Wednesday, August 26, 2020

ఆరోగ్యాన్ని కలిగించే గణపతి పూజ పత్రాలు

గణపతి పూజ సామగ్రిలో దాగున్న ఔషధ లక్షణాలు 

గజముఖుడైన వినాయకుడు మనోవనసంచారి. 

గణనాయకునికి కృతఙ్ఞతగా ఆయనకెంతో ఇష్టమైన పత్రాలతో భక్తితో పూజించు కోవాలి 

ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మష భావాలనే కలుపు మొక్కలను సమూలంగా

పీకేసి, తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి, ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు. 

వినాయకుని పూజించే 21 రకాల ఆకులలో ఎన్నో ఔషధీయ లక్షణాలు ఇమిడి ఉన్నాయి 

ఈ పూజ పత్రాలలో పాలు స్రవించేవి, పసరు స్రవించేవి ఉన్నాయి .

స్రవించే పాలు, పసర్లు  మన చర్మ రంధ్రాలగుండా శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధిచేసి, నరాలకు పుష్టిని కలిగిస్తాయి. 

గణపతి పత్రాలను సేకరించే క్రమంలో ఔషధ మొక్కల దగ్గర గడుపుతూ, అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం.

ఈ ఓషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు. 

ఈ గాలిని పీలిస్తే ఊపిరితిత్తులు శుద్ధిపడి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాం.

1. మాచీపత్రం

2. బృహతీపత్రం (వాకుడు)

3. బిల్వపత్రం (మారేడు)

4. దూర్వాయుగ్మం (గరికె)

5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త)

6. బదరీపత్రం (రేగు)

7. అపామార్గపత్రం (ఉత్తరేణి)

8. వటపత్రం (మఱ్ఱి)

9. చూతపత్రం (మామిడి)

10. కరవీరపత్రం (గన్నేరు)

11. విష్ణుక్రాంతపత్రం

12. దాడిమీపత్రం (దానిమ్మ)

13. దేవదారుపత్రం

14. మరువకపత్రం (మరువం)

15. సింధువారపత్రం (వావిలి)

16. జాజీపత్రం (సన్నజాజి)

17. గండకీపత్రం

18. శమీపత్రం (జమ్మి)

19. అశ్వత్థపత్రం (రావి)

20. అర్జునపత్రం (మద్ది)

21. అర్కపత్రం (తెల్ల జిల్లేడు)

No comments: