతముగా ఉంటుంది. సముద్రమును చేరువరకు తీర్థముగా నిలుచుచు ఈ తీర్థము బ్రహ్మహత్యాది పాపములను మనోవాక్కాయములతో ఆచరించిన పాపములను స్నానమాత్రముననే నశించవలయును. చంద్రసూర్య గ్రహణములలో అయనములలో విషువములలో సంక్రాంతిలో వైధృతిలో ఇతర పుణ్యతీర్థములలో కలుగు ఫలము ఈ తీర్థరాజమును స్మరించినంతనే కలుగవలయును.
        శ్లాఘ్యంకృతే తపఃప్రోక్తం                                            త్రేతాయాం యజ్ఞకర్మచ                                            ద్వాపరేయజ్ఞదానేచ                                            దానమేవకలేయుగే.
    కృతయుగములో తపస్సు, త్రేతాయుగ మహాయజ్ఞము, ద్వాపరయుగములో యజ్ఞదానములు కలియుగములో ఒక్క దానమే ఇట్లు చెప్పబడిన యుగధర్మములు దేశధర్మములు. కాలధర్మములు. దేశకాలాది సంయోగము వలన కలుగు ధర్మములు స్నానదానాది నియమములలో ఇతరత్ర ఆచరించిన పుణ్యములు ఈ తీర్థమును ఈ గాథను స్మరించినంతనే కలుగవలయును. సముద్రమును చేరు వరకు ఈ నది అనేకానేక ప్రాంతములలో ప్రవహించునో ఆయన్ని ప్రదేశములలో నీవు వెంచేసి ఉండవలయును. ఈ తీర్థమునకు థయోజనముల పరిధిలో ఉండువారికి ఆలోపలికి వచ్చువారికి మహాపాతకులైననూ వారి పితరులకు వారికి స్నానము కొరకు వచ్చువారికి స్నానమాత్రముననే ఇతర మానవులు ముక్తిని కావించుచుందురుగాక. సకల తీర్థములు ఒకప్రక్క స్వర్గమర్త్యపాతాలములోనున్నవి ఈ తీర్థమువాి అన్నికంటే విశిష్టమైనది. కావలయును. ఇట్లు పలికిన గౌతమమహర్షి మాటలను వినిన శంకర భగవానుడు తథాస్తు అని పలికెను.
        అస్యాః పరతరం తీర్థం న భూతం న భవిష్యతి                                    సత్యం సత్యం పునస్సత్యం మేదేచపరినిష్ఠితమ్‌                                    గౌతమేనయధానీతా గౌతవిూ తేనసంస్క ృతా                                    గాందదాతిచ విప్రేభ్య తతః గోదాప్రకీర్తితా                                    అవనాత్‌ పుణ్యదానాచ్చ అవరీపరికీర్తితా                                    గోదా చ అవరీచైవ తతో గోదావరీ మతా                                    సర్వేషా గౌతవిూపుణ్యా ఇత్యుక్త్వాన్తర ధీయత.
దీనికంటే గొప్పదైన తీర్థము ఇది వరకులేదు. ఇకముందు ఉండదు. ఇది ముమ్మాికి సత్యమే. వేదములో ప్రతి పాదించబడినది. గౌతమమహర్షి తీసుకొనివచ్చినాడు గాన ఇది గౌతమి అను పేరుతో ప్రసిద్ధి చెందినది. మరణించినట్లు పడియున్న గోవును మరల బ్రాహ్మణులకు ఇచ్చినందున, సకలవేవేదాంతజ్ఞానరూపమైన వాక్కును అనగా గోవును ఇచ్చినందున గోదా, అవతి, రాతి అను వ్యుత్పత్తిచే రక్షించును, ఇచ్చును అనగా అమోఘమైన పుణ్యములనిచ్చును. పాపములనుండి రక్షించును. గాన అవరీ గోదా అవరీ కలిపితే గోదావరి అనుచున్నారు. ఈ గౌతవిూనది అందరికే పుణ్యప్రదమైనది అని చెప్పి శివుడు అంతర్ధానముచెందెను.
    ఇట్లు లోకపూజితుడైన శంకర భగవానుడు అంతర్థానము కాగా ఆ శివాజ్ఞతో పరిపూర్ణమైన బలము కలిగిన గౌతమమహర్షి ఆ నదీమతల్లి ఉన్నజటను తీసుకొని దేవతలతో కలిసి బ్రహ్మగిరిని చేరెను. అంతట జటను తీసుకొని గౌతమమహర్షిరాగా అక్కడ అనగా ఆ బ్రహ్మగిరిపై పుష్పవృష్టి కురిసినది. సురేశ్వరులందరూ అచికి వచ్చిరి, మహానుభావులైన ఋషులు బ్రాహ్మణులు క్షత్రియులు జయ శబ్దముతో ఆ గౌతమమహర్షిని పూజించుచు సంతోషముకలవారైరి.
    ఇట్లు చెప్పగా నారదమహర్షి మరల బ్రహ్మను ఇట్లు అడిగెను. మహేశ్వర జా జూటమునుండి గంగను తీసుకొని బ్రహ్మగిరికి వచ్చిన గౌతమమహర్షి ఆ తరువాతయేమి చేసెను. అనగా బ్రహ్మ ఇట్లు తెలుపుచున్నాడు. ఇట్లు గౌతమమహర్షి మహేశ్వరుని జా జూటమునుండి గంగను తీసుకొని వచ్చి పరిశుద్ధుడై ఏకాగ్రమైన మనస్సుకలవాడై దేవతలచేత గిరినివాసులచే పూజించ ప్రతిష్ఠించి త్రిలోచనదేవుని స్మరించుచు చేతులు జోడించుచు ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు గంగ నుద్దేశించి ఇట్లు పలికెను.
        త్రిలోచన జోద్భూతే సర్వకామప్రదాయిని                                    క్షమస్వమాతశ్శాన్తాసి సుఖంయాహిహితంకురు.
    త్రినేత్రుని జటనుండి ఉద్భవించినదానా! సకల కామనలను ప్రసాదించుతల్లీ! క్షమించుము. శాంతించుము. సుఖముగా వెళ్ళుము. హితమును చేయుము. ఇట్లు గౌతమమహర్షి పలుకగా గంగాదేవి దివ్యరూపమును ధరించి దివ్యమాల్యాఉపావనములను ధరించి గౌతమునితో ఇట్లు పలికెను. దేవసదనమునకు వెళ్ళెదనులేదా బ్రహ్మకమండలమునకు వెళ్ళెదను. రసాతలమునకైనా వెళ్ళెదను. నీవు సత్యమును మాటలాడువానిగా ప్టుితివి. అనగా గౌతమమహర్షి ఇట్లు పలికెను. మూడులోకములకుపకారమునకై నేను యాచించితిని. శంకర భగవానుడు కూడా అట్లే ఇచ్చెను. ఆ శంకర భగవానుని సంకల్పము ఇంకొక తీరుగాకాదుకదా! ఇట్లు గౌతమమహర్షి వాక్యమును వినిన గంగ బ్రాహ్మణవాక్యము సత్యమే అని తలచెను. అపుడు గంగ తనను మూడు విభాగములుగా విభజించుకొని స్వర్గమర్త్యరసాతలములను చేరెను. స్వర్గమున నాలుగు విధములుగా ప్రవహించి మర్త్యలోకమున ఏడుగా రసాతలమున నాలుగుగా ఇట్లు పంచాదార విధములుగా అయి ప్రవహించినది. అంతట అన్ని తానే అయినది. సర్వపాపవినాశిని. సర్వకామప్రద. ఇదే వేదమున గానము చేయబడుచున్నది. మానవులు మానవుల లోకమునున్న దానికే దర్శించెదరు. రసాతలగతమున నున్నదానిని దర్శించజాలరు. స్వర్గములోనున్న దానిని చూడజాలరు. సముద్రమునకు చేరువరకు ఇది దేవమయెను. గౌతమ మహర్షి వదలగా పూర్వసాగరమునకు వెళ్ళెను. అంతట దేవతలతో ఋషులతో సేవించబడుచున్న దానిని జగత్తునకు శుభమును కలిగించబడుచున్నదానిని జగత్తునకు శుభమును కలిగించి గోదావరీమాతను మునిశ్రేష్ఠుడైన గౌతమమహర్షి ప్రదక్షిణము నాచరించెను. సురేశుడైన త్రిలోచనుని మొదట పూజించి గౌతమ మహర్షి ఉభయతీరములలో స్నానము చేసెదనని సంకల్పించెను. స్మరించినంతనే అక్కడ కరుణాసాగరుడు అక్కడ సాక్షాత్కరించెను. చెతులు జోడించి భక్తితో వంగిన వాడై త్రిలోచనుని ఇక్కడస్నానమెట్లు సిద్ధించును అని శంకరుని అడిగెను.
    దేవదేవమహేశానా? లోకములహితమును కోరి గౌతవిూ తీర్థస్నానవిధిని నాకు చక్కగా తెలుపుము అనగా మహేశ్వరుడు ఇట్లు చెప్పెను. మహర్షీ గోదావరీస్నాన విధిని సమగ్రముగా చక్కగా వినుము. మొదట నాందీముఖము నాచరించి దేహశుద్ధిని ఆచరించి బ్రాహ్మణులను భుజింపచేసి వారి ఆజ్ఞను స్వీకరించి పతితులతో మాటలాడుటను విడిచిప్టిె బ్రహ్మచర్యముతో వెళ్ళవలయును.
        యస్య హస్తౌ చపాదౌ చ మనశ్చైవసు సంయతమ్‌                                విద్యాతపశ్చకీర్తిశ్చ సతీర్థఫలమశ్నుతే.
    హస్తములు పాదములు మనస్సు విద్యా తపస్సు కీర్తి నియమబద్ధముగా నున్న వాడు తీర్థఫలమును పొందును. దుష్టభావమును విడిచిప్టిె స్వధర్మపరినిష్ఠితుడై అలసినవారికి సేవ చేయుచు యధోచితముగా అన్నదానము చేయవలయును. ఏవిూలేని సాధువులకు వస్త్రదానమును చేయవలయును. దివ్యమైన గంగా సముద్భవమైన హరి వధను వినవలయును. ఈ విధితో వెళ్ళుచు సకల తీర్థఫలమును పొందును. శంకరుడు గౌతమమహర్షితో మరియొకమాట చెప్పియున్నాడు. ద్విహస్తమాత్రముననే తీర్థములు సంభవించగలవు. సర్వకామ ప్రదుడనైన నేను అన్నిచోట్ల సన్నిహితుడనై యుందును. గంగాద్వారే ప్రియాగమున సాగరసంగమమున ఈ తీర్థములలో గౌతవిూనది భాగీరధి నరులకు మోక్షమును ప్రసాదించునది.
        నర్మదాతు సరిచ్ఛ్రేష్ఠా పర్వత్వేమర కర్కాటకే                                    యమునాసంగతా తత్ర ప్రభాసేతు సరస్వతీ                                    కృష్ణా భీమరధీచైవ తుంగభద్రాతు నారద                                    తిసృణాంసంగమోయత్ర తీత్తీర్థం ముక్తిదంనృణామ్‌                                పయోష్ణీసంగతాయత్ర తత్రత్యాతత్రముక్తిదా                                    ఇయంతు గౌతవిూ వత్సయత్రక్వాపిమమాజ్ఞయా                                సర్వేషాం సర్వదా నౄణాం స్నానాన్ముక్తిం ప్రదాస్యతి                                కించిత్కాలేపుణ్యతమా కించిత్తీర్థే సురాగమా                                    సర్వేషాం సర్వదా తీర్థం గౌతవిూనాత్ర సంశయ.
అమర కంటక పర్వతమున నర్మదా ఉత్తమనది. అక్కడే యమునా సంగమము శ్రేష్ఠము. ప్రభాసమున సరస్వతీ శ్రేష్ఠనది. కృష్ణా భీమరధీ తుంగ భద్రా ఈ మూడునదులసంగమమ ఉన్నతీర్థము ముక్తిప్రదము. పయోషీసంగమము కల తీర్థము ముక్తిప్రద. ఇక ఈ గౌతతవిూనది యెక్కడ ఉన్ననూ నా ఆజ్ఞచె అందరికి అన్ని వేళలా అన్నిచోట్ల నరులకు స్నానమాత్రమున ముక్తిప్రద. కొన్ని నదులు కొన్ని కాలములలోనే పుణ్యతమలు. కొన్ని తీర్థములు దేవతలరాకలో పుణ్యప్రదములు. అందరికీ అన్నిచోట్ల అన్నివేళలా గౌతవిూ ముక్తిప్రదా.
        షష్ఠిర్వర్ష సహస్రాణి భాగీరధ్యవగాహనీమ్‌                                    సకృద్ఘోదావరీస్నానం సింహస్థే చ బృహస్పతౌ                                    విశేషాద్రామ చరణ ప్రదానాత్‌ తీర్థసంశ్రయాత్‌                                    సింహస్థితేసురగురౌ దుర్లభాగౌతవిూనృణామ్‌                                    భాగీరధీ నర్మదా చ యమునా చ సరస్వతీ                                    ఆయాన్తి భీమర ధ్వాద్యాః స్నాతుంసింహగతేగురే                                విహాయ గౌవిూం గంగాం తీర్ధాన్యన్యానిసేవితుమ్‌                                యేయాన్తి మూఢాస్తే యాన్తి నిరయంసింహగేగురే
అరవైవేల సంవత్సరములు గంగాస్నానము బృహస్పతిసింహరాశిలో ఉన్నపుడు కూడా వరీస్నానము సమాన ఫలప్రదము. రామచరణ ప్రదానము వలన తీర్థసంశ్రయము వలన బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు గౌతవిూస్నానము దుర్లభము. భాగీరధి నర్మదా యమునా సరస్వతి భీమర ధ్యాదినదులు సింహగతగురువులో గోదావరికి వచ్చును. బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు గోదావరిని విడిచి ఇతర తీర్థములను సేవించు మూఢులు నరకమునకు వెళ్ళెదరు.
        తిస్రఃకోట్యర్థ కోీచ యోజనానాం శతద్వయే                                    తీర్థాని ముని శార్దూల సంభవిష్యంతి గౌతమి                                    ఇయం మాహేశ్వరీ గంగా గౌతవిూ వైష్ణవీతిచ                                    భ్రాష్మీగోదావరీనందా సునందావామదాయినీ                                    బ్రహ్మతేజస్సమానీతా సర్వపాపప్రణాశినీ                                    స్మరణాదేవపాపేఘహన్త్రీ మమసదా ప్రియా                                    పంచానామపి భూతానామాపః శ్రేష్ఠత్వమాగతా.
మూడుకోట్ల 50 లక్షల తీర్థములు రెండువందలయోజనాలలో గౌతవిూనదిలో సింహబృహస్పతిలో సంభవించును. ఈ గోదావరి గంగా మాహేశ్వరి గౌతవిూ వైష్ణవీ బ్రాహ్మీ గోదావరీ నర్మదా సునందాకామదాయినీ బ్రహ్మతేజస్సుతో గొనితేబడినది. సర్వపాపప్రణాశినీ గోదావరిని స్మరించినంతనే సకలపాపరాశులను నశింపచేయును. నాకు సదా ప్రీతికరురాని. అయిదు భూతములు, జలము శ్రేష్ఠతముములు. ఆ జలములలో తీర్థభూత జలము ఇంకా శ్రేష్ఠములు. కావున జలములు సర్వశ్రేష్ఠములు.
        తస్మాత్‌ భాగీరథీశ్రేష్ఠాతాభ్యోయ గౌతవిూత్వయా                                ఆనీతాస జాగంగా అస్యానాన్యచ్ఛు భావహమ్‌                                స్వర్గే భువిలిచేవాపి తిర్థేసర్మార్ధదం మునే
కావున భాగీరథి జలములలో కెల్ల శ్రేష్ఠమైనది. భాగీరథా జలములకంటే గోదావరీ జలములు శ్రేష్ఠములు. శంకరుని జాసహితముగా నీవు తీసుకొని వచ్చితివి. దానికంటే శ్రేష్ఠిమింకొకిలేదు. స్వర్గములో భూలోకమున పాతాళమున సర్వార్థద గౌతమి పుత్రా ఇట్లు గౌతమమహర్షికి శంకర భగవానుడు అంతా చెప్పెను. శంకరుడు సంతోషించి చెప్పిన దంతయు నీకు తెలిపితిని. ఇట్లు గౌతవిూగంగ అన్నికంటే అధికమైనది శ్రేష్ఠమైనది. గౌతమి ఉత్పత్తిని ప్రభావమును స్వరూపమును కూడా చెప్పితిని. ఇంకాయేమేమి వినగోరుచున్నావు. ఇది సంగ్రహముగా గోదావరి ఉత్పత్తి. గౌతమి గోదావరి వైభవము. బ్రహ్మవిష్ణుమహేశ్వరుల త్రిమూర్తుల సంకల్పములతో సకల లోకహితమును కోరి ఆత్రిమూర్తులు సకల చరాచరప్రపంచహితమునకు అవతరింపచేసినది గోదావరి ఇక ఇపుడు పుష్కర ప్రభావమును పుట్టుకను చూతము.
పుష్కర ప్రాదుర్భావము
    శౌనకాది మహామునులు సూతమహర్షిని ఇట్లు అడిగిరి.
    మహామునీ గోదావరియొక్క అద్భుతమైన చరితమును వినిపించి మమ్ములను కృతార్ధులను చేసితిరి. తమ వాక్యామృతమును జుఱ్ఱుచున్న మాకు తృప్తి కలుగుటలేదు. ఇంకా వినాలి అ తహ తహ కలుగుచున్నది. ఇక ఇపుడు పుష్కరమంటే యేమి. అది 12 సంవత్సరములకే ఒక్కసారే ఎందుకొచ్చును. దీనిలోని అంతరార్ధమేమి. ఆ విధి విధానమును కూడా వినిపింపవేడుచున్నాము అని శౌనకాది మహామునులు కోరగా సూతమహర్షి ఇట్లు చెప్పసాగెను.
    సాధార ఋరదనీిని చిల్లగింజ (ఇండుపగింజ) శుద్ధి చేయునట్లు అఖిలచరాచర జగత్తులోని జావకంటే పాపాలను తమలో కలుపుకున్న మహానదులు ఆ పాపాలను తొలగించుకొని మళ్ళీ నిర్మలములు పరిశుద్ధములు పవిత్రములు పుణ్యప్రదములుగా అగునట్లు చేయునదే పుష్కరము. పుష్కరము అంటే కమండలమునకు పేరు. పుష్కరము అంటే పద్మము. పుష్కరము అంటే యేనుగుతొండము. పుష్కరము అంటే మహాలక్ష్మి. శ్రీ మన్నారాయణునకు పుష్కరాకక్షుడు అనిపేరు. మహాలక్ష్మికి పుష్కరాసన అని పేరు. సముద్రునకు పుష్కర నిలయుడు అనిపేరు. ఇట్లు ఇన్ని అర్థములు ఆంతర్యములున్న పుష్కర శబ్దము నామము ఇక్కడ ఎలా వించుకు వ్యవహరించబడుచున్నదో చూతము.
