Wednesday, August 26, 2020

108 రూపాలలో మహా గణపతుల పేర్లు

108 రూపాలలో ఉన్న మహా గణపతుల పేర్లు 


1. ఏకాక్షర గణపతి

2. మహా గణపతి

3. బాల గణపతి

4. తరుణ గణపతి

5. విఘ్నరాజ గణపతి

6. సిద్ది గణపతి

7. బుద్ధి గణపతి

8. లక్ష్మీ గణపతి

9. సంతాన లక్ష్మీ గణపతి

10. దుర్గా గణపతి

11. సర్వశక్తి గణపతి

12. విరివిరి గణపతి

13. క్షిప్ర గణపతి

14. హేరంబ గణపతి

15. నిధి గణపతి

16. వక్రతుండ గణపతి

17. నవనీత గణపతి

18. ఉచ్ఛిష్గ్ట గణపతి

19. హరిద్రా గణపతి

20. మోదక గణపతి

21.మేధా గణపతి

22.మోహన గణపతి

23.త్రైలోక్య మోహన గణపతి

24. వీర గణపతి

25. ద్విజ గణపతి

26. ఋణవిమోచన గణపతి

27. సంకష్టహర గణపతి

28. గురు గణపతి 

29. స్వర్ణ గణపతి 

30. అర్క గణపతి 

31. కుక్షి గణపతి 

32. పుష్టి గణపతి 

33. వామన గణపతి 

34. యోగ గణపతి 

35. నృత్య గణపతి 

36. దూర్వా గణపతి 

37. అభీష్టవరద గణపతి

38. లంబోదర గణపతి 

39.విద్యా గణపతి 

40. సరస్వతీ గణపతి 

41. సంపత్ గణపతి 

42. సూర్య గణపతి 

43. విజయ గణపతి 

44. పంచముఖ గణపతి 

45. నీలకంఠ గణపతి 

46. గాయత్రి గణపతి 

47. చింతామణి గణపతి 

48. ఏకదంత గణపతి 

49. వికట గణపతి 

50. వరద గణపతి 

51. వశ్య గణపతి 

52. కుల గణపతి 

53. కుబేర గణపతి 

54. రత్నగర్భ గణపతి 

55. కుమార గణపతి 

56. సర్వసిద్ధి గణపతి 

57. భక్త గణపతి 

58. విఘ్న గణపతి 

59. ఊర్ధ్వ గణపతి 

60. వర గణపతి 

61. త్ర్యక్ష్యర గణపతి 

62. క్షిప్రప్రసాద గణపతి 

63. సృష్టి గణపతి 

64. ఉద్దండ గణపతి 

65. డుండి గణపతి 

66.ద్విముఖ గణపతి 

67. త్రిముఖ గణపతి 

68. సింహ గణపతి 

69. గజానన గణపతి 

70. మహోదర గణపతి 

71. భువన గణపతి 

72. ధూమ్రవర్ణ గణపతి 

73. శ్వేతార్క గణపతి 

74. ఆధార గణపతి 

75. భూతరోగ నివారణ గణపతి 

76. ప్రసన్న విఘ్నహర గణపతి 

77. ద్వాదశభుజవీర గణపతి 

78. వశీకర గణపతి 

79. అఘౌర గణపతి 

80. విషహర గణపతి 

81. భర్గ గణపతి 

82. సర్వ సమ్మోహన గణపతి 

83. ఐశ్వర్య గణపతి 

84. మాయావల్లభ గణపతి 

85. సౌభాగ్య గణపతి 

86. గౌరి గణపతి 

87. ప్రళయంకర్త గణపతి 

88. స్కంద గణపతి 

89. మృత్యుంజయ గణపతి 

90. అశ్వ గణపతి 

91. ఓంకార గణపతి 

92. బ్రహ్మవిద్యా గణపతి 

93. శివ అవతార గణపతి 

94. ఆపద గణపతి 

95. జ్ఞాన గణపతి 

96. సౌమ్య గణపతి 

97. మహాసిద్ధి గణపతి 

98. గణపతి 

99. కార్యసిద్ధి గణపతి 

100. భద్ర గణపతి 

101. సులభ గణపతి 

102. నింబ గణపతి

103. శుక్ల గణపతి 

104. విష్ణు గణపతి

105. ముక్తి గణపతి

106. సుముఖ గణపతి

107. సర్వ గణపతి

108. సిద్ధిబుద్ధి గణపతి


ఆరోగ్యాన్ని కలిగించే గణపతి పూజ పత్రాలు

గణపతి పూజ సామగ్రిలో దాగున్న ఔషధ లక్షణాలు 

గజముఖుడైన వినాయకుడు మనోవనసంచారి. 

గణనాయకునికి కృతఙ్ఞతగా ఆయనకెంతో ఇష్టమైన పత్రాలతో భక్తితో పూజించు కోవాలి 

ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మష భావాలనే కలుపు మొక్కలను సమూలంగా

పీకేసి, తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి, ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు. 

వినాయకుని పూజించే 21 రకాల ఆకులలో ఎన్నో ఔషధీయ లక్షణాలు ఇమిడి ఉన్నాయి 

ఈ పూజ పత్రాలలో పాలు స్రవించేవి, పసరు స్రవించేవి ఉన్నాయి .

స్రవించే పాలు, పసర్లు  మన చర్మ రంధ్రాలగుండా శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధిచేసి, నరాలకు పుష్టిని కలిగిస్తాయి. 

గణపతి పత్రాలను సేకరించే క్రమంలో ఔషధ మొక్కల దగ్గర గడుపుతూ, అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం.

ఈ ఓషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు. 

ఈ గాలిని పీలిస్తే ఊపిరితిత్తులు శుద్ధిపడి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాం.

1. మాచీపత్రం

2. బృహతీపత్రం (వాకుడు)

3. బిల్వపత్రం (మారేడు)

4. దూర్వాయుగ్మం (గరికె)

5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త)

6. బదరీపత్రం (రేగు)

7. అపామార్గపత్రం (ఉత్తరేణి)

8. వటపత్రం (మఱ్ఱి)

9. చూతపత్రం (మామిడి)

10. కరవీరపత్రం (గన్నేరు)

11. విష్ణుక్రాంతపత్రం

12. దాడిమీపత్రం (దానిమ్మ)

13. దేవదారుపత్రం

14. మరువకపత్రం (మరువం)

15. సింధువారపత్రం (వావిలి)

16. జాజీపత్రం (సన్నజాజి)

17. గండకీపత్రం

18. శమీపత్రం (జమ్మి)

19. అశ్వత్థపత్రం (రావి)

20. అర్జునపత్రం (మద్ది)

21. అర్కపత్రం (తెల్ల జిల్లేడు)

వివిధ చోట్ల వినాయకుని విశ్వరూపము

వివిధ చోట్ల వినాయకుని విశ్వరూపము

వివిధ దేశాలలో గణపతి ఆనవాళ్లు 

మన గణేశుడు విశ్వదేవుడు 

దేశ విదేశాల్లో మహా గణపతులు 


వినాయకుని పుటక భారతదేశంలోనే జరిగినా నేడు విశ్వవ్యాప్తమై జగ మెరింగిన దేవుడైనాడు

ఆఫ్ఘనిస్తాన్‌ :- ఇక్కడ 4వ శతాబ్దం పూర్వం నుండియే గణపతి ఆరాధన కదు. కాబూుకు పదిమైళ్ళ దూరంలో ‘‘సకర్డర్‌’’ (శంకర్‌ ధర్‌) అనే చోట ఉన్న గణపతి లంబోదరుడు పొట్టసన్నగా ఉండి నాగ యజ్ఞోపవీతముంది. చెవులు పెద్దగా వున్నాయి. తొండం కుడివైపు తిరిగివుంది. ఇప్పటికి ఈ గణపతి పూజందుకుంటున్నాడు. 

చైనా :- ఇక్కడ 5వ శతాబ్దం నుండి గణపతినారాధిస్తున్నారు. ఇక్కడ కింగ్‌ - హ్సయన్‌ దేవాయంలో పద్మాసనస్థుడైన గణపతి ఉన్నాడు. తున్‌ హువాంగ్‌ గుహ గోడపై గణపతి చిత్రం కదు.

ఇండోనేషియా :- ఇక్కడ ఆరవ శత్డానుండి గణపతి ఆరాధన కదు. పశ్చిమ ‘జావా’లో అతి ప్రాచీన గణపతి విగ్రహం భించింది. ఇక్కడనే మరో కంచుమూర్తి లభించింది. జావాలో డయంగ్‌ ‘స్లీబ్యూ’ దగ్గర ఒక అసీనమూర్తి అతిపురాతనమైనది కదు. 

కాంబోడియా :- దీనిని పూర్వం కాంభోజ దేశమనేవారు ఇచట 6వ శతాబ్ది నాటికే వినాయకారాధన కలదు ‘ప్రసక్బర్‌’ దేవాయంలో ‘స్టర్‌ ధ్మాన్‌ మెడల్‌’’ అనే సంగ్రహాలయంలో ‘‘ధురోకే పాక్‌ కింకాండం’’ అనేచోట వినాయక విగ్రహాున్నాయి. 

థాయ్‌ లాండ్‌ :- బాంకాక్‌ లోని హిందూదేవాయంలో కంచు వినాయకుడు ‘‘అయాతియాన్‌’’ (అయోధ్య) అనే మరోచోట కంచు వినాయకుడు కలడు. 

