వివిధ చోట్ల వినాయకుని విశ్వరూపము
వివిధ దేశాలలో గణపతి ఆనవాళ్లు
మన గణేశుడు విశ్వదేవుడు
దేశ విదేశాల్లో మహా గణపతులు
వినాయకుని పుటక భారతదేశంలోనే జరిగినా నేడు విశ్వవ్యాప్తమై జగ మెరింగిన దేవుడైనాడు
ఆఫ్ఘనిస్తాన్ :- ఇక్కడ 4వ శతాబ్దం పూర్వం నుండియే గణపతి ఆరాధన కదు. కాబూుకు పదిమైళ్ళ దూరంలో ‘‘సకర్డర్’’ (శంకర్ ధర్) అనే చోట ఉన్న గణపతి లంబోదరుడు పొట్టసన్నగా ఉండి నాగ యజ్ఞోపవీతముంది. చెవులు పెద్దగా వున్నాయి. తొండం కుడివైపు తిరిగివుంది. ఇప్పటికి ఈ గణపతి పూజందుకుంటున్నాడు.
చైనా :- ఇక్కడ 5వ శతాబ్దం నుండి గణపతినారాధిస్తున్నారు. ఇక్కడ కింగ్ - హ్సయన్ దేవాయంలో పద్మాసనస్థుడైన గణపతి ఉన్నాడు. తున్ హువాంగ్ గుహ గోడపై గణపతి చిత్రం కదు.
ఇండోనేషియా :- ఇక్కడ ఆరవ శత్డానుండి గణపతి ఆరాధన కదు. పశ్చిమ ‘జావా’లో అతి ప్రాచీన గణపతి విగ్రహం భించింది. ఇక్కడనే మరో కంచుమూర్తి లభించింది. జావాలో డయంగ్ ‘స్లీబ్యూ’ దగ్గర ఒక అసీనమూర్తి అతిపురాతనమైనది కదు.
కాంబోడియా :- దీనిని పూర్వం కాంభోజ దేశమనేవారు ఇచట 6వ శతాబ్ది నాటికే వినాయకారాధన కలదు ‘ప్రసక్బర్’ దేవాయంలో ‘స్టర్ ధ్మాన్ మెడల్’’ అనే సంగ్రహాలయంలో ‘‘ధురోకే పాక్ కింకాండం’’ అనేచోట వినాయక విగ్రహాున్నాయి.
థాయ్ లాండ్ :- బాంకాక్ లోని హిందూదేవాయంలో కంచు వినాయకుడు ‘‘అయాతియాన్’’ (అయోధ్య) అనే మరోచోట కంచు వినాయకుడు కలడు.
కాబూల్:- 70 మైళ్ళ దూరంలో ‘‘గందేవ్’’ దగ్గరో అపురూపమైన శిల్పంతో సంస్కృత శాసనంతో కూడిన గణపతి ఉన్నాడు. ‘దర్గాపిక్ రతన్ నాథ్’ వద్ద ఈ విగ్రహం పూజింప బడుతుంది.
టిబెట్ :- పశ్చిమ టిబెట్ వారికి గణపతి అత్యంత ప్రియమైనవాడు. బౌద్ధాయాల్లో ఎన్నోగణపతి విగ్రహాలున్నాయి.
నేపాల్: - ఇక్కడ హిందువుకు వలెనె బౌద్ధులకు గణపతి ప్రియమైనవాడు. భోటో గావూ ‘మ్యానిచ్’ ‘ఖాట్మాండు’ మొపప అనేకచోట్ల ఈ గణపతి విగ్రహాలు కలవు.
జకార్తా :- మ్యూజియంలో చక్కగా అంరించబడిన గణపతి మూర్తి ఒకటి ఉంది. ‘‘చాందిసింఘసారి’’లో కపామా ధరించిన గణపతి మూర్తి ఒకటి భించింది.
బలిదీపం :- ఇక్కడ భించిన గణపతులందరు త్రినేత్రులు
జపాన్ :- ఈ దేశంలో 8వ శతాబ్దంనుండి గణపతి కనిపిస్తున్నాడు. ఇక్కడ గణపతి ఆలయాలు వెలసినవి. ఈ దేశస్తులు వినాయకుడిని ‘బనాయక్ శోధన్’ మరియు కాంగ్ లెన్ అని పిలుస్తారు. ద్విభుజ, చతుర్భుజ, శోధన్ మరియు షడ్భుజ మూర్తు భించినవి. ఇక్కడ ‘‘కాన్ బెన్ చో’’ అనే త్రిముఖ గణపతి గూడా ఉన్నాడు.
భూటాన్ :- ఇక్కడ కంచు మరియు చెక్క కొయ్యపై చిత్రించిన గణపతి మూర్తులు కనుగోబడినాయి. ‘‘ఖాబ్లెట్’ అనే చోట ఒక చతుర్భుజమూర్తి ఉంది. బెజెలిక్ గుహలో సూర్యచంద్రును చేతుల్లో ధరించిన అనేక మూర్తు భించినవి.
మంగోలియా :- నారాల్ వద్ద ఒక నృత్య గణపతి కలడు. ఇక్కడి వారికి గణపతి పూజనీయుడు. పూర్వపు జనచక్రవర్తి కూడా గణపతి భక్తుడు.
చంపా :- ఇది కంబోడియాకు తూర్పుగా ఉండేది. ఇక్కడి శాసనావన గణపతి ఆలయాలు ఈ దేశంలో చాలానే ఉన్నట్లు తొస్తుంది. మి సూన్ ఎనమిదవ శతాబ్దానికి చెందిన ఒక గణపతి విగ్రహం దొరికింది. సైగన్ ప్రదర్శన శాలలో ఒక త్రినేత్ర ఆసీన మూర్తి ఉంది.
వియత్నాం:- ఇక్కడొక ద్విభుజ మూర్తి అపూర్వమైన విగ్రహం లభించింది. ఇక్కడ దొరికిన మరికొన్ని మూర్తులకు తలపై ఉషీషం ఉంది.
బర్మా :- ఇక్కడ 11వ శతాబ్దం నుండి గణపతి పూజ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రదర్శనశాలో షడ్భుజ గణపతి మూర్తి కల దు. ‘పగన్’ అనే చోట శిథిలాలో ఒక గణపతి మూర్తి లభించింది. మకరవాహనం మీద ఉన్న ఈ గణపతి ప్రపంచంలో ఏకైక గణపతి.
శ్రీలంక :- ఇక్కడ పోలోన్నరు వద్ద శివాయ స్తంభంపై సుందరమైన గణపతిమూర్తి కలదు. ‘కటకమ్’ సుబ్రహ్మణ్యేశ్వరాయంలో మరో వినాయక మూర్తి ఉంది. ఈ స్వామి నక్కడి మహమ్మదీయులు , క్రైస్తవులు గూడ పూజిస్తారు. ఇదొక విశేషం. ‘‘కంటంగ చెట్టింగ’’ అనే స్థూపంపై గ గజముఖ గణాను బౌద్ధులు పూజిస్తారు.
No comments:
Post a Comment