    జీవులందరూ తమపాపాలను నదులలో వదులుచున్నారు. మరి ఆ నదులు ఎట్లు పాపాలను వదిలించు కోవాలి అను సందేహము పుష్కరుడనే ఒక బ్రాహ్మణునకు కలిగినది. ఆ నదులపాపములను తొలగించు విధానమును తెలియుటకు ఆ పుష్కరుడు శివునికై ఘోరమైన తపమును ఆచరించినాడు. ఆ శంకరుని అష్టమూర్తులలో ఒకటైన జలత్వసిద్ధికై ప్రాదేయపడినాడు. ఆ భక్తుని ఉదారమైన సంకల్పము లోకహితమును ఆకాంక్షించుట అతని ఆవేదనను అర్ధము చేసుకొని శంకరభగవానుడు ఆ పుష్కరునికి అభయమునిచ్చి భక్తునకు పుష్కరమూర్తిగా పరిణమించి సాక్షాత్కరించినాడు. అది తెలిసిన బ్రహ్మశంకరుని ప్రార్థించి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ తీసుకొని ఆ పుష్కర తత్త్వాన్ని తనకమండల జలంలో నిక్షిప్తం చేసుకొనినాడు.
    ఇది ట్లు జరుగుచుండగా గౌతముని ధర్మపత్ని అయిన అహల్య పై కామవాంఛా కలుషితుడైన ఇంద్రుడు తన వాంఛను తీర్చుకొనుటకు ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరకు ఒకనాడు తన మాయచే కోడిపుంజురూపమున అతని ఆశ్రమమునకువెళ్ళి బ్రాహ్మిముహూర్తమునకు ముందే సమయమైనట్లుగా కూతకూసినాడు. బ్రాహ్మముహూర్తమైనదని తలచిన గౌతమమహర్షి వాచిస్నానార్ధియై నదీప్రాంతముకు వెళ్ళెను. అంతలో ఇంద్రుడు తాను ఆ ముని రూపమును ధరించి ఆహల్యను అనుభవించెను. స్నానార్ధమై వెళ్ళిన గౌతమమహర్షి సగము దారిలోనే ఇది రాక్షసవేళకాని బ్రాహ్మీముహూర్తముకాదని తెలిసి ఇది స్నానసమయముకాదని తెలిసి వెనుకకు మళ్ళీ ఆశ్రమమునకు చేరెను. అక్కడ తన వేషములో నున్న ఇంద్రుని అతని నున్న అహల్యను చూచి కోపించెను. అహల్యా నా భార్యవై తపస్సంపన్నురాలవై పవిత్రమైన గృహస్థధర్మమును పతివ్రతాధర్మమును మరిచి పరపురుషునితో క్రీడించుచున్న నీవు అందరికీ అదృశ్యురాలవై భస్మచ్ఛన్నముగా ఉండి ఆహార నిద్రలు మాని కఠినమైన తపమునాచరించుచు పాపమును తొలగించుకొనుము అని శపించెను. అట్లే ఇంద్రుని సురపతీ! ది...డవై యుండి జ్ఞానమును వివేకమును వాస్తవమును తెలియుస్థితిని కోల్పోయి కేవలము యోనిపట్ల తహతహతో ఇంతి అకృత్యమునకు పూనుకున్నావు. అందుకే నీ శరీరమంతా ఆ యోనులమయమై పోవుగాక అని శపించెను. అహల్య అదృశ్య అయినది రావతారమున రాముని రాకతో తన శాపము తొలగిపోయినది. ఇక ఇంద్రుని శరీరమంతా యోనులు ఏర్పడినది. మూడులోకములను పాలించు ఇంద్రుడు ఈ జుగుప్సాపాపమును కఠినమైన శాపమును భరించ జాలక తన ఆచార్యుడైన బృహస్పతిని చేరినాడు బృహస్పతి ఇంద్రుని తనవెంట తీసుకొని బ్రహ్మలోకమున బ్రహ్మవద్దకు వెళ్ళెను. బ్రహ్మను పలురీతులా ప్రార్థించెను. అయినా ఇంద్రుని వైరుచ్యము తొలగలేదు. అపుడు బ్రహ్మ మందాకినివద్ద ఒకసరస్సును నిర్మించి అందులో తన కమండలములోని పుష్కరజలమును కొద్దిగా ప్రోక్షించి మహోన్ద్రని ఆ సరస్సులో స్నానము చేయించినాడు. శంకరభగవానుని సంకల్పమున యేర్పడిన గంగ శ్రీ మహావిష్ణువు పాదములను కడిగిన గంగ శంకరుడు పుష్కరమూర్తిగానున్న గంగ బ్రహ్మకమండలములోచేరిన గంగ ఇంతాదిజలము ప్రోక్షించబడిన సరమున స్నానము చేసినంచున ఇంద్రుని వికృతరూపమునశించి యధావస్థిత రూపుడాయెను. ఆకాశగంగకన్నా అత్యంత ప్రభావసమన్వితమైన ఆ పుష్కరమహిమను దేవేంద్రుడు బృహస్పతికూడా ఆశ్చర్యమునందినారు.
    సకలలోకాలు ఆశ్చర్యమును పొందించిన ఈ పుష్కర మాహాత్మ్యము ఆనోా ఆ నోా జగమంతా ప్రచారమైనది. ఆకాశగంగకన్నా పరమపావనమైన ఆ పుష్కరసమ్మెలనమునకు నదులన్ని తహతహలాడినవి. గంగా గౌతవిూనదులను ముందర నుంచుకొని బ్రహ్మవద్దకువెళ్ళి బ్రహ్మను ప్రార్థించిసాగినవి. అదే సమయమున పుష్కర మహిమను తాను దగ్గర ఉండి కనులారా చూచాడు కావున ఆ పుష్కరత్వమును తనకు పొందింప చేయమని బ్రహ్మదేవుని ప్రార్థించియున్నారు. కాని పుష్కరుడు దీనికి అంగీకరించలేదు. అయినా నదుల ప్రార్ధనను బృహస్పతి ప్రార్ధనను మన్నించిన బ్రహ్మకర్తవ్యమునకు శ్రీ మన్నారాయణుని ప్రార్థించినాడు. అంతట శ్రీహరి గురువు ఆయా రాశులలో చేరిన మొది 12 రోజులు రాశిని విడిచు చివరి పన్నెండు రోజులు బ్రహ్మనిర్ణయించిన నదులలో ఉండుమని పుష్కరుని ఆదేశించిన శ్రీహరి ఆజ్ఞ మేరకు పుష్కరుడు అందులకు అంగీకరించెను. అపుడు బ్రహ్మ శ్రీహరి ఆజ్ఞమేరకు ఇట్లు నదీ నిర్ణయము పుష్కర ప్రవేశమును ఆదేశించెను. మేషాది ద్వాథరాశులయందు సర్వశుభగ్రహమగు గురుడు సంచరించునపుడు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరకాలముగా నిర్ణయంపబడినది.
బృహస్పతి    మేషరాశిలో ప్రవేశించినపుడు    గంగా నదికి
బృహస్పతి    వృషభరాశిలో ప్రవేశించినపుడు    నర్మదా నదికి
బృహస్పతి    మిధునరాశిలో ప్రవేశించినపుడు     సరస్వతీ నదికి
బృహస్పతి    కర్కాటకరాశిలో ప్రవేశించినపుడు     యమునా నదికి
బృహస్పతి    సింహరాశిలో ప్రవేశించినపుడు     గోదావరి నదికి
బృహస్పతి    కన్యారాశిలో ప్రవేశించినపుడు     కృష్ణా నదికి
బృహస్పతి    తులారాశిలో ప్రవేశించినపుడు     కావేరీ నదికి
బృహస్పతి    వృశ్చికరాశిలో ప్రవేశించినపుడు     భీమా(తామ్రపర్ణి)నదికి
బృహస్పతి    ధనురాశిలో ప్రవేశించినపుడు     పుష్కరిణి నదికి
బృహస్పతి    మకరరాశిలో ప్రవేశించినపుడు     తుంగభద్రా నదికి
బృహస్పతి    కుంభరాశిలో ప్రవేశించినపుడు     సింధు నదికి
బృహస్పతి    విూనరాశిలో ప్రవేశించినపుడు     ప్రాణహితనదికి
ఈ విధముగా పన్నెండు నదులకు పన్నెండు రాశులలో బృహస్పతి ప్రవేశించిసంచరించునపుడు పుష్కరుడు ప్రవేశించును. ఇట్లు ఒక్కొక్కనదికి 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరము లేర్పడును. ఆయా పుష్కరమున ఆయా నదీస్నానము పూజదానధర్మములు వ్రతములు శ్రాద్ధములు తర్పణములు పిండప్రదానములు చేయుట వలన తాము పాపవిముక్తులగుటయెకాక తమ పితృదేవతలకు కూడా ఊర్ధ్వగతిని లభింపచేతురు. ఇట్లు చెప్పగా శౌనకాది మహామునులు మరల ఇట్లు అడిగిరి. సర్వజ్ఞా! నీవు చెప్పిన 12నదులలో యేనదీ పుష్కరము ఉత్కృష్టమైనది తెలుపుడు అని అడుగగా సూతమహర్షి ఇట్లు చెప్పసాగెను.