కాబూల్‌:- 70 మైళ్ళ దూరంలో ‘‘గందేవ్‌’’ దగ్గరో అపురూపమైన శిల్పంతో సంస్కృత  శాసనంతో కూడిన గణపతి ఉన్నాడు. ‘దర్గాపిక్‌ రతన్‌ నాథ్‌’ వద్ద ఈ విగ్రహం పూజింప బడుతుంది. 

టిబెట్‌ :- పశ్చిమ టిబెట్‌ వారికి గణపతి అత్యంత ప్రియమైనవాడు. బౌద్ధాయాల్లో ఎన్నోగణపతి విగ్రహాలున్నాయి. 

నేపాల్‌: - ఇక్కడ హిందువుకు వలెనె బౌద్ధులకు గణపతి ప్రియమైనవాడు. భోటో గావూ ‘మ్యానిచ్‌’ ‘ఖాట్మాండు’ మొపప అనేకచోట్ల ఈ గణపతి విగ్రహాలు కలవు.

జకార్తా :- మ్యూజియంలో చక్కగా అంరించబడిన గణపతి మూర్తి ఒకటి ఉంది. ‘‘చాందిసింఘసారి’’లో కపామా ధరించిన గణపతి మూర్తి ఒకటి భించింది. 

బలిదీపం :- ఇక్కడ భించిన గణపతులందరు త్రినేత్రులు 

జపాన్‌ :- ఈ దేశంలో 8వ శతాబ్దంనుండి గణపతి కనిపిస్తున్నాడు. ఇక్కడ గణపతి ఆలయాలు వెలసినవి. ఈ దేశస్తులు  వినాయకుడిని ‘బనాయక్‌ శోధన్‌’ మరియు కాంగ్‌ లెన్‌ అని పిలుస్తారు.   ద్విభుజ, చతుర్భుజ, శోధన్‌ మరియు షడ్భుజ మూర్తు భించినవి. ఇక్కడ ‘‘కాన్‌ బెన్‌ చో’’ అనే త్రిముఖ గణపతి గూడా ఉన్నాడు. 

భూటాన్‌ :- ఇక్కడ కంచు మరియు చెక్క కొయ్యపై చిత్రించిన గణపతి మూర్తులు  కనుగోబడినాయి. ‘‘ఖాబ్లెట్‌’ అనే చోట ఒక చతుర్భుజమూర్తి ఉంది. బెజెలిక్‌ గుహలో సూర్యచంద్రును చేతుల్లో ధరించిన అనేక మూర్తు భించినవి. 

మంగోలియా :- నారాల్‌ వద్ద ఒక నృత్య గణపతి కలడు.  ఇక్కడి వారికి గణపతి పూజనీయుడు. పూర్వపు జనచక్రవర్తి కూడా గణపతి భక్తుడు. 

చంపా :- ఇది కంబోడియాకు తూర్పుగా ఉండేది. ఇక్కడి శాసనావన గణపతి ఆలయాలు  ఈ దేశంలో చాలానే ఉన్నట్లు తొస్తుంది. మి సూన్‌ ఎనమిదవ శతాబ్దానికి చెందిన ఒక గణపతి విగ్రహం దొరికింది. సైగన్‌ ప్రదర్శన శాలలో ఒక త్రినేత్ర ఆసీన మూర్తి ఉంది. 

వియత్నాం:- ఇక్కడొక ద్విభుజ మూర్తి అపూర్వమైన విగ్రహం లభించింది. ఇక్కడ దొరికిన మరికొన్ని మూర్తులకు తలపై ఉషీషం ఉంది. 

బర్మా :- ఇక్కడ 11వ శతాబ్దం నుండి గణపతి పూజ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రదర్శనశాలో షడ్భుజ గణపతి మూర్తి కల దు. ‘పగన్‌’ అనే చోట శిథిలాలో ఒక గణపతి మూర్తి లభించింది. మకరవాహనం మీద ఉన్న ఈ గణపతి ప్రపంచంలో ఏకైక గణపతి. 

శ్రీలంక :- ఇక్కడ పోలోన్నరు వద్ద శివాయ స్తంభంపై సుందరమైన గణపతిమూర్తి కలదు. ‘కటకమ్‌’ సుబ్రహ్మణ్యేశ్వరాయంలో మరో వినాయక మూర్తి ఉంది. ఈ స్వామి నక్కడి మహమ్మదీయులు , క్రైస్తవులు  గూడ పూజిస్తారు. ఇదొక విశేషం. ‘‘కంటంగ చెట్టింగ’’ అనే స్థూపంపై గ గజముఖ గణాను బౌద్ధులు పూజిస్తారు.