గోదావరీ పుష్కరములు
    అన్ని పుష్కరములలో గోదావరి పుష్కరము సర్వోత్క ృష్టమైనది. సమస్త నదీపుష్కరములకన్ననూ గోదావరి పుష్కరములు అతి పవిత్రము. అతిపుణ్యప్రదము. అమితశక్తిమంతము. అంతేందుకు 'గోదావరి గోదావరి గోదావరి' అని మూడు మార్లు స్మరించినచాలును. సకలపాపములు తొలగును. అట్లు గురువు సింహరాశిలో ప్రవేచగనే మూడుకోట్ల యాబది లక్షల పుణ్యతీర్థములతో పుష్కరుడు గోదావరినదిని ఆశ్రయించును. ఆనాినుండి సంవత్సరాంతము వరకు సకల తీర్థములు గోదావరిలోనే నివసించు చుండును. పుష్కరుడు మాత్రము మొది పన్నెండు దినములు చివరి పన్నెండు దినములు మాత్రమే గోదావరిలో ఉండును. అందు వలన మొది పన్నెండు దినములు ఆదిపుష్కరమని చివరి పండ్రెండు దినములు అంత్యపుష్కరములని వ్యవహరించెదరు. ఈ అంత్యపుష్కరోత్సవములు అన్ని నదులకు జరుగుచు ఒక్క గోదావరినదికి మాత్రమే అంత్యపుష్కర ఉత్సవములు జరుగును. ఈ ఆచారముతో తక్కువ నదులకు కూడా అంత్యపుష్కరములను జరుపుచున్నారుకాని వాస్తవముగా జరుపవలసినది ఒక గోదావరీనదికి మాత్రమే.
    కావున సాధారణ సమయముననే గోదావరీస్నానము సర్వార్థసిద్ధిదము సర్వకామప్రదము. సర్వపాపహరము. అయినపుడు ఇక ఈ గోదావరీపుష్కర పుణ్యకాలమున గౌతవిూస్నానము తీరమున సాగించు జపహోమ దానధర్మ తర్పణ శ్రాద్ధపిండప్రదానాదికములు కోట్లధికఫలప్రదములు. అందుకే మహామహులగు ఎంతోమంది ఋషులు గోదావరిగురించి ఇట్లు చెప్పియున్నారు.
        రేవా తీరేతపః కుర్యాత్‌                                            మరనం జాహ్నవీతవే                                            దానంకుర్యాత్‌ కురుక్షేత్రే                                            గౌతమ్యాంత్ర తామం వరమ్‌.
    రేవానదీతీరమున తపమును ఆచరించ వలయును. గంగాతీరమున మరణము కురుక్షేత్రమున దానము గౌతవిూనదీ తీరమున పుణ్యప్రదములే.
        పుష్యార్కే జన్మనక్షత్రే వ్యతీపాతే దినత్రయే                                    సకృద్నాదావరీస్నానం కులకోి సముద్ధరేత్‌.
    పుష్యవిూ నక్షత్రమున్న ఆదివారమునాడు, ప్టుినరోజునాడు జన్మతారనాడు, వ్యతీపాతులలో కాని మామూలు రోజులలో మూడు మార్లు స్నానము గోదావరినదులో చేసినచో ఊర్ధ్వగతులు  లభించును.
        యాగతి ర్ధర్మ శీలానాం మునీనామూర్ధ్వరేతసామ్‌                                సాగతిస్సర్వజంతూనాం గౌతవిూ తీరవాసినామ్‌.
    ధర్మశీలులకు నైష్ఠికబ్రహ్మచారులకు లభించే ఉత్తమ గతి గౌతవిూతీరమున నివసించు సకలప్రాణులకు లభించును.
        పంచానామపి భూతానాం అపాంశ్రేష్ఠత్వ మాగతమ్‌                                తస్మిన్‌ భాగీరథీ జ్యేష్ఠా తస్యా జ్యేష్ఠాతు గౌతవిూ                                ఆద్యాతు గౌతవిూ గంగా పశ్చాత్‌ భాగీరథస్మ ృతా                                తయోరేకతరాసేవ్యా గౌతవిూ తత్రపావనీ.
    అయిదు భూతములలో జలములు శ్రేష్ఠములు. ఆ జలములలో భాగీరధిశ్రేష్ఠ. దానికంటే శ్రేష్ఠము గౌతమి. మొదట గౌతమి గంగా తరువాత భాగీరధి. ఆ రిెంలో ఒకి సేవించాలి. వాిలో గౌతమి పావని అయినది.
    యస్మిన్‌ దినే సురగురు సింహస్థాపియుతో భవేత్‌                                తస్మింస్తు గౌతవిూస్నానం కోి జన్మాఘనాశనమ్‌.
    బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు చేయు గౌతవిూ స్నానము కోిజన్మల పాపములను నశింప చేయును. ఈ గోదావరి నదీజలము గంగానది సైతము పవిత్రము చేయును అ తెలియవలయును. అందుకే కాశీకి పోయినవారు గంగోదకమును తెచ్చి గోదావరిలో కలుపు ఆచారము కలదు. ఇట్లు కలుపుట వలన గంగానది పాపవిముక్తియగునని పండుతుల నిర్ణయము. కావున గంగనే పావనము చేయుగల నది గోదావరియని తెలియవలయును. ఒక్కమాటలో చెప్పాటలంటే గోదావరి కాన్న గొప్పనది గోదావరిపుష్కరములకంటే గొప్ప పుష్కరములు గొప్ప పుణ్యకాలము ఈ సృష్టిలోనేలేవు అని తెలియుచున్నది.
ఇది అఖండ గౌతమి
    మహారాష్ట్రలో అవతరించిన గోదావరీనది నిజామాబాద్‌ జిల్లా నుండి తెలంగాణాలో తన తొలికెరటపు కాలుమోపినది. బాసరమహాక్షేత్రంలో సరస్వతీదేవి చల్లని చూపులు తనపై ప్రసరింప చేసుకొని వేములవాడ కాళేశ్వరములలో తన సోయగాలపై శివుడు చేసే చిలిపిసైగలకు సిగ్గుపడుతూ నవ నవ సర సరసమాధురీ భావజాలములను రంగరించుకొని అగ్నిమండలమైన భద్రాచలాన్ని ఆర్ద్రతా నిలయముగాచేసి తెలుగించి ఇలవేలుపులైన సీతారాముల పవిత్రానురాగాలను పరామర్శించుచు తూర్పుకనుమలద్వారా పాపికొండలను తరిచి తరించి మైదానప్రాంతానికి వచ్చి రాజమహేన్ద్రవరము విూదుగా బంగాలాఖాతంవైపు ప్రవహించినది. అత్యన్త విశాలప్రాంతములో ప్రవహించే గోదావరి ఈ ప్రాన్తంలోనే అఖండగౌతమిగా ఆరాధనలందుకుంటున్నది. సరస్వతి చల్లని చూపులను భావుకతలను పవిత్రానురాగబంధాలను రాజమహేన్ద్రవరములోనే భద్రపరిచి ధవళేశ్వరవైపు కదిలి ఆ పై నుండి అఖండగౌతమిగా సప్తగోదావరిగా యేడుపాయలుగా చీలిపోయినది.
సప్తగోదావరులు
    తుర్యాత్రేయీ భరద్వాజా గౌతవిూ వృద్ధ గౌతవిూ                                కౌశికాచ వశిష్ఠాచ సర్పరీతి సాగరం తధా.
1.తుల్య 2.ఆత్రేయ 3.భరద్వాజ 4.గౌతమి 5.వృద్ధగౌతమి 6.కౌశిక 7.వశిష్ఠ అను యేడు గోదావరి పాయలుగా సప్తగోదావరులందురు. ఈ ఏడు గోదావరులు వివిధ క్షేత్రములను పునీతమొనరించుచు సాగి తూర్పుసముద్రమున కలియుచున్నది. నాసిక్‌లో జన్మించి అంతర్వాహినిగా ప్రవహించి త్య్రంబకమందలి గోముఖముద్వారా పునరావిర్భూతమై సముద్ర సంగమము వరకు దాదాపు వెయ్యిమైళ్ళ విస్తీర్ణముగా ప్రవహించు గోదావరి అడుగడుగునా పవిత్రమైనదే. కణకణమునా పుణ్యమును నింపినదే, నిండినదే. అందుకే ఒకటేమాట. గోదావరీ పుష్కరముల పుణ్యకాలములో ఒక్కరోజు స్నానమాడిననూ అరువదివేల సంవత్సరములు గంగలో స్నానము చేసిన ఫలము లభించునని బ్రహ్మపురాణములో విస్పష్టముగా చెప్పియున్నారు. కావున తేది:14.7.2015 నుండి వచ్చు గోదావరీపుష్కరాలలో పవిత్రమైన గోదావరీ చరితమును చదివి, చదివించి, వినిపించి గోదావరీ పుష్కర ప్రభావమును తెలిసి పదిమందికి తెలిపి తమకు అనువైన ప్రాంతమున నున్న గోదావరీనదిలో ఒక్కరోజైనా స్నానమాడి దాన ధర్మ యాగ జప తప తర్పణ శ్రాద్ధ పిండ ప్రదానాదులను కావించుకొని తాము తరించి తమకోి కులములను తరింప చేసెదరను ఆశతో
స్వస్తి. సమస్త సన్మంగళాని భవరతు